తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందుకడుగుతున్నారు? దేశం మీద ఈ అంశం ప్రభావం ఎలా ఉంటుంది? సమైక్య రాష్ట్రం మీదగానీ, రెండు ప్రత్యేక రాష్ట్రాల మీదగానీ దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది? అసలీ సమస్య ఇంత జఠిలంగా ఎందుకు తయారయ్యింది? ప్రాంతాల వారీగా కాకుండా అసలు ఈ విషయం మీద వివిధ పార్టీల ఆలోచనా విధానం ఏంటి? తప్పో రైటొ ఇప్పుడున్న పరిస్థితి నుండి మార్గాంతరాలేంటి? ప్రత్యేక రాష్ట్రం వద్దనే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు?
అన్నీ ప్రశ్నలే. సమాధానాలెక్కడ? నాకు వీలయినంత వరకూ నిష్పక్షపాతంగా(?) ఈ విషయం మీద నా ఆలోచనలు రాద్దామంటే, ఒక టపా సరిపోయేట్టులేదు. సరే వీలయినంతవరకూ మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకూ వరసగా టపాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయాలు చెప్పి మంచి చర్చ చేస్తారని ఆశిస్తున్నాను.
ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?
అసలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకడుగుతున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అనేక వాదనలూ, విశ్లేషణలూ చూస్తే స్థూలంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కి కారణాలు 5. ఈ కారణాలన్నిటినీ పరిశీలిస్తే, అర్థమయ్యేదేంటంటే, ఇందులో కొన్నేమో గణాంకాల ఆధారంగానూ, డాక్యుమెంట్ల ఆధారంగానూ విశ్లేషణ చెయ్యడానికి వీలయ్యేవీ, మరికొన్నేమో అలా వీలు కానివీ. ఇందులో కొన్ని ఎక్కువా కొన్ని తక్కువా అనేదేమీ లేదు నాదృష్టిలో. అన్నీ బలమైన కారణాలే. వీటిల్లో నిజానిజాల్నీ, అపోహలనీ బేరీజు వేద్దాం.
ఎవరికి వీలయిన గణాంకాలు వాళ్ళు తీసుకొచ్చి, మధ్యలో ఒక కారణం నుంచి ఇతర కారణాల వైపు చర్చని దారి మళ్ళిస్తూ కలగాపులగం చెయ్యటం అనేది విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతే. మళ్ళీ మనమెందుకు అదే చెయ్యటం!! మనం అన్ని కారణాలనీ ఒక్కొక్కదాన్నీ విడివిడిగా, సరళంగా విశ్లేషిద్దాం.
1. తెలంగాణా ప్రాంతం అభివృధ్ధిలో వెనకబడి ఉండటం
ఇది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన కారణమా కాదా అనేది కాసేపు పక్కనపెడదాం. ఎందుకంటే, ముందు వెనకబాటుతనం ఉంది అని నిరూపణ అవ్వాలి, తరవాత వెనకబాటుతనం ప్రత్యేక రాష్ట్రంగా లేకపోవడం వల్లే అని నిర్ధారింపబడాలి. ప్రభుత్వం వారి లెక్కలు గానీ లేదా అదే పనిగా ఈ విషయం కోసమే నియమించబడ్డ శ్రీక్రిష్ణ కమీటీ లెక్కలుగానీ చూస్తే 1956 తరవాత జరిగిన అభివృధ్ధిలో ఈ ప్రాంతం వెనకబడి లేదనేది కనిపిస్తుంది. స్థూలంగా వెనకబాటుతనం ఉన్నా అది అన్ని ప్రాంతాలలోనూ ఉంది. 1956 తరవాత హైదరాబాదు లో అన్ని ప్రాంతాల పెట్టుబడిదారుల డబ్బు వల్లా అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ వల్లా ఎక్కువగా అభివృధ్ధి జరిగిందనేది నాకైతే బాగానే కనిపించింది.
2. ఆర్థికాంశాల్లోనూ, పరిపాలనాంశాల్లోనూ ఈ ప్రాంతం నిర్లక్ష్యం చెయ్యబడుతూ ఉంది
ప్రభుత్వ పరంగా జరిగిన కేటాయింపులూ, ఇతరత్రా వివరాలు చూస్తే ఈ కారణం కూడా పెద్దగా నిలబడలేదనే చెప్పొచ్చు. నీటి లభ్యత మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. ఉద్యోగాల విషయంలో ప్రైవేటు ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంతవాసులకి మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువ ఉద్యోగాలు లభించిన మాట వాస్తవమే అయినా, అది ప్రత్యేక రాష్ట్ర అంశానికి సంబంధం లేని విషయమే. నీటి వనరుల విషయంలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే, ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ ఫలితాలు సాధించడం కంటే, ఈ ప్రాంతానికి వీలైన ఇతర రంగాల్లో నిధులు పెట్టి మంచి ఫలితాలు సాధించడమే మంచిది కదా ! ప్రకాశం జిల్లా గానీ, లేదా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గానీ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్నీ నిర్లక్ష్యం అనలేము కదా !
