2, సెప్టెంబర్ 2010, గురువారం

రాజ్యాంగానికి పవిత్రత అపాదించాల్సిన అవసరం ఉందా?? నాకైతే లేదనిపిస్తుంది!!

34 కామెంట్‌లు:

  1. Depends on onez perspective. The problem is with someone trying to be a Bogart. Its fine if someone treats the constitution as ones God - the others can refrain from insulting it in front of him.

    The question here is whether it was insulted in the first place.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. తమ పాండిత్యం చూపించుకోవటానికి పోట్లాడుతున్నట్టు వుంది. విషయమేమిటో గాలికి ఒదిలేశారు. వీళ్ళంతా తమ ఇంగ్లీషు దురద తీర్చుకోవడానికి తెలుగు బ్లాగుల్లో పడ్డారెందుకా అని !

    రిప్లయితొలగించండి
  4. రాజ్యాంగం భారతీయులుగా మనకు మనం ఇచ్చుకున్న వ్యవస్థ. దానికి కూడా గౌరవం ఇవ్వకపోవడం మనల్ని మనం కించపరుచుకున్నట్లే.

    రిప్లయితొలగించండి
  5. ఎవరితోనైనా మనం విభేధించినంత మాత్రానా వారిపై గౌరవం తగ్గుతుందని అనుకోనఖ్ఖర లేదు.శంకరుడైనా, క్రీస్తైనా,గాంధీ అయినా వారి విలువ వారికుంది. కాకపోతే, సమయానుగుణంగా సమాజంలో, ఆలోచనా ధోరణుల్లో కొన్ని మార్పులొచ్చి, అప్పట్లో వారు చెప్పిన, చేసినవాటిల్లో కొంత తప్పుందని ఎవరికైనా అనిపిస్తే అది చెప్పడం పెద్ద నేరం కాదని నా ఉద్దేశం.అలా చెప్పడానికి పెద్ద qualification కూడా అవసరం లేదు. ఒక ఆలోచించే మనిషైతే చాలు. అంత మాత్రానా, “అతగొప్పవారి గురించి ఇలా మాట్లాడతారా?” అనే holy-cow syndrome తెచ్చుకోనక్కర లేదు.

    నావరకూ everybody is open to criticism and there and no holy-cows. నిజంగా వాళ్ళుంటే ఇవన్నీ విని ఇంకా సంతోషించేవారేమో! They were much more broad minded then most.ఈ మహానుభావులెప్పుడూ తాము “మహానుభావులం” అని చెప్పుకోలేదు. సమాజానికి వారు చేసిన మేలునిబట్టి ఆ గొప్పతనం మనం ఆపాదిస్తున్నాం. అలాంటప్పుడు, కందకు లేని దురద కత్తిపీటకెందుకు? I am also a custodian of their greatness as much as anybody who is speaking in favour of them here. ఎందుకంటే, ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఒక మనిషైతే (ఈ వారసత్వం కేవలం భారతీయులదే కూడా కాదు)చాలు.

    ఇలా అన్నింటినీ ప్రశ్నించడానికి అతీతంగా “పవిత్రం” చెయ్యడం వల్లనే మనం వెనుకబడున్నాం. అది మతమైనా,సామాజిక విలువైనా, వ్యక్తిగత అభిప్రాయమైనా ప్రశ్నించాల్సిందే. పూర్ణసత్యం కాకున్నా, ప్రతివొక్కరూ తమదైన సత్యం తెలుసుకోవలసిందే.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. and this: (f) to value and preserve the rich heritage of our composite culture - your derogatory remarks on Hindu culture

    (c) to uphold and protect the sovereignty, unity and integrity of India - Your uttarences on Kashmir

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. విబేధించడానికీ గౌరవించడానికీ ప్రశ్నించకుండా పవిత్రతని ఆపాదించి నెత్తిన పెట్టుకోవడానికీ చాలా తేడా ఉంది. అది తెలుసుకోవడం అవసరం.

    రిప్లయితొలగించండి
  12. >>రాజ్యాంగం భారతీయులుగా మనకు మనం ఇచ్చుకున్న వ్యవస్థ.

