6, సెప్టెంబర్ 2011, మంగళవారం

అన్నా హజారే ఉద్యమం-అసలు కారణాలు-గుణపాఠాలు

ఈ ఉద్యమం అవసరం లేదనీ,సరైన దారిలో నడవట్లేదనీ, రాజకీయ నాయకులు దీన్ని కూడా ఎలాగోలా నీరుగారుస్తారనీ అనేక సందేహాలూ, దీని వల్లైనా కొంత మేలు జరుగుతుందనే ఆశల మధ్య దేశాన్ని ఉర్రూతలూగించిన ఈ పరిణామాలన్నింటినీ గమనించినప్పుడు మనం గానీ మన రాజకీయ వ్యవస్థ గానీ అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాల పొరపాట్లున్నా మొత్తం మీద ఈ ఉద్యమం చాలానే మంచి ఫలితాల్ని సాధించిందనేది కాదనలేని విషయం. ఈ ఉద్యమాన్నీ, కారణాలనీ, ఫలితాలనీ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఒక విజయంగానో లేకా ఒక అనుకోని పరిణామంగానో మాత్రమే చూస్తే పెద్దగా ఉపయోగం ఉండదు.

ఈ ఉద్యమం సాధించిన మంచి ఫలితాలు:
  1. అవినీతి మీద ప్రజల్లో ఉన్న ఏవగింపూ, ప్రజల దృష్టిలో ఈ సమస్యకున్న ప్రాధాన్యతా చాలా ఎక్కువ అనేది స్పష్టంగా బయటకొచ్చింది  
  2. వివిధ కారణాల వల్ల సామాజిక చైతన్యం అంతగా కనపరచని అనేక మందిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది 
  3. జాతీయ స్థాయిలో అవినీతి అనే సమస్యని ఎదుర్కోవడానికి ఎంచుకోవలసిన మార్గాలూ, సత్వర చర్యలూ ఏంటనే చర్చ ప్రారంభమయ్యింది
  4. ఒక పటిష్ఠమైన లోక్ పాల్ చట్టం తయారవ్వడం ఖాయంగా కనిపిస్తుంది
 ఈ ఉద్యమం ఇంతగా సఫలమవ్వడానికి ముఖ్య కారణం ప్రజల మద్దత్తు. జనలోక్ పాల్ బిల్లు కోసమే ఇంత మద్దత్తు వచ్చిందా ? హజారేకి మద్దత్తు తెలిపిన ప్రజలందరూ నిజంగా జనలోక్ పాల్ బిల్లు అవినీతిని అంతం చేసే ఏకైకమార్గంగా నమ్ముతున్నారా ? ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజా స్పందనకి కారణాలేంటి ? ఎన్నో మంచి ప్రయత్నాలకి అనుకున్నంతగా స్పందించని ప్రజలు ఈ ఉద్యమానికి ఎందుకు ఇంతలా స్పందించారు ? ఉద్యమం నడిపేవాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ఠ వల్లే ప్రజలకి నమ్మకం కుదిరిందా ? అవినీతి విషయంలో పరిష్కారాల మీదా వాటిల్లో హజారే బృందం సూచించినదే అత్యుత్తమమైనదనే అవగాహన మద్దత్తుదారులకి ఏర్పడిందా ?
అనూహ్యమైన ఈ స్పందన కేవలం లోక్ పాల్ చట్టం, అదీ హజారే బృందం సూచించిన జనలోక్ పాల్ కోసమే అని నాకైతే అనిపించట్లేదు. ఈ స్పందన ఎన్నో లోతైన విషయాల్ని సూచిస్తుందనిపిస్తుంది.

