16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

నరేంద్ర మోడీ.. నరేంద్ర మోడీ.. so.. what's the deal !!

నరేంద్ర మోడి, ఈ పేరే ఒక సంచలనం. చాలా మంది దృష్టిలో హీరో గానో, లేకా అతి దుర్మార్గుడిగానో ముద్ర వేసుకున్నాడు అనడంలో సందేహమే లేదు. దేశ రాజకీయాలనీ, భావోద్వేగాలనీ అత్యంత ప్రభావితం చెయ్యగల అతికొద్ది పేర్లలో ప్రస్తుతం ఇది అతి ముఖ్యమైన పేరు. గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళనీ, అంతే గుడ్డిగా సమర్ధించేవాళ్ళనీ ఇంత మందిని తయారు చెయ్యగలిగాడంటే ఖచ్చితంగా ప్రతిభావంతుడే. నిజా నిజాలూ ఏంటి అనేదాని మీద బోలెడు వాదనలూ దృక్కోణాలూ.. వీటి మధ్యలో మనమేం అర్థం చేసుకోవాలి? నేను చదివిన దాన్నిబట్టీ అర్థం చేసుకున్నదాన్నిబట్టీ ముఖ్యంగా నాకు అర్థమయ్యిన విషయాలేంటంటే:

  1. 2002 లో జరిగిన మారణకాండ కి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ప్రోత్సాహం అందించాడనీ, కావాలనే ఒక వర్గానికి వత్తాసు పలికాడనీ ఉన్న ఆరోపణల్లో కొంత క్రెడిబిలిటీ ఉందనిపిస్తుంది.
  2. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా అభివృధ్ధి సాధించాడు. (కొన్ని గణాంకాలూ, మీడియా అభిప్రాయాలూ అన్నింటికంటే ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు చూసిన మీదట ఏర్పడిన అభిప్రాయం )
  3. సమర్ధవంతమైన, బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న రాజకీయవేత్త (వ్యక్తిగతంగా డబ్బు కోసం అవినీతికి పాల్పడడు అని జరుగుతున్న ప్రచారంలో కూడా కొంత క్రెడిబిలిటీ కనిపిస్తుంది)

ఇంక మోడీ గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు వేరు వేరు దృక్పధాల్లో వ్యక్తం చేస్తున్నారు. కొంత మందేమో మాకు మొదటి దాంట్లో మోడీ ప్రవర్తన ఎంతమాత్రం సమ్మతంకాదు కాబట్టి మిగిలిన రెండూ అంశాలతో మాకు పనిలేదు అనే వాళ్ళు. ఇంకొందరేమో..ఏదో 2002 లో జరిగి పోయింది. మిగిలిన రెండు అంశాల్లో బానే ఉన్నాడుగా దాన్ని బట్టి చూద్దాం అంటారు.
పై రెండు వాదాలతో పెద్దగా పేచీ లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. పరిస్థితులనిబట్టీ , అవగాహననిబట్టీ, దృక్పధాలు మారుతుంటాయి. అది వాళ్ళ అభిమతానికే వదిలేయవచ్చు. నాకొచ్చిన చిక్కల్లా పై రెండూ కాకుండా వేరే వాదనలు చేసే వాళ్ళతోనే..
  • మొదటిదాంట్లో మోడీ చేసింది సరైనదే. మాకు ఆవిషయం మీదే మోడీ గొప్ప అంటారు.
  • మొదటి కారణం వల్ల మాకు మోడీ నచ్చడు కాబట్టి, అసలు మోడీ ఇతర సుగుణాలని గుర్తించటం మాట అటుంచి చూడటానికీ, వినటానికీ కూడా మేం ఒప్పుకోం అంటారు. అసలవి లేనే లేవని వాదిస్తారు. వీళ్ళ వాదనలోని డొల్లతనాన్ని మోడీకి ఒకరకమైన మద్దత్తుగా ఉపయోగించాలనుకునే వాళ్ళూ ఉన్నారనుకోండి.

