ఎవరైనా ఒక విషయం మీద వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు ఇతరులు దానితో విభేదించడమో, అంగీకరించడమో లేక వేరే కోణంలోంచి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమో లేక విని ఊరుకుండడమో చేస్తారు అని అనుకునే వాణ్ణి. అయితే ఈ మధ్య కొత్త కొత్త పోకడలు కొన్ని వచ్చినట్లున్నాయి.. అంటే తమ అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఇంకేదో విషయంలో వాళ్ళ స్పందన చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఒక కుహనా మేధావులు అని ఒక ముద్ర తగిలించేసి హాయిగా తప్పుకొని విషయాన్ని పక్కదారి పట్టించడం. ఈ పోకడ ఇంటర్నెట్లోనూ బాగానే ప్రబలుతున్నట్లుంది.
ఉదాహరణకు, స్త్రీవాదానికి మద్దత్తుగా మాట్లడామో అంతే.. మహిళల వైపునుంచి జరిగే పొరపాట్లన్నిటికీ నువ్వే బాధ్యత తీసుకోవాలి లేదంటే నువ్వొక కుహనా స్త్రీవాదివి అంటారు. మీరు ఏదైనా మతపరమైన విషయం మీద మాట్లాడారో, ఇంక అంతే.. వచ్చేస్తారు మన వాళ్ళు.. ఫలానా మతంలొ జరిగిన విషయాన్ని నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు చెప్పేదాంట్లొ అర్థం లేదు అంటారు. ఒక విషయం మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళు అన్నింటిమీదా గుత్తాధిపత్యం తీసుకోవాలి అన్నట్లు. అదేదో వీళ్ళే ఖండించొచ్చు కదా!!
ఇలాంటి వాళ్ళకు ఆలోచించే ఓపికా, అర్థం చేసుకొనే సహనం లేకపోవడం వల్ల ఒకరకమైన నూతిలో కప్ప మనస్తత్వం అలవాటై పోయుంటుంది. తమకు తెలిసిన దాన్ని ప్రశ్నించినా లేక వేరే ద్రుక్కోణం చూపించినా అది తమపై జరిగిన వ్యక్తిగత దాడిగా భావించి ఒకరకమైన ఆత్మన్యూనతలో మునిగిపోతుంటారు. వెంటనే తమకు చిన్నప్పటినుంచీ ఎలా అన్ని వర్గాల ప్రజలతో స్నెహం ఉండేదో, తాము చిన్నప్పుడు ఎంత మందికి పెన్సిళ్ళు గట్రా ఇచ్చేసి ఉధ్దరించేశారో ఏకరువుపెట్టి, తమ భావదారిద్ర్యాన్ని వ్యక్తిగత మంచితనం వెనక దాచేస్తుంటారు.
ఇలాంటి అనుభవాలు మీకూ ఎదురయ్యే వుంటాయికదూ! ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళు అని ఉండరేమోగానీ, ఈ రకమైన బలహీనతకి చాలామంది కొన్ని కొన్ని సందర్భాలలో లోనవుతుంటారేమో అనిపిస్తుంది. ఈ బలహీనత నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి.. ఆరోగ్యకరమైన చర్చా, అర్థవంతమైన ప్రశ్నలూ లేకపోతే ఆ సమాజం తిరోగమనంలో పడిపోయినట్టే..

ఏవో కొన్ని ప్రశ్నించరాని సూత్రాలూ, నమ్మకాలూ మనసులో పెట్టేసుకోని వాటిని ఎవరైనా ప్రశ్నించడమో లేక కొత్త దృక్పధాన్ని తేవడమో చేస్తే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వారి మీద విపరీతమైన ద్రోహులుగా ముద్ర వెయ్యడం లాంటివి చేస్తారు. ఇంక చూస్కో నా సామిరంగా విమర్సల జడివాన, వ్యక్తిగత దాడి..నషాలానికి అంటుద్ది వేడి.
అవతలి వ్యకి యొక్క వ్యక్తిత్వం మీద దాడి చేసి వాళ్ళు చెప్పే విషయాన్ని మరుగు పరచెందుకు ప్రయత్నించడం కూడా ఈ కోవలోకే వచ్చే ఇంకో పద్దతి. ఉదాహరణకు.. కె సి ఆర్ మొదట్లో తెలంగాణా వాదన వినిపించినప్పుడు, ఆ వాదం గురించి చర్చ చెయ్యకుండా, ఆయన మంత్రి పదవి కోసం చేస్తున్నాడనీ, బాగా తాగుతాడనీ (అంతకుముందు తెలియనట్లు!!) చిత్ర విచిత్ర మైన ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితులొచ్చాక మాత్రమే అసలు విషయం (తెలంగాణా వాదం) గురించి చర్చ మొదలయ్యింది. అప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది.
పోనీ అతి జాగ్రత్తగా విషయాన్ని వివరించామో, అయ్యుండొచ్చు కానీ.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటారు. లేదంటే, సగటుమనిషి అనే మిథికల్ క్రీచర్ వెనకాల దాక్కుంటారు. ఎలాగంటే.. అప్పటి దాక చూపటానికి ప్రయత్నించిన మేధావితనాన్ని పక్కన పెట్టి, సగటు మనిషి కి ఇలా చెప్పకూడదు అది సమాజానికి మంచిది కాదు అనటం, లేదంటే.. నేను ఒక మామూలు డీసెంట్ సగటు మనిషిని నేనింతే అంటారు.