19, సెప్టెంబర్ 2011, సోమవారం

పిల్లి అంతరంగం - గోడెందుకెక్కాల్సొస్తుందంటే...

గోడకి ఇరువైపులా ఉన్న గొర్రెలు అవతలి వైపు వాటిని తోడేళ్ళని ప్రగాఢమైన నమ్మకంతో దూసుకెళ్ళిపోతా ఉంటాయి.

ఇంతలో ఒక పిల్లి, బాబూ ఈ వైపు కూడా తోడెళ్ళున్నాయి అలాగే ఆవైపు కూడా కొన్ని తోడేళ్ళున్నాయి మనం జాగ్రత్తగా ఆలోచించి రెండు వైపులా ఉన్న గొర్రెల్ని కాపాడుకోవాలి, అని చెప్తే..

చస్స్.. ఇవన్నీ అయ్యేపనులు కాదు, అవతలి వైపు తోడేళ్ళున్నాయా లేదా సూటిగా చెప్పు అంటాయి.

ఉన్నాయి కాబట్టి, సత్వర పరిష్కారం ఏంటంటే, అవతలి వైపు వాటినన్నిటినీ వధిస్తే ఇటువైపున్న అమాయక గొర్రెలం మనమంతా హాయిగా ఉండొచ్చు అని తీర్మానించినంత పని చేశాయి. అవతలివైపు గొర్రెలు కూడా ఉన్నాయి మొర్రో అని పిల్లి నెత్తినోరూ బాదుకుంటుంటే..

కొన్ని తెలివైన గొర్రెలొచ్చి.. అవతలి వైపు తోడేళ్ళొచ్చి మనలో కొన్ని గొర్రెల్ని తిన్నాయా లేదా ? అని అడిగాయి.

అవును అంది పిల్లి పాపం.

అవతలి వైపు గొర్రెలుంటే ఆ తోడేళ్ళు ఇటెందుకొస్తాయే తెలివిలేని పిల్లీ. అవతలివైపువన్నీ తోడేళ్ళే అని నీలాంటి మేతావి బుర్రలకి అర్థంకాదులే నోర్మూసుకోని చెప్పింది చెయ్ అంటాయి.

పాపం పిల్లి ఏం చెయ్యాలి ? గోడెక్కితేనే కదా నిజం తెలిసేది ? సరే, నిజం తెలుకుందామని పిల్లి గోడెక్కింది. అంతే.. రెండూ వైపులా ఉన్న తోడేళ్ళు విషయం పసిగట్టి, అదుగో ఆ పిల్లి చూశావా ఎవరు గెలిస్తే ఆవైపు దూకటానికి వీలుగా గోడెక్కింది అని గొర్రెల్ని నమ్మించబూనుకున్నాయి.

పిల్లి ఏం చెయ్యాలి ? కనీసం కొన్ని గొర్రెల్నయినా గోడెక్కించాలి ? అప్పటి వరకూ.. ఏ వైపైతే పూర్తిగా తుడిచి పెట్టుకు పోయే ప్రమాదంలో ఉందో ఆ వైపు మద్దత్తు తెలుపుతూ వ్యవహారాన్ని కొద్దిగా ఆలస్యం చెయ్యాలి. నాకు రెండూ వైపులా తెలుసు కాబట్టి నేను చెప్పేదే న్యాయం అని పిల్లి నమ్మిందనుకోండి.. దానర్థం.. పిల్లి కూడా తోడేలుగా రూపాంతరం చెందుతున్నట్టు. గొర్రెలు గోడెక్కి చూసేదాకా తన ప్రయత్నాలు అలాగే కొనసాగించడమే న్యాయం.

అదండీ పాపం.. మన పిల్లి గారి పిచ్చి లాజిక్కు  ;)   

23 కామెంట్‌లు:

  1. పిల్లిని అడిగి తెలంగాణా సమస్యకి పరిష్కారం చెప్పండి :))

    రిప్లయితొలగించండి
  2. lol :))

    >>"అవతలి వైపు గొర్రెలుంటే ఆ తోడేళ్ళు ఇటెందుకొస్తాయే తెలివిలేని పిల్లీ. అవతలివైపువన్నీ తోడేళ్ళే అని నీలాంటి మేతావి బుర్రలకి అర్థంకాదులే నోర్మూసుకోని చెప్పింది చెయ్ "

