22, మార్చి 2012, గురువారం

అయ్యా రవి శంకరు గారూ, మీరు కాస్త... ;)

ప్రభుత్వ పాఠశాలల్లో చదవే వాళ్ళ నుండే నక్సలైట్లు వస్తారనీ, హింసా ప్రవృత్తి ఉంటుందనీ సెలవిచ్చారట శ్రీ శ్రీ రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ ) గారు. పైగా అసలు ప్రభుత్వాలు స్కూళ్ళు నడపగూడదనీ, స్కూళ్ళని పూర్తిగా ప్రైవేటు పరం చెయ్యాలని కూడా ఒక అభిప్రాయాన్ని ప్రవచించారంట.

ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన గొప్ప వారైతే అయ్యుండొచ్చు గానీ, మిగిలిన విషయాల్లో ఆయన ఆలోచనలూ, అభిప్రాయాలూ ఇంత అపరిపక్వంగా ఉన్నాయనేది చాలా నిరాశ కలిగించే విషయం.

ఆయన ప్రైవెటు రంగం గొప్పదనం గురించి బాకా ఊదాలనుకుంటే అది ఆయన హక్కు, మనం విమర్శించొచ్చు కానీ ప్రాధమిక విద్యా, ప్రాధమిక ఆరోగ్యం లాంటి వాటి నుంచి కూడా ప్రభుత్వాన్ని వైదొలగి ప్రైవేటు పరం చెయ్యమని చెప్పడానికి ఆయన ఎంచుకున్న లాజిక్ మాత్రం హాస్యాస్పదంగానూ, ఆలోచనారహితంగానూ, అవగాహనా లోపంగానూ కనిపించక మానదు.

ఆధ్యాత్మిక విషయాల్లో అంత పేరు ప్రఖ్యాతులు  ఉండీ, చాలామంది జనాలని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయ, ఆర్థిక విధానాల గురించి మాట్లేడే టప్పుడు, చాలా ఆలోచించి మాట్లాడాలని ఆశించడం అత్యాశ కాదనిపిస్తుంది.

57 కామెంట్‌లు:

  1. కర్నాటకలో అంతే..
    స్వాములు ప్రతీ విషయంలోనూ సలహాలిస్తారు.

    ఈయన కార్పొరేట్ స్వామి కాబట్టి ప్రైవేట్ రంగానికి మద్దతిస్తాడు.

    రిప్లయితొలగించండి
  2. "ఆధ్యాత్మిక విషయాల్లో అంత పేరు ప్రఖ్యాతులు ఉండీ, చాలామంది జనాలని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయ, ఆర్థిక విధానాల గురించి మాట్లేడే టప్పుడు, చాలా ఆలోచించి మాట్లాడాలని ఆశించడం అత్యాశ కాదనిపిస్తుంది."
    నిజం

    రిప్లయితొలగించండి
  3. @కృష్ణప్రియ గారూ,

    అదే మరి :)

    @bonagiri గారూ,

    అంతేనంటారా :). ఈయన రాజస్థాన్ లో చెప్పారట ఈ అభిప్రాయాన్ని.

    @నారాయణ స్వామి గారూ,

    ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  4. పండిట్ రవిశంకర్ అంటే సుప్రసిద్ధ సితార్ విద్వాంసుడు. మీరు "శ్రీశ్రీ" అని చెప్పుకునే "జీవిత కళ" దుకాణం యజమాని గురించి చెప్తున్నారని అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  5. ఏ ఆధ్యాత్మిక గురువు అయినా జనం గురించి ఆలోచించాలి అనుకోవడం, ఇప్పటి నుండి అత్యాసే అవుతుందని రవిశంకర్ గారి మాటల్లో అర్ధం అయ్యింది .
    ఆయన మెచ్చుకొంటే మాత్రం ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడి పోతాయా . ఆయనకీ పిల్లలు లేరు కాబట్టి ఏ అభిప్రాయం చెప్పినా తప్పు కాదు :)

    రిప్లయితొలగించండి
  6. Jai Gottimukkala గారు,

    సుప్రసిద్ధ సితార్ విద్వాంసులు రవిశంకర్ గారి గురించి కాదులెండి. ఈ పైత్యం శ్రీ శ్రీ జీవిత కళ దుకాణం యజమానిదే :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరి ఈయన్ని పండిట్ అంటే నిజమయిన పండితులు మోచ్చుకుంటారు. అయితే వీరి తండ్రి గారు ఖచ్చితంగా మహా పండితులు అయి ఉంటారు, "పండిత పుత్ర పరమ bleep" అనే నానుడి ఉంది కాబట్టి :)

      తొలగించండి
  7. Being a Government Teacher, I would be rather satisfied if any one of my student is raise as Moist. Better to teach the would be moists rather than pseudo Babas.

    రిప్లయితొలగించండి
  8. కార్పోరేట్ కాసుల వర్షానికి .ఏసీ రూముల ధ్యానాలకు మెదడు మొద్దుబారి పోయుంటుంది . ధ్యానం వికటించి పిచ్చి మొదలయ్యుంటుంది

    రిప్లయితొలగించండి
  9. మా నాన్నగారు ప్రభుత్వం నడిపే ఒడియా మీడియం పాఠశాలలో చదివారు. కానీ ఆయన virulent anticommunist. నేను చదివినది ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో. కానీ స్కూల్‌లో ఎక్కడా బోధించని మార్క్సిజం-లెనినిజం-మావో జెడాంగ్ థియరీలు చదివాను. తెల్ల చొక్కా వేసుకున్న బ్యాంక్ ఆఫీసర్ కొడుకు మావోయిస్ట్ అవ్వొచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివినవాడు anticommunist కాకూడదు.