ప్రజాస్పందనకి అసలు కారణాలు:
  1. రాజకీయ నాయకుల మీదా, పార్టీల మీదా ప్రజల్లో ఉన్న అపనమ్మకం  
  2. పై స్థాయిల్లో జరిగే అవినీతిని అంతం చేసే ఒక శక్తివంతమైన నియంత(దాదాపుగా) అవసరం అనే నిస్పృహ
  3. సుప్తచేతనావస్థలో ఉన్న మధ్యతరగతి సామాజిక చైతన్యానికి సరైన అవకాశాలు లేకపోవడం
  4. విలువల్లేని రాజకీయాలూ, వినే లక్షణం లేని పరిపాలనా వ్యవస్థ మీదా ప్రజల్లో గూడుకట్టుకున్న నిరసన
  5. నత్తనడక నడిచే న్యాయ వ్యవస్థ మీద ఉన్న కసి.
ఇలాంటి అనేక లోతైన కారణాల బాహ్య స్వరూపమే ఈ ఉద్యమానికి లభించిన స్పందన. అంతిమంగా ఏం జరిగిందనేదాన్ని కాసేపు పక్కనబెట్టి, ఉద్యమం దాని తీరుతెన్నులూ పరిశీలించినప్పుడు కొన్ని పొరపాట్లూ ప్రమాదకర పోకడలూ మౌలికమైన తప్పులూ కనిపించాయనడంలో తప్పులేదు.

ఉద్యమం లో పొరపాట్లు:
  1. ప్రజాస్వామ్యంలో మనకేంకావాలో మనమేం అనుకుంటున్నామో చెప్పే హక్కు ప్రజలకెప్పుడూ ఉంటుంది. దాన్నెవరూ కాదనలేరు. కాకపోతే, తాము చెప్పిందే జరిగితీరాలనీ, తామే దేశప్రజలందరి ఆలోచనలకీ ప్రతినిధులమనే స్థాయికి ఉద్యమం వెళ్ళుండకూడదు.
  2. అసలు జన లోక్పాల్ గురించీ, అవినీతిని కట్టడి చేసే మార్గాల గురించీ జరిగే పోరాటం కాస్తా రాజకీయ వ్యవస్థకీ, పౌర సమాజానికీ జరుగుతున్న యుద్ధంలా మారుండకూడదు
  3. ఎన్నో లోపాలుండవచ్చు కానీ, మనకందరికీ అత్యంత విలువైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది విస్మరించకూడదు.
ప్రభుత్వం వైపు నుంచి తప్పులు/పొరపాట్లు:
  1. హజారే బృందంతో కలిసి చట్టాన్ని డ్రాఫ్ట్ చెయ్యబోవడం. తరవాత పార్లమెంటరీ వ్యవస్థ గొప్పదనం గురించి గొతు చించుకున్న ప్రభుత్వానికి ఈ బుద్ధి ముందే ఉండాల్సింది.
  2. హజారేని అరెస్ట్ చెయ్యడం, ప్రజాస్వామ్యం గురించీ రూల్ ఆఫ్ లా గురీంచీ తమకవసరమైనప్పుడు మొసలి కన్నీరు కార్చే ప్రభుత్వానికి ఈ పని చేసేటప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ ?
రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్:
  1. అసలు ఇంతమంది రాజకీయ వెత్తలుండీ ఇంత అత్యవసరమైన సమస్య కళ్ళముందున్నప్పుడు, ఏదో ఒక రాజకీయ శక్తే ఈ ఉద్యమం ఎందుకు చెయ్యలేదు ? 
  2. తీరిగ్గా వచ్చి హజారే ఆరోగ్యం, పార్లమెంట్ సార్వభౌమత్వం గురించి చెప్పడం కాకుండా అన్ని పార్టీలూ కలిసి లోక్ పాల్ చట్టం గురించి మంచి ప్రతిపాదనని ఎందుకు ప్రజల ముందు పెట్టలేక పోయారు? 
  3. ప్రజల్లో రాజకీయ వ్యవస్థ మీదా, నాయకుల మీదా ఇంత అపనమ్మకం, అసహనం, వ్యతిరేకతా ఉందనే విషయాన్ని ఎందుకు గమనించలేక పోయారు ?
పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన విషయాలు:
  1. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ వ్యవస్థ మీద అపనమ్మకం ఉన్నా ఎందుకు మనల్నెవరూ పట్టించుకోలేదు ? వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తేతప్ప మన అభిప్రాయాల్నీ ఆలోచనల్నీ రాజకీయ పార్టీలు ఎందుకు గమనించ లేక పోయాయి ?
  2. మనమసలు ఈ వ్యవస్థలో పాల్గొంటున్నామా ? రాజకీయాల్ని నిందిస్తూ తప్పించుకు తిరుగుతున్నామా లేదా ?
  3. ఆర్థికంగానూ, విద్య పరంగానూ మనం పొందిన ఉన్నతిని, మేధోపరంగానూ, సామాజికంగానూ ఈ దేశానికి అందిస్తున్నామా లేదా ?
  4. మనకి సరైనది అనే విషయాలకొచ్చేసరికి పద్దతులూ, చట్టాలూ అన్నీ వదిలేసి Mob Justice మాత్రమే సరైనది అనేలా ఆలోచించినప్పుడు మనం మేధోపరంగా ఏ స్థాయిలో ఉన్నట్టు ?
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ వ్యవస్థ నేర్చుకోవలసిన గుణపాఠాలు చాలానే ఉన్నాయి. వాటిని సరైన రీతిలో నేర్చుకోలేక పోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికీ, పార్లమెంటరీ వ్యవస్థకీ ప్రమాదమే. ఏదో సాధించామనో, ఇంత చేసినా ఏమీ జరగలేదనో ఆలోచన చెయ్యకుండా సరైన రీతిలో దేశ రాజకీయాల్ని అర్థం చేసుకొని అందులో భాగస్వాములవ్వాల్సిన అవసరాన్ని పౌర సమాజం ఇంకా గుర్తించక పోతే అప్పుడొస్తుంది ప్రజాస్వామ్యానికీ, పార్లమెంటరీ వ్యవస్థ కీ అతిపెద్ద ప్రమాదం.
 .