3. 1956 లో ఒకే రాష్ట్రంగా ఏర్పడినప్పుడు చేసిన ఏర్పాట్లేవీ చిత్తశుద్దితో అమలు జరగలేదు కాబట్టి ఇక ముందైనా మధ్యేమార్గంగా చేసే ఏర్పాట్ల మీద ఈ ప్రాంత ప్రజలకి నమ్మకం లేదు.
శ్రీక్రిష్ణ కమీటీ ప్రకారం చూసుకున్నా మరే ఇతర ఆధారాల ప్రకారం చూసినా ఒప్పందాలు సరిగ్గా అమలు చెయ్యబడలేదు అనేది మాత్రం స్పష్టం. అసలు ఆ ఒప్పందాల్లోని షరతులే తప్పు కాబట్టి అవి అమలు జరక్కపోయినా తప్పేంలేదు అనే వాదన అర్థ శతాబ్దం తరవాత ఇప్పుడు చెయ్యడం మాత్రం అర్థంలేని పని. ఒకవేళ ఇప్పుడేదైనా పకడ్బందీ ఏర్పాటు చేద్దామన్నా ఈ ప్రాంత ప్రజలు దాన్ని విశ్వసించడానికి సిధ్ధంగా లేకపోతే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ పరిస్థితుల్లో ఎవరున్నా అంతే కదా !
కేవలం ఒప్పందాల అమలులో లోపాలవల్లే తెలంగాణా కోసం ఇంత పోరాటం చేస్తున్నారా ? ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంత పోరాటం ఎందుకు జరుగుతున్నట్టు ? మిగతా ఏవైనా కారణాలుండే ఉండాలిగా. అయితే వాటిని ఇదమిధ్ధంగా తేల్చడం గణాంకాలూ, డాక్యుమెంట్ల తో అయ్యేపని కాదు. కానీ అవేమీ తక్కువ చేసి చూడాల్సిన అంశాలేం కాదని నేను అనుకుంటున్నాను.
4. సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత ప్రజల ఆకాంక్షలకీ, ఆశలకీ, సమర్ధతకీ సరైన అవకాశాలు దొరకడం దుర్లభం అనే భావన
పైన చెప్పబడిన మొదటి రెండూ అంశాల ప్రకారం చూస్తే, ఈ భావన కలగడం ఎలా సాధ్యం ! కానీ ఈ భావనా, అభద్రతా చాలా బలంగానే ఉంది ఈ ప్రాంతంలో. ఏమై ఉండొచ్చు ? తెలంగాణా మీద మిగిలిన ప్రాంతాల సాంస్కృతిక ఆధిపత్యం వల్ల అవకాశాలూ తగ్గి ఇటువంటి భావన ప్రబలే అవకాశం ఉంది. మొదటి రెండూ అంశాల్లో కూడా గణాంకాల ప్రకారం అంతా సవ్యంగానే ఉన్నా, ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇంత బలంగా ఉందంటే, బహుశా గణాంకాల్లోని న్యాయం ప్రజలకి అనుకున్నంతగా అందలేదేమో !!
5. ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉంది. పరిపాలనాపరంగా బానే ఉండి మిగిలిన వారికి నష్టం లేనప్పుడు ఎందుకివ్వకూడదు?
ఇదికూడా ఒక రకంగా బలమైన వాదనే. ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉందనేది నిజమే. ఇక తేలాల్సింది, పరిపాలనా పరంగా బానే ఉంటుందా మిగిలిన వారికి ఏమైనా నష్టాలున్నాయా అనే రెండు విషయాలు. అధికార వికేంద్రీకరణ అనే సూత్రం ప్రకారం మంచిదేగానీ, ఒక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే దానికి పరిష్కారం కాదు. స్థానిక సంస్థలని రాజ్యాంగ ప్రకారం నడిపితే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. కాకపోతే ఆ పని సమైక్య రాష్ట్రంలో ఇప్పటివరకూ అనుకున్నంతగా జరగలేదు. అదట్లా ఉంచితే, దాదాపుగా 4 కోట్ల మంది జనాభా ఉన్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పరిపాలనా పరంగా గానీ, వనరుల పరంగా గానీ బానే ఉంటుందనిపిస్తుంది.