    రిప్లయితొలగించండి
  10. 'నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు' , 'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అనే రెండు సామెతలు గుర్తుకువస్తున్నాయి. ఈ మధ్య ఆధ్యాత్మికత పేరుతో ఏది చెప్పినా సరిపోతుందని ఎవడికి తోచింది వాడు మాట్లాడుతున్నాడు.వాళ్ల ఆర్ధిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాల మెప్పుకోసం ఈ సన్నాసులు ఇలా పిచ్చి ప్రవచనాలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆధ్యాత్మికత ముసుగులో చేసే వ్యాపారాలు కార్పొరేట్ సామ్రాజ్యాలను తలదన్నుతున్నాయి. దుర్గేశ్వర గారన్నట్లు " కార్పోరేట్ కాసుల వర్షానికి .ఏసీ రూముల ధ్యానాలకు మెదడు మొద్దుబారి పోయుంటుంది . ధ్యానం వికటించి పిచ్చి మొదలయ్యుంటుంది " . ప్రజలలో చైతన్యం పెరిగితే వీరి పిచ్చి వదిలిస్తారు. తస్మాత్ జాగ్రత్త.

    రిప్లయితొలగించండి
  11. రవిశంకర్ వ్యాఖ్య నాకేమి ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన తన వర్గం వారి ప్రయోజనాలకి అనుగుణంగానే మాట్లాడాడు. ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నత వర్గీయుల్లో వింటుంటాం. కాకపోతే వారెవరూ రవిశంకర్ లాగా బయటపడి మాట్లాడరు. ఈ బాబా గారికి రాజకీయాల పట్ల ఆసక్తి మెండు. కేవలం ఆధ్యాత్మిక వ్యాపారంలోనే మునిగి తేలకుండా.. సామాన్య ప్రజానీకం గూర్చి కూడా బాబాలు మాట్లాడటాన్ని ఆహ్వానిస్తున్నాను (వారి అభిప్రాయాలు ఎంత అసంబద్ధంగా ఉన్నప్పటికీ).

    రిప్లయితొలగించండి
  12. "జీవిత కళ దుకాణం" పెట్టుకున్న వాడు దుకాణం పన్లు చూసుకోక ఈ అనవసరమైన ప్రవచనాలెందుకో!

    సర్వ సంగ పరిత్యాగులుగా తమను తాము చూపించుకుంటున్న వాళ్ళు ఈ ప్రాపంచిక విషయాలు జనాల కొదిలేసి వాళ్ల పన్లు వాళ్ళు చూసుకుంటే బాగుండు.

    ఇంతకీ ఆయన ఏ బళ్ళో చదివాడటా? అందర్నీ అక్కడ చదవమంటాడా ఏం?

    రిప్లయితొలగించండి
  13. నాకు తెలిసినంత వరకు మతం ముసుగు వేసుకోకుండా వ్యక్తి స్వేచ్ఛావాదం పేరుతో అభివృద్ధి నిరోధక సిద్ధాంతాలని సమర్థించేవాళ్ళే అలా ఓపెన్‌గా మాట్లాడుతారు. ఉదాహరణకి లిబర్టేరియన్ పార్టీ ఆఫ్ యు.ఎస్.ఎ.వాళ్ళు. కానీ మతం ముసుగు వేసుకునేవాళ్ళు అంత ఓపెన్‌గా అలాంటి ప్రకటనలు చెయ్యరు. రవిశంకర్ మతం ముసుగు వేసుకున్నా ముసుగు వెనుక ఏముందో బయటపెట్టుకున్నాడు. అదే తేడా.

    రిప్లయితొలగించండి
  14. My maternal grandfather studied in Government school in Paralakhemundi. He was born in the year 1931. There were no private schools in those days. There were private colleges in Paralakhemundi and Vizianagaram in those days but school education system was almost owned by the government. During the time of 1975, my maternal grandfather worked in Swatantra Party that was a virulent anticommunist party. Swatantra Party merged into a hindu fundamentalist party named Bharatiya Jan Sangh and Bharatiya Jan Sangh later merged into BJP. All these parties are virulent anticommunist parties and most of the leaders of these parties were educated in government schools.

    మన పాలక వర్గంవాళ్ళు నడిపే స్కూల్‌లలో చదివినవాళ్ళు నక్సలైట్లు అవుతారనుకుంటే అది భ్రమే. భూదాన్ ఉద్యమం పేరుతో ప్రజలని ఆకర్షించి వాళ్ళని కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు వెళ్ళకుండా చెయ్యడానికి ప్రయత్నించిన వినోభా భావే లాంటి వాళ్ళ గురించి స్కూల్ పుస్తకాలలో గొప్పగా వ్రాసారు మేము స్కూల్‌లో చదువుకునే రోజుల్లో. కమ్యూనిస్ట్‌లని నమ్మితే రక్తపాతం తప్ప ఏదీ రాదనీ, వినోభా భావే లాంటి శాంతి ప్రవక్తలని మాత్రమే నమ్మాలనీ బోధించి పిల్లలు భవిష్యత్‌లో కమ్యూనిజం వైపు వెళ్ళకుండా చెయ్యాలనుకున్నారు. రవిశంకర్ లాంటి వాళ్ళకి సమస్య ఏమిటొచ్చింది అనే విషయానికొద్దాం. పశువులు తోలేవాని కొడుకు చదువుకుంటే అతను కూడా డబ్బున్నవాళ్ళ పిల్లలతో పోటీ పడి డాక్టరో, ఇంజినీరో అవ్వాలనుకుంటాడనీ, అప్పుడు డబ్బున్నవాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయనీ వైట్ కాలర్ భక్తులు ఉన్న ఈ స్వామివారి భయం. రిజర్వేషన్‌ల వల్ల తమ అవకాశాలు తగ్గిపోతున్నాయని అగ్రకులాలవాళ్ళు ఢిల్లీలో గొడవ చెయ్యడం గురించి మనకి తెలిసినదే కదా. డబ్బున్నవాళ్ళు కూడా ఇలాగే అవకాశాలు కాపాడుకోవాలనుకుంటారు.

