10, జూన్ 2010, గురువారం

2010 లో 1910 నాటి అభిజాత్యం.. సిగ్గుచేటు!

నితిన్ గడ్కారీ గారు హైదరాబాద్ కి వచ్చారు భేష్! సాఫ్ట్ వేర్ ఇంజినీర్లని కలిసి, మాట్లాడి, లాప్ టాప్ బహుమతి పొందారు.. నైస్! పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.. మంచి పని...
అసలే మధ్య తరగతి వాళ్ళు రాజకీయాల నుండి దూరంగా వుండటం నచ్చని నేను, ఎదోలే కనీసం పార్టీలన్నా వీళ్ళ దగ్గరకి వచ్చే ప్రయత్నం చెస్తున్నాయి అని ఆనందపడుతూ టీవీ పెట్టా.. హైదరాబాదు యాత్రలో గడ్కారి గారు ఒక దళిత వాడలో సహపంక్తి భోజనం చేశారనే ఐటం చూసి, నివ్వెరపోయి అర్జెంటుగా కేలండరు చూసా! ఇది 2010 లేక 1910అని.


అన్నీ బాగానే ఉన్నాయి.. దళితులతో (పెద్ద మనసు చేసుకుని..) పెద్ద ఎత్తున చేపట్టిన ఈ 'సహపంక్తి భోజనమే ' మింగుడు పడట్లేదు... అసలేంటి వీళ్ళ ఉద్దేశ్యం? ఈయన గారితోనో లేక ఈయనగారిలాంటి వాళ్ళ తోనో సహపంక్తిలో కూర్చోగలిగితే అదే పదివేలు దళితులకి అనా! లేక చూడండి మేము ఎంత ఉదార స్వభావులమో అనా!
దళితులు గానీ ఇతర అణగారిన వర్గాలు గాని అడిగేది ఆత్మ గౌరవం, సమానత్వం, సమాన అవకాశాలే గానీ ఇతర వర్గాల దయా దాక్షణ్యాలు కాదు కదా!

5 కామెంట్‌లు:

  1. "దళితులు గానీ ఇతర అణగారిన వర్గాలు గాని అడిగేది ఆత్మ గౌరవం, సమానత్వం, సమాన అవకాశాలే గానీ ఇతర వర్గాల దయా దాక్షణ్యాలు కాదు".........చాలా బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. నా దృష్టి లో, అలా సహా పంక్తి భోజనాలు అని ప్రత్యేకము గా నిర్వహించుటే పొరపాటు. ఈ నాడు అన్ని హోటళ్ళలో, తిరుమల మొదలగు అన్న దాన కేంద్రాలలో జరిగేది సహపంక్తి కాదా?
    అది కూడా అందరితో కాదు, దళితులతో అని ప్రత్యేక గుర్తింపు? ఎందుకని? అలా వ్రాసే, చేసే, ప్రతీ వ్యక్తినీ సమాజం తిరస్కరిస్తే తప్ప ఈ జాడ్యం వొదలదు. అదే మందు. దేశంలో పేదరికం పోనంత వరకు, అందరికీ విద్య లేనంత వరకు, ఇటువంటి నీచ రాజకీయ ఎత్తుగడలతో నాలుగు వోట్లు సంపాదించుకోవాలనే నికృష్టులు ఉంటూనే ఉంటారు. వ్యతిరేకించండి. అంటరానితనం ఉంటె, నిర్మూలించండి, అంతే కాని, ఆ ముసుగు లో స్వలాభం కోరకండి.

    సీతారామం

    రిప్లయితొలగించండి
  3. సీతారాం గారూ thank you. రాజకీయాలు మారితేనే మనకు నిష్కృతి. సామాన్య, ఆర్దినరీ and డీసెంట్ ప్రజలు రాజకీయాలలో అడుగు పెట్టేదాకా రాజకీయాలు మారే అవకాశం తక్కువ.

    రిప్లయితొలగించండి