29 కామెంట్‌లు:

  1. >>కాకపోతే, తాము చెప్పిందే జరిగితీరాలనీ, తామే దేశప్రజలందరి ఆలోచనలకీ ప్రతినిధులమనే స్థాయికి ఉద్యమం వెళ్ళుండకూడదు.

    No one did that, even now, no one given assurance that those points will be included, parliament just agreed to pass those things to standing committee, even I or you can give our representation to it, but the thing is, those people wanted to show people unity and anger against corruption, nothing else.

    Ofcourse, stringent law is a necessity, govt is not willing, so they are adamant, you can't leave every thing to Parliament, esp most people are corrupted.

    >>పోరాటం కాస్తా రాజకీయ వ్యవస్థకీ, పౌర సమాజానికీ జరుగుతున్న యుద్ధంలా మారుండకూడదు

    It happens, esp if ruling party is not willing to change its corrupted ways, its fault of ruling party.

    >>మనకందరికీ అత్యంత విలువైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది విస్మరించకూడదు.

    YUP :)

    రిప్లయితొలగించండి
  2. విషయం limelight లో ఉన్నప్పుడు రాయకుండా ఎందుకండీ ఇప్పుడివన్నీ ?

    who will read this now? Its outdated :)

    రిప్లయితొలగించండి
  3. >>ఎన్నో లోపాలుండవచ్చు కానీ, మనకందరికీ అత్యంత విలువైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది విస్మరించకూడదు.

    బహుశ ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నిర్వచించుకోవాల్సిన సమయం ఆసంనమయినట్టుంది. ప్రజవామ్యం లో రాజకీయ జవాబుదారితనం కుడా వుండాలి. లేకపోతె ప్రజల నిరాశ నిస్ప్రుహలు ఇలానే బయటపడతాయ్. అది ప్రజవామ్య వ్యవస్థ ఉనికినే ప్రశ్నించే అవకాశం వుంది.

    రిప్లయితొలగించండి
  4. @తార,

    ధన్యవాదాలు.

    @అజ్ఞాత,

    ఎప్పుడు రాసినా ఒకటే కదా !

    @mmd,

    >> ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నిర్వచించుకోవాల్సిన సమయం ఆసంనమయినట్టుంది.

    కొత్తగా నిర్వచించుకోవలసిన అవసరం లేదండి. ఉన్న నిర్వచనం ప్రకారం సరిగ్గా పనిచెయ్య గలిగితే చాలు.

    రిప్లయితొలగించండి
  5. chattaalu chaalaane unnayi.. implementation lenappudu.. enni chattaalu undi em laabham.. I seriously wish this doesn't end up amongst those we already have but not used..

    రిప్లయితొలగించండి
  6. @ Shivudu గారు,

    Thank you for your comment.

    అవునండీ. ఉన్న చట్టాలని సరిగ్గా అమలు చెయ్యడం చాలా ముఖ్యం. కాకపోతే, అమలులో సమస్యలున్నాయని అవసరమైనప్పుడు కొత్త చట్టాలు చెయ్య కుండా ఊర్కోలేం కదా !