ఏమీ నష్టం లేకుండానే మిగిలిన ప్రాంతాల్లో అంత వ్యతిరేకత ఎందుకుంటుంది? ముఖ్యంగా ఉపాధి అవకాశాలుగానీ, పెట్టుబడికి అనుకూలతలుగానీ హైదరాబాదు లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల అటువంటి అవకాశాలు కల్పించడంలో సమైక్య రాష్ట్రం విఫలమవ్వడం వల్ల హైదరాబాదుని ఒక్కసారిగా ఒదులుకోవడం మిగిలిన ప్రాంతాల వారికి ఖచ్చితంగా నష్టమే, అభ్యంతరకరమె. మిగిలిన అంశాల విషయానికొస్తే, నీటి విషయంలోగానీ, హైదరాబాదు నుండి సమైక్య రాష్ట్రానికి ఒనగూరుతున్న ఆర్థిక వనరులనన్నిటినీ కోల్పోవడమంటే అది మిగిలిన ప్రాంతాలకి తప్పకుండా నష్టం కలిగించే అంశమే. మరీ ముఖ్యంగా తెలుసుకోవలసిందేంటంటే, రాష్ట్ర రాజధాని కాబట్టే ఇక్కడ మాత్రమే మిగిలిన ప్రాంతాలకంటే ఎక్కువ అభివృధ్ధి జరుగుతున్నా ఇంత కాలంగా అందరూ దాన్ని సహిస్తూ, సహకరిస్తూ వచ్చారనేది నిర్వివాదాంశం. కేవలం హైదరాబాదు మాత్రమే అభివృధ్ధి చెందడం అనేది తప్పైనా, ఇప్పుడు మనమున్న వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే.
ఇవి కాకుండా ఇంకేవైనా కారణాలు నేను గమనించలేకపోయున్నా, ఈ కారణాలని అర్థం చేసుకోవడంలో పొరపాట్లున్నా మీ అభిప్రాయాలు చెప్పండి.
ధనవంతులైన డాక్టర్లు కూడా తెలంగాణా జెఎసిలలో ఉన్నారంటే తెలంగాణా ఉద్యమం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. సాధారణంగా మధ్యతరగతి & పేద ప్రజలే ఇటువంటి ప్రజా పోరాటాలు చేస్తారు.
రిప్లయితొలగించండిRallabhandy Ravindranath said:
రిప్లయితొలగించండిThe aspiration or sentiments or emtions are not the parameters for the bifurcation of state. It the bifurcation is based on sentiments ad emotions, the Gorkhaland is the oldest agitation in the country. Hence, the state of Gorkhaland is to be formed.
There may be economic disparities though the are of Telangana is developed. Those anomalies should be curtailed and plugged forever but the separation is not solution for those disparities.
Remaining points are answered by the author himself.
http://www.facebook.com/rnral02
The rich and wealthy people joined the agitation because they will be treated as traitors of Telangana if they do not support the cause and may be harassed/looted by the so called agitators after the formation of the state like the landlords suffered after the liberation from the nijam by the communists.
రిప్లయితొలగించండిమౌలిక ప్రశ్న ఆలస్యంగా ఐనా సంధించారు, ఏళ్ళకొద్దీ సాగగల మంచి టాపిక్. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ రెఫర్ చేయండి, మీకు డిస్కషన్స్‌కు సరుకు దొరుకుతుంది. ఈలోగా నేను పల్లీలు వేయించి తీసుకొచ్చి జాయిన్ అవుతా. అంతవరకూ శోషయాలజి ప్రవీణ్ మీతో డిస్కషన్స్ చేస్తుంటాడు. ఇదో చిటికెలో వచ్చేస్తా...
రిప్లయితొలగించండిడాక్టర్ తాను పేషెంట్లని చూసుకోవాలని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది కానీ తెలంగాణా డాక్టర్లు ఆ పని చెయ్యలేదు.
రిప్లయితొలగించండిtelanganalo doctors are doing strike.. is it good..? patients are most important for them than any other thing.. it may be region, religion, state, even country....
రిప్లయితొలగించండి@ఇంత కాలంగా అందరూ దాన్ని సహిస్తూ, సహకరిస్తూ వచ్చారనేది నిర్వివాదాంశం.
రిప్లయితొలగించండిWHO?
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల బలిదానాలు మీకు తెలియవా?తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం
రిప్లయితొలగించండితెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల బలిదానాలు మీకు తెలియవా?తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం
రిప్లయితొలగించండిFirst answer Why 610 GO not implemented ,
రిప్లయితొలగించండిFirst answer what is telangana share of Krishn a/Godavari water how much given in last 56 yrs.