    రిప్లయితొలగించండి
  15. Mouli గారూ,

    ఎవరైనా, సామాజిక, రాజకీయ అంశాలమీద అభిప్రాయాలు ఏర్పరచుకోవటం, వాటిని వ్యక్తీకరించడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమే. అభిప్రాయంలో తప్పులూ, పొరపాట్లూ, మనకి అర్థంకాని కోణాలూ ఉండొచ్చు కానీ బాధ్యతా రాహిత్యమూ, ఎదుటి మనుషుల ఆలోచనా శక్తి మీద చిన్న చూపు కనబడినప్పుడు కొంచెం కోపం, నిరుత్సాహం, బాధ లాంటివి కలుగుతాయి. Thank you for your response :)

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాత(Mar 22, 2012 07:36 AM) గారూ,

    అంతేనంటారా :) yeah.. you have more than a point :)

    రిప్లయితొలగించండి
  17. @Durgeswara గారూ,

    స్పందించినందుకు ధన్యవాదాలు. ఆయన ధ్యాన పద్దతుల గురించి నాకు అంత అవగాహన లేదు. ప్రభుత్వ పాఠశాలల విషయం లో ఆయన అభిప్రాయాలు మాత్రం మీరన్నట్టుగా చాలా తెలివితక్కువగా ఉన్నాయనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  18. ప్రవీణ్ గారు,

    ఆయన చేసిన స్వీపింగ్ జెనెరలైజేషన్స్ ని సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు. కెవలం పొరపాటున చేసిన స్వీపింగ్ జెనెరలైజేషన్స్ మాత్రమే కాదు అవి, విధానాల మీదా ఆయనకున్న అవగాహనా రాహిత్యం గానీ లేకా ఆయనకి నచ్చిన విధానాల వైపుగా జనాలని మోసపుచ్చే ఉద్దేస్యం గానీ ఉండి ఉండాలి.

    రిప్లయితొలగించండి
  19. వీకెండ్ గారు,

    రవిశంకర్ గారి వంటి వారు ఆలోచించి మాట్లాడవలసినది అన్న మీ అభిప్రాయం తో ఏకీభవించినా, రవిశంకర్ అటువంటి వ్యాఖ్య చేయడానికి సాహసించిన కారణాలు కూడా చూడాలనిపిస్తున్నది.

    ఆయన చెప్పినట్లు స్కూళ్ళని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తే, ప్రభుత్వ స్కూళ్ళ లో మాత్రమె చదవగలిగే పిల్లలని చదువు మానెయ్యమని చెప్పినట్లు అవుతుంది లేక ఆయన స్వయంగా పూనుకొని ఆ పేద పిల్లల కోసం ప్రైవేటు స్కూళ్ళు నడుపుతారా? మరి ఆ ప్రశ్న ఎవరు అడగరేమి :)

    రవిశంకర్ వ్యాఖ్య సంబద్దమో ,అసంబద్దమో కాని...ఈ అయిడియా కూడా బానే ఉన్నట్లుంది. ఈ పిల్లలు కూడా ప్రైవేటు స్కూల్స్ లో నే చేరిపోతారు. ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది. పేద విద్యార్ధులు కూడా ప్రైవేటు స్కూల్స్ లో మిగిలిన పిల్లలతో సమానం గా చదువుకొంటే మంచిదే కదా? పనిలో పని అపుడు శ్రీ శ్రీ రవిశంకర్ ముఖ్యమంత్రి కూడా అయిపోతారు.

    అపుడు మన అసెంబ్లీ లో శాసన సభ్యులందరి చేతా ప్రార్ధనా గీతం కన్నా ముందు ' సుదర్శన క్రియ' ని విధిగా చేయించడం వల్ల బుర్ర చురుగ్గా పని చేస్తుంది (లేకుంటే పనికి మాలిన చర్చలు వదిలేసి శుభ్రం గా ప్రాణాయామం పేరు చెప్పి నిద్ర పోతారు. :))

    రిప్లయితొలగించండి
  20. పల్లా కొండల రావు గారు,

    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రమణ గారూ,

    ఎవరైనా, సామాజిక, రాజకీయ అంశాలమీద అభిప్రాయాలు ఏర్పరచుకోవటం, వాటిని వ్యక్తీకరించడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమే. బాధ్యతా రాహిత్యమూ, ఎదుటి మనుషుల ఆలోచనా శక్తి మీద చిన్న చూపూ, మోసగించాలనే ఉద్దేస్యమూ కనబడినప్పుడు కొంచెం కోపం, నిరుత్సాహం, బాధ లాంటివి కలుగుతాయి. Thank you for your response :)

    రిప్లయితొలగించండి
  21. సుజాత గారు,

    నా అభిప్రాయంతో మీరుకూడా ఏకీభవించినందుకు సంతోషంగా ఉంది :)

    >>"ఇంతకీ ఆయన ఏ బళ్ళో చదివాడటా?"

    తెలియదండీ.. ఇదేదో కనుక్కోవాల్సిన విషయమే.. క్రిష్ణప్రియగారు కూడా ఇదే ప్రశ్న అడిగారు :)

    రిప్లయితొలగించండి
  22. నక్సలైట్ భావాలు,హింసా ప్రవృత్తి నచ్చని శ్రీ శ్రీ గురూజీ గారు
    వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్రీ స్కూల్స్ లో వీళ్ళు
    నక్సలైట్స్ పిల్లలు అంటూ కొంతమంది పిల్లల్ని
    ఆర్ఫన్స్ గా ఉంచి చదివించటం లో భావమేమిటి??

    ఆ స్కూల్ చూడటానికి వెళ్ళిన వాళ్ళకి, డొనేషన్స్ కోసం వెళ్ళిన ప్రతి చోటా
    వాళ్ళను నక్సలైట్స్ పిల్లలు అని పరిచయం చేయటం వలన ఆ పిల్లల మనసుల్లో,

    అలాగే అక్కడ ఉన్న మిగతా పిల్లల్లో ఎలాంటి భావాలు కలుగుతాయి??

