కొంతమంది రాసే విషయాల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది పేరడీ బ్లాగులు నడుపుతున్న విషయం జగద్విదితమే. వాళ్ళ మధ్య ఏమేం సమస్యలున్నాయో, ఎవరు ఎవరిని ఎందుకు కెలుక్కుంటున్నారో, ఎందుకు గిల్లుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు తేల్చుకోవలసిన విషయం. అందులో మన అభిప్రాయాలు మనకుండొచ్చు కానీ అవి ఇక్కడ అప్రస్తుతం.
ఇక్కడ విషయమేంటంటే, ఈ పేరడీ బ్లాగులు గొప్ప గొప్ప దేశ నాయకులనీ, దేశ రాజ్యాంగాన్నీ కూడా తమ రొచ్చులో నిర్లజ్జగా వాడుకోవడం బహుశా క్షణికావేశంలో జరిగి ఉండవచ్చని ఆశిస్తున్నాను. అలా కాని పక్షంలో మనోభావాల ముసుగేసుకు తిరుగుతున్న వీళ్ళకు, మామూలు భారతీయుల మనో భావాలు దెబ్బతింటాయి ఇలాంటి చర్యలవల్ల అనితెలియదనుకోవాలా?
దేశ నాయకులూ, రాజ్యాంగమూ విమర్శలకు అతీతం కాదు. కానీ ఆ విమర్శలు విషయం మీద జరిగితే ఆహ్వానించవలసిందే. కానీ ఇదేంటి, వీళ్ళు చేసుకునే పనికిమాలిన పనుల కోసం, చెత్త పేరడీ కోసం దేశ నాయకులనీ రాజ్యాంగాన్నీ వాడుకోవడం ఎంతవరకూ సబబు?
మెజారిటీ బ్లాగరులు నా భావాలతో ఏకీభవిస్తారనే నమ్మకంతో..
మీ,
వీకెండ్ పొలిటీషియన్/-