Then ask why separate state.
regarding Sakala janula Samme ask your MLA & MP as u are advising to ask our MLAs for T -state
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి@Praveen Sarma, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ రక్తచరిత్ర , ధన్యవాదాలు. మీరిచ్చిన ఫేస్ బుక్ లింక్ చూశాను :)
@ Rallabhandy Ravindranath, ధన్యవాదాలు
@సంక్ర్, ఎప్పుడు మొదలుపెట్టినా మౌలికమైన అంశాలనుండే మొదలు పెట్టాలండీ. పల్లీలు ఇంకా వేగలేదా :)
@ ప్రేమిక, True. You are right.
@ Mouli, I meant everyone outside Hyderabad
@ raj smile ever, అటువంటి దురదృష్టకర పరిణామాలు జరలేదని నేను చెప్పానా ఈ టపాలో. వాటిని అర్థం చేసుకోవాలేగానీ వాటి ఆధారంగా విశ్లేషణ చెయ్యకూడదు అనుకుంటానండీ నేను. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
@ Maa Bhumi, మీరసలు టపా శీర్షిక తప్ప ఒక్క లైను కూడా చదివినట్టు లేదు మీ వ్యాఖ్య చూస్తుంటే.
10 years minister ga unnnappudu KCR ki telvada...
రిప్లయితొలగించండి60 years telangane valle telangana prantham lo MLAs ga unnaaru kada...ante..emee cheyyaledaa....central govt companies annee telangana lone unnay kada...appudu telvada....boggu undi ani sankalu kottukoni aapeste...power pothundi....harish babu full happy....gulf vallu oil ivvakapothe....car etla naduchuddi....ithara desala nundi ship lo vachhee eruvulu telangana ki ela vastay....
naaku atham gourava samasya...maa village ni separate state cheyyandi ante...ok na....ento...
@I meant everyone outside Hyderabad
రిప్లయితొలగించండిసమైక్య రాజ్యం ఉన్నన్నాళ్లూ వాళ్ళకా ఖర్మ తప్పదా :)
"Telangana udyaman undaali...kaanee Telangana Rakudadu"--KCR policy
రిప్లయితొలగించండిWP Gaaru,
రిప్లయితొలగించండిGood topic for discussion if everyone can keep their emotions aside and discuss, which is very hard for humans.
Looks like your expression has not completed yet.
For me apart from all the above points, I feel there are some more roots which needs to be analysed/discussed if serious about the topic. otherwise it will be like any other blog writings on this topic ( very few exceptions) which are written only as emotional outlet, which is understandable.
I will come back.
Thx
Meena
అసలయినవిమర్చిపోయారు
రిప్లయితొలగించండి1) తెలంగాణాలో రాజకీయ నిరుద్యోగులు ఎక్కువయ్యారు
2) హైదరాబాదు విపరీతంగా అభివృద్ది చెందడంతో అప్పనంగా తిని తొంగోవచ్చు అన్న భావన పెరగడం.
"తెలంగాణా ప్రాంతం అభివృధ్ధిలో వెనకబడి ఉండటం" అన్నారు. మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు అభివృద్దికి ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకుంటారా? హైదరాబాదే ఈ ఉద్యమానికి ప్రధాన కారణం అని నా ప్రగాఢ నమ్మకం. హైదరాబాదు ను సీమాంధ్రలో కలిపేస్తాము అంటే ఒక్క సీమాంధ్రుడు కూడా ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకించడు,ఒక్క తెలంగాణా వాసి కూడా ఒప్పుకోడు. ఎందుకంటారు?
టపా రాసే టప్పుడు కాస్త చూసుకొని రాయండి... " అర్థ శతాబ్దం తరవాత "కాదు.... అరవై సంవత్సరాల నుండీ...
రిప్లయితొలగించండిప్రత్యేక రాష్ట్రం ఎందుకు దగ్గరే ఉన్నారేంటి మాష్టారూ?
రిప్లయితొలగించండినన్ను నిరుత్సాహపరిచారు.
ప్రత్యేక రాష్ట్రం ఎలా గురించి రాస్తారని అభిలషిస్తున్నాను.
నిజంగా ప్రత్యేక రాష్త్రం కోరుకోవడానికి బలమయిన కారణాలు ఏమి లేవు. ఇది చాలా సింపుల్. రాజకీయాలలో పెద్ద పెద్ద పదవులు పొందటానికి అతి దగ్గర దారి ఇదే అని చాలా మంది స్వార్ధ తెలంగాణా నాయకుల విస్వాసం. తమ పదవీ కాంక్ష తీర్చుకోవడానికి అమాయక ప్రజలని సమిధలుగా మార్చుతున్నారు. ప్చ్.
