ఈ మధ్య ఒక కామెంట్లో అడిగారు ఎవరు మన రాష్ట్రానికి సరైన నాయకుడు అని. ఇదేందబ్బా.. ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా అడిగేశారు అనిపించింది. పోనీ బ్లాగర్లనడితే ?? అమ్మో..
రౌడీ గారొచ్చి LooooL అని పోతారు. ఆ పేరుండే వాళ్ళని మనం వెదకలేం. శరత్ గారు చూశారంటే, ఈసారి అవకాశం గేలకి ఇమ్మంటాడు. కాకపోతే.. నాయకత్వం కోసం అందరూ నేను గే నేను గే అంటారెమో !! మహేష్ గారికి తెలిసిందో.. అసలు తాడిత, పీడిత జనాలకి తెలియకుండా ఏంటీ ఈ బ్లాగు selection అంటారేమో అని అనుమానం..ఇంకెవరైనా వచ్చి అసలిదంతా.. రామోజీ రావూ, సోనియా గాంధీ, నకిలీ కణిక వ్యవస్థ చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తారేమో అనే జంకు.. అమ్మో ఇంకా ఎంతమంది హేమాహేమీలు వచ్చి ఏమేమంటారో ! ఎందుకులే..
సరే మనమే చెప్పేద్దాం. మనకేంటి భయం.. అని ఒక్కసారి చుట్టూ చూస్తే, ఆ విషయం తెలియకే..ప్రజలేమో జుట్టు పీక్కుంటున్నారు. అసలు తేల్చిపారెయ్యల్సిందే అని విపరీతంగా బుర్ర చించుకొని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ మీద దృష్టి పెట్టానో లేదో..
మహా రాష్ట్ర పోలీసులూ, ఉప ఎన్నికల ఫలితాలూ, వాళ్ళ బామ్మర్దులూ కలసి మూకుమ్మడిగా ఒక పేరు కొట్టేశారు.
ఇంకొకాయనేమో, నా ముక్క నాకు పడేస్తే నే పోతా..నీ బోడి లిస్టులో నా పేరేంది? అని నా పేపరు చింపుకెళ్ళిపోయాడు.
సరే వీళ్ళంతా ఎందుకులే, ఆల్రెడీ సీటు మీద ఉన్నయన్నే ఖరారు చేద్దామంటే.. ఆయనకేమో ఉద్యోగం మాత్రమే కావాలంట. నేను నాయకుణ్ణి కాదుగానీ, నువ్వు నాయకుణ్ణి ఎలాగు కనిపెట్టలేవు కాబట్టి.. ఆ వంకతో నేనలా నడిపించేస్తానంటున్నాడు. చిరాకేసి ఈ పేరు నేనే కొట్టేశా.
ఇంకొకాయనొచ్చాడు..ప్లీజ్ ప్లీజ్ నన్ను సెలెక్టు చెయ్యవా అని. అదేంటంటే నా పరిస్థితేం బాగోలేదు ఏదొ ఒక దారి నువ్వే చూపించాలి అని మరీ ఇబ్బంది పెట్టేసాడు. ఇంతకుముందేదో సిన్మాల్లో చేసిన అనుభవం ఉందంట.. పైగా కావాలంటే ఢిల్లీ వాళ్ళ కాళ్ళూ గడ్డాలు పట్టుకునైనా రికమండేషన్ తెస్తానంటాడు. పోనీ కనీసం నువ్వు సెలెక్ట్ చేసే వాళ్ళ టీం లోనైనా పెట్టుకునేట్టు చూడూ అంటాడు. మనదసలే జాలి గుండె కదా.. కరిగి పోయి పేపరు వైపు చూసి, చెప్పలేక చెప్పేశా.. సారీ బాస్.. అసలు నా లిస్టులో నీ పేరే లేదు అని. ఉండే వుంటుంది.. ఆ ముక్క చింపుకెళ్ళినోడి వల్ల పోయుంటుంది అనుకుంటూ తిరుమల వైపు వెళ్ళి పోయాడు పాపం..
ఇంకొకాయన పాపం నా దగ్గరకి రాలేదు కానీ, పోన్లే మంచోడని నేనే పేరు రాశా లిస్టులో.. పోనీ ఆయన్నే చేద్దాం అంటే.. జుట్టు పీక్కుంటున్న ఫ్రజలందరూ ఒక్క సారిగా, ఆ పని ఆపేసి .. ఆ హ మేమాటైపు కాదు మాకిట్లా మంచోళ్ళు పనికిరారు..కొట్టేయ్ పేరు అన్నారు...ఏం చేస్తాం.. ఈ పేరుకి సత్తా ఉన్నా పత్తాలేకుండా పోయింది.