    మహేష్ గారు, మనకు మనం అనగా మీరు నేనూ కుడా వస్తాం, మనకి మనం ఇచ్చుకునే వ్యవస్థ ఇంకా రాలేదని గమనించగలరు, మనకి ఇష్టం లేకపోయినా, మెజారిటీ ప్రజలు వ్యతిరేకించినా అది చట్టం అవడం కష్టం కాదు, కాబట్టీ మీరు చెప్తున్న మనకి మనం ఇచ్చుకున్న వ్యవస్త ఐతే, గౌరవించడం సమంజసమే..

    కానీ, గౌరవించడం అంటే ఏమిటో? కొందరు ఆగష్ట్ ౧౫ న ఝండా వందనానికి రాకపోతే వారికి దేశ భక్తి లేదు అని తేల్చారు, మరి, ఆ గౌరవం ఏమిటో? మరి అది నేను పాటించకపోయినచో నేరమా? లేక రాజ్యాంగాన్ని అవమానించడమా?

    గౌరవం వ్యక్తి స్వేచ్చ, దాన్ని కాదనే హక్కు ఒక్క నియంతకే సాధ్యం, అందరూ రాజ్యాంగాన్ని ఇలా చేస్తేనే గౌరవించినట్టు అనడం నియంతృత్వమే, ఇలా వ్యక్తి స్వేచ్చని ఒక చట్రంలో భంధించి, అది రాజ్యాంగానికి మేము ఎదో గౌరవం ఆపాదించాము అనికోవడం నియంతృత్వమే.

    ఇక పవిత్రత అంటే అది నిజమైన దిగజారుడుతనం,..,

    రిప్లయితొలగించండి
  13. @అజ్ఞాత: All the articles in my blog are in line with the spirit of constitution and law of this nation.

    @తార: You have made no argument at all. Please read your question, it makes no sense at all.

    రిప్లయితొలగించండి
  14. మహేష్ గారు, మీకు అర్ధం కాకపొతే కాలేదు, వివరించమని చెప్పండి, అంతే తప్ప దానిలో సెన్సు వున్నదో లేదో మీరు చెప్పక్కర్లేదు, కాస్త వివేకంతో జవాబు ఇవ్వగలరు.

    రిప్లయితొలగించండి
  15. @తార: When I say "it makes no sense at all", it essentially means, it makes no sense to ME. ఇందులో వివేకానికొచ్చిన ఢోకా ఏమిటో అస్సలు అర్థం కావడం లేదు !

    రిప్లయితొలగించండి
  16. రాజ్యాంగం పవిత్రమైనదే అయితే ఇన్ని సవరణలుండవు. మారుతున్న ఆలోచనలకు, అవసరాలకనుగుణంగా మార్పులు చోటు చేసుకోవాల్సినంతగా జరగకపోవడం, అది రాజ్యం యొక్క మొఖంగా తయరవుతోందే తప్ప ప్రజల మనోభావాలను ప్రతిబింబించకపోవడంతో అది ఫార్సుగా తయారయ్యింది. రాసుకున్నమేరయినా ప్రజల వ్యక్తిగత జీవనానికి భయాందోళనలేకుండా చేయలేకపోవడం, నిజానికి ఆదేశ సూత్రాలలో మంత్రాలుగా మిగిలిపోయిన సూక్తులు ప్రజలకు ప్రాధిమిక హక్కుగా ఇవ్వాల్సినవి. కానీ పాలకవర్గం ఎన్నికల ముందు తాయిలాలివ్వడం ద్వారా అధికారాన్ని చేపడుతూ, ప్రజలపై నియంతృత్వాన్ని చెలాయిస్తున్నాయి. పవిత్రతను ఆపాదించడం వ్యక్తి ఆరాధన లాంటిదే. ఈ దేశ ప్రజల మౌలిక భావనకు వ్యతిరేకంగా వున్నదానిని వ్యతిరేకించే అవకాశం ప్రజల హక్కు.

    రిప్లయితొలగించండి
  17. @అజ్ఞాత: All the articles in my blog are in line with the spirit of constitution
    ---
    You are wrong. Not even Islamic constitution would tell to redicule other religious belief. Your high headedness is clear in all your posts.

