ఏందో ఈ తెలంగాణా వాదులూ, సమైక్య వాదుల పరిస్థితి చూస్తుంటే ఏదో సినిమాలో ఉండే ఈ డైలాగ్ తెగ గుర్తొచ్చేస్తుందీ మధ్య.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లో ఎన్ని సమస్యలున్నాయో, ఒకే రాష్ట్రంగా కలిసి ఉండడంలో ఎవరెవరికి ఏ ఏ ఇబ్బందులున్నాయో ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారు. బానే ఉంది. ఈ మొత్తం వ్యవహారం లో భావోద్వేగాలు శృతి మించాయనేది తెలిసిన విషయమే.
సామాన్య ప్రజల దగ్గరినుండీ నాయకుల వరకూ మొత్తం అందరూ ఒక రకమైన ఉన్మాదానికి లోనయ్యారనేది మరీ బాధాకరం. ద్వంద్వ ప్రమాణాలు రాజ్యమేలుతున్న ఈ పరిస్థితుల్లోనుండి బతికి బయట పడాలంటే ఏంచేయాలనేది అందరూ ఆలోచించ వలసిన విషయం. రాజకీయ పార్టీలూ నాయకులూ ఆ పని చెయ్యట్లేదు. పోనీ కనీసం మేధావి వర్గం అన్నా చేస్తుందా అంటే అదీ లేదు. సరే మనోళ్ళు బ్లాగుల్లో బరికేస్తారేమో అనే ఆశ కూడా గల్లంతే. ఎక్కడ చూసినా ఎవరిక్కావలసింది వాళ్ళు గుడ్డిగా సమర్ధించుకోవడం, అవతలి వాళ్ళనీ దుమ్మెత్తి పోయడమే కనిపిస్తుంది. కావాలంటే చూడండి..
తెలంగాణా వాదులు భాగో అన్నప్పుడూ, నాలుకలు కోస్తాం అన్నప్పుడూ సమైక్య వాదులంతా తెగ గింజుకుని పదజాలాల గురించి బాధపడిపోతారు. తెలంగాణా మద్దత్తుదారులు నోరు మెదపరు, మెదిపినా పై పై మాటలు చెప్పి అందులో ఆవేదన అర్థం చేసుకొమ్మని కాకమ్మ కథలు చెప్తారు.
అసలు తెలంగాణా వాళ్ళకి కష్టపడే గుణంలేదు, మేమొచ్చాకే వీళ్ళకి నాగరికత అబ్బింది అని సీమాంధ్రులు వాగినప్పుడు తెలంగాణా వాదులేమో రోడ్లమీదా, మీడియాలోనూ శివాలెత్తి పోతారు. సీమాంధ్ర మద్దత్తు దారులేమో లోలోన సంతోషిస్తూ పళ్ళికిలిస్తూ పైకి గభీరంగా వేరే విషయాలు మాట్లాడుతారు.
వేర్పాటు వాదులు అన్నప్పుడో, ఏ కాశ్మీర్ సమస్యతోనో పోల్చినప్పుడు తెగ బాధ పడిపోతారు. బ్రిటీష్ వలస వాదంతో సీమాంధ్రులని పోల్చినప్పుడు మాత్రం అవ్. కదా అని నోరెళ్ళ బెడతారు. సీమాంధ్రులూ అంతే వేర్పాటు వాదం అనేప్పుడు ఏనొప్పీ ఉండదు, వలస వాదం అన్నప్పుడు రోషం పొడుచుకొస్తుంది మరి.
దాడులు చేస్తాం తరిమి కొడతాం అని ఒకళ్ళంటే, సాయుధ ముఠాలు తయారు చేస్తాం ఆత్మాహుతి దాడులు చేస్తాం అని ఒకళ్ళంటారు. మళ్ళీ మనం మామూలే.. ఒకసారి మౌనం మరోసారి ఆగ్రహం.. మనదేప్రాంతం అనేదాన్ని బట్టి.. ప్రాంతీయాభిమానం మరి !
ఇలా మన వెధవతనం పెంచుకుంటూ పోటీ పడుతున్నంతకాలం ఈ సమస్య తీరదు. కాకపోతే..మొత్తం అందర్నీ కలిపి వెధవతనం జాయింట్ విన్నర్స్ అని ఆ ఢిల్లీ వాళ్ళు జమకట్టేస్తారు :( అయినా పర్లేదులే.. ఆ ఢిల్లీ వాళ్ళ యెదవతనంతో పోల్చుకుంటే మన వెధవతనమూ ఒక వెధవతనమేనా !!!!
