25, ఆగస్టు 2010, బుధవారం

పెన్సిళ్ళ చాటున దాచేస్తే దాగని భావదారిద్ర్యం...

ఎవరైనా ఒక విషయం మీద వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు ఇతరులు దానితో విభేదించడమో, అంగీకరించడమో లేక వేరే కోణంలోంచి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమో లేక విని ఊరుకుండడమో చేస్తారు అని అనుకునే వాణ్ణి. అయితే ఈ మధ్య కొత్త కొత్త పోకడలు కొన్ని వచ్చినట్లున్నాయి.. అంటే తమ అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఇంకేదో విషయంలో వాళ్ళ స్పందన చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఒక కుహనా మేధావులు అని ఒక ముద్ర తగిలించేసి హాయిగా తప్పుకొని విషయాన్ని పక్కదారి పట్టించడం. ఈ పోకడ ఇంటర్నెట్లోనూ బాగానే ప్రబలుతున్నట్లుంది.


ఉదాహరణకు, స్త్రీవాదానికి మద్దత్తుగా మాట్లడామో అంతే.. మహిళల వైపునుంచి జరిగే పొరపాట్లన్నిటికీ నువ్వే బాధ్యత తీసుకోవాలి లేదంటే నువ్వొక కుహనా స్త్రీవాదివి అంటారు. మీరు ఏదైనా మతపరమైన విషయం మీద మాట్లాడారో, ఇంక అంతే.. వచ్చేస్తారు మన వాళ్ళు.. ఫలానా  మతంలొ జరిగిన విషయాన్ని నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు చెప్పేదాంట్లొ అర్థం లేదు అంటారు. ఒక విషయం మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళు అన్నింటిమీదా గుత్తాధిపత్యం తీసుకోవాలి అన్నట్లు. అదేదో వీళ్ళే ఖండించొచ్చు కదా!!


ఏవో కొన్ని ప్రశ్నించరాని సూత్రాలూ, నమ్మకాలూ మనసులో పెట్టేసుకోని వాటిని ఎవరైనా ప్రశ్నించడమో లేక కొత్త దృక్పధాన్ని తేవడమో చేస్తే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వారి మీద విపరీతమైన ద్రోహులుగా ముద్ర వెయ్యడం లాంటివి చేస్తారు. ఇంక చూస్కో నా సామిరంగా విమర్సల జడివాన, వ్యక్తిగత దాడి..నషాలానికి అంటుద్ది వేడి.


అవతలి వ్యకి యొక్క వ్యక్తిత్వం మీద  దాడి చేసి వాళ్ళు చెప్పే విషయాన్ని మరుగు పరచెందుకు ప్రయత్నించడం కూడా ఈ కోవలోకే వచ్చే ఇంకో పద్దతి. ఉదాహరణకు.. కె సి ఆర్ మొదట్లో తెలంగాణా వాదన వినిపించినప్పుడు, ఆ వాదం గురించి చర్చ చెయ్యకుండా, ఆయన మంత్రి పదవి కోసం చేస్తున్నాడనీ, బాగా తాగుతాడనీ (అంతకుముందు తెలియనట్లు!!) చిత్ర విచిత్ర మైన ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితులొచ్చాక మాత్రమే అసలు విషయం (తెలంగాణా వాదం) గురించి చర్చ మొదలయ్యింది. అప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది.


పోనీ అతి జాగ్రత్తగా విషయాన్ని వివరించామో, అయ్యుండొచ్చు కానీ.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటారు. లేదంటే, సగటుమనిషి అనే మిథికల్ క్రీచర్ వెనకాల దాక్కుంటారు. ఎలాగంటే.. అప్పటి దాక చూపటానికి ప్రయత్నించిన మేధావితనాన్ని పక్కన పెట్టి, సగటు మనిషి కి ఇలా చెప్పకూడదు అది సమాజానికి మంచిది కాదు అనటం, లేదంటే.. నేను ఒక మామూలు డీసెంట్ సగటు మనిషిని నేనింతే అంటారు.


ఇలాంటి వాళ్ళకు ఆలోచించే ఓపికా, అర్థం చేసుకొనే సహనం లేకపోవడం వల్ల ఒకరకమైన నూతిలో కప్ప మనస్తత్వం అలవాటై పోయుంటుంది. తమకు తెలిసిన దాన్ని ప్రశ్నించినా లేక వేరే ద్రుక్కోణం చూపించినా అది తమపై జరిగిన వ్యక్తిగత దాడిగా భావించి ఒకరకమైన ఆత్మన్యూనతలో మునిగిపోతుంటారు. వెంటనే తమకు చిన్నప్పటినుంచీ ఎలా అన్ని వర్గాల ప్రజలతో స్నెహం ఉండేదో, తాము చిన్నప్పుడు ఎంత మందికి పెన్సిళ్ళు గట్రా ఇచ్చేసి ఉధ్దరించేశారో ఏకరువుపెట్టి, తమ భావదారిద్ర్యాన్ని వ్యక్తిగత మంచితనం వెనక దాచేస్తుంటారు.