ఇంత గందరగోళం మధ్య స్పష్ఠత రావాలంటే ఆలోచించాల్సినవిషయాలు చాలా ఉన్నాయి. ఏ సమర్ధతా లేకుండానే ప్రజలు ప్రతిసారీ మోడీని గెలిపిస్తున్నారా? గెలిపిస్తున్నారు అంటే, ప్రజలు 2002 మారణకాండ విషయంలో మోడీ పాత్ర లేదని నమ్మినట్టేనా ? మారణకాండ విషయంలో మోడీ వైఖరికి ప్రజలు మద్దత్తు ఇచ్చారనా ? మారణకాండ విషయంలో తప్పు జరిగినప్పటికీ, మిగిలిన విషయాల్లో మోడీ ప్రతిభా పాటవాలకి విలువిచ్చి గెలిపిస్తున్నారనా ? మారణకాండ విషయంలో వ్యతిరేకించినా, మోడీ లా మెరుగైన పరిపాలన అందించేవాళ్ళు లేకపోవడం వల్ల, అటువంటి ప్రత్యామ్నాయం దొరికేవరకూ ఇదే మంచిది అనుకొనా?
గుజరాత్ లో ప్రజలు మతాల వారీగా పూర్తిగా విడిపోయుండటం వల్లే ఇది జరుగుతుందా ? నా దృష్టిలో ఇది ఇంతకాలం సాధ్యం కాకపోవచ్చు. మతాలవారీ ఉన్మాదం కొన్ని సందర్భాలలో ఉంటుందనేది వాస్తవమే అయినా, ఇంత దీర్ఘకాలం అది అలాగే నిలిచిఉంటుందనేది నమ్మడమంటే నాకైతే, ఈ దేశ ప్రజల్ని అవమానించడమే అనిపిస్తుంది.
పై ప్రశ్నల్లో మనకీ, మన వాదనలకీ ఏది అనుకూలంగా ఉంటే దాన్ని నమ్మటం సహజంగా చాలా మందికి ఉండే బలహీనతే. అందులో తప్పులేదు. ఆ బలహీనతని అధిగమించేలా ప్రజని చైతన్య పరచడం సరిగ్గా చెయ్యగలిగే నాయకుల్ని తాయారు చేసుకోలేకపోవడం మనందరి ఫెయిల్యూర్. సరే.. నేను చెప్పాలనుకుంటున్న దాన్ని సూటిగా చెప్పాలంటే:
మోడీ వ్యతిరేకులకి:
  • ఒకవేళ 2002 మారణకాండలో మోడీ వైఖరి గనుక చాలా మంది ఆరోపించినట్లుగా ఉండి ఉన్నట్టయితే, ఒక సమాజంగా మనం దాన్ని నిర్ద్వందంగా గర్హించాల్సిందే. అదే సమయంలో మోడీ అందించే పరిపాలనకి ధీటైన ప్రత్యామ్నాయం మేమివ్వగలం అని మోడీని వ్యతిరేకించేవాళ్ళు ప్రజల్లో విశ్వాసం నింపగలగాలి. అప్పటివరకూ మోడీ చేసే పరిపాలన గురించి నిష్పక్షపాతంగా సద్విమర్శలు చేస్తూ, 2002 లో మోడీ చేసింది ఎంత ప్రమాదకరమైనదో, అటువంటి వాటిని ఎందుకు వ్యతిరేకించాలో ప్రజలకు వివరించాలి.
  • మోడీ చేస్తున్న పరిపాలననీ అభివృధ్ధినీ లేదన్నట్టుగా ప్రవర్తించడం మానుకోవాలి.

 మోడీని సమర్ధించే వారికి:

  • 2002 ని వదిలేసి, పరిపాలన విషయంలో బావుంది కదా, దాని మీదే మోడీ ని అంచనా వేద్దాం అనేది సరైన ఆలోచన కాదు. ఒకవేళ అలా జరగాలంటే, మోడీ నిజాయితీగా, 2002 లో తన మీద ఆరోపించబడుతున్న విధమైన ఆలోచనలు, దుశ్చర్యలూ తప్పు అని నమ్మి దాన్ని ప్రజలకి నమ్మకంకలిగేలా పశ్చాత్తాపం ప్రకటించగలిగితే, అప్పుడు కుదురుతుంది.  
  • జరిగిన అభివృధ్ధి మాటున 2002 ఘాతుకాలని సమర్ధించే ప్రయోగాలు మానుకోవాలి.
------------------------------------------------------------------
మారణకాండకి వత్తాసు పలికిన విషయంలో నేనైతే మోడీకి బద్దవ్యతిరేకిని. వ్యతిరేకించినంత మాత్రాన మోడీలో ఉన్న మిగతా మంచి లక్షణాలని చూడలేక కళ్ళుమూసుకోవడం మాత్రం నా వల్ల అయ్యే పనికాదు. మిగతా అంశాల్లో బానే ఉన్నాడుకదా అని, 2002 ప్రవర్తనని ఉదారంగా మర్చిపోవడమూ లేదా అసలదేమీ జరగలేదన్నట్టు నటించడమూ నావల్ల అయ్యే పనికాదు.