    మంచి చట్టాలూ చెయ్యాలి అమలు తీరునీ బాగు చెయ్యాలి. అన్ని సక్రమంగా జరిపించాలంటే పౌరులుగా మనం మరింత బాధ్యతతో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమవ్వాలి అనుకుంటాను నేను.

    రిప్లయితొలగించండి
  7. >>>>>>>>పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన విషయాలు:

    >>>>>>>>ఇంత పెద్ద ఎత్తున రాజకీయ వ్యవస్థ మీద అపనమ్మకం ఉన్నా ఎందుకు >>>>>>>>మనల్నెవరూ పట్టించుకోలేదు ? వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తేతప్ప >>>>>>>>మన అభిప్రాయాల్నీ ఆలోచనల్నీ రాజకీయ పార్టీలు ఎందుకు గమనించ >>>>>>>>లేక పోయాయి ?

    చాలా కారణాలున్నాయి. ఒక మోబ్ గా మన వోటు బాంక్ లో లేము కాబట్టి, మన అవసరం ప్రజా నాయకులకి లేదు కాబట్టి. అదే ఒక కులం/మతం/ఇంకా ఏదైనా వోటు బ్యాంక్ లో ఉండి ఉంటే కొద్దో గొప్పో మన గళం వినిపించుకునేవారేమో?

    >>>>>>మనమసలు ఈ వ్యవస్థలో పాల్గొంటున్నామా ? రాజకీయాల్ని నిందిస్తూ >>>>>>తప్పించుకు తిరుగుతున్నామా లేదా ?

    వ్యవస్థ లో ఏవిధం గా పాల్గొనాలని మీ ఉద్దేశ్యం? ఓటు హక్కు ని ఉపయోగించుకోవటం.. ఎవరు మెరుగైన నాయకులో నిర్ణయించుకునెంత నాలెడ్జ్ కలిగి ఉండటం, ఇంకా ఉన్న వాళ్లల్లో మెరుగైన నాయకుడి(రాలి)కే ఒటేయ్యటం.. అంతకు మించి సామాన్య మధ్య తరగతి వారికి జరిగే పనేనా?

    >>>>>>ఆర్థికంగానూ, విద్య పరంగానూ మనం పొందిన ఉన్నతిని, >>>>>>మేధోపరంగానూ, సామాజికంగానూ ఈ దేశానికి అందిస్తున్నామా లేదా ?

    ఇక్కడ కూడా..పన్నులు కడుతున్నాం, సమాజానికి మేలు చేయలేకపోయినా.. చేటు చేయకుండా ఉండటానికి చాలా వరకు సాధారణ ప్రజలు ప్రయత్నిస్తూనే ఉంటారని నా నమ్మకం.

    >>>>>>>>మనకి సరైనది అనే విషయాలకొచ్చేసరికి పద్దతులూ, చట్టాలూ అన్నీ >>>>>>>>వదిలేసి Mob Justice మాత్రమే సరైనది అనేలా >>>>>>>>ఆలోచించినప్పుడు మనం మేధోపరంగా ఏ స్థాయిలో ఉన్నట్టు ?
    పద్ధతులూ, చట్టాలూ ఉన్నాయి లెమ్మని సాధారణ ప్రజలు 'చట్టం తన పని చేసుకుపోతుందని ' తమ గొంతు ని వినిపించక్కరలేదంటారా?

    మీలాగే, 'అన్నా హజారే అన్న ప్రతి మాటకీ ఉన్న మద్దతు ఇది' అని నేననుకోను...మాకూ ఒక మోబ్, బలగం ఉంది. మేమూ ఈ వ్యవస్థ ని మార్చగలం.. అని తెలియచేయటానికి మధ్య తరగతి ప్రజలు ఎంచుకున్న మార్గమే ఆయన పోరాటానికి ఇచ్చిన మద్దతు.. అని నేననుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  8. క్రిష్ణప్రియ గారు,

    >> "చాలా కారణాలున్నాయి. ఒక మోబ్ గా మన వోటు బాంక్ లో లేము కాబట్టి, మన అవసరం ప్రజా నాయకులకి లేదు కాబట్టి."

    అవును, అదే. ఎందుకు ఇంత పెద్ద మధ్యతరగతి సమాజం ఓట్ బ్యాంక్ కాలేక పోతుంది ?