    ఇది నేను చూసిన రవిశంకర్ సేవామందిర్ అని పిలిచే ఒక ఫ్రీ స్కూల్ లో విషయం..

    ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను..

    రిప్లయితొలగించండి
  23. *జీవిత కళ దుకాణం" పెట్టుకున్న వాడు *
    @సుజాత,
    ఎన్నో సాహిత్య పుస్తకాలు చదివి వీశ్లేషించే మీరు, ఆయనని "వాడు" అంటు మీరు ఏకవచనం తో సంభోదించటం చూసి చాలా ఆశ్చర్య పోయాను!. మగజాతి పైన మీకున్న చులకన భావం బయట పెట్టుకొన్నారు. ఈ ఒక్క వ్యఖ్య మీ స్థాయిని అర్థమైంది.

    ఇక వెనుకబడిన రాష్ట్రలలో ఎక్కడైతే నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉందో అక్కడౌన్న ప్రభుత్వ పాఠశాలను నక్సల్ ఆక్రమించుకొని వారి కార్యకలాపాలకు, వారి సిద్దాంత ప్రచారానికి ఉపయోగించుకొంట్టున్నారనేది బహిరంగ రహస్యం. ఇక ఆ స్కూళ్లలో ఎర్రపాటలు,నాటకాలు,కథలు మొద|| కళా ప్రక్రియలను భారత ప్రభుత్వాన్ని నిందిస్తూ, సృష్ట్టించటం జరుగుతున్నాది. వాస్తవానికి అడవులలో ఉండె వారికి ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు. వారిని విలన్ల లాగా చిత్రికరించటం వలన ఉద్యోగం చేసే వారు చాలా కష్ట్టాలకు లోనౌతున్నారు.

    రిప్లయితొలగించండి
  24. అజ్ఞాత (Mar 23, 2012 10:34 PM),

    అసలు విషయం మీద, మీరెం చెప్పదల్చుకున్నారో ఇంకొంచెం వివరంగా చెప్పుంటే బావుండేది. ఇతర వ్యాఖ్యాతలమీదా, వారి వ్యక్తిత్వం మీదా అకారణ దాడి అవసరం లేదేమో ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  25. రాజి గారు,

    నా బ్లాగుకి స్వాగతం:)

    ఆయన నడిపించే స్కూలు గురించి వివరాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది చదివితే నాకు రుచించలేదు అక్కడి పద్దతి. కాకపోతే అది పూర్తిగా వేరే చర్చ. వీలైతే దాని మీదా కూడా మరోసారెప్పుడైనా చర్చిద్దాం.

    రవి శంకరు గారు, ఆధ్యాత్మిక విషయాల్లో మహా గొప్పవాడైనా, లేకా మోసపూరితమైనా, ఆయన నడిపే స్కూళ్ళలో పద్దతులు బాగున్నా బాగా లేకపోయినా వాటివల్ల ఆయన అభిప్రాయాలమీద మన జడ్జిమెంట్ ప్రభావితం కాకుండా ఉండటమే మేలు.

    మీరన్నట్టు ఆయన స్కూళ్ళలో ఉండే పద్దతుల మీద ఎవరైనా వేరే అభిప్రాయం ఏదైనా చెప్తే దానిమీద చర్చిద్దాం :)

    రిప్లయితొలగించండి
  26. *ఇతర వ్యాఖ్యాతలమీదా, వారి వ్యక్తిత్వం మీదా అకారణ దాడి అవసరం లేదేమో ఆలోచించండి.*
    మీరు అంతగా చింతించవలసిన అవసరం లేదు.అనవసరంగా వాడు వీడు అని ఎక వచన ప్రయోగం తో మగవారి మీద నోరుపారేసుకొంటే ఒప్పుకునేది లేదు. ఆయన చేసేది ఆధ్యాత్మిక వ్యాపారం అని ఇక్కడ చాలా మంది వ్యాఖ్యానించారు. ఆయన చేసే వ్యాపారం కోట్లలో ఉంది. ఒక వ్యాపారం లో ఇన్ని సం||లు కొనసాగుతున్నారంటే అతనిలో ఎంతో కొంత సామర్థ్యం, నిజాయితి ఉన్నాదని ఇక్కడా వ్యాఖ్యానించిన వారు గుర్తించాలి. నిజాయితి లేక పోతె ఎప్పుడో బిచానా ఎత్తి ఉండేవాడు బాల సాయిబాబా లాగా. ఆయన చేసేది ఆధ్యాత్మిక వ్యాపారం అని అనుకొన్నా తన మొహం మీద చిరునవ్వుతో, శాంతితో ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తూ, ఇతరులను తనకొరకు పని చేసేటట్లు మోటివేట్ చేస్తూ సంపాదిస్తున్నడని గుర్తుంచుకోవాలి. ఎంతమంది వ్యాపారులు, ఆవిధంగా తమ కింద పనిచేసేవారిని మోటివేట్ చేస్తున్నారో చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  27. ఇంతకీ ఆయన ఏబళ్ళో చదివాడో అన్నది అంత అర్థవంతమైన ప్రశ్న అనిపించదు. ప్రభుత్వ బళ్ళలో చదివినా వాటిపై గుడ్డిప్రేమ వుండాలని లేదు.
    పోతే ఆయన చెప్పింది ఈ కాలంలో వాస్తవమే అనిపించే చాన్స్ ఎక్కువ. అరకొర జీతాలు, అటెండెన్సులు, రెకమెండేషన్లు, బాధ్యతా రాహిత్యం, జవాబుదారీ లేని తనము, కనీస సదుపాయాల లేమి, A/B/C/D కోటాలు ప్రభుత్వ ఫ్రీ బడుల్లోనే ఎక్కువగా మనకు కనిపిస్తాయన్నది వాస్తవము. పోతే 1970ల్లో మేము చదివామే , అమెరికా వెళ్ళామే అంటే అది వేరే విషయం.
    హిందూ బాబాలు, స్వాములు, పీఠాధిపతులు ఎవరైనా సామాజిక స్పృహ కలిగివుండి తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకునే స్వేచ్చ ఈ ప్రజాస్వామ్య దేశంలో వుందని విజ్ఞులు గ్రహించినపుడే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం చేకూరుతుంది.
    వీకెండు గారితో ఏకీభవించలేక పోతున్నందుకు నా కసి తీరా కామెంటును నేలరాసి అదోరకమైన తృప్తి చెందరనే ఆశిస్తాను. :))