    రిప్లయితొలగించండి
  18. >>it essentially means, it makes no sense to ME

    ఒహో,..నాకు అంత ఇంగ్లీషు వచ్చిచావదు లేండి..

    ఐతే దానిలో మీరు అర్ధం లేదు అని తేల్చిపడేశాక మీకు నా భావన వివరించడం అనవసరం.

    >>ఇందులో వివేకానికొచ్చిన ఢోకా

    అవతలి వాడు చెప్పింది అర్ధం కాకపొతే, దానిలో అర్ధమే లేదు అని తేల్చడం వివేక శూన్యత.

    రిప్లయితొలగించండి
  19. ప్రశ్నించడమే మహా పాపం అనే పవిత్రత ఆపాదించడం అవసరంలేదు. రాజ్యాంగానికైనా, నాయకులకైనా లేకా నమ్మకాలకైనా. అయితే గౌరవమైతే ఇవ్వల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. అసలు గౌరవమంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? అనేది పెద్దగా చర్చించవలసిన విషయం కాదు.

    ఇంతమంది ప్రజలు కలిసి ఒక వ్యవస్థగా జీవించడం, ఎన్నో సమిష్టి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉన్నప్పుడు, ఏదో ఒక ప్రాతిపదిక కావాలికదా. మెజారిటీ ప్రజలుకు అంగీకారయోగ్యమైన అటువంటి ప్రాతిపదికే రాజ్యాంగం.

    ఏంవిషయాన్నైనా మార్చుకోవాలంటే, మార్చుకొనే వీలున్నప్పుడు, ఒక్కరికి నచ్చకపోయినా తమ వాదనతో మిగిలిన వారిని ఒప్పించుకునే ప్రయత్నం చేసుకొనే వీలున్నప్పుడు ఇంక సమస్యేముంది?

    రిప్లయితొలగించండి
  20. >>మెజారిటీ ప్రజలుకు అంగీకారయోగ్యమైన అటువంటి ప్రాతిపదికే రాజ్యాంగం.

    మెజారిటీ ప్రజలు కలిసి మైనారిటీ ప్రజలని చంపినా తప్పులేదు అని మార్చితే?
    మీ రాతల్లో ప్రిజుడీస్ ఎక్కువ, ఆలోచనలు కుడా ఇరుగ్గా ఉంటున్నాయి, మీరు ఇంకా ఇలాంటివి రాసే ముందు, కాస్త పొలిటికల్ సైన్సు చదివి, కాస్త తెలుసుకోని రాయగలరు

    రిప్లయితొలగించండి
  21. >>మీ రాతల్లో ప్రిజుడీస్ ఎక్కువ, ఆలోచనలు కుడా ఇరుగ్గా ఉంటున్నాయి

    నా రాతల్లో ప్రిజుడీస్ లేక ఇరుకుతనం ఉంతే మీరు చూపించే విశాల దృక్పధాన్ని చూసి చదివే వాళ్ళతో పాటు నేను కూడా తప్పకుండా నిజాన్ని గ్రహించగలం.

    >>మెజారిటీ ప్రజలు కలిసి మైనారిటీ ప్రజలని చంపినా తప్పులేదు అని మార్చితే?

    నేను చెప్పిన దాంట్లో మీకు అటువంటి అర్థం స్ఫురించిందా మహాశయా! మీ సందేహం ఏంటో చెప్పి వుంటే వివరణ ఇవ్వడానికి అవకాశం ఉండేది. అంతే కానీ ఇలా కొత్త కొత్త భాష్యాలు మీకు మీరే సృష్టించుకొని అపనిందలు వేయడం ఏమాత్రం బాలేదు.

    >>ఇలాంటివి రాసే ముందు, కాస్త పొలిటికల్ సైన్సు చదివి, కాస్త తెలుసుకోని రాయగలరు

    నాకు తెలిసినంతవరకూ నేను రాస్తున్నానండీ. ఇంకా తెలుసుకోవడమంటారా, తప్పకుండా. అది నిరంతర ప్రక్రియ నా విషయంలో. బహుశా మీలాంటి వారికైతే అంతా తెలుసనుకుంటా !!!