Righto!!
రిప్లయితొలగించండినిన్నటి విషయాన్నే తీసుకుంటే నాకు నిన్నటివరకూ వున్న అభిప్రాయం ఈ రోజు మారిపోయింది.
మీరన్నది నూరుశాతమూ కరెక్టు.
బ్లాగుల్లో ఒక న్యూట్రల్ అన్‌బయాస్డ్ వేదిక లేకుండా చర్చ సాధ్యం కాదు. ఎవరి బ్లాగుల్లో వాల్లే రారాజులు. ఇక మిగిలిందల్లా ఎదుటివారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే..మరిప్పుడు బ్లాగుల్లో అదే జరుగుతుంది.
రిప్లయితొలగించండిబ్లాగుల్లోనయినా, బయటి ప్రపంచంలోనయినా మన అసెంబ్లీలోనయినా మెజారిటీ చెప్పింది తప్పయినా ఒప్పుగా తేలుతుంది, అందులో వాస్తవాలు ఎంత అనేది ఎవరికీ అవసరం లేదు, ఎన్ని కామెంట్లు మనల్ని సమర్ధిస్తూ, ఎదుటి పక్షాన్ని తిడుతూ వస్తే అంత గొప్ప. మన రాష్ట్రంలో మెజారిటీ ఎవరివైపు ఉంటుందో తెలిసిందే కదా?
సీమాంధ్ర వల్ల తెలంగాణాకి అన్యాయం జరుగుతుంది అని తెలంగాణా వాదులు భావిస్తున్నారు కాబట్టి వారు సీమాంధ్రులని తిట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని కలిసుందామని చెప్పే సమైక్య వాదులు తెలంగాణా వారిని తెలంగాణా వారికి తిట్టడం పూర్తిగా అసంబద్ధం. "జై ఆంధ్ర" అనేవారు తిట్టినా దానికో అర్థం ఉంటుంది.
రిప్లయితొలగించండిమీరు చెప్పింది నిజం...నాయకులు తిట్టుకోడం ఎక్కువయింది బాగా
రిప్లయితొలగించండి@శ్రీకాంతాచారి ....righto
@శ్రీకాంతాచారి
రిప్లయితొలగించండితెల౦గాణా నాలుగు తిడితే , అధికారం, అర్ధ బల౦ ఉన్న ఆ౦ధ్ర ఇ౦కెన్ని తిట్టాలి :)
@ Indian Minerva గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు :)
@ సత్యాన్వేషి గారు,
బ్లాగుల్లో అయినా బయటయినా మనం న్యాయమనుకున్నదీ, నమ్మిందీ ఆచరిస్తే ఏ సమస్యా ఉండదు. సమస్యని పరిష్కరించడానికి ఉపయోగ పడకుండా కేవలం మరిన్ని సమస్యల్ని సృష్టించడానికి మాత్రమే పనికొచ్చే ప్రేలాపనలు ఏవైపునుండి వచ్చినా అందరికీ నష్టమే.
వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
@ శ్రీకాంతాచారి గారు,
Thanks :) తిట్టుకోవడానికి అర్థాలు వెదకడం మొదలెడితే ఇక దీనికి అంతం ఉండదు. రీజన్ కి మెజారిటీ ప్రజలు సేలవు చీటీ ఇవ్వడం వల్ల స్వల్ప కాలిక ప్రయోజనాలుంటాయేమో కానీ అది చాలా ప్రమాదకరం.
@ sanju -The king,
రిప్లయితొలగించండినాయకులు తిట్టుకోవడమే కాదు, మన ప్రయోజనాలకి అణుగుణంగా ఉన్నప్పుడు ఎటువంటి దిగజారుడుతనాన్నయినా సమర్ధించుకునే అలవాటు మనలో కూడా ఎక్కువయ్యింది. అందుకే చాలా విషయాల్లో మనం అవసరమైన దానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.
@ వీకెండ్ పొలిటీషియన్
రిప్లయితొలగించండిబ్లాగులనేవి ఎక్కడినుంచో ఊడిపడినవి కాదు కదా! అవీ సమాజములో వ్యక్తులు నడిపేవే కనుక బ్లాగులైనా సమాజాన్నే ప్రతిబింబిస్తాయి. ఇరుపక్షాలూ తిడుతున్నాయన్నారు. మొదలెట్టింది ఎవరు? తెలంగాణవాదుల నోటితీట ఎక్కువైనప్పుడే ప్రతిస్పందన మొదలవుతుంది. సరే ఇక తిట్టటం అనేది ఈ సమాజం ఎప్పుడో ఆమోదించటం మొదలు పెట్టింది. దీని గురించి సమయాన్ని ఎక్కువ వృధా చేయటం అనవసరం.