    http://www.youtube.com/watch?v=VC7_MTIbmSc&feature=related

    పై వీడియో తీసిన TV9 టైపు విలే'ఖరుడి' పై మీ అభిప్రాయమేమిటి? :)

    రిప్లయితొలగించండి
  28. ఎవరన్నా ఆయనకు 'ఆర్ట్ ఆఫ్ సెన్సిబుల్ టాకింగ్' నేర్పించాలి! :)

    రిప్లయితొలగించండి
  29. అజ్ఞాత గారూ, మీరు ఒక వ్యాఖ్య మీద స్పందించే ముందు ఒకసారి వ్యాకరణం సరి చూసుకుని రాయాలి. నాకు షిర్డీ సాయి బాబా అంటే ఇష్టమనుకోండి. "షిర్డీ సాయి బాబా ఎంతో గొప్ప వాడు" అంటే నేను ఆయన్ని వాడు అనేసినట్టా! ఇక్కడ కూడా దుకాణం పెట్టుకున్న వాడు అనే మాటను అర్థం చేసుకోవాలి మీరు!

    మీ వ్యాఖ్య లోని మిగతా భాగం మీద స్పందించడం సమయం వృధా!

    రిప్లయితొలగించండి
  30. అజ్ఞా (Mar 24, 2012 07:21 AM),

    >> "మీరు అంతగా చింతించవలసిన అవసరం లేదు."

    వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇతరులకి ఇవ్వకుండా, మీరు ఇతర వ్యాఖ్యాతల స్థాయి గురించి మీ అపోహలు ప్రవచించినప్పుడు చింతించవలసిన అవసరం ఉందండీ.

    >>"ఆయన చేసేది ఆధ్యాత్మిక వ్యాపారం అని ఇక్కడ చాలా మంది వ్యాఖ్యానించారు. ఆయన చేసే వ్యాపారం కోట్లలో ఉంది. ఒక వ్యాపారం లో ఇన్ని సం||లు కొనసాగుతున్నారంటే అతనిలో ఎంతో కొంత సామర్థ్యం, నిజాయితి ఉన్నాదని ఇక్కడా వ్యాఖ్యానించిన వారు గుర్తించాలి."

    ఈ విషయంలో మీతో కొంతవరకూ ఏకీభవిస్తాను. ఆయన ఆధ్యాత్మికత గురించీ అందులోని మంచి చెడుల గురించీ కాదు ఇక్కడ చర్చ.

    అవునూ ఇంతకీ, ఈ టపాలో చెప్పిన ఆయన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం చెప్పండి వీలైతే :)

    రిప్లయితొలగించండి
  31. SNKR గారు,

    >>"ఇంతకీ ఆయన ఏబళ్ళో చదివాడో అన్నది అంత అర్థవంతమైన ప్రశ్న అనిపించదు."

    మీరు మరీ లిటరల్ గా తీసుకున్నారండీ, క్రిష్ణప్రియ గారూ, సుజాత గారూ ఆ ప్రశ్నని రవిశంకర్ గారి స్వీపింగ్ జెనరలైజేషన్ మీద వ్యంగ్యాస్త్రంగా వాడారండీ.

    >>"ప్రభుత్వ బళ్ళలో చదివినా వాటిపై గుడ్డిప్రేమ వుండాలని లేదు."

    నిజమే..గుడ్డిగా వెనకేసుకు రావలసిన అవసమూ లేదూ, గుడ్డీగా దుష్ప్రచారం చెయ్యాల్సిన అవసరమూ లేదు. ఇంక ప్రభుత్వ పాఠశాల గురించి మీరు చెప్పిన అనేకానేక సమస్యలు ఈ సమస్యకి అంతగా సంబంధం లేని వేరే విషయాలు. మీ అభిప్రాయాలు మీవి. వాటిమీద చర్చ జరిగినప్పుడు చూద్దాం.

    >>"హిందూ బాబాలు, స్వాములు, పీఠాధిపతులు ఎవరైనా సామాజిక స్పృహ కలిగివుండి తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకునే స్వేచ్చ ఈ ప్రజాస్వామ్య దేశంలో వుందని విజ్ఞులు గ్రహించినపుడే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం చేకూరుతుంది."

    సామాజిక స్పృహ కలిగివుండి తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడం అనే అంశాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే ఆ అభిప్రాయాల మీద మా అభిప్రాయాలు చెప్పే స్వేచ్చ కూడా ఉంటుందండీ. వాళ్ళు చెప్పే ప్రతి అభిప్రాయం పైనా గుడ్డినమ్మకం వుండాలని లేదు ;)

    రిప్లయితొలగించండి
  32. /ఇంక ప్రభుత్వ పాఠశాల గురించి మీరు చెప్పిన అనేకానేక సమస్యలు ఈ సమస్యకి అంతగా సంబంధం లేని వేరే విషయాలు./

    అవునా?!! ఏలనో!

    వైఫల్యాలు ఎందుకు జరిగే అవకాశాలను తరచి చూడటం అపుడే ఈ అంశానికి సంబధించినది కాదా? వ్యంగంగా పొడవటమే టపా ప్రదానోద్దేశ్యం, అదే కీలకం అనుంకుంటే ... మీరన్నట్టు అప్రస్తుతమే లేండి, పొడుచుకోండి ;) అతను ఓ హిందూ బాబా అన్నదే 'లౌకిక' వాదత్వంప్రదర్శించుకునే మహాదవకాశం అయితే ... అలానే కానివ్వండి.

