ఇదేమీ బాగా ఆలోచించి ఆ ఆలోచనలని చర్చకి పెట్టే టపా కాదులెండి. ఈ కింది ఫోటో చూడగానే మనసుకి అనిపించింది రాస్తున్నానంతే. వెయ్యి సంవత్సరాల నుండీ ముస్లీములు హిందువులని అణగదొక్కారనీ, హిందువులు ముస్లీంల మీద ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తున్నారనీ, ఈ దేశం హిందువులది మాత్రమే అనీ, కాదు అందరిదీ అనీ రకరకాల వాదనలు చేసే వాళ్లంతా ఇదొక్కసారి చూస్తే తమ వాదనలని సరిచూసుకునే అవకాశం దొరుకుతుందనే ఆశ, అంతే. ముఖ్యోద్దేశ్యం మాత్రం ఈ ఫోటోని అందరితో పంచుకోవడమే.
సుప్రీం కోర్టు చెప్పినట్టు, హిందూయిజం అనేది ఒక జీవన విధానం మాత్రమే అంతకంటే ఇంకేమీ కాదు.
మిత్రుడు సీతారం ఫేస్ బుక్ లోనుండి తీసుకున్నాను ఫొటొ. Thank you Sitaram RNV. You made my day :)
well
రిప్లయితొలగించండిhimduvuladi eebhaavane
meeaachaaraalu paatimchu ..itarula aahaaraalanu gouravimchu . ide mulasutram ee dharmaaniki
tarataraalugaa eedesham nammi aacharistunnadide
లేని సెక్యులర్ భావాలు ఉన్నట్టు నటించడం ఎందుకు? ఒక హిందువు ముస్లిం లాగ టోపీ పెట్టుకుని "షుక్ర్, అల్హమిదులిల్లాహ్ (Thank you, praise the god)" అని అరబ్ భాషలో ప్రవచనాలు చదివితే హిందువులు మెచ్చుకుంటారా? హిందూ మతం కాదు, జీవన విధానమే. ఒకప్పుడు హిందూ మతం అనే మతం లేదు. వైదిక, వైష్ణవ, శైవ మతాలు ఉండేవి. విదేశాల నుంచి వచ్చి దండయాత్రలు చేస్తున్న ముస్లింలకి వ్యతిరేకంగా ఈ మూడు మతాలు కలిసాయి.
రిప్లయితొలగించండిThe problem with this bonhomie philosophy is, the exact opposite is NOT possible. Try posting a 'Hindu' couple riding a bike with their son dressed as prophet Mohammed('Peace' Be Upon Him)! Lets not argue that there is simply no tradition of dressing kids as their prophet in Muslims. Thats not the point. The point is, it is okay for others own the 'hindu' way of living, Indians dont give a hoot. They are indifferent. The same is NOT true, lets say, if you want to do something a Muslim does. If what you want to do is demeaning to them, you will be skewed alive.
రిప్లయితొలగించండిRK, The problem is majority and minority issue. Hindus wont attend iftar parties even though Hindu politicians organise iftar parties for muslim votes. But a person from a minority religion may practice the culture of majority for his identity in majority dominated society.
రిప్లయితొలగించండిPraveen - What time do you go to bed? I usually go to bed around 12:30 am and that is proven to have profound implications on Hindu-Muslim unity in India.
రిప్లయితొలగించండిPresent time shown in my computer is 8:29 PM. Individually, I am not against any religious group. I hate only the system of religion and not the people who believe in god. Muslim population is very less in our town. Here, muslims do not dare to clash with Hindus for any cause. Clashes happen only in those zones where people of both religions have significant number in population. Here the talk is about muslim boy in Hindu getup. I didn't get surprised because it is the matter of social identity in the zone where his own customs are not identified by the majority.
రిప్లయితొలగించండిమా అమ్మగారు నాకో విషయం చెప్పారు. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఊరిలో హరికథలు పాడిన ఆవిడ ముస్లిం. సంప్రదాయకంగా పాటలు పాడే దాసరి, జంగం కులాలవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు కానీ ఒక ముస్లిం ఆవిడ హరికథలు పాడేది. మెజారిటీ హిందూ కుటుంబం నుంచి వచ్చినవాడు ఏసు ప్రభువు కీర్తనలు పాడగలడా? మతం మారిన తరువాత పాడితే అది వేరే విషయం. మతం మారకుండానే ఏసు ప్రభువు కీర్తనలు పాడగలడా?