@ శ్రీకాంతాచారి
సమైక్యవాదుల కర్మేమి! వారు నోరు తెరచినా పాపమే కాబోలు. ప్చ్ ఏమి చేస్తాం? తెలంగాణవాదులు భావించారని అన్నీ జరిగిపోవు, ఆకాశం ఊడిపడిపోదు. తెలంగాణవారివి 4 కోట్ల మనోభావాలయితే మిగతా జనానివి 6 కోట్ల మనోభావాలు. సీమాంధ్ర దోపిడీ అంటూ తెలంగాణవాదులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలుండాలి, ఆ ఆధారాలు పరీక్షలకు నిలబడాలి. అవేమీ జరక్కుండా తెలంగాణ రాష్ట్ర అంశం అంగుళమైనా కదిలే ప్రసక్తే లేదు. కాదు లేదని ఎంత గింజుకున్నా బయటపడేది మీవి (తెలంగాణవాదులవి) మీ భజనపరుల డొల్లవాదనలే తప్పించి మరోటేమీ కాదు. మనోభావాలు మట్టిబెడ్డలూ అంటూ కాలహరణం చేయకుండా నిఖార్సయిన ఆధారాలు సేకరించేపనిలో ఉంటే మంచిది మీరు మీ భజనపరులూనూ!
Mauli గారు,
రిప్లయితొలగించండిమీరు నాటపాని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేరు. ఏంటి మీరనేది, అధికారం అర్థబలం ఉన్నవాళ్ళు ఎక్కువగా దిగజారొచ్చా !
దిగజారుడులో కూడా అసమానతలా..!!! హే ఏదో ఒక భగవాన్, Save us..pleaaase..
@ అచంగ,
రిప్లయితొలగించండిబ్లాగుల గురించే అని ప్రత్యేకంగా చెప్పాలనేది నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. అన్నిచోట్లా జరుగుతున్న తంతు మీదే నా అభిప్రాయం రాశానండీ. ఎవరు ముందు మొదలు పెట్టారు? ఎవరు ఎక్కువ దిగజారారు? అనేవాటికంటే సమస్య పరిష్కారానికి ఏంచేయాలి అనేదే ముఖ్యం కదా..
ఇక తిట్టడం లాంటి వాటిని సమాజం ఆమోదించింది అంటే నేనంగీకరించను. కాకపోతే మామూలుగా మనం ఆమోదించని వాటినికూడా మనకనుకూలంగా ఉన్నప్పుడు ఆమోదించడం, భరించడం అనేది అత్యంత ప్రమాదకరం అని భావిస్తాను.
@సామాన్య ప్రజల దగ్గరినుండీ నాయకుల వరకూ మొత్తం అందరూ ఒక రకమైన
రిప్లయితొలగించండిసామాన్య ప్రజలు కోరికమేరకేగా నాయకులు స్ప౦ది౦చాల్సి౦ది :)
@ వీకెండ్ పొలిటీషియన్,
రిప్లయితొలగించండినాకు మీ టపా మొత్తమ్మీద అభిప్రాయభేదం ఉన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాను. మిగిలిన అంశాలకు సంబంధించి నాదీ మీమాటే!
సమస్య పరిష్కారము ఎంత ముఖ్యమో ఎవరి తప్పులు ఎంత అనేది తేల్చటమూ ముఖ్యమే. ఒక హత్య కేసులో ఉన్న పదిమంది ముద్దాయిలకూ ఒకే శిక్ష ఎలా పడదో ఈ తిట్లపురాణానికి సంబంధించి అయినా ఎవరి తప్పులు ఎంత అనేది తేల్చాల్సిందే. సహజన్యాయమూ అదే.
మీ మత విశ్వాసాలు వేరయితే మన్నించాలి. హిందూ ధర్మము 'నిజము' 'సత్యము' అనే పదాలను వాడుతుంది సమాజాన్ని గురించి చెప్పేటప్పుడు. "పదుగురాడు మాట పాడియై ధరజెల్లు" అని నిజాన్ని గురించి అంటే, స్థలకాలాలు, సమాజామోదముతో పనిలేనిది అని సత్యాన్ని గురించి చెబుతుంది. నిజాల మధ్య జీవించటం సులువు. సత్యాన్వేషణ కఠోర సాధనతో కూడుకున్నది. మన విఙ్ఞత ఉపయోగించాలి. నాకన్నా పెద్దవారు మీ అనుభవానికి తెలియనిది కాదు.