    ఇది కేక

    రిప్లయితొలగించండి
  3. గోడా వుంటే ఆవైపు తోడేళ్ళేలు ఈవైపెలా వచ్చి తిన్నాయి? అని తెలివైన గొర్రెలకి తట్టకపోవడం పిల్లి తప్పుకాదు. ఆవైపు ఈవైపూ వునా తోడేళ్ళని గోడెక్కించి ఒకవైపు తోసేస్తే అవి రక్కుకు చస్తాయి, రెండువైపులా గొర్రెలూ హాయిగావుంటాయి అన్న తెలివి ఆ పిల్లికి ఎందుకు తట్టలేదో CBI విచారణ జరిపించాలి. ఇంకో డౌటు .. ఆ గొర్రెలని తోడేళ్ళు తింటే మాంసాహారి పిల్లికెందుకు బాధ? తనకూ పూట గొర్రెబిరియాని దొరుకుతుంది కదా? ఏమీటో ఏమీ అర్థం కాలేదు, ఏవి గొర్రెలో, ఏవి తోడేళ్ళో అంతా విష్ణుమాయ.
    Snkr

    రిప్లయితొలగించండి
  4. పిల్లి,గొర్రెలు,తోడేల్లు అంటూ రాసినా, మీరు రాసింది ప్రస్తుతం సమాజంలోని వివిధ మనస్తత్వాల్ని చక్కగా ప్రతిబింబిస్తుంది.
    ఇక్కడ పిల్లికి,తోడేల్లకీ కనిపించే ప్రధాన తేడా - సహనం,సమ్యమనం. మన ముందు తరాలకి ఇవి బాగా ఉండేవి, బహుశా గాంధీ,నెహ్రు,అంబేద్కర్ లాంటి వారి నాయకత్వం వల్ల కావచ్చు. ఇవి ఉండబట్టే, బ్రిటిష్ వారు వెల్లిపోగానే వివిధ జాతులు,భాషలు,కులాలు,మతాలు గల 60 కోట్ల మంది తమలో తాము తన్నుకోకుండా ఒకటే దేశంగా మనగలిగారు.

    ప్రస్తుతం విలువలు గల నాయకులు పోయి, అధికారమే పరమావధిగా భావించే నాయకుల ద్వారా పార్టీలు నడుస్తున్నాయి కాబట్టే ప్రజల వైఖరుల్లోనూ మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మతం విషయంలో ఈ భావనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేపు కులం,భాష,ప్రాంతాల పేరుతోనూ జనం కొట్టుకు చావడానికి ఎక్కువరోజులు పట్టదు. Thanks

    రిప్లయితొలగించండి
  5. @అజ్ఞాత (19 సెప్టెంబర్ 2011 1:31 సా),

    Sure :) Thanks

    @అజ్ఞాత (19 సెప్టెంబర్ 2011 1:42 సా),

    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. @ Snkr గారు,

    హ్మ్మ్.. మీరు ఎక్కువగా ఆలోచించి విషయాన్ని అర్థం కాకుండా చేసుకున్నారనిపిస్తుందండీ.

    ఎవరికి (గొర్రెలు, తోడేళ్ళు, పిల్లి) సపోర్ట్ చెయ్యాలి అనేది పక్కనబెట్టి సరదాగా చదవండి, సరళంగా అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి
  7. పిల్లి పై CBI విచారణ ??? ఇది గొర్రె అ౦తర౦గమా , తోడేలు అ౦తర౦గమా? కెవ్వ్ వ్వ్ వ్వ్ !!!!!!

    రిప్లయితొలగించండి
  8. @ cheekati గారు,

    మీ స్పందనకి సంతోషంగా ఉందండి. నా ఉద్దెశ్యాన్ని అర్థమయ్యేలా రాశాననె నమ్మకం కలిగించారు.
    Thank you for understanding my post and elaborating it in your comment.

    రిప్లయితొలగించండి
  9. గొర్రెలు, తోడేళ్ళు మాత్రమేనా లేకాదు, గాడిదలు కూడా పోరుగడ్డలో భారీగా వున్నాయన్నది సుస్పష్టం.