రిప్లయితొలగించండిMay be you don't know about the Christian songs sung by SP Balasubhramanyam-Saradhi
తొలగించండిఏమతం వాళ్ళు గొప్ప లేదా ఏ మతం వాళ్ళు తక్కువా అనేది ఇక్కడ మనం చర్చింట్లేదని గమనించగలరు. In my opinion, every group (be it religeous, caste, or economic) is as good or as bad as any other.
రిప్లయితొలగించండిWill come back and respond to you all soon :)
Read the reply again. ఒక మతం గొప్ప అనో, ఒక మతం తక్కువ అనో నేను అనలేదు. హిందూ మెజారిటీ సమాజంలో ఒక హిందువు ముహమ్మద్ ప్రవక్త వేషం వేసుకుంటే దానికి ఐడెంటిటీ ఉండదనేది నిజం అని చెప్పగలను.
రిప్లయితొలగించండివిచారగ్రస్త విషయ మేమింటే .వాస్తవాలను మభ్యపెట్టడానికి తీవ్రంగాశ్రమిస్తున్నవారు ఎక్కవటం జరుగుతున్నది యుగప్రభావాన.
రిప్లయితొలగించండిమీరు పల్లెలకొచ్చి చూడండి .చర్చిలకుమసీదులనిర్మాణాలకు చందాలిచ్చేది హిందువులు. పీర్లపండగలలో పీర్లుమోసేది హిందువులు. గుంటూరు మస్తానయ్య దర్గా దగ్గర చూడండి .ఎక్కువమంది హిందువులే జ్ఝానాన్ని మహాత్ములను గౌరవించటం హిందువుల రక్తలో ఉండే లక్షణం .సర్వమానవుల ఉపాసనా పద్దతులను గౌరవించి అన్నిమార్గాలలోనూ
భగవంతుణ్ణి చేరవచ్చనే మళాలస్వామి,రామకృషణ పరమహంసలవంటి ్ ఆద్యాత్మిక గురుపరంపర కలిగిన మహోన్నత మానవజీవన విదాన దార ఇది.
మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోని ముస్లింలలో ఎక్కువ మంది దూదేకుల కులస్తులు. వాళ్ళు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారినా ఇంకా హిందూ దేవుళ్ళ ఫొటోలని ఇంట్లో పెట్టుకుంటారు. పర్సియా & తురుష్క దేశాల నుంచి వలస వచ్చిన సంతటికి చెందిన ముస్లింలు దూదేకులవాళ్ళని ముస్లింలుగా అంగీకరించరు. గుంటూరు జిల్లా వినుకొండకి చెందిన షేక్ కరీముల్లా గారు వ్రాసిన తెలుగు ఇస్లామిక్ కవితలు చదవండి, మీకు అర్థమవుతుంది.
రిప్లయితొలగించండిఇప్పటికే బోలెడు మ౦ది వాడేసారు ఈ పుటో :)
రిప్లయితొలగించండి@హిందూయిజం అనేది ఒక జీవన విధానం మాత్రమే అంతకంటే ఇంకేమీ కాదు.@
'ఒక' జీవన విధానమేనా? నాకైతే ఒక్కోరు ఒక్కోలా కనిపిస్తున్నారు ;-)
బాగా చెప్పారండి. ఒక్క కుటుంబం ఉన్న ఫొటొ తొ " వెయ్యి సంవత్సరాల నుండీ ముస్లీములు హిందువులని అణగదొక్కారనీ" అనే వారు తమ తమ వాదనలు సరి చూసుకుని/ సరి చేసుకొవాలని సూపర్ కంక్లూజన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే స్పూర్తి తొ ఇఫ్తార్ విందులకెళ్ళి ముస్లీం లు ధరించే Taqiyah లు ధరించే మన గుజరాత్ రాజకీయ నాయకుల ఫొటొ పెట్టి గుజరాత్ లొ మత ఘర్షణలు జరగడానికి కొంతమంది హిందూ నాయకులే కారణం అనే వారు తమ వాదనలు సరి చూసుకొవాలని మీరు చెప్తే చూడాలని ఉంది. ఎమంటారు. రెండిటికి పొలిక లేదంటారా.. అదేంటండీ.. వెయ్యి సంవత్సరాల హింస అన్న అరొపణ ఒక్క ఫొటొ మర్చిపొయినప్పుడు వారం రొజుల హింస అన్న అరొపణ అదే ఫొటొ తొ పొదంటారా..