    మన అవసరం లేదు అనుకునేలా ప్రజా నాయకులు మనగలగడం ఎలా సాద్యం ? బాద్యత పూర్తిగా పరిస్థితులదేనా? మనకేం లేదా ?

    >>"అదే ఒక కులం/మతం/ఇంకా ఏదైనా వోటు బ్యాంక్ లో ఉండి ఉంటే కొద్దో గొప్పో మన గళం వినిపించుకునేవారేమో?"

    మీరన్న కులం/మతం వీటికి అతీతంగా ఉన్నారా ఈ వర్గాలన్నీ !! ఓట్ బ్యాంక్ లో అక్కర్లేదు ఓటర్లుగా ఉండి మనకి వీలయినంత మెచ్యూర్డ్ ఓటర్లగా ఉంటే చాలు.

    రిప్లయితొలగించండి
  9. క్రిష్ణప్రియ గారు,

    >> "వ్యవస్థ లో ఏవిధం గా పాల్గొనాలని మీ ఉద్దేశ్యం? ఓటు హక్కు ని ఉపయోగించుకోవటం.. ఎవరు మెరుగైన నాయకులో నిర్ణయించుకునెంత నాలెడ్జ్ కలిగి ఉండటం, ఇంకా ఉన్న వాళ్లల్లో మెరుగైన నాయకుడి(రాలి)కే ఒటేయ్యటం.. అంతకు మించి సామాన్య మధ్య తరగతి వారికి జరిగే పనేనా?".

    సరిగ్గా చెప్పారు. ఇవి చెయ్యగలిగితే చాలు. Atleast that's a good beginning and definitely can make a huge change.

    >> "సమాజానికి మేలు చేయలేకపోయినా.. చేటు చేయకుండా ఉండటానికి చాలా వరకు సాధారణ ప్రజలు ప్రయత్నిస్తూనే ఉంటారని నా నమ్మకం."

    Totally agreed. Only thing I am asking is.. "we can afford to sit back sometimes" ఆటిట్యూడ్ నుండి "we can afford to think and participate" వైపుగా పయనిస్తే పరిస్థితులు బాగుపడే అవకాశం ఉంటుంది.

    >> "పద్ధతులూ, చట్టాలూ ఉన్నాయి లెమ్మని సాధారణ ప్రజలు 'చట్టం తన పని చేసుకుపోతుందని ' తమ గొంతు ని వినిపించక్కరలేదంటారా?"

    ఎవరన్నారు అలా ? చట్టం తనపని తాను చెయ్యనప్పుడు నిలదీయాల్సిందే. కాకపోతే, మనం అనుసరించే పద్దతులు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బావుంటుందనే ఆశ అంతే. Sometimes, it may be required to go a little overboard for practical reasons. That doesn't make us justify it. We still need to feel it as wrong so that we can make amends when there is a change in the situation next time.

    రిప్లయితొలగించండి
  10. క్రిష్ణప్రియ గారు,

    ఆలోచనాత్మకమైన వ్యాఖ్య వ్రాశారు. ధన్యవాదాలు. We might see things differently. But it is important to keep thinking. No one is right or no one is wrong. As long as all of us are putting our brains together, as a society we will definitely make great choices. Our democracy has shown that maturity and dynamism so far.

    రిప్లయితొలగించండి
  11. బాగా అనాలసిస్ చేసారు, తీరిగ్గా పడక కుర్చీలో కూచుని, బఠాణీలు/సెనగపప్పు తింటూ ఆలోచించాల్సిన విషయం. మన పెజా సామ్యం గొప్పది అన్న మాట బాగుంది, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది.

    రిప్లయితొలగించండి
  12. @అజ్ఞాత,

    వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. Enjoy your arm chair thinking :)

    రిప్లయితొలగించండి
  13. >> ఇలాంటి అనేక లోతైన కారణాల బాహ్య స్వరూపమే ఈ ఉద్యమానికి లభించిన స్పందన.

    YUP. you are right on that one

    రిప్లయితొలగించండి
  14. కార్పెరేట్ల ఫండింగ్ తో, ఒక ప్యూడల్ పేట్రియాట్ నడిపిన ఉద్యమానికి, మీడియాతప్ప మరే ప్రజాస్వామ్యాన్నీ ఖాతరుచెయ్యని గ్లోబల్ మెల్ట్ దౌన్ తో ఇన్సెక్యూర్ గా మారిన మధ్యతరగతి మద్దత్తునిచ్చి కాపాడుకున్న మిథికల్ ఉద్యమం నుంచీ చాలా నేర్చుకోవాలి. అవి కొంచెం వేరే ఉంటాయి మరి!