    రిప్లయితొలగించండి
  22. వెటకారం బాగుంది, మీ జవాబే, మీ ఆలోచనల్లో వున్న ఇరుకుతనాన్ని చూపిస్తున్నది,.. తప్పు ఎత్తి చూపితే, వెటకారం, బాగు బాగు..

    >>మీ సందేహం ఏంటో చెప్పి వుంటే.
    సందేహం కాదు అది, మీ ఆలోచనలో ఉన్న తప్పుని చూపించాను, అది మీ ఆలోచనకి తట్టలేదు,... అదే చెప్పాను నేను ఇరుకుతనం అని..

    రిప్లయితొలగించండి
  23. మెజారిటీ ప్రజలూ, బలవంతులూ తాము నమ్మిందే న్యాయమని తమ ఇష్టం వచ్చినట్టు చెయ్యకుండా కట్టడి చెయ్యడానికే రాజ్యాంగాలైనా, లేకా కొద్దిగా పాత రోజుల్లో అయితే కట్టుబాట్లూ అచారాలైనా అనిపిస్తుంది.

    నిజానికి చాలా సార్లు మంచి మంచి ఆలోచనలు సమాజంలో మొదట్లో మెజారిటీ ఆమోదంతో మొదలవ్వవు. ప్రతి ఆలోచనా కొద్దిమందితో మొదలయి క్రమంగా మెజారిటీ సంపాదించుకుంటుంది. మెజారిటి మద్దతు లేనిదంతా తప్పు అనుకోవడం అత్యంత ప్రమాదకరం. ఒక మంచి ఆలోచనకు ఇంకా మెజారిటీ మద్దత్తు రాలేదంటే, ఆ ఆలోచన మంచిదేకానీ ఇంకా దానికి సమయం ఆసన్న మవ్వలేదన్న విషయాన్ని గ్రహించాలి. అటువంటి మంచికి మెజారిటీ మద్దత్తు కూడగట్టాలి.

    ఎక్కడదాకో ఎందుకు, మన ఇతిహాసాల్లోనే చూసుకుంటే, రాముడైనా, క్రిష్ణుడైనా క్లియర్ పర్పస్ తో అవతారించారు. అదేంటంటే అప్పుడున్న చెడుని నిర్మూలించి కొత్త యుగానికి శ్రీకారం చుట్టడం. మరెందుకైతే ఇతిహాసాల్లో దుర్మార్గులని సరాసరి సం హరించి అవతల పడెయ్యలేదు? వారి పాపాలు పండేదాకా అది అందరికీ చక్కగా అర్థమయ్యేదాకా ఎందుకు ఎదురు చూసారు? ఎందుకంటే చెడుకి వ్యతిరేకంగా కలెక్టివ్ కన్ సైన్స్ తయారయ్యేవరకూ ఎదురు చూశారన్నమాట. ధర్మం ఏంటనేది తెలిసినా చివరికి దేవుడు కూడా మెజారిటీ ప్రజలకు అది అర్థమయ్యేలా చేసాకే దానిని అమలు చేసాడనిపిస్తుంది.

    అందుకేనేమో ఎన్ని సమస్యలున్నా ప్రజాస్వామ్య భావన మన సంస్కృతిలో అంత బలంగా అంతర్లీనమై పోయుంటుంది.

    రిప్లయితొలగించండి
  24. >>వెటకారం బాగుంది, మీ జవాబే, మీ ఆలోచనల్లో వున్న ఇరుకుతనాన్ని చూపిస్తున్నది,.. తప్పు ఎత్తి చూపితే, వెటకారం, బాగు బాగు..

    చాలా సంతోషంగా ఉందండీ, క్రికెట్టు బాగా ఆడుతున్నావోయ్ అని టెండూల్కర్ మెచ్చుకున్నట్టుగా!!

    రిప్లయితొలగించండి
  25. >>చాలా సంతోషంగా ఉందండీ, క్రికెట్టు బాగా ఆడుతున్నావోయ్ అని టెండూల్కర్ మెచ్చుకున్నట్టుగా!!

    :-) ...

    మీ ఇంగితానికే వదిలేస్తున్నాను...

