28, ఆగస్టు 2010, శనివారం

అభ్యుదయం, సనాతనం - బొంగు, భోషాణం...చివరికి శరత్ కాలం


నేపధ్యం
అభ్యుదయ వాదం, సనాతన వాదం (ఇంకా చాలా వాదాలు వున్నాయి లేండి, వాటి గురించి ఇంకోసారి చూద్దాం)- అసలీ అభ్యుదయవాదులంటే ఎవరు? సనాతన వాదులంటే ఎవరు? ఒకడేమో సనాతనం గొప్పదంటాదు, ఒకడేమో మరీ అంత సనాతనం కూడదంటాడు! ఒకడేమో నేనే పెద్ద అభ్యుదయవాదినంటాడు! ఒకడేమో అసలు వున్న అభ్యుదయ వాదం సరిపోవట్లేదంటాడు!
అబ్బో!! ఇందులో క్లారిటీ లోపించింది అని చాలా కాలం నుంచీ ఆలోచిస్తున్నా. అంతర్జాలం లో ఎంటర్ అవ్వగానే, అసలు ఈ పదజాలం, భావజాలం వెనక భారతీయత మీద కుట్రేమైనా వుందేమో అనే అనుమానం వచ్చింది. కానీ తెలిసింది లేండి, అలాంటిదేమీ లేదని. అసలు ఈ పదజాలాలు, భావజాలాల దెబ్బకి నకిలీ కణికుడే లాక్కోలేక పీక్కోలేక గింజుకుంటున్నాడు.

సొంత పైత్యమే మంచిదని మా నాయనమ్మ చెప్పింది గుర్తొచ్చి, ఎప్పట్లాగే మనమే నడుం బిగించేసాం. అదుగో సరిగ్గా ఆ సమయంలోనే శరత్ కాలం గారు ఒక టపా పెట్టి అభ్యుదయం సరిపోవట్లేదు, అందుకే స్వలింగ సంపర్కుల హక్కుల కోసం బ్లాగరులేమీ చెయ్యట్లేదు అని గోడు వెళ్ళబోసుకోవటం మొదలు పెట్టారు. మామూలుగానే నలుగురు జనాలు పోగయ్యి చర్చ మొదలు పెట్టారు. మందిని చూస్తే మనలోని రాజకీయ ఆంబోతు జూలు విదిలిస్తుంది కదా! విదిలించి పారేసింది. ఒక కామెంట్ పెట్టేసి, అసలీ విషయం మీద ఒక టపా రాసేస్తానని కమిటయ్యా.

విశ్లేషణ
చాలా ప్రయత్నించాను గానీ ఈ భాగం లో స్పష్టత లేదు. ఒక కామెంట్లో Sheshu Kumar Inguva చెప్పినట్లు ఇదే అంశం మీద ఇంకో బ్లాగులో చాలా చక్కటి పోస్ట్ ఉంది. అందుకే స్పష్టత లేని భాగాన్ని తొలగిస్తూ పైన చెప్పిన టపా కి లంకె ఇస్తున్నాను.

శరత్ కాలం గోడు
ఇక మన శరత్ గారి గోడు విషయానికి వస్తే, ఎదో నా నిరాశ నిశ్పృహ వ్యక్తం చెస్తున్నానంటునే బ్లాగరులందరి అభ్యుదయాన్నీ ప్రశ్నించాడు. పోనీలే ఈ భావజాలం గోల మనకెందుకు అని తప్పుకు పోనీయకుండా మీరంతా అసలు స్వలింగ సంపర్కుల హక్కుల పోరాటానికి మద్దత్తు ఎందికివ్వట్లేదని కెలికేశారు. ఇంక మామూలే, ఏందిబే నీ గోల అని కరిచేవాళ్ళు కరిచేశారు. అలో, అలో అసలు నీ అభ్యదయం ఎంత అని అరిచే వాళ్ళు అరిచేశారు. అసలేంది ఇతగాడి బాధ, ఏదో బానే రాస్తున్నాడనుకుంటుంటే ఇలా హింసపెడుతున్నాడేంటి అని పిసుక్కునేవాళ్ళు పిసుక్కున్నారు.
ఇతగాడి సమస్యేంటంటే, ఎందుకు సమాజం ఇంకా స్వలింగులను అంగీకరించలేకపోతుంది అనేది. ఇప్పుడు బ్లాగరులంతా ఆయన కోరుకునే స్వలింగ హక్కులకి మద్దత్తు పలకాలనే ఎక్స్ పెక్టేషన్ ఇతని నిస్పృహకు కారణం. అయితే సమస్యేంటంటే స్వలింగులైనా, ఏలింగులైనా వారిని కూడా మిగతా మనుషుల లాగే చూడాలి అనేంతవరకూ మెజారిటీ ప్రజలు సిద్దంగానే ఉన్నారు. అయితే స్వలింగ సంపర్కం కూడా సహజమైనదే అని ఒప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఒకవేళ అది సహజమైనదీ న్యాయమైనదీ అయితే కొన్నాళ్ళకు ఒప్పుకోవచ్చు. మీరు కావాలంటే ఆ ఒప్పించే పని మీద వుండొచ్చు.