రిప్లయితొలగించండిI hope you understand .
కులం కట్టుబాట్లు లేని సమాజంలో ఒక దళితుడు దేవాలయానికి పూజారి అయితే అది వార్త అవ్వదు. కులం కట్టుబాట్లు ఉన్న సమాజంలో దళితుడు పూజారి అయితేనే అది వార్త అవుతుంది. విధవా వివాహాలకి సామాజిక అడ్డంకులు లేని సమాజంలో ఒక వ్యక్తి భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకుంటే అది వార్త అవ్వదు. విధవా వివాహాలకి సామాజిక అడ్డంకులు ఉన్న సమాజంలోనే భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకుంటే అది వార్త అవుతుంది. ముస్లింలలో హిందూ దేవుని వేషం వేసుకునేవాళ్ళు ఏ ఒకరో, ఇద్దరో ఉన్నారు కాబట్టే ఇది వార్తయ్యింది. ఎక్కువ మంది ఉంటే ఇది వార్త అవ్వదు కదా.
రిప్లయితొలగించండిబాబులూ... మతాలూ, సామరస్యాలూ మనలాంటి తిన్నదరగనోళ్ళకే. పనిచే(చూ)సుకుంటే తప్ప రోజులుగడవని లేబరునాయాళ్ళకూ, లోక్లాసు నాయాళ్ళకూ, పల్లెటూరినాయాళ్ళకూ రహీము రహీముగా కనిపిస్తాడేకానీ ముస్లిముగా కనిపించడు. ఒకేళ అప్పుడప్పుడూ(పండగలప్పుడు) అనిపించినా తరవాత దాన్ని ఖాతరుజెయ్యరు (మనం పోయి వాళ్ళని కలబెట్టనంతవరకూ). వాళ్ళకి మతాలపేరుతో కొట్టుకోవడానికీ టైమూఉండదు, సామరస్యాన్ని ప్రదర్శించడానికీ తీరికాఉండదు. అదీ కధ.
రిప్లయితొలగించండిఇంకోమాట సుప్రీంకోర్టుమాట "ఇంకేమీ కాడు" టైపు మాటకాదు. "బారతీయ జీవనవిధానం జీవించేవాళ్ళందరూ హిందూ జీవనవిధానాన్ని జీవిస్తున్నవారే" అని చెప్పటం. అది విస్తృతార్ధాన్నివ్వడమేకానీ పలచనచెయ్యడంకాదు. ఈ సోకాల్డు భారతీయ జీవన విధానంలో హిందూజీవన విధానానిది ముఖ్యభాగం కాబట్టే ఏదో కొంతమంది devote followers(ఇందులో హిందూ చాందసులుకూడా వుంటారు)ని మినహాయిస్తే మనందరి విలువలూ ఒకేరకంగా వుంటాయి. ఇది పెళ్ళిళ్ళూ, social transactions లాంటి పెద్దవిషయాల్లోనేనండోయ్. ఆహారపుటలవాట్లూ లాంటి చిన్న విషయాల్లో కాదు.
రిప్లయితొలగించండిఇదొక కాజువల్ ఫొటో!
రిప్లయితొలగించండిస్కూల్లో పిల్లవాడికి బహుమతి రావాలంటే అట్రాక్టివ్ గా ఉన్న వేషమొకటి వెయ్యాలి, ప్రైజు కొట్టాలి. అదొక్కటే టార్గెట్ ఇక్కడ!
రెండు మూడు స్కూళ్ళలో ఇలాంటి వేషం పిల్లలు వేయగా చూశాను. వారిలో ఒక పిల్లాడి తల్లికి ఈ వేషానికి సామాగ్రి అక్కడ దొరుకుతుందో సదరు తల్లికి సమాచారం కూడా ఇచ్చాను. ఈ ఫొటో ఆధారంగా ఇదొక్కసారి చూస్తే తమ వాదనలని సరిచూసుకునే అవకాశం దొరుకుతుందనే ఆశపడటమూ, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం, దాని మీద ఇంత చర్చ జరగడమా? :-))))
పైగా బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టారు:-))
ఇందాక నేను ఒక వాక్యం వ్రాసాను
రిప్లయితొలగించండి>>>>>
I didn't get surprised because it is the matter of social identity in the zone where his own customs are not identified by the majority.