    రిప్లయితొలగించండి
  10. WP gaaru,
    Good Analogy representing the society. In this I not only see the current situation in AP but this is also implicable to many other aspects/mentalities in current society.
    The way I'am looking at this is, if really the cat understands both the sides and has empathy for gorrelu on both sides then it will be part of the crowd and tries to keep the gorrelu on both sides safe. Only the cats who have intentions of becoming Thodellu will only climb the wall and called as Goda midhi pillulu.
    Thx
    Meena

    రిప్లయితొలగించండి
  11. @అజ్ఞాత(20 సెప్టెంబర్ 2011 9:09 ఉ),

    :) అవునండీ చాలా రకాలు ఉంటాయి. విషయం అర్థమవ్వడానికి ఎంతకావాలో అంతే రాశాను. అన్నిటి గురించీ రాయాలంటే యానిమల్ ఫాం మళ్ళీ రాసినట్టువుతుంది ;)

    రిప్లయితొలగించండి
  12. @Meena గారు,

    Thank you for those kind words about the post. I know you understood the post and just mentioned a caution. nevertheless, I would like to provide a small clarification for the benifit of others as well..

    >>"if really the cat understands both the sides and has empathy for gorrelu on both sides then it will be part of the crowd and tries to keep the gorrelu on both sides safe."

    Its not about the cat arrogating the task of keeping the sheep safe onto itself. Its all about the cat believing that the sheep can see the truth if presented properly and about the Cat having faith in the good sense and judgement of the sheep.

    Cat can be on either side or on the wall as long as its intent is to empower the sheep to see the truth rather than teaching them :) I think it is worthy to reiterate the last few sentenses of the post here again..

    "నాకు రెండూ వైపులా తెలుసు కాబట్టి నేను చెప్పేదే న్యాయం అని పిల్లి నమ్మిందనుకోండి.. దానర్థం.. పిల్లి కూడా తోడేలుగా రూపాంతరం చెందుతున్నట్టు. గొర్రెలు గోడెక్కి చూసేదాకా తన ప్రయత్నాలు అలాగే కొనసాగించడమే న్యాయం."

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. శంక్ర్ గారు,

    మనం సరదాగా రాస్తున్న కామెంట్లు మరీ ఎక్కువయ్యి అసలు టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు కాబట్టీ ప్రస్తుతానికి మన కామెంట్లు తీసేస్తున్నాను. మీరెం తప్పుగా అనుకోకండేం :)

    రిప్లయితొలగించండి
  16. సరే, మీరన్నట్టు అసలు టాపిక్కి వద్దాము.
    మన పిల్లికి వున్న ఆప్షన్స్:
    1) రెండు వైపుల గొర్రెలను గోడెక్కించడం
    2) రెండు వైపుల తోడేళ్ళును గోడెక్కించడం
    3) ఈవైపు తోడేళ్ళను, ఆవైపు గొర్రెలను గోడెక్కించడం
    4) ఈవైపు గొర్రెలను, ఆవైపు తోడేళ్ళను గోడెక్కించడం
    5) గోడ పడగొట్టి రెండువైపులా చూసుకోండి అనడం.

    ఇందులో ఏది బెటర్ అంటారు? నాకైతే 5) బెటర్ అనిపిస్తుంది.

    Snkr

    రిప్లయితొలగించండి
  17. Snkr గారు,
    గోడ పడగొట్టడం అంత ఈజీ కాదు. గోడలంటే మామూలుగా ఉందేవి కావండీ. సాధారణంగా మన మనసుల్లోనూ, ఆలోచనల్లోనూ, మెదళ్ళలోనూ ఉండే గోడలు పడగొట్టడం చాలా స్లో ప్రాసెస్..

    రిప్లయితొలగించండి
  18. WP Gaaru,
    I totally understood your point of view.I'am overthinking and extrapolating( may be with some biased mindset)
    The Cat on the wall should be very cautious because sometimes the howlings of the wolves are so very disturbing and distracting which makes cat eventually fall into wolves trap on either side.
    You might be thinking its enough :) I will stop here.

    Thx
    Meena

    రిప్లయితొలగించండి
  19. మనం వున్న సమస్య పరిధి దాటి ఆలొచించగలిగినప్పుడు , ప్రతి గొర్రె , తోడేలు పిల్లులు అవుతాయి. సమస్య కి పరిధి గోడ అయితె ఆ పరిధి దాటడం గోడ ఎక్కడమే!
    మీ పాయింటు అర్ధం అయ్యింది. బాగుంది పొస్టు :)

    రిప్లయితొలగించండి