    మరి రవిశంకరుని స్కూలేదో తెలియదుగాని, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. :) మరి విమర్శకుల బుజ్జికూనలు ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివారో/చదువుతున్నారో దయచేసి తెలుసుకోవచ్చా? :)

    /సామాజిక స్పృహ కలిగివుండి తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడం అనే అంశాన్ని స్వాగతిస్తున్నాం./

    ఏమిటి స్వాగతించింది "అయ్యా రవి శంకరు గారూ, మీరు కాస్త... ;)
    " అని కన్ను మీటా?! ఇస్మీఎ... :P

    :D

    రిప్లయితొలగించండి
  33. సుజాత

    *"షిర్డీ సాయి బాబా ఎంతో గొప్ప వాడు" అంటే నేను ఆయన్ని వాడు అనేసినట్టా!*

    అయితే తమరు రవిశంకర్ షిరిడి సాయిబాబా తో సమానులు అని అన్నట్టా ? అదయితే సాయిబాబా భక్తులు కూడా వచ్చి తమర్ని ఛీ కొట్టే అవకాశాలున్నాయి, గబా గబా ఇంకో సవరణ పెట్టేయ్యమ్మా

    రిప్లయితొలగించండి
  34. /క్రిష్ణప్రియ గారూ, సుజాత గారూ ఆ ప్రశ్నని రవిశంకర్ గారి స్వీపింగ్ జెనరలైజేషన్ మీద వ్యంగ్యాస్త్రంగా వాడారండీ./

    నేనెవరి పేర్లు ప్రస్తావించలేదే! మీరే మీరే పేర్లు లాగుతున్నారు (వారాంతక రాజకీయమా?!) :)
    నేనూ అలానే అంతే.. అంతంతే... అదే నాగాస్త్రం ... ఛ కాదు కాదు వ్యంగాస్త్రం, వ్యంగాస్త్రం. :))

    రిప్లయితొలగించండి
  35. అజ్ఞాత (Mar 24, 2012 09:30 AM),

    మీరు మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదుగానీ, కొంచెం వ్యక్తిగత దాడి తగ్గించండి.

    రిప్లయితొలగించండి
  36. @SNKR,

    >>"నేనెవరి పేర్లు ప్రస్తావించలేదే! మీరే మీరే పేర్లు లాగుతున్నారు (వారాంతక రాజకీయమా?!) :)"

    పేర్లు లాగటం లేదూ ఏమీ లేదు. ఇక్కడ వ్యాఖ్యల్లో ఉన్న సందర్చాన్ని బట్టి అలా ఉదహరించానండీ. సరే, మీరంత ముచ్చటపడుతున్నారు కాబట్టి, వాళ్ళ పేర్ల సంగతి అలా వదిలేద్దం. ఆ వ్యగ్యం నాదే అనుకుందాం. అయితే ఏంటి ? మీ అభ్యంతరం ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ పేర్లు వదిలేసి ఎంచక్కా నా మీదే రాసుకోండి.

    రిప్లయితొలగించండి
  37. SNKR,

    >>"వైఫల్యాలు ఎందుకు జరిగే అవకాశాలను తరచి చూడటం అపుడే ఈ అంశానికి సంబధించినది కాదా?"

    అవునండీ, ప్రభుత్వ స్కూళ్ళలో అనేక లోపాలు ఉండి ఉంటాయి. వాటిగురించి మాట్లాడొచ్చుగా రవిశంకర్ గారు !! మరి అలా చెయ్యకుండా మావోయిస్టులు తాయారవుతారనే అసంబధ్ధ వాదన ఎందుకో ! పైగా, ఈ అసంబధ్ధ వాదన ఆధారంగా స్కూళ్ళని అసలు ప్రైవేటుపరం చెయ్యాలని చెప్పడమొకటీ !!

    >>"వ్యంగంగా పొడవటమే టపా ప్రదానోద్దేశ్యం. అతను ఓ హిందూ బాబా అన్నదే 'లౌకిక' వాదత్వంప్రదర్శించుకునే మహాదవకాశం అయితే ... అలానే కానివ్వండి"

    అసలు నా టపా చదివే మాట్లాడుతున్నారా మీరు ? అతను హిందూ బాబా అయినా, ముస్లీం ముల్లా అయినా ఇంకేదైనా ఇక్కడది అప్రస్తుతం. ఆయన అభిప్రాయంలోని అవగాహనా రాహిత్యం, పొరపాటు పోకడా లేకా ఔచిత్యం గురించి మాత్రమే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను.

    ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన చెప్పేదాంతో అంగీకరించకపోతే, కుహనా లౌకిక వాదమనీ, హిందూ వ్యతిరేక కుట్రనీ వీరంగ సృష్టించేవాళ్ళు కొద్దిమంది ఉంటారులెండి. వాళ్ళ గురించి అస్సలు ఆలోచించే అలవాటు నాకు లేదు. కాకపోతే, వాళ్ళకి కొన్నిసార్లు సరైన సమాధానాలు ఇస్తుంటా. ఎందుకంటే ఎప్పుడోసారి ఆలోచించక పోతారా అని ఆశ.

    రిప్లయితొలగించండి
  38. సుజాత గారు,

    మీరు ఇచ్చినవివరణ సందర్భానుసారంగా, తీసుకొంటే షిరిడి సాయిబాబా ను గొప్పవాడు గా అన్నారు. అక్కడ "వాడు" అనేపదం పొగటటానికి ఉపయోగించారు. అదే రవిశంకర్ గారి పై మీరు "తెగుడుతూ" రాసిన వ్యాఖ లో "వాడు" అనే పదం ఉపయోగిస్తే ఎటువంటి అర్థం వస్తుందో, చదివేవారికి తెలుసు. మీరు ఎంత జస్టిఫై చేయాలనుకొన్న అది నిలవదు.