    రిప్లయితొలగించండి
  26. ఏకాభిప్రాయం అనే ఒక దాని పాత్ర ఉంటుంది రాజ్యాంగంలో అనే తెలియని మీరు, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అంత స్థాయి కాదు కదా, మా వీధిలో ప్లాస్టిక్ కవర్లు చుట్టి క్రికెట్ ఆడుకునే వారి అంత స్థాయి కుడా లేదు,.... సచిన్ ఐనా తప్పులు చెబితే వింటాడు కానీ, మీరు ఎదురుదాడి చేసి, సిసలు రాజకీయవేత్త అనిపించుకున్నారు, బాగు బాగు,.., ఇలానే మెల్లగా రౌడీయిజంతో ఎదగండి,..
    నేను చాలా దూరంగా ఉంటాను మీకు..

    రిప్లయితొలగించండి
  27. నేనెప్పుడూ సిద్దమేనండీ. మీరు చెప్పినదాన్లోని విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాను.

    మీరుకూడా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తాను.

    రిప్లయితొలగించండి
  28. >>మీరుకూడా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తాను.
    సరే ఐతే, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి,

    >>మెజారిటీ ప్రజలుకు అంగీకారయోగ్యమైన అటువంటి ప్రాతిపదికే రాజ్యాంగం.
    మెజారిటీ ప్రజలు కలిసి మైనారిటీ ప్రజలని చంపినా తప్పులేదు అని మార్చితే? లేదా రాజ్యాంగంలో చేర్చితే?

    రిప్లయితొలగించండి
  29. తార గారు,
    >> మెజారిటీ ప్రజలు కలిసి మైనారిటీ ప్రజలని చంపినా తప్పులేదు అని మార్చితే? లేదా రాజ్యాంగంలో చేర్చితే?

    అటువంటి ప్రమాదకరమైన పోకడలు రాకూడదనే, కొన్ని ప్రాధమిక హక్కులని ముందుగానే నిర్థారించుకుంటారు అని అనిపిస్తుంది. అందుకే కేవలం మెజారిటీ వున్నంత మాత్రాన సరిపోదు, ఆ మెజారిటి అభిప్రాయం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకి అనుగుణంగా ఉండాలి అనే నియమం.

    కేవలం ఒక్క మనిషైనాసరే మిగతా వారి అందరితో విభేదించినా తన భావలని ప్రచారం చేసుకొని మెజారిటీని ఒప్పించుకునే వెసులుబాటు ఉండి తీరాల్సిందే.

    ఈ చర్చ కోసం కొంచెంసేపు అలాంటి తీర్మానమే జరిగిందనుకుందాం! అప్పుడు అది కేవలం మెజారిటీ ప్రజల అభిప్రాయమే కానీ రాజ్యాంగబద్దం కాదు.

    నిజంగా మెజారిటీ ప్రజలు అటువంటి ఘోరమైన తప్పుడు నిర్ణయాలు చేయడమంటూ జరిగితే, ఆవ్యవస్థ మీద పోరాటం చెయ్యల్సిందే. మీరు పైన ఇచ్చిన ఉదాహరణ అంత ఘోరంగా కాకపోయినా కొన్నిసార్లు ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. అది రాజ్యాంగ వ్యతిరేకమె. అందుకేనేమో బహుశా బలహీనులూ, ఆదివాసులూ కొన్ని సార్లు పోరాడక తప్పని పరిస్థితి. అందుకే మేధావి వర్గం కానీ, నాయకులుగానీ ఒక్కోసారి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నైనా మాట్లాడి ప్రజలకి సరైన మార్గనిర్దేశం చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో మెజారిటీ ప్రజలు కాస్త ఆలస్యంగానైనా మంచి ని గుర్తించగలరు అనేది నా విస్వాసం. అలా కాని పక్షంలో ఒక సమూహంగా ఆ సమాజం పతనమయ్యిందనే చెప్పుకోవాలి. దానికి ఆ సమాజం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సిందే.

    రిప్లయితొలగించండి
  30. >>అందుకే కేవలం మెజారిటీ వున్నంత మాత్రాన సరిపోదు, ఆ మెజారిటి అభిప్రాయం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకి అనుగుణంగా ఉండాలి అనే నియమం.