24 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా చెప్పారు. నిజానికి మోడీని సమర్ధించే వాల్లు అంతా హిందూత్వ వాదులు కాదు, ఆయన్ను వ్యతిరేకించే వాల్లంతా సెక్యులరిస్టులూ కాదు. చాలామంది నమ్మేది ఏమిటంటే, ఏమీపనిచేయని మోసకారి రాజకీయనాయకుల కన్నా, చెడ్డవాడనిపించున్నా కొద్దో గొప్పో ప్రజల కోసం పనిచేసే రాజకీయనాయకుడు మిన్న అని మాత్రమే.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. @Srikanth M గారు,
    మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. తమకి నచ్చిన నాయకుడు చేస్తే అభివృద్ధి అనీ, నచ్చని నాయకుడు చేస్తే అవినీతి అనీ అనుకునేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పరిచయమైన అతను బీహార్ అంటేనే అవినీతి అనీ, బీహార్ ఎప్పటికీ బాగుపడదనీ వాదించాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఓడిపోయిన తరువాత బీహార్‌లో అవినీతి తగ్గింది, కులపరమైన హింస కూడా తగ్గింది. నితీశ్ కుమార్ నరేంద్ర మోడీని వ్యతిరేకించాడనే ఒకే కారణం చెప్పి బీహార్‌ని అవినీతి రాష్ట్రం అన్నాడు. గుజరాత్‌లోనూ అవినీతి ఉంది. నరేంద్ర మోడీ గ్లోబలైజేషన్ విధానాలని పక్కాగా అమలు చేశాడు కాబట్టి గ్లోబలైజేషన్ విధానాలు నచ్చినవాళ్ళు మోడీని పొగడడానికి గుజరాత్‌లో అవినీతి లేదని వాదిస్తారు. బహుళజాతి కంపెనీలవాళ్ళు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి సౌకర్యాలు ఉన్న అహ్మదాబాద్ లాంటి నగరాలలోనే కార్యాలయాలు పెడతారు కానీ ఇతర ప్రాంతాలలో కార్యాలయాలు పెట్టరు. నరేంద్ర మోడీ కాకుండా ఇంకొకడు గుజరాత్ ముఖ్యమంత్రి అయినా అతను అహ్మదాబాద్‌లోని మౌలిక సౌకర్యాలని చూపించి ఆ నగరంలో బహుళజాతి కంపెనీల చేత పెట్టుబడులు పెట్టించగలడు. విదేశీ పెట్టుబడులని చూపించి నరేంద్ర మోడీ ఒక్కడే హీరో అనుకుంటే అది ఏమీ తెలియనితనమే అవుతుంది.

    రిప్లయితొలగించండి
  5. మారణకాండ -1: హిందువులను Train లొ చంపడము

    మారణకాండ -2: దానిని నిరసిస్తు ప్రజలు తిరుగుబాటు చేయడము. It is difficult to control angry mob. Don't you see this as part of Arab Spring movement.

    చర్య కు వేతిరేక చర్య ఎప్పుడు ఉంటుంది. దీనినే ఇంగ్లీషు లొ Tit for Tat అంటారు.

    ఒక పక్షము వాళ్ళే ఎప్పుడు receiving end లొ ఉండరు కదా!.