వీపో, మీరు ప్రాంతాలకతీతంగా రాజీకుదిర్చేవారిలా పెద్దరికంపైనేసుకుని చెబుతున్న తీరు చూస్తే, కిరణ్ కుమార్ తరువాత ముఖ్యమంత్రి మీరేనేమో అనిపిస్తోంది.
రిప్లయితొలగించండి;)
@అజ్ఞాత,
రిప్లయితొలగించండినాకనిపించింది నేను రాశాను. మీరు నామీద వెయ్యడానికి ప్రయత్నిస్తున్న పెద్దరికాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నాను ;)
కిరణ్ కుమార్ తరువాత నా సంగతేమో గానీ, మీరు మాత్రం త్వరలోనే TV ల్లో వ్యంగ programs లో దర్శనిమిస్తారనిపిస్తుంది.
btw, I would appreciate if you can stick to the topic.
I totally agree with you MR Weekend politician gaaru.
రిప్లయితొలగించండిNuvvu mundu thittavu kabbati nenu ninnu thitinna naa tappu ledu
Nenu seprate telangana annanu kaabati emina matlodochhu- enti idantha ?
With this kind of attitude where are we going ????
inni years lo saadhinchindi ida ? intha kakshalu, kopalu taapalu avasarama ?
asalu okosaari alochisthe....
మీ పోస్ట్ బాగుంది. వాస్తవాలు రాశారు. అందుకోండి అభినందనలు.
రిప్లయితొలగించండివి.పో,
రిప్లయితొలగించండిసమస్య చక్కగా వివరిస్తారు, డిష్కషన్స్ అంటూ మొదలెడతారు, మీ అభిప్రాయం మాత్రం పేరుకు తగ్గ కర్ర విరక్క పాము చావక టైపులో స్పర్శిస్తూ ఏదో చెప్పేస్తారు. తప్పో రైటో మీ సొల్యూషన్ ప్రతిపాదించిన సందర్భం ఎప్పుడూ గమనించలేదు. వారాంతం రాజకీయాలు కాక ఫుల్‌టైమ్ పొలిటికల్ సొల్యూషన్స్ ఇవ్వొచ్చు కదా.
baagundi maastaaru... ainaa saamaanyudu vidipovaali ani gaani, kalisi vundaali ani gaani korukuntunnaadaaa ??. evadi swardam vaadidey... okadu kalisi antey inkokadu vidipodaam antaadu. A naayakudainaa ee vudyamam lo sachchaadaa? ledu. vaallu enduku aathma hathyalu chesukoru?. Y S R gaaru vunnappudu, ee godavalu levu...ippudu controll chesey leader ledu maastaaru. YSR gaaru ani enduku annanu antey, aayana thinnadi pakkana peditey, peda vaadiki manchi chesaadu, oka team laagaa pani cheyinchaadu. Aarogya sri, pension, vuchitha vidya , inthakannaa em kaavaali? Inthaki mee agendaa ento konchem chepthaaraa ?????? ----
రిప్లయితొలగించండి@అజ్ఞాత (22 జూలై 2011 8:13 సా), ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@yaramana గారు, ధన్యవాదాలు :)
@అజ్ఞాత 23 జూలై 2011 1:20 ఉ), నా గురించి మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. విషయాన్ని ఇంకాస్త వివరంగా చెప్పి ఉంటే స్పందించడానికి బావుండేది.
@అజ్ఞాత (25 జూలై 2011 3:47 సా), థాంక్యూ, మీ వ్యాఖ్యలో కొన్ని పదాలని మార్చాను గమనించ గలరు.
వేలు చూపిస్తే కాలుదాకా కబ్జా చేసే పొలిటీషియను వనుకుంటే ఇంకా వివరాలివ్వాల అంటారేందండి? నాతో మజాక్ చేస్తుండ్రా?
రిప్లయితొలగించండిmaastaaru...ee naayakulanthaa samaajaaniki emainaa cheddamani vastunnaaraa ???. nijaayithi gaa pani chesey naayakudu asalu vunnaadaa ?. eppatikainaa peda vaadu peda vaadi gaaney vuntunnaadu...politics oka profession ayipoindi maastaaru. gelichaamaa, dabbu venaka vesukunnaamaa anthey. mana zeevitha samasyalu teerustaaru anukuntuntey, zeevithamey samasya laaga chestunnaaru. ika media vundi antey vesina clip ne vesi , 100 saarlu choopistundi. manishiki upayoga padey prasaaraalu cheyadam ledu.
రిప్లయితొలగించండి