>>>>>
ఇంగ్లిష్‌లో వ్రాయడం వల్ల మీకు అర్థమవ్వలేదేమో. కానీ చిన్నప్పుడు నాకు స్కూల్‌లో నేర్పించిన సంస్కృతం కలిపిన తెలుగులో చెప్పినా అర్థం కాదేమోనని ఇంగ్లిష్‌లో వ్రాసాను.
నేను తెలుగులో చెప్పలేకపోయినది సుజాత గారు చెప్పగలిగారు. అదే తేడా.
రిప్లయితొలగించండినిజ జీవితంలో చాలా పనులు మతంతో పని లేకుండా చేస్తుంటాం. ఎల్.కె.అద్వానీ క్రిస్టియన్ పాఠశాలలో చదివాడని అతన్ని లౌకికవాది అనగలమా? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నాకు తెలిసిన ఒక ముస్లింల అబ్బాయి ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు నడిపే సరస్వతి శిశు మందిర్‌లో చదివాడు. ఆ స్కూల్‌లోని స్టాండర్డ్ నచ్చిందనో, హిందువుల పిల్లలు క్రైస్తవ మిషనరీ స్కూల్‌లలో చేరగా లేనిది ముస్లింల పిల్లవాడు ఆర్.ఎస్.ఎస్.వాళ్ళ పాఠశాలలో చేరితే తప్పేమిటనో అతని తండ్రి అతన్ని ఆ స్కూల్‌కి పంపించాడు. ఆ స్కూల్‌లో ముస్లింల పండగలకి సెలవులు ఇవ్వరని తెలిసినా పంపించాడు. ఉర్దూ మీడియం పాఠశాలలో చదివితే తెలుగు రాదనీ, తెలుగు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చెయ్యడం కష్టమనీ ఊరిలో ఉర్దూ మీడియం పాఠశాల ఉన్నా తెలుగు మీడియంలో చదివిన ముస్లింల పిల్లలనీ చూశాను. జీవితంలో మతం కంటే ఎక్కువ ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఒక ముస్లింల కుటుంబంలో పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి డబ్బున్న కుటుంబాలకి చెందిన హిందువులనీ పిలిచారు. ఆ పెళ్ళికి మణిహారీ (గాజులు అమ్ముకునే కులం)కి చెందిన ఒకామె వచ్చింది. ఖరీదైన చీర, నగలు వేసుకోవడంతో అమె డబ్బున్న స్త్రీ అనుకుని ముస్లిం స్త్రీలు ఆమె పక్కన కూర్చుని భోజనాలు ప్రారంభించారు. ఆమె మణిహారీ కులానికి చెందిన స్త్రీ అని తెలిసిన తరువాత ఆమెని లెగమన్నారు. అప్పుడు ఆమె కింద కూర్చుని భోజనం చెయ్యాల్సి వచ్చింది. ఎంత పల్లెటూరివాళ్ళైనా మతం విషయంలో అభిప్రాయాలు మార్చుకోవడానికి ఒప్పుకుంటారు కానీ ఆర్థికాంశాలలో అభిప్రాయాలు మార్చుకోవడానికి ఒప్పుకోరు. హిందువులూ, ముస్లింలూ కలిసిపోయినంతమాత్రాన సమాజంలో గొప్ప మార్పేమీ రాదు. డబ్బున్న హిందువు డబ్బున్న ముస్లింతో కలిసి ఉంటాడు, పేద హిందువు పేద ముస్లింతో కలిసి ఉంటాడు. అసదుద్దీన్ ఒవైసీ ఏర్పాటు చేసే ఇఫ్తార్ పార్టీలకి డబ్బున్న హిందువులు వెళ్తారు కానీ పేద ముస్లింలు వెళ్ళగలరా? అలా వెళ్ళగలిగిన రోజే నిజమైన మత సామరస్యం వచ్చినట్టు అంటే అసదుద్దీన్ ఒవైసీ ఒప్పుకుంటాడా?
రిప్లయితొలగించండి@ duregeswara గారు,
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. అవునండీ చాలా మంది ప్రజలు అలాగే జీవిస్తున్నారు. ఏమతం వారైనా మెజారిటీ ప్రజలు మనదైన పద్దతుల్లో జీవిస్తున్నారు అనేది సంతోషించవలసిన విషయం.