    కానీ మెజారిటీ ఉంటే అవి కుడా (మౌలిక సూత్రాలు కుడా) మార్చేస్తారు కదా..అప్పుడు వాటికి అనుగూణంగానే ఉంటుంది.

    >>అప్పుడు అది కేవలం మెజారిటీ ప్రజల అభిప్రాయమే కానీ రాజ్యాంగబద్దం కాదు.

    రాజ్యాంగబద్దం ఎందుకు కాదు, చక్కగా రాజ్యాంగవ్యతిరేకం అని రాజ్యాంగంలొనే ఉంటుందాయె..

    >>అది రాజ్యాంగ వ్యతిరేకమె.
    రాజ్యాంగం అంటే, ఒక దేశంలో ఉన్న చట్టం, ప్రభుత్వం ఎలా ఉండాలి అని, (తెలుగులో సరిగ్గా చెప్పలేను క్షమించాలి), సో రాజ్యాంగ వ్యతిరేకమే అని అంటే మీ భావన నాకు అర్ధం కావడం లేదు, మీరు వేరే డెఫినిషన్ లో వాడుతున్నారా?

    >>సమాజంలో మెజారిటీ ప్రజలు కాస్త ఆలస్యంగానైనా మంచి ని గుర్తించగలరు అనేది నా విస్వాసం

    ఈలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది కదా మరి? దాన్ని నివారించడం ఎలా?

    >>దానికి ఆ సమాజం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సిందే.
    ఎలా? ఆఫ్రికాలో చేసిన జీవహింసకి ఒక్కరుకుడా మూల్యం చెల్లించుకోలేదు కదా..

    >>కొన్ని ప్రాధమిక హక్కులని ముందుగానే నిర్థారించుకుంటారు అని అనిపిస్తుంది.

    మనం చేసుకున్నవే ఇవి అన్నీ, మార్చడం కుడా సులభమే కదా, మెజారిటీ ఉంటే.. ఇప్పటికీ కొన్ని అరబ్బు దేశాలలో, స్త్రీలకి ప్రాధమిక హక్కులు కుడా లేవు కదా, అసలు ఎవరికీ లేవేమో (మన దేశ ప్రాధమిక హక్కులతో పోల్చుకుంటే), మరి అసలు ప్రాధమిక హక్కు అంటే, మెజారిటీ అభిప్రాయం లేక, కొందరి బలవంతుల అభిప్రాయం ఐపోతుంది ఎమో కదా..చైనా, కొరియా, అవి రాజ్యాంగ బద్ద పాలనే చేస్తున్నాయి, కానీ మానవ హక్కులు ఎంత ఘోరంగా ఉన్నాయి?

    ఇప్పుడు మన రాజ్యాంగమే తీసుకుందాం, అసలు అది మెజారిటీ ప్రజల ఆశయాలకి అనుగూణంగానే ఉన్నదా? ఉన్నది అంటే ఎలా? అసలు ఒక చర్చ కానీ, ఒక రెఫెరెండెంకానీ ఎప్పుడైనా జరిగిందా? కాలం చెల్లిన చట్టాలని మార్చమని ఎంతమంది అడగటంలేదు, మరి ఆ దిశగా అసలు ఏదైనా ప్రయత్నం జరిగిందా? నాకు రాజ్యాంగలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మరి వాటికి జవాబు ఎవరిస్తారు? అసలు అది ప్రజలకి అందుబాటులో ఉన్నదా?

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. by Wit Real (did minor edits without loosing the meaning..)

    1.

    Yab Said:
    >> Isn't the Constitution a majority thing,
    >> there can be people (may be a minority)
    >> who might not ..........

    Hehe! Someone here had a problem, when I said "your" constitution! ;)

    2.
    >>
    See this argument put by that clan
    1. All Indians are equal (కుల వ్యవస్థ ని నిర్మూలించాలి)
    2. reservations for backward castes

    Dont go into detailed analysis. Just clarify whether this 2 statement argument is coherent?