రిప్లయితొలగించండిYou are missing a fundamental point. The people of Telangana have as much right to demand a separate state as the andhras did in 1950's. The opinions of the andhras today like that of the Tamils then is irrelevant.
రిప్లయితొలగించండిHighly unfortunate situation....
రిప్లయితొలగించండిunfortunate that two states were merged on *terms*, unfortunate that despite having experienced an agitation for separate state we didn't take adequate measures, unfortunate that during last few years the debate was as though we were mentally prepared for separation and decide ppl of which region are generous, who are ignorant, who are vile. unfortunate that at this stage we start again from square one, hope for the problem to subside and then leisurely sit back. you know what we want, we want not the solution not the problem to vanish but problem be subdued. we want to grow prosper, and thats what has happened all these years, polished it to give a look of unity. who cares if we were not united inwardly. we want a status-quo of pre-KCR arrival, a single *political map* for telugites on whatever illogical foundations/reasons we can possibly think of. I strongly believe that we aren't interested in the solution- any solution, that does good, which is imminent. rather we let ourselves think of using brute force to arrive at a conclusion that is believed to be good without ever realizing that forcing things doesn't ensure permanent solution. in the mean time, hoping for the agitation subdue, there's a good game brought in- calling names. I call someone a looter/ modern rajakar you call me telaban/taliban shit n crap of that sort and when someone raises objection shamelessly admit that they meant something different altogether.damn these rotten souls.
we don't understand that if this attitude is to continue no matter how many states are formed or how ever big akahnda/ samaikya states are formed our fate is doomed.
long live our unity (of whoever it be )
@అజ్ఞాత (24 సెప్టెంబర్ 2011 2:10 ఉ), Thanks for letting your views known.
రిప్లయితొలగించండి>>"60 years telangane valle telangana prantham lo MLAs ga unnaaru kada...ante..emee cheyyaledaa"
అవునండీ, సమైక్య రాష్ట్రంలో వాళ్ళు చెయ్యగలిగింది ఇంతే, ప్రత్యేక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చెయ్య గలుగుతారు అనే భావన ఈ ప్రాంత ప్రజల్లో ఉండి ఉండొచ్చు కదా !!
@అజ్ఞాత (24 సెప్టెంబర్ 2011 2:29 ఉ), That's too harsh and over simplified judgement in my opinion.
@ Mouli గారు,
>>"సమైక్య రాజ్యం ఉన్నన్నాళ్లూ వాళ్ళకా ఖర్మ తప్పదా :) "
That's a different issue but a fundamental problem to be addressed irrespectiveof a unified state or two separate states.
@ Meena గారు,
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. అవునండీ, ఇంకో రెండు మూడు భాగాలు వ్రాయాల్సుంది. ఈ వారంలో వ్రాస్తాను. I look forward to your comments and views :)
@ జీడిపప్పు గారు,
రిప్లయితొలగించండి>>"హైదరాబాదే ఈ ఉద్యమానికి ప్రధాన కారణం అని నా ప్రగాఢ నమ్మకం."
కారణం కాదుగానీ, చాలా ముఖ్యమైన అంశం అనుకోవచ్చు.
@అజ్ఞాత(24 సెప్టెంబర్ 2011 8:28 ఉ),
>>"టపా రాసే టప్పుడు కాస్త చూసుకొని రాయండి... " అర్థ శతాబ్దం తరవాత "కాదు.... అరవై సంవత్సరాల నుండీ... "
తప్పకుండా. అసలు విషయ తీవ్రత సరిగ్గా చెప్పగలిగినప్పుడు చిన్న చిన్న లెక్కల్లో ఏముందండీ :) 1956 నుండీ లెక్కేస్తే మీరు చెప్పినట్టు 60 సంవత్సరాలు కూడా కాదు మరి ;)
@భాస్కర్ రామరాజు గారు,
రిప్లయితొలగించండి>>"ప్రత్యేక రాష్ట్రం ఎందుకు దగ్గరే ఉన్నారేంటి మాష్టారూ? నన్ను నిరుత్సాహపరిచారు. ప్రత్యేక రాష్ట్రం ఎలా గురించి రాస్తారని అభిలషిస్తున్నాను."