    రిప్లయితొలగించండి
  6. మోదీపై నా అభిప్రాయం నూరుశతమూ ఇదే! ఆయన చెసిన వెధవపనిని గర్హిస్తున్నాను. కానీ ఆయన అభివృధ్ధిని మాత్రం స్వాగతిస్తున్నాను. ఈ రెండింటికీ linking గా ఒక సిన్సియర్ అపాలజీ చెఫ్ఫుంటే బాగుండేదని అనుకుంటున్నాను (దాని పరిణామాలెలావుంటాయో తెలుసు అయినప్పటికీ let the "people" decide what is right)

    రిప్లయితొలగించండి
  7. ఈవిషయంలో మీ అభిప్రాయం బాగానే వుంది. గోద్రా రైలు దహనానికి పాల్పడి, అల్లర్లను లేపిన మాబ్ మీద, నేషనలిస్ట్ భావాలు కల RSSలాంటి సంస్థ నేపథ్యం కల మోడీ ఆ మాబ్‌కు వ్యతిరేకంగా స్పందించి వుండటం సహజమే ఐనా తప్పే. ఏదో ఒకటి/రెండు తప్పులు చేశాడని వాటినే భూతద్దంలో చూపిస్తూ పబ్బం గడుపుకునే కమ్యూనిస్ట్/సూడో-సెక్యులరిస్ట్ పార్టీల లా కాక అతడు సాధించిన అభివృద్ధికి ఎక్కువ వెయిటేజి ఇవ్వాలనుకుంటా. వామన పచ్చాలు 26ఏళ్ళు బెంగాల్‌లో వుండి, దాన్ని ఓ బీద రాష్ట్రంగా చేశారు. వూచకోతలు కోయలేదా? అంటే కోశారు ( నందిగాం, శరణార్థులు, ఆనదమార్గ్ వగైరాలు), కాని అది కప్పెట్టేసి మార్క్స్ అది రాశాడు, ఇది రాశాడు అని మార్క్స్ పేరు మీద ఓట్లడుక్కుంటూ వుంటారు.
    చవటలు ముఖ్యమంత్రులుగా మనకూ వున్నారు, ఏం బావుకున్నామని?! వీసా నిరాకరించిన అమెరికాతోనే మోడీ మంచి అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నాడు. ఏదీ కిరణ్కుమార్ రెడ్డి, రోశయ్య, ... ఎప్పుడైనా అలా ప్రశంశలు పొందారా?

    ఈ పొగడ్తలు, మోడీ ఇంకా మెరుగు పడేందుకు(గోద్రాలాంటి విషయాల్లో ఏవైనా 'చారిత్రిక తప్పిదాలు' నిజంగా చేసివుంటే..) వుపయోగిస్తాయని అనుకుంటూ, మోడీని మెచ్చుకుంటున్నా.

    రిప్లయితొలగించండి
  8. @ Praveen Sarma గారు,

    మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

    >> "తమకి నచ్చిన నాయకుడు చేస్తే అభివృద్ధి అనీ, నచ్చని నాయకుడు చేస్తే అవినీతి అనీ అనుకునేవాళ్ళు ఉన్నారు."

    True. That is the problem most of us have in varying degrees. It got to be controlled.

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత (16 సెప్టెంబర్ 2011 11:53 సా),

    నేను మీతో అంగీకరించలేను. రెండూ మారణకాండలే. ఒక మారణకాండ విషయంలో మీరు వాడిన పదజాలం చూస్తే మీ ఆలోచనల్లోని ప్రమాదకర ధోరణిని ఆలోచించగల వాళ్ళెవరైనా పసిగట్టగలరు.

    >> "మారణకాండ -2: దానిని నిరసిస్తు ప్రజలు తిరుగుబాటు చేయడము."
    ఏంటి? "నిరసిస్తూ ప్రజల తిరుగుబాటా" !!!!. enough of your subtlities. At least I am not falling into these subtle traps.


    >> "It is difficult to control angry mob. Don't you see this as part of Arab Spring movement. చర్య కు వేతిరేక చర్య ఎప్పుడు ఉంటుంది. దీనినే ఇంగ్లీషు లొ Tit for Tat అంటారు. ఒక పక్షము వాళ్ళే ఎప్పుడు receiving end లొ ఉండరు కదా!"

    My problem is not with the limitations of our capacity to control angry mobs. Though I am worried about the fact that there are so many people who readily resort to such barbaric thinking.. I am not too much worried about that also Since I know our religions and the democratic and educational institutions will work on making it better. Our main worry should be the fact that a Government itself trying to be partisan and encouraging the barbaric activities of some.