ఇలాంటి అనుభవాలు మీకూ ఎదురయ్యే వుంటాయికదూ! ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళు అని ఉండరేమోగానీ, ఈ రకమైన బలహీనతకి చాలామంది కొన్ని కొన్ని సందర్భాలలో లోనవుతుంటారేమో అనిపిస్తుంది. ఈ బలహీనత నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి.. ఆరోగ్యకరమైన చర్చా, అర్థవంతమైన ప్రశ్నలూ లేకపోతే ఆ సమాజం తిరోగమనంలో పడిపోయినట్టే..

43 కామెంట్‌లు:

  1. వీకెండ్ పొలిటీషీన్ గారూ,

    మీరు ఇక్కడ రెండు మూడు ప్రశ్నలు లేవనెత్తారు. మీ అభిప్రాయాలతో చాలావరకూ నేను ఏకీభవిస్తాను.
    వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రైవేట్ ఫోరం స్ లో వ్యక్తపరిచినప్పుడు పర్వాలేదు. ఒక పబ్లిక్ ఫోరం లో చెప్పినప్పుడు/రాసినప్పుడు
    ఒక వర్గం (కులపరమో, మతపరమో, స్త్రీ వాదమో, లేక ఒక కంపెనీ లో ఉద్యోగస్తులో.. etc) వారిని ఏదైనా అంటే మిగిలిన వారిని అనలేదేంటని అడగటం..అది సహజమైన ప్రతిస్పందన కాదంటారా?

    చంద్రబాబు పాంట్ షర్ట్ వేశాడు.. దుస్తుల్లో భారతీయత ఎవరైనా ఆక్రోశిస్తే.. (ఊర్కే పిచ్చి ఉదాహరణే అనుకోండి..) రియాక్షన్ ఏముంటుంది? అదిగో చిరంజీవి వేయట్లేదా? అని అడగటం.. మానవ నైజం కాదంటారా?

    రిప్లయితొలగించండి
  2. ఆ రోజు నా గర్ల్ ఫ్రెండిని బూతులు తిట్టినోడి పైన పడి ఖండించనోళ్ళకు శాశ్వతంగా శాశ్వతంగా నోరు మూసుకునే వుండాల.

    రిప్లయితొలగించండి
  3. ఇవి కొత్త పోకడలు కావులెండి. మూలమూలలా సమాజంలో ఉండేవే. కాకపోతే సమాజంలో వ్యక్తిలతో వ్యవహరించేప్పుడుండే మానవీయ నైతికత, బాధ్యత ఇంటర్నెట్లో అవసరం లేదు కనక, this takes an ugly turn. అంతే!

    ఇదే వ్యక్తుల్ని in person కలవమనో లేదా ‘కనీసం ఫోన్లో ఈ విషయాలు చర్చించుకుందాం రా’ అంటే వీళ్ళకి ఫ్యూజులు పోతాయి. ఇక్కడ మసలే చాలా మంది ఇంజనీరింగ్ కాలేజులనుంచీ కార్పొరేటు ఆఫీసులవరకూ హైవే మీదొచ్చేసి, ల్యాప్ టాప్ ముందేసుకుని వంశపారపర్యంగా వచ్చిన నమ్మకాల్నో లేక వాళ్ళు అనుకుంటున్న మతం సాంప్రదాయాన్నో పట్టుకుని ఎవరైనా ప్రశ్నిస్తే అర్జంటుగా కామెంటో, కసితీరా ధూషించో వీలైతే ఒక గ్రూపుకట్టి నానాయాగీచేసో తమ నిరసనని తెలిపి తృప్తి పడుతూ ఉంటారు.

    అటు విషయపరిజ్ఞానం ఇటు సామాజికసృహ రెండూ వీళ్ళకి ఉండవు. భౌతికంగా వీళ్ళు కార్యాచరణచేసేదీ ఏమీ ఉండదు. మాటలు...మాటలు అంతే! మనోభావాలు గాయపరుచుకున్నామని సూటిపోటి మాటలు. అంతే!

    రిప్లయితొలగించండి
  4. "ఇదే వ్యక్తుల్ని in person కలవమనో లేదా ‘కనీసం ఫోన్లో ఈ విషయాలు చర్చించుకుందాం రా’ అంటే వీళ్ళకి ఫ్యూజులు పోతాయి"
    అబ్బ చా నెట్ లో ఉన్న చెత్త చాలక ఫోన్లో వ్యక్తిగత జీవితంలో కూడా మీ గురించి కలవరించాలా?
    "మతం సాంప్రదాయాన్నో పట్టుకుని ఎవరైనా ప్రశ్నిస్తే"
    ప్రశ్నించడానికి,ద్వేషించడానికి మధ్యన ఉన్న తేడా తమరిలాంటి మూర్ఖులకు అర్థం కాకపోవడం లో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు
    "అటు విషయపరిజ్ఞానం ఇటు సామాజికసృహ రెండూ వీళ్ళకి ఉండవు. భౌతికంగా వీళ్ళు కార్యాచరణచేసేదీ ఏమీ ఉండదు."
    చూస్తుంటే తమరికి తెలుగు బ్లాగుల్లో ఉన్న వాళ్ళ జాతకాలు సమస్తమూ తెలిసినట్టున్నాయి.నాకు అంతా తెలుసు మిగిలిన వాళ్ళంతా వెధవలు అనుకునే తమరి భావ దారిద్ర్యానికి పై వాక్యం ఒక మచ్చుతునక.
    "మాటలు...మాటలు అంతే!"
    పోతే తమరి చేతలు ఎంత వరకు వచ్చాయో అదీ చెప్పండి

