14, జూన్ 2010, సోమవారం

'రావణ్ ' - అదే కథ.. ఒక వర్షన్లో హీరో, ఇంకో దాంట్లో విలన్?

మణిరత్నం గారి 'రావణ్ ' సినిమాలో తమిళ సూపర్ స్టార్ విక్రం హిందీ వర్షన్లో హీరో ట, అదే కథ.. తెలుగు/తమిళ వెర్షన్లలో విలనట! ఇదేదే గమ్మత్తుగా ఉందే.. అనుకుంటున్నాను..


ఇంటినుండి ఫోన్.. ఈ టైం లో చేయరే అని మీటింగ్ లోంచి బయటకి వచ్చి చూస్తే.. మా పిల్లలు ..


ఇద్దరూ కొట్టుకుని ఫోన్ చేసారు. ఇంటికెళ్ళాక, అమ్మాయి మొదట చెప్పిన కథ వింటే 'అయ్యో .. చెల్లి అని చూడకుండా వీడెంత కష్టపెడుతున్నాడు ' అని హృదయం ద్రవించిపోయింది. కోపం గా వాడి వంక తిరిగి చూస్తే.. వాడు అంతకన్నా హృదయ విదారకమైన కథ చెప్పాడు.. విన్నాక నా సింపతీ కాస్తా వాడి మీదకి మళ్ళింది. ఇద్దరూ పెద్ద సత్య సంధులు కారు కాబట్టి ఇద్దరి కథా విని దాని మీద మా పిల్లల్ని చూసే ఆవిడ దృష్టికోణం కూడా అప్లై చేసాకే ఏది కరెక్టో ఒక నిర్ధారణకి రావాల్సి వచ్చింది..


చిన్నపిల్లలతో అయితే .. ఇలాగ కుదురుతుంది కానీ..


ఈరోజు మనం ఒక వార్త సత్యాసత్యాల నిర్ధారణ కి 3-4 దిన పత్రికలు చూడవలసి వస్తుంది. అదే కథ, పాత్రల పేర్లూ అవే.. కానీ ఈనాడు, జ్యోతిల్లో ఒకరు కథానాయకుడు/రాలు ఇతే.. సాక్షి లో వారు ప్రతికథానాయకులు.. అదేవిధంగా వైస్ వెర్సా !


ఏదైనా ఒక పత్రిక లో ఒక పారా చదివి ఒక విషయాన్ని సత్యానికి దగ్గరగా తెలుసుకోగలిగిన రోజొస్తే ఎంత బాగుంటుంది.?

8 కామెంట్‌లు:

  1. ఆ రోజొస్తుందంటారా.. నాకు డౌటే!

    రిప్లయితొలగించండి
  2. "ఏదైనా ఒక పత్రిక లో ఒక పారా చదివి ఒక విషయాన్ని సత్యానికి దగ్గరగా తెలుసుకోగలిగిన రోజొస్తే ఎంత బాగుంటుంది"
    దీనికో చిట్కా ఉంది. పత్రికల్లో రాసేవన్నీ సత్యానికి చాఆఆఆలాఆఆఆ దూరంగా ఉంటాయని మొదలుపెట్టి, మనకు దొరికే వేరే ఆధారాలనిబట్టి దగ్గరగా జరుపుకుంటూ రండి.

    రిప్లయితొలగించండి
  3. @మధురవాణి - Thank you for the comment. ఏ రోజులైనా వాటంతటవే రావండీ. మన పరిధిలో మనం ప్రయత్నిస్తే వాటి టైంకి అవొచ్చేస్తాయి.

    @నాగేస్రావ్ - చిట్కా బావుందండీ (పెర్సొనల్ లెవెల్లో పనికొస్తుంది). వ్యవస్థలో మార్పు రావాలంటే.. చాలా కష్టపడాలి.

    రిప్లయితొలగించండి
  4. మిగతా టపా సంగత్సరే, 'రావణ్' విషయంలో గమ్మత్తేముందో అర్ధం కాలా. తమిళ వెర్షన్లో విక్రమ్ పోషించిన పాత్ర హిందీలో అభిషేక్ వేస్తున్నాడు. హిందీలో విక్రమ్ వేరే పాత్ర వేస్తున్నాడు. అంతే కదా.

    రిప్లయితొలగించండి
  5. అసలు పత్రికల లక్ష్యమే అదండీ. నిష్పక్షపాతంగా నిజాన్ని ప్రజలకు తెలియజేయడమే....కానీ అదే చెయ్యట్లేదు ఈ పత్రికలు.

    రిప్లయితొలగించండి
  6. అబ్రకదబ్ర గారు,గమ్మత్తు ఏమీ లేదండీ. ఒకే నటుడు, ఒక వెర్షన్ లో హీరో గా ఇంకో వెర్షన్ లో విలన్ గా కనిపించడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంతే. (isn't it similar to what we are seeing in news papers ??)


    సౌమ్య గారు,అవునండీ పత్రికలకీ phamplets కీ తేడా లేకుండా పోయింది.

    రిప్లయితొలగించండి
  7. అమ్మఒడి బ్లాగును చదవండి. ఆమే రోజు అన్ని పేపర్లు చదివేట్టట్టుంది. అన్ని వార్తల వెనుక భావం అర్థమౌతుంది.:)
    ఈ రోజులలో పత్రికలు ఉండేది మీకు వార్తలు చేప్పటానికి కావు ఏ మాల్ లో ఏ షాప్ లో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు. కొత్త ప్రాడక్ట్ లాంచ్ చేస్తుంటె మొదటి పేజి అంతా దాని గురించే యాడ్స్. వారలకోసం బ్లగులు చదవాలి. షాప్ లో వస్తువుల కోసం పేపర్ చూడాలి.

    రిప్లయితొలగించండి