24, ఆగస్టు 2010, మంగళవారం

సోనీ TV శ్రీరాం జగన్ దగ్గర ట్యూషన్ చేరడం ఒక చారిత్రక అవసరం


శ్రీరాం అదేదో పాటల పోటీలో గెలిచాడు. మంచి సింగర్. మన తెలుగువాడే అవటం మరింత ఆనందంగా వుంది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద మన తెలుగు బ్లాగర్లు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. బ్లాగు బాబ్జీ SMS మోసాన్ని ఎత్తి చూపడం, మరో బ్లాగరెవరో, శ్రీరాం తమిళంలో మాట్లాడాడనే విషయాన్ని కూడా లేవనెత్తారు. మొత్తమ్మీద అనేక దృక్కోణాలు వెలుగులోకి వచ్చాయి. నాకు మాత్రం ఇంకా అర్థం కాని విషయాలు చాలా వున్నయి.


అసలు తెలువాడిని గెలిపించమని అంత వెఱ్ఱెత్తి పోవడం అవసరమా? బాగా పాడుతున్నాడు అని ప్రచారం చేసుంటే బావుండేది.


ఇక మనవాడు హైదరాబాదు వస్తే అద్భుతమైన స్వాగతం ఇచ్చారు. ఒక విజయ యాత్ర తరహాలో. అది సరిపోనట్టు మన ముఖ్యమంత్రి దారినపోయే దానయ్యగారు, విలువైన సమయాన్ని బాగానే కేటాయించి అదేదొ అవార్డు కూడా కట్టబెట్టారు. సోనీ TV లో గెలిస్తే అర్జంటుగా అవార్డ్ ఇవ్వాల్సిన అవసరం వుందా? అసలు పాటల పోటీ లో గెలిచినందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? పోటీలో గెలిచి ఆల్రెడీ డబ్బు సంపాదించు కున్నాడు. మన తెలుగు వాడూ,  పైగా మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కదా!
ఆయినా ఇతగాడు ఆ విజయ యాత్ర చేయడం మాత్రం మరీ టూమచ్. అదీ ఈ పరిస్థితుల్లో .. అసలేమనుకుంటున్నారు? ఏదైనా యాత్ర చెయ్యాలంటే ఇలాగేనా చేసేది? ముందు అహ్మద్ పటేల్ సోనీTV వాళ్ళతో చర్చించాలి, తరువాత శ్రీరాం తల్లిదండ్రులు వీరప్ప మొయిలీ ని కలవాలి, ఆ తరువాత వీహెచ్, కేకే,కాకా, శంకర్రావు మొదలైన వాళ్ళ జట్టు తో అంబటి రాంబాబు, సురేఖ జట్టు కబడ్డీ మాచ్ ఆడాలి, ఆ తరువాత రోశయ్య జనాలని వెళ్ళవద్దని చెప్పాలి, ఆ తరువాత వీలైతే గెలిచిన కప్పుని ఒక చోట పెట్టి అందరూ ఒకేసారి చూసే అవకాశం వుందేమో పరిశీలించాలి. ఇవన్నీ లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు యాత్రలు చేస్తే ఈ దేశం ఏమైపోవాలి? కనీసం, శ్రీరాం జగన్ దగ్గర ట్యూషన్ చేరుండాల్సింది. 


రాజకీయ యాత్రలకి జనాలు వస్తున్నారా, తరలిస్తున్నారా అని బోలెడంత ఆశ్చర్యం వ్యక్తం చేసే వాళ్ళకి మాత్రం కళ్ళు తెరుచుకొనే విషయం బోధపడి వుండొచ్చు. పాటలపోటీ విజయ యాత్రకే వెఱ్ఱెత్తి పొయే జనాలని చూశాక!!

11 కామెంట్‌లు:

  1. good good.. good... ఎందరో మనసులని దోచిన ప్రశ్న మీరు వేసారు

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత, నేను చాలా ప్రశ్నలు వేశాను. మీరు ఏ ప్రశ్న గురించి అంటున్నారో అర్థం కాలేదు :)

    రిప్లయితొలగించండి
  3. దీన్నే అభిమానాన్ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకోవడం అంటారు. ప్రతి SMA మీదా ఫోనుకంపెనీవాడికీ సోనీకీ వచ్చినడబ్బు లెఖ్ఖగడితే మన మూర్ఖత్వం ఖరీదు తెలిసొస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. :-) good one.
    he is a good singer plz vote ani unte baavundedi, inciting regionalism baaledu.

    State govt. baaga over chesinattundi.

    Coming to SMS election it is amusing in the first thought, but as a concept it is not a bad idea, considering the public usage of cell phones. 1 vote per 1 number can be used to get public opinion on many issues.

    రిప్లయితొలగించండి
  5. రాకేష్ అభిమానులను ఓదార్చడానికి జగన్ ఓదార్పుయాత్ర చేస్తే సరి.

    రిప్లయితొలగించండి
  6. @YAB - Yes. The idea is a good one for eliciting public opinion on many issues. yeah.. may be one vote per number and hopefully having the Unique ID also in future might be great ideas to strengthen our democracy.

    రిప్లయితొలగించండి
  7. వేరే అజ్ఞాత, మీ కామెంటు ప్రచురించ లేక పోతున్నందుకు చింతిస్తున్నాను. ఏదో ఆవేశంలో రాశారనుకుంటా..

    రిప్లయితొలగించండి
  8. ట్యూషన్ కనీసం మా అప్పూ భాయ్ దగ్గరన్నా తీసుకోవాలి

    రిప్లయితొలగించండి