12, నవంబర్ 2010, శుక్రవారం

పెద్ద పెద్ద విప్లవాలొద్దు, మనలో ఒక చిన్న మార్పు చాలు

మన రాజకీయాల్లోనూ, వ్యవస్థలోనూ ఉన్న ఎన్నో సమస్యలూ వైవిధ్యాల గురించి అలోచనలూ భావ సంఘర్షణలూ రోజూ ఎదురవుతూనే వుంటాయి మనకు. అవినీతి, అవగాహనా రాహిత్యం, రకరకాల వివక్షలూ, అతిగా ఊహించుకుని చూసే ఆభిజాత్యాలూ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో..


నా దృష్టిలో అనేక సమస్యలకు కారణాలుగా కనిపిస్తూ, పరిష్కారాలకు అడ్డంకిగా అనిపిస్తున్న అతి ముఖ్యమైన విషయాలుగా కనిపించేవి:
  1. రాజకీయ అవినీతి
  2. సమాజంలో నాయకత్వ లోపం
  3. రాజకీయాలకీ, వ్యవస్థకీ ప్రజలు వీలైనంత దూరంగా ఉండడం
  4. మన వ్యవస్థ పనితీరులో పారదర్శకత లోపించడం
  5. ఇంతపెద్ద వ్యవస్థలో మార్పు మనవల్ల అయ్యే పనేనా అనే నిస్పృహ
ఇవేకాకుండా ఇంకా అనేక సమస్యలు ఉనాయి. అయితే పరిష్కారాలు మాత్రం ఎదో అలా కొంతమంది మేధావులు చెప్పే చిట్కాల్లా సులువుగా ఉండవు. అసలు నాదృష్టిలో సులువుగా కనిపించే మార్గం అంత నమ్మదగినదిగా అనిపించదు. అనేకనేక సమస్యలకి పైన మనం చెప్పుకున్న సమస్యలు మూలకారణాలైవుంటాయి. వీటన్నింటి పరిష్కారానికి చాలా వరకు దోహద పడగలిగే మార్పులేవైనా వుంటే వాటిని ముందుగా చేసుకొంటే వ్యవస్థలో మార్పు కొంత వేగంగా జరిగె అవకాశం ఉంది.


నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలని (Local Governments ) బలోపేతం చేయడం అటువంటి మార్గాలలో అతి ముఖ్యమైనది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ దిశగా అవసరమైన చర్యలు మొదలు పెట్టాం గానీ అనుకున్నంత పురొగతి సాధించలేదు. అందుకే రాజ్యాంగం నిర్దేశించినట్టు మొత్తం 29 అంశాల మీదా నిధులూ, విధులూ, అధికారాలు స్థానిక ప్రభుత్వాలకి నిజంగా అప్పగించే ఎటువంటి ప్రయత్నాన్నైనా సమర్ధించడం చాలా అవసరం.
     
మనమొక్కళ్ళమే ఇంత పెద్ద వ్యవస్థని మార్చగలమా అనే సందేహాల్ని కాసేపు పక్కనబెడితే, మన పరిధిలో వీలైనంత వరకూ స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి కృషిచేసే ప్రయత్నాలకు మద్దత్తు నివ్వడం, స్థానిక ప్రభుత్వాల పని తీరులో వీలయినంత పార్టిసిపేషన్ చెయ్యడం చేస్తే భావితరాలు ఖచ్చితంగా మెరుగైన భారత దేశాన్ని చూడగలుగుతారు.  ప్చ్ .. డౌటే అంటారా? బానే వుంది చూద్దాం అంటారా? 

14 కామెంట్‌లు:

  1. 1) యధ ప్రజా తధ రాజా
    2) మనం ఎవ్వరికి మార్గదర్శకులుగా ఉండక్కర్లేదు ఈరోజు మనం సంతోషంగా ఉంటే చాలు
    3) క్రమశిక్షణ తో పనిలేదు మన పని పూర్తితే చాలు
    4) ఇంటిగుట్టు వీధి లో పెడతారా ఎవరైనా
    5) బ్లాగుల్లొ ఎంతమంది తరచుగా రాజకీయంగా స్పందిస్తున్నారు

    రిప్లయితొలగించండి
  2. I certainly have high hopes on 73 and 74 amendments, the results might not be very clearly visible at this point of time but surely their positive impact will seen in the coming years.