    రిప్లయితొలగించండి
  5. @అజ్ఞాత: ఓహో నా గురించి నెట్ లో కలవరిస్తున్నారన్నమాట. బాగుంది :)

    రిప్లయితొలగించండి
  6. చక్కని టపా. తెలుగు బ్లాగుల్లో ఇలా తమ నమ్మకాలతో విభేదించే వారిపై దాడులు ఒక రొటీన్ అయిపొయ్యింది. ముఖ్యంగా హేతువాదులు ఎదైనా టపా వేస్టే వెంటనే వారిని కుహనా హేతువాదులు, హిందూ ద్వేషులు అంటూ మొదలు పెడతారు.ఈ విషయం పై నేను ఇక్కడ ఒక టపా రాశాను.

    http://edisatyam.blogspot.com/2009/12/blog-post_14.html

    రిప్లయితొలగించండి
  7. క్రిష్ణప్రియ గారు, మీరన్నట్లు అది మానవ నైజమే, అయితే అసలు విషయాన్ని వదిలేసి అలా చేయడం పలాయన వాదం అనిపిస్తుంది నామటుకు నాకైతే..విషయాన్ని హేండిల్ చేసాక కొద్దిగా జర్క్ ఇవ్వడం బానే వుంటుంది లెండి:)

    ఇలాంటి ధోరణులవల్ల, విషయం పక్కదారి పట్టి అనేకానేక వ్యక్తిగత స్పర్థలకు అవకాశం పెరుగుతుంది. ఒక్కసారి వ్యక్తిగత స్పర్థలు ప్రవేశిస్తే ఇంకేముంటుంది.. నిజం మరుగున పడటం తప్ప.. చూస్తూనే ఉన్నాం కదా రాజకీయాల్లోనూ, బ్లాగ్లోకంలోనూ ఈ పరిణామాలని.. నా టపాలోని చివరి పారా అతి ముఖ్యమైనది నా దృష్టిలో..

    మొదటి అజ్ఞాత, థాంక్యూ :))

    రిప్లయితొలగించండి
  8. సత్యాన్వేషి గారు, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ టపా చదివాను. చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  9. మహేష్ గారు,
    చాలా బాగా చెప్పారు. పై రెండూ లేకపోయినా, తమకి తెలిసినంతలో ఇతరులు చెప్పినదానితో విబేదించవచ్చు.కానీ గుడ్డిగా వాదించీ, విషయాన్ని పక్కదారి పట్టించాలని చేసే ప్రయత్నాలతోనే వచ్చింది చిక్కంతా!

    హాస్యచతురతా, మంచి రచనా శైలీ వంటి గొప్ప గొప్ప టాలెంట్స్ ని వక్రమార్గంలో నిజాన్ని అణిచివెయ్యడానికి ఉపయోగించడం మరింత విషాదకరం.

    రిప్లయితొలగించండి
  10. రెండో అజ్ఞాత, చూశారా మీరుకూడా, ఈ టపాలో విషయం వదిలేసి ఏదో మీ సొంత అజెండా తీసుకొచ్చారు! వ్యాఖ్యాతలందరికీ మధ్య గతంలో ఏమేం జరిగాయో దాని చట్రం లోనే మా టపాలు కూడా వుండాలంటే చాలా ఇబ్బందే కదా!
    I hope you will understand. btw, you have good talent in satire..:)

    రిప్లయితొలగించండి
  11. వీకెండ్ పొలిటీషియన్ గారు మీరు రాసిన కాంటెస్ట్ నాకు అర్ధం కాకపొతే క్షమించండి .
    ఒక మనిషి ప్రతి రోజు మీ ఇంటి కి వచ్చి మీ తాత ఇలా చేసేవాడు (అది నిజమే కాదో ఎవడికి తెలియదు అది వేరే విషయం) , మీ అయ్యా అంటే మీరు తినేదంతా గడ్డి అని వాగుతున్నాడు అనుకోండి మీరేమి చేస్తారు , ఎన్ని రోజులు భరిస్తారు ? మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరు మరీ అంత తెలివి తక్కువ వారు అని అంచనా వేస్తె ఏలా ? ఇదంతా ఎందుకు మీ టాపా నే మళ్ళీ ఒకసారి చదవండి , మీరు నిజం ఏ పక్షపాతం లేకుండా రాసారా ? అవతలి వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒకసారాన్న ఆలోచించారా ?
    మీ కళ్ళ కి ఉత్తముడి గా కనిపిస్తున్న మనిషి కి అంత సీను లేదు అని అవతలి వారికి అనిపిస్తుందేమో . వేరే వాళ్ళు చాలా మంది కూడా మతం గురించి , హేతువాదం గురించి రాస్తున్నారు వాల్లందిరి మీద రాని విమర్శలు ఒక్కరి మీదే ఎందుకు వస్తున్నాయి .