    రిప్లయితొలగించండి
  15. ఈ రకమయిన ఉద్యమాలు ఆరోగ్యకరమయినవి. ఈ వేడి ఎన్నికలప్పుడు కూడా ఉంటే బాగా పనికొస్తుంది.

    రిప్లయితొలగించండి
  16. ఫ్యూడల్ పెట్రియాట్!!! అన్నా హజారే కార్పరేట్ ఫండింగ్ దన్ను చూసుకుని ఉద్యమాన్ని నడిపారంటారా? ఉద్యమం సాగిన తీరు/టార్గెట్ లో లోపాలుండ వచ్చు గాక! ఆ 'మిథికల్' ఉద్యమం లో కానీ, 'మిథికల్' ఉద్యమం లో పాల్గొన్న 'ఇన్సేక్యూర్' మధ్య తరగతి వారిలో కానీ మెరిట్/ఒక మంచి ఉద్దేశ్యం ఏమీ లేదంటారా?

    రిప్లయితొలగించండి
  17. మహేష్ గారు,

    మీ నుండి ఇలాంటి వ్యాఖ్య Expect చెయ్య లేదండీ.

    హ్మ్మ్, ఎలా చెప్పాలి...! సరే మీ భాషలో చెప్పాలంటే.. అపోహల మీద నిర్మించబడిన ఎమోషనల్ రెటొరిక్ లా ఉంది మీ వ్యాఖ్య.

    I expected the direction of it but I did not expected the degree of it. Let me dissect..

    >>కార్పెరేట్ల ఫండింగ్ తో

    మీ కారణాలు మీకుండొచ్చు. అవి తప్పయినా కాకున్నా, అయితే ఏంటి? కార్పోరేట్ల ఫండింగ్ తో జరిగితే అదేమన్నా డిస్క్వాలిఫికేషనా ?

    >> ఒక ప్యూడల్ పేట్రియాట్ నడిపిన ఉద్యమానికి

    so what ? Even if he is what you you said... I think this is personal attack. The issue at hand is much larger than personalities.

    >> మీడియాతప్ప మరే ప్రజాస్వామ్యాన్నీ ఖాతరుచెయ్యని

    To some extent I am OK with you here. But I think this tendency is there in everyone and we need to control it.

    >> గ్లోబల్ మెల్ట్ డౌన్ తో ఇన్సెక్యూర్ గా మారిన మధ్యతరగతి

    This is a completely baseless figment of imagination. Thereare not enough reasons to suggest any immediate insecurity as of now and its relavance to this movement.

    >> మిథికల్ ఉద్యమం

    ఉన్నదానికంటే కొంచెం మీడీయా ఎక్కవ చేసుండొచ్చు. కానీ మిథికల్ అని ఎలా అనగలం? మీదియా చెప్పునట్టూ బిలియన్ పీపుల్ కాదు గానీ, లక్షల మందిని మిథికల్ అని సరిపెట్టుకోలేం కదా.

    రిప్లయితొలగించండి
  18. @>>>'మిథికల్' ఉద్యమం>>>>> పాల్గొన్న 'ఇన్సేక్యూర్' మధ్య తరగతి >>> మెరిట్/ఒక మంచి ఉద్దేశ్యం ఏమీ లేదంటారా?

    కృష్ణ ప్రియ గారు,

    ఈ ఉద్యమం వల్ల ఏ మనిషి మారలేదు అనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి
  19. >> మధ్య తరగతి వారిలో కానీ మెరిట్/ఒక మంచి ఉద్దేశ్యం ఏమీ లేదంటారా?

    ఎన్నో అంశాల మీద వారికున్న అపోహల వెనకా, కావాలని చూపించే నిర్లిప్తత వెనకా కొన్ని సొంత రిజర్వేషన్స్/సందేహాలు ఉన్నాయని తెలియదా ?