    If you and some people like you are seeing such idiotic and inhuman stuff as part of an "Arab Spring Movement" and hiding your onesided and communial minds behind terms like "Tit for Tat " ... then that is something that really worries me. But be sure.. you have ME and millions like me who can stand up to these tendencies.

    రిప్లయితొలగించండి
  10. మోడీ మారణకాండకు, ఓడకుండా గెలవడానికీ కేవలం మతమో మతోన్మాదమో మాత్రమే కారణం కాదు. అంతకు మించి ఆర్థిక కారణాలు చాలా ఉన్నాయని అనిపిస్తుంది. సోమ్ నాథ్ ఆలయాన్ని మధ్యభారతంలో కొల్లగొట్టడం నుంచీ, మొన్నటి హింసాకాండవరకూ. ఇప్పటి రాజకీయ గెలుపు నుంచీ, రాబోయే కాలంలో మోడీని ప్రధానమంత్రి పదవి కి కాంటెస్టంటుగా నిలబెట్టేవరకూ గుజరాతీల ఆర్థికాఅలోచనే మతంకన్నా ఎక్కువగా కనిపిస్తుంది నాకెందుకో...

    రిప్లయితొలగించండి
  11. @ Snkr గారు,

    >> " గోద్రా రైలు దహనానికి పాల్పడి, అల్లర్లను లేపిన మాబ్ మీద, నేషనలిస్ట్ భావాలు కల RSS లాంటి సంస్థ నేపథ్యం కల మోడీ ఆ మాబ్‌కు వ్యతిరేకంగా స్పందించి వుండటం సహజమే ఐనా తప్పే."

    మోడీ చేసిందానికి కారణాలేవైనా, అసలు జరిగిందని చెప్పబడుతున్న విషయం తప్పే అని చెప్పగలిగిన మీ అభిప్రాయాన్ని గౌరనివిస్తున్నాను,అభినందిస్తున్నాను.

    మీ వ్యాఖ్యలోని మిగిలిన అంశాల విషయంలో కొద్దిగా అభిప్రాయ భేదాలున్నా అవి ఈ టపాకు అంతగా సంబంధం లేని విషయాలు కాబట్టి వాటి గురించి మరోసారెప్పుడైనా చర్చిద్దాం.

    రైలు దహనం చేసిన మాబ్ అయినా, విచక్షణా రహితంగా ఊచకోతకు పాల్పడిన మాబ్ అయినా నా దృష్టిలో ఒకటే. ఈ రెండు మాబ్ ల కన్నా, ఒక వర్గానికి మద్దత్తు పలికి ఊచకోతని ప్రోత్సహించిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశానికీ, ప్రజలకీ ఎక్కువ ద్రోహం చేసిందని నా అభిప్రాయం.

    RSS నేషనలిస్ట్ భావాలు అంటే, హిందూ నేషనలిస్ట్ అనా? హిందూ ఫండమెంటలిస్ట్ అనా ? సెక్యులరిస్ట్ అనా ? సూడో సెక్యులరిస్ట్ అనా ?
    నాకు ఈ విషయం మీద క్లారిటీ లేదు కాబట్టి, దీని గురించి నేనేమీ వ్యాఖ్యానించలేను.

    రిప్లయితొలగించండి
  12. @మహేష్ గారు,

    మీరొక కొత్త దృక్కోణాన్ని ప్రతిపాదించారు. హ్మ్.. నాకు ఈ దృక్కోణం మీద అంతగా అవగాహన లేదు, ఇంకా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. వారాంతం గారు,

    మీ ఏమనుకోనంటే ఓ ప్రశ్న అడుగుతాను. మీ పోస్ట్లన్నీ అటూఇటూ కాకుండా గో.పి. వాటంలో వుంటాయి( తప్పోరైటో ఓ నిస్చిత అభిప్రాయం వెలిబుచ్చకుండా అని), ఎందుకండి? :P
    మీరు మోడె, నితీష్, షీలా దీక్షిత్, జయ, కరుణానిధి... లకు 10పాయింట్ స్కేలులో ఎన్ని పాయింట్లు ఇస్తారో తెలుసుకోవాలనుంది. నే చర్చించే వుద్దేశ్యంతో వ్యాఖ్యలు సాధారణగా రాయన్లెండి, ఏదో తాత్కాలిక అభిప్రాయ వ్యక్తీకరణ మాత్రమే. చర్చించి ముసాయిదా బిల్లు తయారుచేసి, పార్లమెంటులో పెట్టే వుద్దేశ్యాలు లేవు. :) ;)

