27, సెప్టెంబర్ 2010, సోమవారం

చవితి నాడు కథ చదవని జగన్...

మంచి రాజకీయ భవిష్యత్తూ, కోరుకున్న పదవి దక్కాలంటే ఏం చేయాలో అధిష్ఠాన దేవత ఉపదేశించారు. జగనూ, రోశాయ్యా ఊపిరిబిగబట్టి శ్రద్ధగా విన్నారు. ఉపదేశం సారాంశం ఏంటంటే, గ్రామ గ్రామానా ఉన్న ప్రజలందరినీ దర్శించు కుంటే పదవులు దక్కే యోగం పడుతుందట. వీళ్ళిద్దరిలో ఎవరైతే ముందుగా ఆ పని పూర్తి చేసుకొస్తారో వారికి అధిష్ఠానం అనుగ్రహం లభిస్తుందట.


యువకుడూ, ఉత్సాహవంతుడూ అయిన జగన్ పరుగు పరుగున ఆ పని  ప్రారంభించేశాడు. వయోవృద్ధుడైన రోశయ్య దిగులుగా బయటకొచ్చి, ఆప్తుడైన అహ్మద్ పటేల్ దగ్గర, ఈ పోటీలోని అన్యాయం గురించి వాపోయారు. ఇటువంటివెన్నో చూసిన అహ్మద్ పటేల్ చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోగానే రోశయ్య గారికి చటుక్కున ఙానోదయమయ్యింది. ఊరూరూ తిరగడమెందుకని అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జగన్ కేమో ఒక్కో వూరు వెళ్తుంటే, ఆ వూరి నుండి రోశయ్య గారు అప్పుడే బయటకెళ్ళినట్టు కనిపించడం మొదలయ్యింది. 


సందేహం: హిందూత్వ భావనలని ఇంత చక్కగా వంటబట్టించుకొని అవలంబిస్తున్న కాంగ్రేసెక్కడా!! ఎప్పుడు చూసినా ఒక్క రాముడి గురించే సోది చెప్పే BJP ఎక్కడ?


Source: one of my friend shared this joke seen on one of the channels.. Liked it very much. Posted just for the fun and satirical value :) With thanks to google image search...

8 కామెంట్‌లు:

  1. గురువుగారూ,
    ఇది ప్రజా స్వామ్యం. ప్రజలే ప్రభువులు. ప్రజలు కోరుకున్న వారే పాలించాలి. అదిష్ఠానమన్నది ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నుకో బడే సంస్కృతి కాంగ్రెస్ పార్టిలో లేదు. దమ్ముంటే సి.ఎల్.పి సమావేశం ఏర్పాటు చేసి సీక్రెట్ బ్యేలెట్ పెట్టుండాల్సింది.

    రిప్లయితొలగించండి
  2. Chittoor.S.Murugesan గారూ,
    ఈ టపా ఉద్దేశ్యం కేవలం జరుగుతున్న తమాషా మీద కాస్తంత హాస్యం మేళవించిన వ్యంగ్యం మాత్రమే.

    మీరడిగిన అసలు విషయానికొస్తే, రోశయ్య మాత్రం ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి కాలేదంటారా?(ప్రజల మద్దత్తు ఎంత వరకు ఉంది అనేది చెప్పలేం.) ప్రజా ప్రతినిధుల మద్దత్తు ఆయనకి ఉన్నప్పుడు సమస్యేముంది?

    మీరడిగినట్టే దమ్ముంటే CLP సమావేసంలో సీక్రెట్ వోటింగ్ పెట్టమని MLA లు అడిగితే బావుంటుంది. మనమెలా అడుగుతాం!
    దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టుకోండి అని రోశయ్య అంటే!!

    రిప్లయితొలగించండి
  3. బానే రాస్తున్నావోయ్.. ఇప్పుడే ఒక్కక్క పోస్టూ చదువుతున్నా. ఏదో ఒక పోస్టులో మొట్టడానికి చూస్తా.

    రిప్లయితొలగించండి