    ఇక నారెండవ వ్యాఖ్య సంగతి. అది మిమ్మల్ని ఉద్దేసించి రాసినది కాదు. మిమ్మల్ని విమర్శిస్తూ రాసిన నామొదటి వ్యాఖ్య మాత్రమే రాస్తే, బ్లాగులోకంలో ఉన్న మీమిత్రులు అది ప్రచురించకపోవచ్చనే ఆలోచనతో, నా రెండవ వ్యాఖ్య రాశాను. దానివలన అయినా నా వ్యాఖ్య ప్రచూరిస్తారని. ఇక నాకు రవిశంకర్ గారు గురించి చర్చించటం ఆసక్తి లేదు. నేను రాసిన వ్యాఖ్య మగవారి ని వాడు అనటం నచ్చక రాశాను.

    *అవునూ ఇంతకీ, ఈ టపాలో చెప్పిన ఆయన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం చెప్పండి వీలైతే *

    ఇకనైనా మగవారు వారిలో వారు విమర్శించుకోవటం ఆపాలి. సాటి మగవారిని సానుభూతితో అర్థం చేసుకొవలసిన అవసరం ఎంతో ఉంది. ఆయన ఏదో ఒక మాట అన్నడని, పెద్ద టపా రాయవలసిన అవసరంలేదు. ఆయన కు చేతనైంది ఆయన చేస్తున్నాడు. ఆయన ఎమీ భారత ప్రభుత్వం కాదు.నక్సల్స్ మీద ఆయన వ్యఖ్యలను చదివి ఉలిక్కిపడటానికి. అందువలననే నేను మీకు ఆయన లో ఉన్న పాసిటివ్ పాయింట్లు చెప్పటం జరిగింది. ఇక్కడా ఆయనను విమర్శించిన వారందరు సుదర్శన క్రియకు, ఇంకొక పేరుపెట్టి, ఆయన లాగా దానిని సీరియస్ గా తీసుకొని వ్యాపారం చేసి ఎంత సంపాదించగలుగుతారో ఒకసారి టేస్ట్ చేసుకొని చూడమనండి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత

      హ్మ్, ఆడవారిని ఏమన్నా మీరు స్పందించరన్న మాట :)

      తొలగించండి
  39. అయ్యా,
    వారిని తరపున వాదించటానికి వ్యవస్థలు,చట్టాలు,మీడీయా, స్రీ,పురుష రచయితలు ఉన్నారు. మగవారి తరపున మాట్లాడటానికి కనీసం నలుగురు వ్యక్తులు కూడా లేరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూడు అజ్ఞాతా రవిశంకర్ కి మనిషి కి ఇచ్చే ఇలువ ఇత్తే సాలు. సాటి మనిషిగా గూడా సూడ్డం సేత కానోళ్ళకి మీరు సేప్పేవి ఓ లెక్కా ?

      తొలగించండి
  40. "ఇకనైనా మగవారు వారిలో వారు విమర్శించుకోవటం ఆపాలి."

    తప్పుని కాక ఆ తప్పు చేసింది ఆడో మగో చూసే మీ విశాల హృదయానికి, పురుషాభిమానానికి జోహార్లు అజ్ఞాత గారూ. ఇక్కడ మీరు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ గారి మీద మీ భక్తిని చాటుకోడానికి యావత్ పురుషజాతి గౌరవం కాపాడుతున్న కలర్ ఇవ్వాల్సిన అవసరం లేదండీ. మీ అభిప్రాయం చెప్తే సరిపోతుంది.

    అన్నట్టు మగవారు వారిలో వారు విమర్శించుకోవడం ఆపాలి అని సెలవిచ్చిన తమరు స్త్రీయా? పురుషులా? అబ్బే ఎం లేదు నాకు మీ ఈ వాక్యం చూశాక ఆ అనుమానం వచ్చింది

    " నిజాయితి లేక పోతె ఎప్పుడో బిచానా ఎత్తి ఉండేవాడు బాల సాయిబాబా లాగా."

    ఇక్కడ ఒకటి బాల సాయిబాబా ను వాడు అని అవమానించారు అనుకోవాలా? లేక పురుషుడిని విమర్శించారు అనుకోవాలా? :))

    (మనలో మనమాట మీరు, మీకు సమాధానం ఇవ్వడానికి నేను ఇద్దరం ఇక్కడ చేస్తున్నది రామాయణంలో పిడకల వేటే సుమండీ.

    వీకెండ్ పొలిటీషియన్ గారూ క్షమించాలి.చర్చలో పాల్గోకపోయినా ఫాలో అవుతున్న నాకు ఈ టాపిక్ మధ్యలో ఈ అజ్ఞాత గారి అప్రస్తుత ప్రసంగం అనవసరమనిపించి కలుగజేసుకుని సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్య కూడా అనవసరం అనుకుంటే డిలీట్ చేసేయండి. నేనేమీ అనుకోను :) )

    రిప్లయితొలగించండి
  41. *నా వ్యాఖ్య కూడా అనవసరం అనుకుంటే డిలీట్ చేసేయండి*

    శంకర్ గారు,
    మీరె అనవసరం అనుకుంటే డిలీట్ చేసేయండి అని రాసిన వ్యాఖ్యకి, సమాధానాలు ఇవ్వవలసిన అవసారం నాకు లేదు.

    రిప్లయితొలగించండి
  42. అజ్ఞాతా, కాదేది కామెంటుకనర్హం. అందులోనూ అజ్ఞాతల కామెంటు 'బ్లాగర్ల పరస్పర కామెంట్ల ఒడంబడికలకు' అతీతంగా, హృదయాంతరాలలో నుంచి వస్తుందని నా విశ్వాసం. ఎంతో కొంత సంబధించినది కాకపోతే జస్టిస్ వీకెండు గారి మోడరేషన్ దాటి వచ్చి పడుతుందా?