సరే.. చచ్చో పుచ్చో.. ఆ మిగిలిన పేరునన్నా ఖాయం చేద్దామంటే... ఆయనేమో, ఈ సమస్య మీద జుట్టు పీక్కున్నొళ్ళ నందర్నీ ఓదార్చే పనిలో ఉన్నాడు. ఆ డిల్లీ వాళ్ళేమో అసలు ఆ ఊడిపోయిన జుట్టంతా మాది.. నీకేం సంబంధం ఓదార్చడానికి అంటున్నారు.
మొత్తం మీద అర్థం అయ్యిందేమిటంటే, ఈ సమస్య తీరాలంటే రెండు గొడవలు తేలాల్సిందే.. ఒకటి, ఈ ఓదార్పు గొడవ, రెండు ఆ ముక్క చింపుకెళ్ళేవాడి గొడవా.. ఈ రెండూ తేలేదాకా..నా నిర్ణయాన్ని పెండింగులో పెడుతూ.. ఆ లోపు మరీ బోడి గుండయ్యేదాకా జుట్టు పీక్కోవద్దని ప్రజలకి ఒక ప్రకటన విడుదల చేస్తున్నా.

Hilarious ... LOOOOOOOOOOOL :))
రిప్లయితొలగించండిA nice way to being the day!
malak maalika lo vaakhyala page choodandi mimmalni evaro talchukuntunnaaru
రిప్లయితొలగించండి"నాయకత్వం కోసం అందరూ నేను గే నేను గే అంటారెమో"
రిప్లయితొలగించండిహి హి హి ఖచ్చితంగా అంటారు అందులో ఎలాంటి సందేహం లేదు ;)
బాగుంది :)
రిప్లయితొలగించండిఈ సారి గేలకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటాను కానీ అందులో ఓ చిన్న ట్విస్టు వుంది. ఆడ గే కి ఆ అవకాశం ఇవ్వాలి. అనగా ఓ లెస్బియను లేదా మహిళా బై సెక్సువల్ కి ఆ అవకాశం ఇస్తే చూడముచ్చటగా వుంటుందనేది నా అభిప్రాయం.
రిప్లయితొలగించండిఅదిరింది :)
రిప్లయితొలగించండిVery funny
రిప్లయితొలగించండిమలక్ గారూ, ధన్యవాదాలు. చూచి స్పందించినందుకు.
రిప్లయితొలగించండి@అజ్ఞాత - Malak got there before you :)
వెంకట్, ఒట్టి అనడమేంటి.. విశ్వసనీయత కోసం శరత్ గారి endorsement కూడా తెచ్చేస్తారు మన వాళ్ళు.
రిప్లయితొలగించండిశ్రావ్య గారు, Thank you.
శరత్, ఎలాగూ హైదరాబాదు వస్తున్నట్టున్నారుగా, పనిలో పని ఒకసారి అసెంబ్లీ ముందు తొడగొట్టెయ్యండి. ఆ దెబ్బకు వచ్చేసినా వచ్చెయ్యవచ్చు అవకాశం గే కేటగిరీకి. :)
రిప్లయితొలగించండినేను పైన చెప్పినట్లు మహిళలకే ఎండోర్సుమెంట్ ఇస్తాను. అలా అని అందరికీ ఊరికే ఇస్తాననుకోకండి. అబ్బో దానికి చాలా క్వాలిఫికేషన్లు, తతంగం వుంటాయి లెండి.
రిప్లయితొలగించండి29 న అసెంబ్లీ ముందు తొడగొట్టాలని డిసైడ్ చేసా. ఆరోజు హైదరాబాద్ నగర వీధుల్లో ఓ బ్లాగర్ల ప్రోగ్రాం వుంది లెండి. దానికి హాజరు అవుతూ పనిలో పనిగా ఈ కార్యక్రమం కూడా నడిపిస్తా. టివి 9 గట్రాలు ఎర్పాటు చేసే పని మాత్రం మీదే సుమా. మరి ఆసౌండుకి అందరి ఇళ్ళల్లోని టివిలు రిసౌండ్ రావాలి. గురి తప్పకుండా అంతకుముందు రోజే ప్రాక్టీసు చేస్తా. తొడగొట్టేప్పుడు గురితప్పితే అందరిముందు పరువులు పోతాయి. అసలే మన గురి మీద అందరికీ గురి ఎక్కువ!
rubbish post
రిప్లయితొలగించండిఅజ్ఞాత,ఇట్టే పట్టేస్తారు. అదే మీ అజ్ఞాత లతో చావు :)
రిప్లయితొలగించండినాకసలు ఏం చెప్పాల్నోగూడ సమజైతలేదు :)
రిప్లయితొలగించండి@nagarjuna
రిప్లయితొలగించండిఏమి సమజవ్వకపొతె జై తెలంగాణా అనై బ్రదర్. సమజైనొల్లందరే separate state అడుగుతున్నారా? ఎవడి పిచ్చి వాడికి ఆనందం.