    రిప్లయితొలగించండి
  14. @Snkr గారు,
    హ హ హ :). మీ సందేహాన్ని చక్కగా, సూటిగా అడిగారు. ఇందులో తప్పుగా అనుకోటానికేముందండీ !!

    నిశ్చితాభిప్రాయం లేకుండానా ? హ్మ్.. ఏమో నండీ, బహుశా నేనలాగే ఆలోచిస్తాను కాబట్టి అలాగే ఉంటాయేమో ! నాకైతే, గో.పి వాటం లా అనిపించదు మరి :)

    >>"నే చర్చించే వుద్దేశ్యంతో వ్యాఖ్యలు సాధారణగా రాయన్లెండి, ఏదో తాత్కాలిక అభిప్రాయ వ్యక్తీకరణ మాత్రమే."

    True. I can see that :)

    >>"చర్చించి ముసాయిదా బిల్లు తయారుచేసి, పార్లమెంటులో పెట్టే వుద్దేశ్యాలు లేవు."

    కెవ్వు....:)))

    >>"మోడె, నితీష్, షీలా దీక్షిత్, జయ, కరుణానిధి... లకు 10పాయింట్ స్కేలులో ఎన్ని పాయింట్లు ఇస్తారో తెలుసుకోవాలనుంది"

    హ్మ్మ్..నేనెప్పుడూ అలా ఆలోచించలేదండీ. సరే, మీరడిగారు కాబట్టి..let me try just for fun..

    మోడీ - 4
    జయ - 4
    కరుణానిధి - 4
    షీలా దీక్షిత్ - 6
    నితీష్ - 6

    రిప్లయితొలగించండి
  15. Wav! 6/10 for sheela!!!! Why becoz of her stealthy hand in CWG scam in which only Kalmadi went to Tihar? I can't think of equating Nitish with corrupt sheela and Dravid demons to Modi, even for fun as it is far from reality.

    రిప్లయితొలగించండి
  16. పాట్నా నగరంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండి పక్కా కులగజ్జి నాయకుడైన లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నా నగరంలో విదేశీ పెట్టుబడులు పెట్టించగలిగినా గ్లోబలైజేషన్ అనుకూల వర్గంవాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్‌ని పోగడడానికి అతను అవినీతిపరుడు కాదని వాదించేవాళ్ళు. కేవలం తమ వర్గానికి అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని ఉన్న అవినీతిని లేదని చెప్పడం అర్థం లేనిది. బీహార్‌లో ఎంత అవినీతి ఉందో, గుజరాత్‌లోనూ అంతే అవినీతి ఉంటుంది. తమ అభిమాన నాయకుడు పరిపాలించే రాష్ట్రంలో అవినీతి లేదనుకుంటే అది అసలు విషయాన్ని పూర్తిగా మర్చిపోవడమే అవుతుంది.

    రిప్లయితొలగించండి
  17. వాజపేయి లాంటి గొప్ప ప్రధానమంత్రి చెప్పిన రాజధర్మాన్నే పాటించనివాడు సరైన నాయకుడు ఎలా అవుతాడు?
    గుజరాత్ అభివృధ్ధి చెందడానికి కారణం గుజరాతీలే. మోడీ రాకముందే గుజరాత్ కి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
    మోడీ స్థానంలో ఎవరున్నా అలాగే అభివృధ్ధి చెందుతుంది.
    మోడీ కన్నా చంద్రబాబు, నవీన్ పట్నాయక్,షీలా దీక్షిత్ అంతకన్నా నితీష్ కుమార్ నిజమైన నాయకులు.
    Snkr గారు, ఢిల్లీలొ ఎవరినైనా అడగండి. షీలా దీక్షిత్ గురించి మంచిగానే చెపుతారు. మూడుసార్లు గెలిచిన ఆమె నాలుగవసారి కూడా గెలుస్తుందని నేను చెప్పగలను. ఆరోపణలు వచ్చినా ఆమె అవినీతిపరురాలు కాదనే అంటారు.