    రిప్లయితొలగించండి
  12. @WeekendPolitician

    It was reply to mahesh only, i dont want to divert ur post actually.
    ఒక రకంగా చెప్పాలంటే సో కాల్డ్ వాదాలతో ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు.వచ్చిన చిక్కల్లా ఆ వదాల ముసుగు వేసుకున్న కొందరు వ్యక్తులతోనే.తప్పు చేయని మనిషి, దురాచారాలు లేని మతాలు భూమి మీద లేవు.కాని హేతు వాదమనే పేరు తోనో ఇంకో పేరు తోనో ఇతరుల నమ్మకాలను అవహేళన చేయడంతో వచ్చిన చిక్కులే ఇవన్నీ.
    "ఆరోగ్యకరమైన చర్చా, అర్థవంతమైన ప్రశ్నలూ లేకపోతే ఆ సమాజం తిరోగమనంలో పడిపోయినట్టే.." agreed 100%
    ఇక సెటైర్ గురించి మనకంత సీను లేదు లెండి, మర్చిపోయిన తెలుగును మళ్ళి నేర్చుకోవడానికి ఇక్కడ తిరుగుతుంటాను :)

    రిప్లయితొలగించండి
  13. అజ్ఞాత, క్షమించడం లాంటి పెద్ద మాటలు ఎందులేండి. నేను రాసింది నా అనుభవాలూ, నా అనాలిసిస్ మాత్రమే. మీకెవరు చెప్పారు, నా కళ్ళకి ఉత్తముడిగా ఎవరెవరు కనిపుస్తున్నారో? మీ గొడవల చట్రంలోనే మేమంతా జీవిచాలంటే మాకు వీలు కాదు.
    నేను చాలా క్లియర్ గా చెప్పాను..ఇటువంటి బలహీనతకి అందరూ కొన్ని కొన్నిసార్లు లోనవుతుంటారని. చుట్టూ వున్నవాళ్ళు తెలివితక్కువ వాళ్ళనే అభిప్రాయం నా టపాలో మీకు కనిపించిందా? మీ దివ్య దృష్టికి జోహార్లు.

    నాకు సంబధించినంతవరకూ I am very comfortable with the people in Telugu Blogworld. I admire most of these talented people. Some of them are incidentally fighting with each other based on their past experiences and issues. My only disappointment is with the abuse and too much of personalized attacks (From all sides). I hope to see people happily and honorably disagreeing with others..be it blogworld or real world.

    రిప్లయితొలగించండి
  14. వీకెండ్ పొలిటీషియన్ గారు నా కామెంట్ తో మీ టోన్ మారింది అది చక్క గా అర్ధమవుతుంది . ఇలాంటి మాటలు వినీ వినీ జనాల చెవులు చిల్లుల్లు పడ్డ పర్యవసానమే ఇది .

    రిప్లయితొలగించండి
  15. Disagree agreeably అనేది మన తెలుగు వాళ్ళలో మెజారిటీకి తెలీని విషయం. Subject గురించి చర్చించమంటే కుదరదుగానీ, వ్యక్తుల్ని గురించి మాత్రమే చర్చించడం తెలిసిన జాతి మనది. అది సమాజం నుంచీ సాహిత్యం వరకూ జరిగిన జరుగుతున్న చరిత్రే. అదే బ్లాగుల్లో కొనసాగుతోంది.

    చరిత్ర,సామాజిక చరిత్ర,సామాజిక సృహ ఏమాత్రం లేని జనరేషన్ ఒకటి ఈ బ్లాగుల్లో ఉంది. గుడ్డెద్దు చేలోబడ్డట్టు బడిపాఠాల జ్ఞానం తప్ప, సమాజిక లోతుల్ని అస్సలు అర్థం చేసుకోని అప్పర్ మిడిల్ క్లాస్ అర్బన్ జనతా ఇది. వీరికి సామాజిక శాస్త్ర పదజాలంతో పరిచయం లేదు. హెజిమొనీ, బ్రాహ్మినిజం అనగానే అదేదో కులాన్నో లేక మతాన్నో ఏదో అనేస్తున్నారనో ఆవేశమే తప్ప కనీస్ం గూగుల్ చేసి అదేదో తెలుసుకుందామనే ఆలోచన కూడా కలగని అర్థతెలివి జనరేషన్ ఇది. వీళ్ళకు తెలిసిందల్లా తమ అవగాహనా రాహిత్యాన్ని కసిగా వెళ్ళగక్కడం. చర్చించడం చేతకాక చులకన చేసి మాట్లాడటం. పైగా చిత్ర మేమిటంటే కనీసం ఎవరూ తమ సొంత పేరు, వివరాలూ చెప్పకుండా హేయమైన దుర్భాషలాడటం. అలాంటి వాళ్ళకు మీ అర్థాల్లో అపార్థాలే కనిపించినా ఆశ్చర్యం లేదు.