    3.
    >> నా భావాలను బలపరుస్తూ వీర్ సాఘ్వీ అనే పొలిటికల్ కామెంటేటర్
    >> ఇలాంటి వ్యాసాన్నే హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో రాసాడు

    చేసిన తప్పుని సమర్థించుకోడానికి ఒక "తోడు" చూపించడం దగుల్బాజీ తనానికి పరాకాష్ట!

    ఇప్పుడు పూరిపాక చెడామడా వాయించి, దానికి సపోర్టుగా "నా భావాలను బలపరుస్తూ వరుణ్ గౌరి అనే పొలిటీషియన్ Worshiping the faltoo devils అనే పుస్తకాన్నే రాసాడు" అంటే??

    History says, the India Constitution's chief architect, at every possible turn, opposed the campaigns of the National Movement for independence :( (ref: Vrun Gourie)

    further, వరుణ్ గౌరి says, "There is not one instance, not one single, solitary instance in which XXXX participated in any activity connected with that struggle to free the country

    4. The biggest problem with these "bloggers in the well" is that వాల్లు చేస్తే శృంగారం, వేరేవాల్లు చెస్తే...
    more later.

    రిప్లయితొలగించండి
  33. అనేక దేశాల్లో వారి వారికి సరిపోయిన వ్యవస్థలు నిర్మించుకుంటారు. ఏది మంచి వ్యవస్థ అనేదాని కంటే అది ఆయా ప్రజలకి ఎంత మేలు చేస్తుంది అనేదే ముఖ్యమైన విషయం.

    మన రాజ్యాంగం విషయానికి వస్తే, దేశ ప్రజల ఉమ్మడి ఙాన సంపద మీద నమ్మకమే పునాదిగా మన వ్యవస్థని నిర్మించారు అనిపిస్తుంది. అందుకే పరిస్థితులనుబట్టి సమాజంలో మారే విలువలను బట్టి మార్చుకునే వీలు ఉండడం నా దృష్టిలో చాలా చక్కని వెసులుబాటుగా అనిపిస్తుంది. చాలా మంది అనుకునేట్టు, అనేక సవరణలు జరగడమనేది, సిగ్గుపడాల్సిన విషయంగా కన్నా, మనలో మార్పునీ ఆధునికీకరణనీ ప్రోత్సాహించే అంశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో నిర్ధారించిన విలువలనే యుగయుగాలకీ, తరతరాలకీ పరమ పవిత్రమైనవిగా చూడాల్సిన పరిస్థితిని తప్పించుకోవచ్చు. కాకపోతే ఈ వెసులుబాటుని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది ఒక జాతిగా మనందరి మీదా ఆధారపడి ఉన్న విషయం.

    అందుకే ప్రశ్నించే అవకాశం, విమర్శించే వీలూ ఎప్పుడూ ఉండాల్సిందే! పవిత్రత అయినా గౌరవమైనా అటువంటి సత్సాంప్రదాయాలను కాలరాసే స్థాయికి రాకూడదు.

    ఈ వ్యవస్థలోనూ ఎన్నో లోపాలు బయట పడుతూనే ఉంటాయి. కాకపోతే అవి అన్నీ సరిచేయగలిగినవే. ఆలోపు కొంతమంది నష్టపోవాల్సిరావడం బాధాకరం. వీలైనంతవరకూ దాన్ని తగ్గించేప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చెయ్యవలసిన బాధ్యత రాజకీయనాయకులది. వాళ్ళు చెయ్యట్లేదనే బాధ మనలాంటోళ్ళదీ!

    రాజ్యాంగం పనితీరూ, మౌలిక విలువలూ ఎప్పటికప్పుడు విశ్లేషించి ప్రజల ఉమ్మడి ఙాన సంపదతో మెరుగుపరుచుకొనే ప్రయత్నాలు అంతగా జరగక పోవడమే కొద్దిగా విచారించవలసిన విషయం.

    Constitution of a country or a religion of a people are the foundations of past and present. they are the things that need to be mended if need be, it is a wrong idea to break and demolish them to build them afresh. It is like committing suicide because one is not happy with ones self. It is sensible to change oneself and build a new future.

    రిప్లయితొలగించండి