    రిప్లయితొలగించండి
  20. @ శ్రీ గారు,

    ధన్యవాదాలు. అవునండీ, ఎన్నికలప్పుడనే కాదు, సాధారణంగా రాజకీయ, సామాజిక అంశాల మీద ఇందులో ఎంతోకొంత ఉంటే బావుంటుంది.

    @ Mouli గారు

    ధన్యవాదాలు. మీరు మరీ Simplify చేశారనిపిస్తుంది. ముందు అర్థం చేసుకోవటం అలవాటయితే మార్పు అదే వస్తుందండీ. ఎందుకంటే మెజారిటీ ప్రజలు సహజంగా మంచి వాళ్ళు కాబట్టి.

    రిప్లయితొలగించండి
  21. @ క్రిష్ణప్రియ గారు,

    >> ఉద్యమం సాగిన తీరు/టార్గెట్ లో లోపాలుండ వచ్చు గాక! ఆ 'మిథికల్' ఉద్యమం లో కానీ, 'మిథికల్' ఉద్యమం లో పాల్గొన్న 'ఇన్సేక్యూర్' మధ్య తరగతి వారిలో కానీ మెరిట్/ఒక మంచి ఉద్దేశ్యం ఏమీ లేదంటారా?

    మీ point of view అర్థమయ్యింది. చిన్న thought provoking suggesstion ఏంటంటే, ప్రజలు అనేక మంది చేసిన అనేక ఉద్యమాల విషయంలో ఎన్నిసార్లు ఇలాంటి passionate రియాక్షన్స్ వస్తాయి? వాటిల్లో ఎన్నిట్లో మెరిట్/మంచి ఉద్దేశ్యం/real underlying greivance కనపడింది? ఎవరో స్వార్ధం కోసం చేస్తుంటే డబ్బుల కోసం, బిరియాని పొట్లాల కోసం వచ్చారు అని ఎన్ని సందర్భాలలో ఆ ప్రజలందరూ తూలనాడబడ్డారు?

    Why are we so dismissive of the people who do not fit the bill of our views and aspirations? And surprisingly we adopt a completely different line of thought on other issues quite unabashedly.. I should say.

    This is not criticism on you. As an ordinary middlecalss person I am just thinking aloud. Hope you can understand that.

    రిప్లయితొలగించండి
  22. నిజానికి అవినీతిని పుష్కలంగా పెంచిపోషిస్తున్న నవీనమధ్యతరగతి హఠాత్తుగా తేరుకుని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఒక గాంధేయవాదిని (whatever it means) సపోర్ట్ చేసి, పార్లమెంటుని, బ్యూరోక్రసీని దోషులుగాచేసేసి, ఒకచట్టం చేసేస్తే అవినీతి అంతమై తమ జేబులు భద్రంగా ఉంటాయనుకోవడం ఆనందకరమైన పరిణామమే అయినా, వ్యవస్థమొత్తం నాశనమైపోయిందని ప్రత్యామ్న్యాయంగా ఒక ప్యారలల్ వ్యవస్థని ఏర్పాటుచేసి, అందులో దేవలోకం నుంచీ దిగుమతిచేసుకున్న పవిత్రాత్మలతో నింపి, వారిచేత చట్టసభలను, న్యాయవ్యవస్థను, బ్యూరోక్రసీనీ అవినీతిమయం కాకుండా కాపాడతారు అని చెప్పే ఒక మొండి బిల్లుని గుడ్డిగా సమర్థిచెయ్యడం “పోటా పెడితే టెర్రరిజం అంతమయిపోతుంది” అని చెప్పే భారతీయజనతాపార్టీ నినాదంకన్నా సిల్లీ కాదా!

    రిప్లయితొలగించండి
  23. 'కోటా పెడితే, 50ఏళ్ళుగా పొడిగిస్తూ పోతే సామాజిక అసమానతలు అంతమపోతాయి" అనేది సిల్లీ కానప్పుడు, ఇదీ సిల్లీ ఎందుకవుతుంది?

    రిప్లయితొలగించండి
  24. @మహేష్ గారు,

    హ్మ్మ్.. ఈ ఉద్యమం తీరులనూ లేక పరిస్థితుల్లోనూ కొన్ని ప్రమాద సూచికలు ఉంటే ఉండొచ్చు. కానీ వాటిని పౌరసమాజం బానే గుర్తించగలిగింది కదండీ ! ఈ ఉద్యమం ఊపుతో పార్లమెంటరీ వ్యవస్థకీ, ప్రజాస్వామ్య వ్యవస్థకీ సవాలు విసురుతారు అనే ఆందోళనే మీ అపనమ్మకానికి కారణం అనిపిస్తుంది.