సెక్సూల్ ప్రిఫరెన్స్ సంగతి పక్కనబెట్టి స్వలింగులని కూడా మిగతా మనుషుల్లాగే చూడాలి అనేవరకూ బ్లాగరులు కూడా సిద్దమే కదా (అసలు ప్రక్రియ మీద వాళ్ళ అభిప్రాయం ఏదైనప్పటికీ). మరి ఎందుకీ నిస్పృహ, నిష్టూరం? శరత్ గారు బహుసా వారు సాధించిన దానిని సరిగ్గా అర్థం చేసుకొని ఉండక పోవచ్చు.

Sarat, most of the bloggers accepted you as any other straight person. Most of them judge your writings and talents on their worth and are not prejudiced against you based on your sexual preference. I for one admire your courage and commitment to some thing you beleive in (be it right or wrong). I think there are many in the blogworld like me. You know it better than me.
Because of you many bloggers might have realized that oh.. gays are also as good  or as bad as anybody else. It seems you are socializing with other bloggers and every one is ok with you being a gay. You have proved at least that part. Be content with that acheivement and work on other things you are commiitted to.

Your expectation on bloggers to bat for all the rights you think Gays deserve is not reasonable. I do not know about the future. Your frustration is taking a toll on your writing skill.. take care of that.. my friend..

17 కామెంట్‌లు:

  1. అన్నట్టు, పైన ఉదహరించిన శరత్ కాలం టపా చూడటానికి ఈ లంకె ని ఉపయోగించండి
    http://sarath-kaalam.blogspot.com/2010/08/1_15.html

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. Agnaata, :) నన్నెందుకు బాస్ రొంపిలోకి లాగుతావ్. మీ కామెంట్ని ఏం చెయ్యాల్నోగూడ సమజైతలేదు.

    hey... btw, if it is really required to get in to the mud, I am game for it buddy. anytime.. but be sure that, I won't be on one side or the other. I will hold on to my own independent judgement.

    రిప్లయితొలగించండి
  4. @ Sheshu Kumar Inguva

    Not getting you. do you mean.. Katti also did a similar post in the past?

    That is intresting to know. can you please give me the link.

    రిప్లయితొలగించండి
  5. Look at your title of your post and content You are writing more rubbish without coming to the point directly. You have some itch of being witty, in that process you are confusing readers.

    రిప్లయితొలగించండి
  6. ఎందుకీ నిస్పృహ, నిష్టూరం?
    This is your interpretation that you are trying to force on others. Did anyone ask your sexual status before reading your blog? We are not sure whehter you are a gay or lesbian. But you are still uttering niraaSa, nispruha. They are your feelings not the readers. You are mixing-up nonrelated issues confusing yourself and readers. I see a marthanda, katti in you.

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత ,

    :)) there is some truth in what you said. I agree. hmm... I am realizing how difficult it is to pen the thoughts and translate them to readers. yeah...:) definitely the itch for being witty is there. . but that is only to help my readers easy. But I am not able to do it well many a times..

    Yes. This particular post did not come out as well as I anticipated. Hopefully I will be better as we go along.. I am sure, with honest readers like you will help me get better.

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాత,
    >> ఎందుకీ నిస్పృహ, నిష్టూరం? This is your interpretation that you are trying to force on others.

    oh.. I am just refering to the post by Sarat and the feelings expressed in his post. Those are not my feelings buddy...:)

    రిప్లయితొలగించండి
  9. మీరు రాణి రత్నప్రభ రిమార్కులు బ్లాగు రాసే ప్రభ అశోక్ గారేనా?

    రిప్లయితొలగించండి
  10. స్నేహ గారు,

    కాదండి. బ్లాగు ప్రపంచాన్ని నాకు ఆవిడే పరిచయం చేశారు. అందువల్ల నా బ్లాగును ఒక టీం గా మొదలు పెట్టాం.

    రిప్లయితొలగించండి
  11. ఆవిడ గారు మిమ్మల్నిలా తెలుగు బ్లాగులోకం ఉసిగొల్పటం చారిత్రాత్మక తప్పిదం, దీనికి యాబ్ కలం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద పది పోస్ట్లు మీరు చదవాలి. విట్రియల్ వికటాట్ట హాసం చేయాలి.

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాత, :)) that's a good one.

    btw, coming to the other aspect you have mentioned...చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత :)

    రిప్లయితొలగించండి