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాత మీరు పొరపడుతున్నారు. వీకెండు పొలిటీషియన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేక అర్థంలేని కామెంటు పెట్టాడు, అని నాకు అర్థమవుతోంది.

    రిప్లయితొలగించండి
  17. అజ్ఞాత గారు, ఈ టోను మార్పేంటో అర్థం కాలేదు. సరే, విషయానికి వస్తే, మహేష్ కానీ ఇంకెవరైనా కానీ, నేను అంగీకరించని భావాలు రాసినప్పుడు వాళ్ళతో విషయం మీద చర్చ చేయ్యాలనుకుంటానేగానీ, ఏదో నా అస్థిత్వాన్నే వాళ్ళు ప్రశ్నించారనే న్యూన్య భావనకి లోనవడం సరైంది కాదు అని నా అభిప్రాయం. I believe most of the people will see truth when it is properly presented. There may be some inertia in accepting it when truth is not to their liking..:)

    రిప్లయితొలగించండి
  18. >>వీళ్ళకి ఫ్యూజులు పోతాయి.
    పోవూ మరి మన పర్సనాలిటీకి అలాటిది మరి. ఎదుటబడి మీరు నోరిప్పితే భరించగలిగే శక్తి ఈ అర్భకులకుంటుందా? 100% నిజాలు సెప్తున్నారు.

    రిప్లయితొలగించండి
  19. అబ్బో వ్యాఖ్యాతలు, వ్యాఖ్యలతో పాటు చాలా లగేజీ కూడా తెస్తున్నట్టున్నారే !! అదీ మరీ పాత లగేజీ లా ఉంది. మనమేమో ఈ లోకానికి కొత్త, హే ఆస్ఠిక భగవాన్..ఏం చేయాలిప్పుడు? ఆ శరత్కాలం వున్నా బాగుండేది.. ఏదో మధ్యలో లైంగిక హక్కుల గురించి మాట్లాడి కొంచెం టెంపరేచర్ తగ్గించేవాడు :)

    రిప్లయితొలగించండి
  20. అయ్యా నేను సరిగా చెప్పలేక పోతున్నందుకు క్షమించండి . నూన్యత మొదలైనదే మీరు ప్రస్తావిస్తున్న మనిషి దగ్గర నుంచి . నేను రాసేవి అన్ని నిజాలు , శోధన చేసి మరీ రాస్తానన్న మనిషి ఎదుటివారు సరిగ్గా రెండు ప్రశ్నలు అడిగితే ఇది నా ఊహా , నా అభిప్రాయం , నా వల్లకాడు చదివి ఒప్పుకొంది లేదా స్టే అవుట్ అఫ్ మై బ్లాగ్ అనే చెప్పే పెద్దమనిషి మీకు సరిగ్గా కనపడుతున్నాడు . ఆయన రాసే కామెంట్లు మీకు చక్క గా అంగీకారయోగ్యం గా ఉన్నాయా ?
    ఏమిటిది
    [చర్చించుకుందాం రా’ అంటే వీళ్ళకి ఫ్యూజులు పోతాయి. ఇక్కడ మసలే చాలా మంది ఇంజనీరింగ్ కాలేజులనుంచీ కార్పొరేటు ఆఫీసులవరకూ హైవే మీదొచ్చేసి, ల్యాప్ టాప్ ముందేసుకుని వంశపారపర్యంగా వచ్చిన నమ్మకాల్నో లేక వాళ్ళు అనుకుంటున్న మతం సాంప్రదాయాన్నో పట్టుకుని ఎవరైనా ప్రశ్నిస్తే అర్జంటుగా కామెంటో, కసితీరా ధూషించో వీలైతే ఒక గ్రూపుకట్టి నానాయాగీచేసో తమ నిరసనని తెలిపి తృప్తి పడుతూ ఉంటారు.]
    [మహేష్ గారు,
    చాలా బాగా చెప్పారు]
    దీని భావమేమిటి ? మహేష్ అందరితో చక్క గా చర్చ చేస్తున్నారా ?

    [Disagree agreeably అనేది మన తెలుగు వాళ్ళలో మెజారిటీకి తెలీని విషయం. Subject గురించి చర్చించమంటే కుదరదుగానీ, వ్యక్తుల్ని గురించి మాత్రమే చర్చించడం తెలిసిన జాతి మనది.]
    ఇదేనా ఈయనకు కనపడుతున్న జాతి . ఈయన తప్ప లోకం లో ఎవడు తెలివైన వాడు లేదా ? ఈ బ్లాగుల్లో చర్చలు చేసి చేసి పెద్దలంతా వదిలేసారు .
    వ్యక్తుల గురించి నిన్న వీరు రాసిన అభిప్రాయాలు రాసాక మా కళ్ళు ఆనందం తో చమర్చాయి లెండి ఇక దీని గురించి మళ్ళీ రాయక్కరలేదు .
    ఏమైనా మీ అభిప్రాయం మీది ,.

    రిప్లయితొలగించండి
  21. Good post.

    I liked the KCR example.