    రిప్లయితొలగించండి
  18. గుజరాత్‌లో మౌలిక సౌకర్యాలు పట్టణ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి కానీ గ్రామీణ ప్రాంతాలలో కనిపించవు. ఈ లింక్ చదవండి: http://telugu.stalin-mao.in/70909611

    రిప్లయితొలగించండి
  19. @ bonagiri గారు, Praveen Sarma గారు,

    మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. అవును నిజమే, ఒక్కోసారి కొంచెం అతిగా హైప్ చేసేస్తాం.

    రిప్లయితొలగించండి
  20. @అజ్ఞాత (19 సెప్టెంబర్ 2011 6:38 సా)

    ohh.. you think I am thinking like an ostritch !!! explain more. Where did you see ostritch like behaviour in this post?

    >>"For 1000 years Barbarians heaping abuses on Indian psyche. How long Indians can be at the receiving end?"

    What a meaningless mumbo-jumbo is this !! what have you been smoking lately my friend? just come out of your hellucinations.

    >>Your low pathology (similar there of) lead India to slavery for another 1000 years. Wake up!. Think rationally

    What is this supposed to mean? what are you talking about? What do you mean pushing Indians into slavery? comeon.. come to grips..
    Has your mind gone for vacation or what ?

    రిప్లయితొలగించండి
  21. "1000 ఏళ్ళ నుండి మన దేశంపై.. బ్లా..బ్లా.. మనం ఇంకెన్నాల్లు సైలెంట్ గా ఉండాలి..బ్లా..బ్లా.. " - ఇది ఇటీవల మన అతివాద రాజకీయ నాయకులు వాడుతున్న అతి సాధారణ, ఆత్మ స్థుతి-పరనింద డైలాగు.
    వీరి ద్వారా ప్రభావితులై, ఓ నాలుగు డైలాగుల్ని బట్టీ పట్టేసుకొని, వివిధ బ్లాగుల్లో హడావిడి చేస్తూ, ఈ రకంగా తమ మతానికి(వీరిదృష్టిలో దేశానికి) తమవంతు సేవ చేస్తున్నామనుకొని ఫీలైపోయే అభాగ్యుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. వీరి అవగాహనా రాహిత్యం, 'ఆలోచన లేని ఆవేశం' ఎలాంటివి అనేదానికి, పైన రాసిన డైలాగ్ మీద నాలుగు ప్రశ్నలు చాలు.
    1. 1000 సం, ముందు భారత దేశం అంటూ ఒకటి ఉండేదా..? ఉంటే దాని ఎల్లలు ఏవి.. పొరుగు/శత్రు/మిత్ర దేశాలేవి?
    2. 400,500 వందల ఏళ్ళకు ముందు వరకు కూడా, మన దక్షినాదినే బౌద్ధ,శైవ,విష్ణు,జైనుల మధ్య పరస్పర దాడులు, ఒకరి ఆలయాల్ని ఒకరు కూలగొట్టుకోవడం, లేదా దేవుల్ల విగ్రహారాల్ని గెలిచిన వారు,తమ విగ్రహాల్తో రీప్లేస్ చేసుకోవడం నిరంతరం జరుగుతుండనేది వీరికి ఏమైనా తెలుసా..?
    3. రాజుల యుద్ధాలు, చరిత్ర మీద ఏ కొంచెం అవగాహన ఉన్నా, భార ఉపఖండంలో 'రాజరికం' కోసమే యుద్ధాలు జరిగాయని, 'మతం' ప్రధానంగా కాదనే విషయం ఇట్టే అర్థం అవుతుంది. Ex- హైదరాబాద్ నిజాం,బ్రిటీష్ వారు కలిసి టిప్పుసుల్తాన్ తో యుద్ధం లాంటిని చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయనే విషయం వీరికి తెలుసా?
    4. కేవలం 19,20 శతాబ్దాల నాటినుంచే హిందూ మతం అనేది ఒక స్పష్టమైన సంఘటిత రూపాన్ని సంతరించుకోవడం జరిగిందనీ, ఇటీవల భారత సుప్రీం కోర్టుకూడా 'హిందూ' అనేది ఒక జీవిత విధానం మాత్రమే నని నిర్వచించిందని వీరికి తెలుసా..?
    వీటన్నిటిని బట్టి చూస్తే 1000 ఏళ్ళ నుండి - 'మన ' మీద 'వారు ' దాడి అనేది ఎంత అర్థ రహిత డైలాగ్ అనేది అర్థం అవుతుంది. కానీ రాజకీయానికి మాత్రం చాలా చక్కగా పనికొస్తుందని రుజువైంది.