    ఇక ప్రతి వసంతకోకిలతో పోటీ పడి కాకి కూస్తే, ఉగాది చేసుకోవాలా వద్దా అనేది ఏడుకోట్ల ఆంధ్రులు కూలకషంగా పరిశీలించాల్సిన ప్రశ్న. :)) కాని... కాని ... పోటీతత్వాన్ని ప్రోత్సహించాలి కూడా కాబట్టి కాకులు ఉగాది గాయక సమ్మేళనాల్లో పాల్గొనవచ్చు.

    డిస్క్లైమరు: ఇది ఎవరినీ వుద్దేశించినది కాదు. కేవలం కాకులను మాత్రమే వాడుకోవడం జరిగింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @SNKR,

      ఏంటో అర్థం కాకుండా ఉంది ఈ తతంగమంతా.

      >>"జస్టిస్ వీకెండు గారి మోడరేషన్ దాటి వచ్చి పడుతుందా?"

      :)) అంత లేదులే. సాధారణంగా నేను అన్ని వ్యాఖ్యలనీ ప్రచురిస్తాను. బహుశా మీకెందుకో ఈ విషయంలో వేరే అభిప్రాయం ఉన్నట్టుంది.
      అసభ్య పదజాలం ఉండటంగానీ, సంభంధం లేని వాళ్ళని మధ్యలోకి లాగి అవమానకరంగా రాయటం గానీ జరిగితే తప్ప సాధారణంగా నేను ఎవరి వ్యాఖ్యలూ తిరస్కరించలేదు. Anyway, thanks for your faith in my judgement ;)

      తొలగించండి
  43. /ఆ వ్యగ్యం నాదే అనుకుందాం. అయితే ఏంటి ? మీ అభ్యంతరం ఏంటో మీరు చెప్పండి/
    చెప్తి కద సారూ. విడియో సాచ్యం కూడా ఇచ్చాను, మన పిల్లకాయలు ఏ ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారో కూడా అడిగాను. మా అభిప్రాయాలు అస్సల్ చదవరన్న మాట!! ఏదీ అందరూ అమ్మో మాకెందుకులే అంటూ నిష్క్రమించిరి. ఇంకా 'స్పష్టం', స్పష్టం'గా చెప్పండి అంటూ తెరాస వాళ్ళలా అడిగినదే అడుగుతూ అర్థం కాదని నటించడం మీకు పాడి కాదు, మీరు దయతలచాలి. చిత్తగించవలెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరిచ్చిన వీడియో చూశాను. దాని పూర్వపరాలు నాకు తెలియదు కాని చూసింది మాత్రం ఆందోళన కలిగించే విషయమే. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ వీడియో లో చూపినటువంటి సమస్యలు కొన్ని ఉన్నంత మాత్రాన రవిశంకరు గారి లాంటి కంక్లూజన్ కి రావటం ఎలా సాధ్యం అన్నది.

      ప్రభుత్వ పాఠశాలల్లో అనేముంది, అనేక రంగాల్లో అనేక సమస్యలున్నాయి. వాటిని బయటకి తేవడంలోగానీ, వాటి గురించి అర్థం చేసుకోవడంలో గానీ తప్పేం లేదు. అసలు విషయాన్ని వదిలేసి, ఇటువంటి ఉదాహరణలని తమకి అవరమైనట్టుగా ఉపయోగించు కోవటం జరిగితే (పథకం ప్రకారంగానైనా లేక పొరపాటుగా అయినా) జనాలు ప్రశ్నిస్తారు మరి.

      ఇక్కడ అందరినీ వాళ్ళ పిల్లలు ఏ బడుల్లో చదువుతున్నారో అడిగారు. అది కూడా తెలుసుకొని అర్థం చేసుకోవలసిన విషయమే. కాకపోతే, ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. మావోయిస్టులుగా తయారవుతారేమో అనే భయంతో ప్రభుత్వ పాఠశాలలకి దూరంగా అయితే జనాలు ఉన్నారని నేననుకోవట్లేదు.

      తొలగించండి
  44. పండిట్ రవిశంకర్ అని రాయగానే mis leading గా ఉంది. పండిట్ రవిశంకర్ వేరు...ఆయన సితార విద్వాంసుడు. ఈయన్ని శ్రీ శ్రీ రవిశంకర్ అనో, జీవిత కళ రవిశంకర్ అనో రాస్తే బావుంటుంది.

    >>"ఆధ్యాత్మిక విషయాల్లో అంత పేరు ప్రఖ్యాతులు ఉండీ, చాలామంది జనాలని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయ, ఆర్థిక విధానాల గురించి మాట్లేడే టప్పుడు, చాలా ఆలోచించి మాట్లాడాలని ఆశించడం అత్యాశ కాదనిపిస్తుంది."<<

    completely agree with you!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సౌమ్య గారు,

      అవునండీ మిస్ లీడింగ్ గానే ఉన్నట్టుంది. Jai Gottimukkala గారు కూడా ఇదే చెప్పారు.

      టపా సరిచేశాను. మీరు నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు సంతోషంగా ఉంది.

      తొలగించండి
  45. nenu 10th class varaku govt badi lone chadivaanu....kaani naxalite kaalekapoyyanu.....Sri Sri Ravishankar logic prakaram...nenu akkada kudaa sarigga chavalekapoyanu anipistundi....

    రిప్లయితొలగించండి
  46. RaviShankar trying to campaign for his schools itseems:)

    రిప్లయితొలగించండి
  47. From Phani gaaru blog
    Dr Subramanian Swamy supports Army Chief V. K. Singh

    http://www.youtube.com/watch?v=3Bvu5NHRKiY

    http://www.youtube.com/watch?v=C2nnlICRLEk

    రిప్లయితొలగించండి