    Mythical creature usage is also good. Pushing everything on to the common man has become a norm now.

    I think we tend to minimize the usage of brain. We believe in patterns which have been a part of our life since childhood. If somebody tries to break any such pattern, we first question their credentials and their motives, instead of trying to understand what that person is trying to say, since we are sure he/she is trying to do that with an ulterior motive.

    If some person says he/she appreciates/hates Manu smrithi, we associate him with a particular section of the society and start judjing their other acts based on this. Also we also love/hate certain things because we belong to a particular section, we don't use our discretion as long as it doesn't have recurring economic impact :-) (silver lining on a dark cloud)

    The other thing is blind spots. I think all of us have blind spots to certain things. It takes a huge effort to make logic work here.

    తమకు తెలిసిన దాన్ని ప్రశ్నించినా లేక వేరే ద్రుక్కోణం చూపించినా It depends on the person who is trying to break the pattern, if that person is somebody whom we trust, things become easy. We tend to listen to him with out questioning his motives.

    Looks like the root cause is....TRUST is a rarity in our society.

    ఉదాహరణకు, స్త్రీవాదానికి మద్దత్తుగా మాట్లడామో అంతే.. మహిళల వైపునుంచి జరిగే పొరపాట్లన్నిటికీ నువ్వే బాధ్యత తీసుకోవాలి లేదంటే నువ్వొక కుహనా స్త్రీవాదివి అంటారు. మీరు ఏదైనా మతపరమైన విషయం మీద మాట్లాడారో, ఇంక అంతే.. వచ్చేస్తారు మన వాళ్ళు.. ఫలానా మతంలొ జరిగిన విషయాన్ని నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు చెప్పేదాంట్లొ అర్థం లేదు అంటారు.

    I think this happens more (not always) when the person who is trying to do that belongs to that section of the society or if he/she has something to profit from it or is associated with it in some way or the other.
    Crude example:
    Reserved categories talking about righteousness of reservations as the only way to improve things and other categories talking about reservations as reason for all the ills in the society doesn't cut much ice. Other way round has a little chance.

    If somebody who relentlessly attacks the Indian culture, posting about the goodness of Indian culture (Yoga can be an example) or somebody who harps about our culture all the time talking about how it has de-generated and what are the ills that have crept into it will be easy to believe.
    If a person is really just trying to put a honest view point of the issues in the society, I am sure he/she will not be able to ignore any side of the coin. Championing only one section of the society or a particular view point and asking people to judge them with out prejudice is a bit asking too much in the present scenario.

    It is painful to see when people use their gifted sense of humor or writing skills or majority decisions or vote bank politics or economic strength or mob justice or for that matter of fact.anything in killing the truth.

    రిప్లయితొలగించండి
  22. అజ్ఞాత , నేను ఎవరి గతాన్నీ వెనకేసుకు రావటంలేదు. నేను కేవలం వీలయినంతవరకూ ఈ పోస్టుకి పెడుతున్న కామెంట్ల మీదే స్పందిస్తున్నాను. మీరు మాటి మాటికీ నేనేదొ మహేష్ ని సపోర్టు చెయ్యడానికే పోస్టు రాశాను అనే అర్థం స్ఫురించేలా (I believe unintentionally. But I got to clarify from my side )మాట్లాడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  23. @Weekend Politician, Do you think the above Sutti comment is related to this post? Don't you see the hypocrisy in his comment? What do you say?

    రిప్లయితొలగించండి
  24. భావ వ్యక్తీకరణ స్వేచ్చ అనేది రెండువైపులా పదునున్న కత్తి. మిగాతావాళ్ళని తిట్టే హక్కు మీకుంటే మిమ్మల్ని తిట్టే హక్కు మిగతావాళ్లకి కూడా ఉంటుంది. ఒక భావజాలాన్ని మీరు దూషిస్తున్నప్పుడు అవతలవాళ్ళకి కూడ మిమ్మల్ని దూషించే హక్కుంది కదా.

    మీరు అందరిమీదా రాళ్ళు వేసినప్పుడు అవతలవాళ్ళు మీ మీద వెయ్యకూడదా?

    రిప్లయితొలగించండి
  25. @WeP Timing and context of this post has some personal agenda behind it.

    రిప్లయితొలగించండి
  26. చాలా బాగా రాసారు.
    ఒక విశ్వాసం , సిద్ధాంతం లేక ఒక వాదం పై ఎవరైనా ప్రశ్నిస్తే విలువ ఇవ్వాలసింది ఆ ప్రశ్నకి.. అంతే గాని ఆ ప్రశ్న వెనక వున్న వ్యక్తికి కాదు. ఆ ప్రశ్న ఏ కారణం తో ప్రభావితం అయినా దానికి సమాధానం సభ్యతగా వుండొచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం ప్రశ్న అడిగిన వ్యక్తి పై దూషణ కాజాలదు కదా! ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలు తాను వున్న పరిసర ప్రాంతాలు, తను పెరిగిన పరిస్థితులు తనకి వారసత్వంగా వచ్చిన భావజాలం మీదేనే ఆధారపడతాడు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, ఆఫ్ఘనిస్తానులోనో , ఇరాక్ లోనో పుట్టి వుంటే లాడెన్ , సద్దాంలా వుండేవాడేమో? ఒక వ్యక్తి కి వున్న అభిప్రాయాలు ఆ వ్యక్తికి తారసపడ్డ ప్రత్యేక పరిస్థితుల వలనే కలుగుతాయి. బహుశా మనం ఆ పరిస్థితులలో వుంటే మనం కూడా అలానే ప్రవర్తిస్తామేమో ?