    If that is the case, then be relaxed. As a society we might step over the line occationally. But our democracy is very dynamic and strong. Our people are very sensible and we know what is just and best for us.

    ఉద్యమం సాధించిన ఫలితాలైనా, మీరు ఊహిస్తున్న ప్రమాదాలైనా కేవలం ఉద్యమం మీద దాని సత్వర పరిణామాల మీదా ఆధార పడవు. దీన్నుంచి ఒక సమాజంగా మనం ఏం నేర్చుకున్నాం? భవిష్యత్తులో ఎలా ఆలోచించబోతున్నాం ? అనే వాటి మీద అధార పడి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  25. అవినీతిలో % కోటాలుండాలని ఎవరైనా ఉద్యమించాలి.

    రిప్లయితొలగించండి
  26. >>>ఏదో ఒక రాజకీయ శక్తే ఈ ఉద్యమం ఎందుకు చెయ్యలేదు ?

    అన్నాహజారే రాజకీయశక్తి కాకపోవటం వల్లనే, అ౦దరి మద్దతు లభి౦చి౦ది. ప్రజలయినా , రాజకీయ వర్గాలయినా !

    >>>>తీరిగ్గా వచ్చి హజారే ఆరోగ్యం, పార్లమెంట్ సార్వభౌమత్వం గురించి చెప్పడం కాకుండా అన్ని పార్టీలూ కలిసి లోక్ పాల్ చట్టం గురించి మంచి ప్రతిపాదనని ఎందుకు ప్రజల ముందు పెట్టలేక పోయారు?

    ఇప్పుడేదో అన్నిపార్టీలూ కలిసి లోక్ పాల్ చట్టం గురించి క౦కణమ్ కట్టుకొన్నట్లు!


    >>>>>ప్రజల్లో రాజకీయ వ్యవస్థ మీదా, నాయకుల మీదా ఇంత అపనమ్మకం, అసహనం, వ్యతిరేకతా ఉందనే విషయాన్ని ఎందుకు గమనించలేక పోయారు ?>>>>

    వాళ్లకు(నాయకులు) కూడా ప్రజల౦టే అపనమ్మకం, అసహనం ఉన్నాయని మనం కూడా గమని౦చాలి !

    రిప్లయితొలగించండి
  27. ఇంతకాలం ఓపిక పట్టిన ప్రజలు తమలో దాగి ఉన్న ఆవేశం వెళ్ళగక్కే అవకాశం దొరకగానే ప్రతిస్పందించారు.
    ప్రతిపక్షం నిద్రపోతున్నవేళ దొరికిన నాయకుడి వెంటనడిచి ప్రజలు నిద్రపోవడంలేదని నిరూపించారు.

    రిప్లయితొలగించండి
  28. ఎంత మూర్ఖంగా వాగుతారో తెలుస్తోంది. గట్టి చట్టాలు చేస్తే అది విచ్చలవిడి అవినీతి చేసేవారికి deterrentగా పనిచేస్తుంది. ఏదో గుర్తింపుకోసం వుల్టాసీధా మాట్లాడే వాళ్ళు కోటాలు, అట్రాసిటీ చట్టాల ద్వారా ఏదో ఒరుగుతుందని ఎలా అనుకుంటున్నారోమరి! మొన్న మొన్న తెరాస MLAలు కెమరాలు ఏర్పాటుచేసుకుని ఓ దళీత వుద్యోగిని కొట్టాడు. ఆట్రాసిటీ చట్టాలు విఫలమయ్యాయని, రద్దుచేసేయాలా? అక్కడ మాత్రం గట్టి చట్టాలు కావాలి, అవినీతిపై మాత్రం అర్థంలేని లాజిక్కులు, చూసీ చూడనట్టు పోవాలి అని మరీ అంత నిర్లజ్జగా చెప్పుకునే స్థితికి జనాలు ఎదిగారు.

    రిప్లయితొలగించండి
  29. chedu vinaki,chedu choodaku, chedu matladaku anna ee principles machivi kavani manam namme roju daggaralo vunnatunnaee..

    రిప్లయితొలగించండి