అర్రె.. అవునా ! మీరు మరి అంత నిరుత్సాహ పడకండీ. ఇంకా రెండు మూడు టపాలు రాస్తాను ఇదే అంశం మీద. చూద్దాం వాటిల్లోనైనా మిమ్మల్ని నిరుత్సాహ పరచనని ఆశిద్దాం :)
@సుమ గారు,
మీరన్నంత సింపుల్ కాదు. ప్రజలు కూడా మీరనుకున్నంత అమాయకులు కాదు లెండి.
@అజ్ఞాత(24 సెప్టెంబర్ 2011 1:53 సా,)
Neither the opinions of Anhra people now, nor the opinions of Tamils then are irrelevant in my opinion.
@ Nagarjuna,
రిప్లయితొలగించండిyou spoke very well. I appreciate your views and agree with you to a large extent. These are the times when we should not allow the fringe and extreme elements to rule the core. Majority of the people are sensible and we just need to stuck to our guns.
మీరు తెలంగాణ అవసరమైన సందర్బాలను..."బహుశ" 'ఏమో" "అనుకుంట" లాంటి పదాల మాటున పెట్టేసారు. ఒక మనిషి రాజకీయం గా లేదా ఆర్దికంగా లేదా సామాజికం గా నష్టపోతే మళ్ళీ నిలదోక్కుకోవచ్చు. కానీ సాంస్కృతికంగా తమ అస్తిత్వాన్ని కోల్పోతే ఇంకేమి మిగలదు. అందుకోసం పోరాటం చేయకూడదా? "నీటి కేటాయింపులు తక్కువగా ఉన్నట్టుంది" అని ఒక చిన్న మాట అనేసారు!! పక్కనే కృష్ణా, గోదావరి జీవ నదులు పారుతున్నా..సాగునీరు పక్కన పెట్టండి...తాగునీటి కి కూడా నోచుకోని మాది ఏ దౌర్భాగ్యం? మా ప్రాంతం భౌగోళికం గా ఎత్తు గా ఉంది కాబట్టి ప్రాజెక్టులు కట్టడం ఎక్కువ ఖర్చు తో కూడిన పని కనుక.....తక్కువ పెట్టుబడి తో ఎకువ లాభాలు వచ్చే వాటిపై పెట్టు బడి పెట్టాలా? ఇప్పటికే మీరు పెట్టుబడులు పెట్టేసారు. పెట్టి ఏం చేసారు? ఆ పరిశ్రమలల్లో ఉద్యోగులు అందరూ ఏ ప్రాంతం వారో తెలియంది కాదు!! ఆ నీటి కోసం, ఆ ఉద్యోగాల కోసం మేము పోరాటాలు చేయకూడదా? అభివృద్ధి ఒక్క ఏడాది లో కనిపించేది కాదు. ఒక ప్రాంతానికి నీటి లభ్యత వరుసగా కొన్ని సంవత్స రాలు ఉంటే...ఆ ప్రాంతం లోని కుటుంబాల ఆర్దిక స్థితి గతులు గణనీయం గా మారవా? ఇదే విషయం ఉద్యోగానికి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉన్నారని 610 తో పంపించివేసింది. ఇక్కడ నివసించండి...ఇక్కడ గాలి, నీరు అనుభవించండి...అవి...అందరి హక్కులు. ప్రజాస్వామ్యం కోసం , సమన్యాయం కోసం , స్థానికత కోసం రూపొందించిన చట్టాలను తుంగలో తొక్కి ఉద్యోగాలను ఎగరేసుకు పోతుంటే...అందుకోసం మేము పోరాటం చేయకూడదా? ఇన్ని సంవత్సరాల మీ పాలన లో మాకు ఇవ్వి అందవని అర్ధమయింది.....అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం.
రిప్లయితొలగించండిఇలాంటి వాటి మీద చర్చ జరగాలంటే ఒక కామన్ ప్లాట్ ఫాం ఉండాలి. అది లేకపోతే జరిగేది రచ్చ మాత్రమే.విడిపోవడానికి తెలంగాణావాదులు చెప్పే కారణాలన్నీ దాదాపు సాకులే. నిజమైన కారణాలంటూ ఉంటే పరిష్కారమార్గం కనుక్కోవటానికి వీలైనంతగా ప్రయత్నించడం నిజాయితీపరుల లక్షణం. రాజకీయవాదులకెవ్వరికీ (సమైక్య, అసమైక్య వాదులిద్దరికీ) ఆ చిత్తశుద్ధిలేదు. అంచేతనే ఇలాంటి దిక్కుమాలిన స్వార్థపూరిత ఉద్యమాలు బయల్దేరేది.