    మన పరిధిలో వీలైనంత వరకూ స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి కృషిచేసే ప్రయత్నాలకు మద్దత్తు నివ్వడం
    స్థానిక ప్రభుత్వాల పని తీరులో వీలయినంత పార్టిసిపేషన్ చెయ్యడం

    WP, do you have any feasible action items on the above.

    My major political activity so far, is voting :)
    Previously I used to ignore it, but now I utilize my voting right without fail.

    If they are any action items you can think of please post them, if it is something not heavy, may be it can be tried.

    రిప్లయితొలగించండి
  3. @ అజ్ఞాత,
    మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. డౌటు లేకుండా మనం చెయగలిగినవేమన్నా చెప్పండి వీలయితే, వాటినే ప్రయత్నిద్దాం.

    @ సత్యార్థి
    మీ ఆగ్రహం, అసహనం అర్థం చేసుకోగలను :) వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. నా బ్లాగుకి స్వాగతం.

    రిప్లయితొలగించండి
  4. స్థానిక ప్రభుత్వాల విషయంలో మనం మద్దతు తప్ప మరేమీ ఇవ్వలేకపోవడమే అసలు దురదృష్టమంతా. లెజిస్లేచర్ చెయ్యాల్సినవాళ్ళు పరిపాలన చేస్తూ ఆ బాధ్యత లేని అధికారానికి అలవాటుపడి అసలైన చోట అధికార వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారు. Its MLAs and MPs who are responsible for not allowing local governance to thrive.

    స్థానిక ప్రభుత్వాల విషయంలోఉన్నంతలో కర్ణాటక, ఉత్తరాంచల్ మోడల్స్ బాగున్నాయి. పరమ చెత్త మోడల్ ఆంధ్రప్రదేశ్. కాస్తోకూస్తో ఓకే అనిపించేది తమిళ్ నాడు. Andhra is the state where least line items are transferred to Panchayats. అదికూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాల కోసం చెయ్యక తప్పదు కాబట్టి చేసిన విధుల బదిలీనే తప్ప సిన్సియర్ గా చేసింది అస్సలు కాదు. మన ఖర్మ.

    రిప్లయితొలగించండి
  5. as long as a packet of arak+biryani culture was honoured [in our politics] by mobs,we r helpless in this matter...

    రిప్లయితొలగించండి
  6. @YAB

    >>WP, do you have any feasible action items on the above. My major political activity so far, is voting :)Previously I used to ignore it, but now I utilize my voting right without fail.

    The change in your political attidute is definitely a first step :) Just make sure that you are voting in local elections also and spread the importance of politics in our lives to the extent possible.

    >>If they are any action items you can think of please post them, if it is something not heavy, may be it can be tried.

    హ్మ్మ్... వ్యక్తిగత స్థాయిలో ఈ విషయాన్ని ప్రభావితం చేసే అవకాశాలు తక్కువే కానీ..ఈ క్రింది వాటిని వీలయినంతవరకూ ప్రయత్నించొచ్చు:

    1. స్థానిక సంస్థల విషయంలో పార్టీల విధానాలని కూడా మన ఓటు నిర్ణయంలో దృష్టిలో పెట్టుకోవడం.
    2. ఏదైనా చిన్న చిన్న విషయాల గురించి ంళా లేదా ంఫ్ లని కలవాల్సి వస్తే, ఆయా పనులు స్థానిక ప్రభుత్వాల పరిధిలో ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం.
    3. మన పరిధిలో వీలయినంత మందికి స్థానిక సంస్థల ప్రాధాన్యత గురించి వివరించడం.
    4. ఈ విషయాల మీద పని చేసే రాజకీయ నాయకులకి వీలయినంత మద్దత్తు ఇవ్వడం