    ఒక గొప్ప మతవిధ్య పై నేను కొన్ని ఆరోపణలు చేసాను అనుకోండి.. ఆ ఆరోపణలకి సమాధానం ఇవ్వడం ఒక పద్ధతి.. వాటి వలన బాగుపడిన వారు ఎలా బాగుపడ్డారో చెప్పడం ఒక పద్ధతి.. అంతే కానీ తృఛ్ఛమైన నా వలన ఎవరు బాగుపడ్డారో అని అడిగి.. అలా ఎవరూ లేకపోతే నన్ను ఆత్మహత్య చేసుకోమనడం ఒక పద్ధతి. కాకపోతే..ఒక వ్యవస్థతో ఒక వ్యక్తి కి పోలిక పెట్టి వారు ఆ వ్యక్తి స్థాయి పెంచుతున్నారో లేక ఆ వ్యవస్థ స్థాయి దిగజారుస్తున్నారో వారికే తెలియాలి. ( సారీ ,కొంత వ్యక్తిగత అజెండా నాది కూడా తెచ్చినట్టు వున్నాను.. )

    ఇక్కడ నేను ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చేటప్పుడు కూడా నా వ్యక్తిగత అనుభవాల నుండి ఏర్పరుచుకున్న అభిప్రాయాలనే వ్యక్తీకరిస్తున్నాను. ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత అనుభవాల నుండే నేర్చుకుంటారు ( తాము పెరిగిన వాతావరణం , చదివిన పుస్తకాలు ..వగైరా) ఇక్కడ సమాధానం నా sources ఎలా తప్పో చెప్పాలి గాని నా sources నే తప్పు అనడం కరెక్ట్ కాదు కదా!

    రిప్లయితొలగించండి
  27. @అజ్ఞాత: నేను మొదట్నుంచీ చాలా క్లియర్ గానే ఉన్నాను. నేను చెప్పేవి అంగీకరించమని చెప్పట్లేదు. విబేధిస్తే స్వాగతిస్తాను. మీరు విబేధించారు కాబట్టి, నేను నా అభిప్రాయాన్ని మార్చుకొమ్మంటే నేను మార్చుకోను. చర్చిస్తే సమాధానమిస్తాను. వ్యక్తిగతంగా ధూషిస్తే get lost అంటాను.

    నా కార్యాచరణ చెప్పుకోవడానికి ఇది స్థలం కాదు. Come and meet me. I will tell you what I do or may be you can see what I do. my mail ID is mahesh.kathi@gmail.com

    If you are really interested...why this shadow boxing?

    రిప్లయితొలగించండి
  28. మహేష్, నాదృష్టిలో.. మహేష్ భావాలని వ్యతిరేకించేవాళ్ళు వ్యక్తిగత దూషణలు చెయడమైనా, విభేదించే వాళ్ళని మహేష్ కించపరిచడమైనా రెండూ ఒకటే.. నిజాన్ని కప్పెట్టే మానవ బలహీనతలు. అందరికీ తమ తమ బ్లైండ్ స్పాట్స్ వుంటాయండీ..కాకపోతే మీ BlindSpots మీకు తెలియవు, ఇతరుల BlindSpots వాళ్ళకి తెలియవు. We should open to realize our own blind spots and to recognize and understand the blind spots in others. That is the whole point in discussions. If you fortify your ideas with rational thoughts, if there is truth then people might see it (they need not accept it on the spot). If your idea is a result of your own blind spot, you need to realize that based on the inputs of others.

    రిప్లయితొలగించండి
  29. ok..ok.. bloggers..చాలా మంచి కామెంట్లు రాశారు. ఒక మోస్తరు చర్చ జరిగింది. మరొక్కసారి విషయాన్ని క్రోడీకరించే ప్రయత్న చేద్దాం.

    అసలు విషయాన్ని వదిలి ఆవెశకావేశాల కు లోనైతే నిజం మరుగున పడుతుంది. ఇటువంటి బలహీనతకి మనం అందరమూ ఒక్కోసారి లోనవుతూ వుంటాం. దాన్ని గుర్తించి మన జాగ్రత్తలో మనముంటే మంచి ఫలితాలొస్తాయి.

    కొత్త రకమైన ఆలోచనని తెచ్చిన వాళ్ళమీద వ్యక్తిగతంగా దాడి చేసినా, లేక దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కించపరచినా జరిగేది ఒక్కటే.. ఈ పిడకల వేట వల్ల టూమచ్ పోలరైజేషన్ జరిగి ఎవరికి ఇష్టమైన దానిని వారు పట్టు కొని వేలాడుతారు. నిజం మరుగున పడుతుంది. ఈ వ్యవహారం వల్ల అసలు మొదలు పెట్టిన వాళ్ళ ఆలోచన తప్పైతే అదీ బయటకు రాదు, ఒకవేళ అందులో నిజముంటే అదీ బయటకు రాదు.