    రిప్లయితొలగించండి
  22. @అజ్ఞాత (19 సెప్టెంబర్ 2011 7:53 సా),

    True. I agree with the crux of your comment about ఆత్మ స్థుతి-పరనింద and ఆలోచన లేని ఆవేశం. I might slightly disagree with the degree of it conveyed by your questions. Let me try and give my take on it..

    1. రాజకీయంగా భారత దేశం అనేది ఒకటుండక పోవచ్చు. కానీ భారత దేశం అనే భావన అనేదైతే (At least Geographically) ఉందనే చెప్పొచ్చు (I think Literaty references are available). In Political and Economic sense.. yeah.. it might not be the same India that we are talking about now.

    2. True I agree with you that there are these wars and distructions

    3. చాలా వరకు యుధ్ధాలు రాచరికం కోసమే జరిగాయి. ఒకవేళ మతం అనేదాని పాత్ర ఉండుంటే అది కేవలం ఒక మానసిక సింబల్ గా మాత్రమే ఉపయోగింపబడింది.

    4. మీరు మరీ ఓవర్ సింప్లిఫై చేశారనిపిస్తుంది. హిందూ మతం అనేక రూపాల్నీ, పద్దతుల్నీ మొదట్నుంచీ మార్చుకుంటూనే వస్తుంది కదా ! yeah..మీరన్నట్టు ఇప్పుడు చెప్పబడుతున్న దానికి దగ్గర రూపం 19, 20 శతాబ్దాల్లో ఏర్పడి ఉండవచ్చు.

    రిప్లయితొలగించండి
  23. >>>>>
    రాజుల యుద్ధాలు, చరిత్ర మీద ఏ కొంచెం అవగాహన ఉన్నా, భార ఉపఖండంలో 'రాజరికం' కోసమే యుద్ధాలు జరిగాయని, 'మతం' ప్రధానంగా కాదనే విషయం ఇట్టే అర్థం అవుతుంది. Ex- హైదరాబాద్ నిజాం,బ్రిటీష్ వారు కలిసి టిప్పుసుల్తాన్ తో యుద్ధం లాంటిని చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయనే విషయం వీరికి తెలుసా?
    >>>>>
    నిజమే, ఆ లెక్కన చూస్తే 1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కూడా కేవలం మతం కారణం కాదు. బ్రిటిష్‌వాళ్ళ వల్ల అధికారం కోల్పోయిన మరాఠాలు & ముఘల్ వంశస్తులు అధికారంలోకి తిరిగి రావడానికి సైనిక తిరుగుబాటుదారులకి మద్దతు ఇచ్చారు. ఉత్తర భారత దేశంలోని ముస్లింలలో ఎక్కువ మంది బ్రిటిష్‌వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యగా నిజాం రాష్ట్రంలో రోహిల్లాలు, అరబ్ సైనికులు మాత్రమే బ్రిటిష్‌వాళ్ళపై యుద్ధం చేశారు. గ్వాలియర్ సింధియాలు, ఝాన్సీ మణికర్ణికా తదితరులు మరాఠాలు కావడం వల్ల తాము పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి పొందాలనుకున్నారు. ఢిల్లీ, అవధ్ ఒకప్పుడు ముస్లింల పాలనలో ఉన్న ప్రాంతాలు కావడం వల్ల అక్కడి ముస్లింలు కూడా అధికారంలోకి తిరిగి రావాలనుకున్నారు. ఇక్కడ అధికారం ప్రాధమికం, మతం ద్వితియం కదా.

    రిప్లయితొలగించండి