రిప్లయితొలగించండి@subhashini poreddy గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు మీ వ్యాఖ్యకి. మీరు చెప్పేది చాలా వరకూ అర్థవంతంగానే కనిపిస్తుంది నాకు.
>>"మీరు తెలంగాణ అవసరమైన సందర్బాలను.. "బహుశ" 'ఏమో" "అనుకుంట" లాంటి పదాల మాటున పెట్టేసారు."
ఖచ్చితంగా అంగీకరిస్తాను. May be the hidden seemaamdhra bias made me chose the terms :) అందుకే ఇతరుల దృక్పధాన్ని కూడా అర్థం చేసుకోవడం, చర్చించడం అవసరం అనుకుంటాను నేను. మనలో ఉండే ఇటువంటి కొన్ని బలహీనతలు అప్పుడే బయటపడతాయి.
సరే, నేను చెప్పిన 5 కారణాల్లో నా అభిప్రాయం సూటిగా చెప్తున్నాను చూడండి:
1. Not established as claimed by TelangaNa
2. Not established as claimed by TelangaNa supporters
3. Established as claimed by TelangaNa supporters
4. Difficult to establish but perceived to be true. This might actually be the thing that might make the statistics in 1 and 2 doubtful.
5. TelangaNa supporters claim is reasonable. At the same time there are concerns but they can be addressed.
good analysis and worth to read, even the agitators are known to this facts,
రిప్లయితొలగించండిఎక్కడేనా కలిసి ఉండడానికి ఎలాటి ఉద్యమాలూ అవసరం లేదు . ఎందుకంటే మనం ఇప్పడి దాకా కలిసే ఉన్నాము కదా. కాని విడిపోవడానికి మాత్రం ఉద్యమం తప్పనిసరి. పుండుఅయిన వాడికే బాధ తెలుస్తుంది. అరవై ఏళ్ళ పోరాటం లో తెలంగాణా అవసరాన్నీ, ఆకాంక్షల్ని సూటిగా చెప్పారు ప్రజలు. కానీ వా ళ్ళ గోల పట్టించుకున్న నాధుడెవరు . ఎవడో ఒక స్వార్ధ పరుడు నాయకత్వం పేరుతొ ముందుకొచ్చి, గోల చేసి వాడికొక పదవి చూపించగానే , ఉద్యమ్మాన్ని చల్లార్చే వాళ్ళే గానీ , నిజంగా తెలంగాణా సాధన కోసం నిస్కల్మశంగా , నిస్వార్ధంగా పోరాడే వాడే లేడు. అలా ఉండి ఉంటె ఎప్పుడో మనం మన స్వరాష్ట్రం లో నే ఉండే వాళ్ళం..ఇప్పటికైనా అనవసరమైన అనుమానాలు ,అపనమ్మకాలూ మానేసి తెలంగాణా సాధన కోసం చంద్రుడి కో నూలుపోగు లాగా అందరం సహకరించాలి. భవిష్యత్ లో ఇంకెప్పుడు ఈ సమస్య పునరావృతం అయి మరింతమంది రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా ఉండాలంటే ఇప్పుడే ఏదో ఒకటి తప్పనిసరిగా తేలిపోయి ప్రశాంతమైన భవిషత్తు తరవాతి తరాల వాళ్లకి ఇవ్వాలి. సీమాంధ్రులు కూడా అతి మూర్ఖత్వానికి పోయి ,చీ ఫోండి అంటుంటే చూరు పట్టుకుని వ్రేలాడకుండా , వాస్తవం గ్రహించి, ఒద్దన్నవాళ్ళతో మాకేంటి అన్న ఆత్మాభిమానం తో విడిపోవడానికి ఒప్పులోవాలే గాని , ఆత్మా గౌరవాన్ని తాకట్టు పెట్టె విధంగా కలిసి ఉంటామని వాదించకూడదు. అది ఆత్మాభిమానానికి అవమానమే కానీ మరోటి కాదు
రిప్లయితొలగించండితెలంగాణ అంటే హైదరాబాదు మాత్రమే అని మూర్ఖంగా పట్టుబట్టకుండా పట్టువిడుపులు చూపించి, వివాదాస్పద హైదరాబాద్ వదలి తక్కినప్రాంతాన్ని తీసుకుని, ఆ తరువాత హైదరాబాద్‌ను ఆ ప్రజలకు అంగీకారమయితే ముందుకాలంలో కలుపుకోవచ్చు, అనే వివేకంతో ఆలోచించాలి. చిన్నరాష్ట్రాలు మంచిదని వాదించినప్పుడు హైదరాబాద్‌ను చిన్న రాష్ట్రంగా వుంచితే అభ్యంతరం ఎందుకు?