    రిప్లయితొలగించండి
  30. 1.

    >> Disagree agreeably అనేది మన తెలుగు
    >> వాళ్ళలో మెజారిటీకి తెలీని విషయం.

    numbers please!!
    How did this comment writer measure majority?

    Why did this blog owner publish this statement with out facts?

    isnt it against the theme of this post?


    2.

    >> Subject గురించి చర్చించమంటే కుదరదుగానీ,
    >> వ్యక్తుల్ని గురించి మాత్రమే చర్చించడం తెలిసిన
    >> జాతి మనది.

    మనది అంటే?
    మీదా? మాదా? మీదీమాదీనా?

    ఒక వేళ ఇది తెలుగువాల్లని ఉద్దేశించిందా?
    నాది తెలుగు జాతి.
    ఈ వ్యాఖ్య నాకు వర్తించదు.
    ఇలా నా జాతి మీద సాక్ష్యాలు, సంఖ్యలు లేకుండా అపవాదులు వేయటం నాకు నచ్చలేదు.

    This statement is against the theme of this post.

    Next, the above comment epitomizes the lack of "Disagree agreeably"

    And then, different people read/understand/react differently.

    While one sees communist doctrine in Brinda karat's appearance, others may see her style & makeup.

    So, when anyone comments on these "other" aspects, if you are a Great Soul, then you can ignore & move on.

    రిప్లయితొలగించండి
  31. క్రిష్ణప్రియ, YAB and క్రిష్ణా,

    Special thanks for you three for discussing the topic well and sharing your perspectives.

    YAB- you are rocking with your attempt at analyzing it threadbare man..

    While others remind me of the challenges and difficulties on the way, People like you three provide me hope.

    Thanks once again..

    రిప్లయితొలగించండి
  32. Edited my post :)


    http://malakpetrowdy.blogspot.com/2010/08/blog-post_25.html

    రిప్లయితొలగించండి
  33. @WP, thank you for ur appreciation.

    @Wit Real, your comments make sense with in the context of the post.

    రిప్లయితొలగించండి
  34. @Wit Real,

    I agree with you that blanket statements are not correct. I do not agree with blanket statements. Sometimes we can quote the established patterns but blanket statements are misleading.

    What is your problem if I publish all the comments which are not abscene and abusive? Is the blog owner supposed to check the facts behind all the comments before publishing? What is wrong if a comment is published and rebutted if it is wrong in other comments?

    @YAB -- What is your view on this. Are my questions making sense to you?

    రిప్లయితొలగించండి
  35. @WeP:

    We both agree with each other.

    >> What is your problem

    I absolutely don't have any problem.

    They have every right to comment anything & you have every right to publish.

    peace ??

    all I was saying is that "that is against the theme of your post." ;)

    becos, the said comment is just doing "విషయాన్ని పక్కదారి పట్టించడం" with blanket statements.

    People write/comment with their limited knowledge.

    when they reach the limits of their information levels, they resort to "విషయాన్ని పక్కదారి పట్టించడం" tactics.

    రిప్లయితొలగించండి
  36. అరు౦ధతి ని అన్నారు బానే ఉ౦ది కాని ,కాని ఒక స౦దర్భమ్ లో మీ వ్యాఖ్య ::)

    /అయ్యా హజారే బాబూ, మీ దీక్షలు ఇట్టాంటి పనికిమాలిన పోకడలని దూరం చేసేలా చైతన్యం నింపడానికి చెయ్యండి సారూ.. రాజకీయాలు వాటంతటవే బాగుపడతాయి.. జనాలు ఇట్లా తయారవుతుంటే మీరేంది సారూ పాపం రాజకీయ నాయకుల మీద పడ్డారు ! సమాజంలో ఉన్న జనాల క్వాలిటీ ఇలా ఉంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. యధా ప్రజా తధా నాయకా.../

    ఇక అన్నా హజారే చేసినవేవి అరు౦ధతి అనే ఆమె చెయ్యలేదు, మాట్లాడే హక్కు లేదు అనేవారిని చూస్తే నవ్వు వస్తున్నది . మరి విరు కూడా కిరణ్ బేడి ని, అరు౦ధతి ని ఎ౦తవరకు విమరి౦చే అర్హత తో ఉన్నారు :D ఏమైనా చెబితే అన్నా హజారే నే చెప్పాలి అని ఒక్క మాట వ్రాస్తే సరిపోతు౦ది. కాని అన్నా గెలుస్తాడా అలా చేస్తే ?

    రిప్లయితొలగించండి
  37. @ Mauli,

    I think you are not comprehending my post or my comment above. I do not think you got the satire in my paragraph you quoted.

    రిప్లయితొలగించండి
  38. WP,

    Yes, got what you said..let us interpret Ms.Roy's words too in same way :))))

    రిప్లయితొలగించండి