    అరకొరగానైనా ప్రస్తుతానిక్కి వున్న స్థానిక సంస్థల జవాబుదారీ తనాన్ని పెంచడం కూడా అవసరమే. దీని కోసం:
    1. మన గ్రామంలో గానీ, ఏరియా లో గాని ఉన్న సమస్యల విషయంలో కౌన్సిలర్లనీ, సర్పంచుల్నీ కలిసే ప్రయత్నం చెయ్యడం
    2. గ్రామ సభ, వార్డు సభల్లో వీలయినప్పుడు పార్టిసిపేట్ చెయ్యడం

    above all these, being aware of what we really want and expressing it within our own means will definitely make a difference.. and when there are more people like us.. I am sure our politicians are intelligent enough to read the message :)

    రిప్లయితొలగించండి
  7. @YAB,

    also, we can make sure that we are asking about this when folks come to our door step to ask for our votes

    Note. in point 2 above.. please note that I was referring to MLAs and MPs.

    రిప్లయితొలగించండి
  8. @ Mahesh
    Thank you for your inputs and opinion.

    @ astrojoyd
    >>as long as a packet of arak+biryani culture was honoured [in our politics] by mobs,we r helpless in this matter...

    ఇది కొంత దురదృష్టకరమే అయినా ప్రజలు మరీ అంత దారుణంగా లేరు. చాలా వరకూ ఇస్తే తీసుకుంటారు ఎవరికి వెయ్యలో వారికే వోటేస్తారు.

    అయినా, అరక్ +బిరియాని కి వోటు వేసే దురదృష్టకరమయిన పరిస్థుతుల్లో ఉన్న వాళ్ళ నుంచి అద్భుతాలు ఆశించడం కన్నా.. అన్నీ ఉండి.. వోటెయ్యక పోవడమో లేక.. కుల మత ప్రాతిపదికన వోటు వెయ్యడమో చేసే నిరాశాజీవులున్న మధ్య తరగతి వారి నుండి మార్పు ఆశించడమే సమంజసం అనిపిస్తుంది.

    అదేమంటే రాజకీయాలు దరిద్రంగా వున్నాయి అనీ, ఎన్నికల విధానాలు సరిగ్గాలేవనీ వాపోతూ, సినిమా టిక్కెట్ల కోసం మాత్రం ఎలాగైనా కష్టపడి టిక్కెట్లు సంపాదించుకునే చదువుకున్న వాళ్ళ నిర్లక్ష్యమే అన్నింటికంటే పెద్ద సమస్య.

    రిప్లయితొలగించండి
  9. ఈ లొకల్ గవర్నమెంట్ల గురించి ముఖ్యమైన విషయాలూ, మీరు పైన చెప్పిన సమస్యల పరిష్కారానికీ వీటికీ సంబంధం ఏంటో వివరిస్తూ టపాలు రాయండి.

    రిప్లయితొలగించండి
  10. దళితుడైన అండిముత్తురాజా లక్షలకోట్లు భోంచేసినా ఊరుకోకుకుండా గొడవచేసి రిజైన్ చేయించడం CAG, మీడియా, ప్రతిపక్ష , పాలకపక్షాల యొక్క అభిజాత్యం, బ్రాహ్మినికల్ కుట్ర.

    రిప్లయితొలగించండి
  11. పై అఙాత,

    మీరు రాసింది నా దృష్టిలో అర్థం పర్థం లేని వ్యాఖ్య. అవినీతి పరుడుగా ఆరొపించబడినవాడు అవినీతి చేశాడా లేదా అని అలోచించాలిగానీ వాడిది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేదాని గురించి ఆలోచించే వాళ్ళ అభిప్రాయాలకు విలువివ్వడం నాకు అలవాటు లేదు.

    ఏ టపాకి వ్యాఖ్య రాస్తున్నారో కాస్త చూసుకోవదం అలవాటు చేసుకోండి :)

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాత 19 నవంబర్ 2010 12:15 సా
    హమ్మ్మ్.. ఆలోచింపజేసేదిగా వుంది. :D

    రిప్లయితొలగించండి