చదువరి, Rishi - Thank you
రిప్లయితొలగించండిNagarjuna, అమర్ :)
WP
రిప్లయితొలగించండిlol, very entertaining. This is the best time to include ur name in the list, U don't have a choice now ;-)
@yab - అలా అంటారా! సరే మీ అభిమానం కానీయండి.
రిప్లయితొలగించండిఎందుకైనా మంచిది దీని వెనక కుట్రేమైనా ఉందేమో ?? బ్లాగులోకంలోని సనాతన వాదుల మీదా, ఆధునిక వాదుల మీదా, స్త్రీ వాదుల మీదా ఒక కన్నేసి పెట్టాలి :)
hillarious
రిప్లయితొలగించండిTarakam,
రిప్లయితొలగించండిThank you. :)
ఈ మధ్యకాలంలో ఇంతమంచి పొలిటికల్ సెటైరు చదవలేదు. బాగా రాశారు.
రిప్లయితొలగించండికొత్తపాళీ గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. సెటైరు నాకు నాచురల్ గా అంత రాదు కానీ, ఈ పోస్టులో ఏదో అలా జరిగిపోయింది :)
"ఎవరు మన రాష్ట్రానికి సరైన నాయకుడు?"
రిప్లయితొలగించండినాయకురాలు ఉండకూడదేమిటి? అందర్నీ గుర్తుపెట్టుకుని మా స్త్రీలని వదిలేసారు. ఎంత సేపూ మీరెదుగుదామనే గానీ మా గురించి పట్టించుకునేదేమన్నా ఉందా? నేనైతే మా చిన్నమ్మని CM చేసేస్తా!!!
Nice post.
నీహారిక గారూ,
రిప్లయితొలగించండిThank you :)
దురదృష్టవశాత్తూ నాయకురాళ్ళు ఇంకా ఎవరూ రాలేదు. అయినా మహిళలు అంత ఫీలవ్వాల్సిన పనిలేదులెండి. ఆల్రెడీ సీటు మీదున్నాయన, వాళ్ళ పెద్దమ్మ పేరుమీదేగా పాలన సాగిస్తోంది. సో.. నీహారిక చిన్నమ్మా Vs. దారినపోయే దానయ్య పెద్దమ్మ అన్నమాట !
నేను మన యువ బ్లాగర్ నాగార్జునని ప్రతిపాదిస్తున్నాను..
రిప్లయితొలగించండితార, Thank you.
రిప్లయితొలగించండిnagarjuna కి ఆల్రెడీ, చెప్పాల్నోగూడ సమజైతలేదు :)
మన బ్లాగ్లోకం లొ నాగప్రసాద్ కన్నా పెద్ద పొలిటీషన్లు ఎవరూ లేరు... :-))
రిప్లయితొలగించండి@అమర్ గారు:నేను జై తెలంగాణా, జై ఆంధ్రప్రదేశ్ అనికూడా అంటున్నాకదా. గట్లైతేనాకు సమజైనట్టా కానట్టా.. ?
రిప్లయితొలగించండితారగారు నాలోని నాయకత్వ లక్షణాలును గుర్తుపట్టిన మీకు చాలా......థాంకులు. నేను పెట్టబోయే పార్టికి మీరే పెద్దాయన మరి. నిత్యం చేతిలో తైలం పడుతూనే ఉంటుంది,ఒప్పుకుంటారా.
:) :)
రిప్లయితొలగించండికేక మాష్టారు :)
రిప్లయితొలగించండిMahesh and Krishna,
రిప్లయితొలగించండిThank you :)
చాలా బావుంది. ఇరగ కుమ్మేశారు :))
రిప్లయితొలగించండిచాలా బావుంది. భలే నవ్వించింది
రిప్లయితొలగించండిప్చ్...సరిగ్గా పేల్లేదు.
రిప్లయితొలగించండి