రిప్లయితొలగించండి@wp ... " May be the hidden seemaamdhra bias made me chose the terms :)" i think you are the first one on either side to say something like this...really appreciate it.
రిప్లయితొలగించండిIf language is the right reason to form a state, then why not political economy?
" 1956 తరవాత హైదరాబాదు లో అన్ని ప్రాంతాల పెట్టుబడిదారుల డబ్బు వల్లా అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ వల్లా ఎక్కువగా అభివృధ్ధి జరిగిందనేది నాకైతే బాగానే కనిపించింది." .. The nizam which was not integral part of india before independence was squeezed by rajakars. the people of this land had no capital and education like rest of madras presidency. When hyderabad became the capital of a.p, the capital required for industrial growth had flown from seemandhra. Kind of hard to find bunch of industrialists who are from this region. If you observe the part of nizam which is in karnataka right now is also not so developed.
The education is also weak compared to seemandhra, all the institutions like vignan etc etc have their origins in seemandhra.
" ముఖ్యంగా ఉపాధి అవకాశాలుగానీ, పెట్టుబడికి అనుకూలతలుగానీ హైదరాబాదు లో మాత్రమే ఉన్నాయి." You are implying that its a rule of thumb that the capital of the state will developa lot? Look at the state which is considered to be model for future india i.e gujarat, its capital is gandhinagar and most business is done either at ahmedabad or surat. Provide more SEZ and be industrial friendly...companies dont mind if its a capital or not. As capital of india should have attracted more business than mumbai if 'capital city develops fast ' is right.
మీరు మరికొన్ని మౌలికమైన అంశాలు మరిచారు, తెలంగాణ నైజాం పాలనలో అన్ని రకాలుగా వెనకపడింది, విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత ఆంధ్ర మరియు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు, వారందరు అప్పటికి విద్యాధికులు కావడంతో ఉద్యోగాలు,వ్యాపారాలు మరియు ఇతర రంగాలలో లోకల్ వారికంటే తొందరగా అభివృద్ది చెందారు...
రిప్లయితొలగించండిక్రమేణా ఆ అంతరం పెరుగుతూ వచ్చి 1969, 2009 లో తీవ్ర ఉద్యమ రూపం దాల్చింది...
ఇక సంస్కృతి విషయానికి వస్తే, "ఇఫ్ ఉ ర్ ఇన్ రొమె, బె అ రొమన్" అనే నానుడి ప్రకారం కాకుండా, తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన వారందరు వారి సంస్కృతిని ఇక్కడ ప్రజలపై బలవంతంగా రుద్దారు... దానివల్ల ఇక్కడి సంస్కృతి మొత్తంగా రూపు కోల్పోయే స్తితికి వచ్చింది....
కృష్ణ, గోదావరి తెలంగాణాలో ఉన్న ఇక్కడి ప్రజలు వాటిని ఉపయోగించుకోలేక పోవటం.... దీనికి ఈ ప్రాంత రాజకీయ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది...
ప్రస్తుత పరిస్థితిలో ప్రత్యేక రాష్ట్రం తప్ప మరొక పరిష్కారం లేదు.
only selfish politicians cause of this agitation. in 1956 chennareddy was against unity. in 1968-69 he finally led the agitation and becamew c.m. it is radicals and like minded writers& some writers like kaloji, varavararao, etc in their seminar in warangal in 1990s demanded telangana. may be as part of red carridor agenda of naxals. BJP cashed it with the support of TDP. no body knows whether it is TDP vote or telangana vote. indra reddy tried and failed. KCR consistantly due to his magical intelligence kept telangana issue as prime issue for 12 years or so. he made people think that they will have more jobs, water, development.he will get them if he can make the people enterprising in nature only. all most all telugu people are same. none of us are enterprising in nature like punjabis, jews, parsis etc. we have cultural problems.Haryana is developed because its proximity to delhi and big markets. common people from coastal area and seema was loving Hyderabad since two generations. many have sentimental links with Hyderabad. They feel it is like " mother suddenly telling few of her children as not of her children and asking them to leave her. other districts are like own brothers. division is painful.common people get nothing in unity or in division.people like kcr and many unknown politicians gain. IT IS MORE EMOTIONAL ISSUE THAN JOBS, WATER ETC. in division we may have to face more naxalism . nothing more any body gets. one has to earn his own livelihood. state govt can't change much. if hyderabad is given telangana gets more income from hyderabad initially. who spends it on what god only knows
రిప్లయితొలగించండిgod bless all of us
రిప్లయితొలగించండిnice matter
రిప్లయితొలగించండి