@ RK,
I am not trying to show artificial bonhomie. Seeing people not clinging to symbolic things and having the ability to coexist with differences just made me happy. This is too trivial a piece to base any analysis or argument on the larger issues. Anyway, Thanks for sharing your views.
@ Mouli గారు,
రిప్లయితొలగించండి>> "'ఒక' జీవన విధానమేనా? నాకైతే ఒక్కోరు ఒక్కోలా కనిపిస్తున్నారు ;-) "
ఒక్కొక్కరూ ఒకోరకంగా జీవిస్తూ కూడా ఒక సమాజంగా కలిసి మనగలగడమే మన జీవన విధానం అని సుప్రీం కోర్టు అభిప్రాయం అయ్యుండొచ్చు :)
@ మంచు గారు,
రిప్లయితొలగించండిపెద్ద పెద్ద విషయాలు వాదించేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఉదాహరణలతో పబ్బం గడుపుకోవటం సరికాదండీ. మీ ఉద్దేశ్యం అదే అయితే నేను ఏకీభవిస్తాను. వాదనలు సరి చూసుకోవడం అంటే, చాలా మంది సాధారణ హిందువులూ, ముస్లీముల లాగా ఆలోచించగలిగితే బావుండు అని నా అభిప్రాయమండీ. అంటే, అభిప్రాయ భేదాలున్నా, అవసరమైన దానికన్నా ఎక్కువగా భావోద్వేగాలకి లోనవడం వంటి వాటిని మార్చుకోవచ్చు అని నా అభిప్రాయం అంతే.
@ Indian Minerva గారు,
రిప్లయితొలగించండిసరిగ్గా చెప్పారు :) ధన్యవాదాలు.
@ సుజాత గారు,
వాదనలని సరి చూసుకోవడం అని చెప్పినప్పుడు బహుశా నేను సరైన పదాలు వాడకపోవటం వల్ల నా ఉద్దేశ్యం సరిగ్గా బయటికి రాలేదనుకుంటాను. వాదాలు సరిచూకోవటం ఏమీ లేదు లెండి. కేవలం మామూలు జనాల్లా భావోద్వేగాలకి లోనవ్వకుండా ఆలోచించ గలైగితే బావుంటుంది. You are right.. Its just a casual photo :)
@ Praveen Sarma గారు,
రిప్లయితొలగించండిచాలా కోణాల్లోనుంచి విశ్లేషించారు. ధన్యవాదాలు. (majority/minority Identity, religion not being the only ground etc.)
ఆశ్చర్యం కలిగించని దానికి అద్భుతత్వం ఆపాదిస్తే mislead చేసినట్టు ఉంటుంది. అందుకే ఈ ఫొటో యొక్క promotionని విమర్శించాను.
రిప్లయితొలగించండిThank you. Understood and agree with the intent :)
తొలగించండిఫోటోలో ఉన్న వారి విశాలహృదయాన్ని నేను మెచ్చుకుంటున్నానండి. కొన్ని వ్యాఖ్యలు చదివాక , ఈ రోజుల్లో చాలామంది పోజిటివ్ గా, తేలికగా తీసుకోవాల్సిన విషయాలను నెగెటివ్ గానూ, నెగెటివ్ గా ఆలోచించవలసిన సందర్భంలో పోజిటివ్ గానూ ఆలోచిస్తున్నారనిపిస్తోంది..
రిప్లయితొలగించండిహిందూ మతం వేరు . భారతీయ జీవన విధానం వేరు. మరో దేశం పై దండెత్తని , దాడి చేయని , అందరిని కలుపుకోగలిగే ఉన్నత సాంప్రదాయ విలువలు - సాంస్కృతిక విలువలు కలిగని భారతీయ జీవన విధానం ప్రపంచానికే ఆదర్శం .అదే ఈ ఫొటోలోనూ చూడొచ్చు. ఏ దేశమైనా ఏ మతం వారి సొత్తు కాదు. మనిషి పుట్టాకే మతం పుట్టింది. హిందూమతం లో కూడా మనువు లాంటి వాళ్ళ అశాస్త్రీయ,మనిషిని మనిషి అణగదొక్కోందుకు జ్నానంతో రచించిన అజ్నానాన్ని , ముస్లింలో తలాక్ ని ఈ ఫోటో లో కనిపిస్తున్న బురఖాలని కూడా సమర్దించ కూడదని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండిపల్లా కొండల రావు గారు,
తొలగించండిధన్యవాదాలు :)