24, మే 2011, మంగళవారం

భారతీయులు మేల్కొనే ఉన్నారు. మీరు నిద్రపుచ్చకండి, సరేనా..:) (Updated with more comments from FB)

హిందువులు మేల్కోవాలి అనే టపా ఒకటి చూశాను. అర్చక, పౌరోహిత వృత్తులలో మనుషుల కొరత ఉంది దాన్ని ఎలాగోలా సరిచెయ్యాలి అనే అసలు విషయం తప్ప మిగతా టపా అంతా చాలా అసందర్భంగానూ, అర్థరహితంగానూ అనిపించింది. అదే విషయం ఆ టపాలో వ్యాఖ్యానిస్తే బ్లాగు రచయిత నా వ్యాఖ్యని ప్రచురించలేదు.

ఇదే టపా మీద కత్తి మహేష్ గారి ఫేస్ బుక్ లో ఒక మంచి చర్చ జరిగింది. ఆ చర్చని యదాతధంగా ఇక్కడ ప్రచురిస్తున్నాను. మీ అభిప్రాయాలు కూడా చెప్పండి.
---------------------------------------------------------------------------------------------
 
Kishore Kvn: ఇది బ్రాహ్మణుల కోసం బ్రహ్మణులు వ్రాసింది. కొన్ని చోట్ల మేము చాల గొప్పవాళ్ళం అంటాడు. ఇంకో చోట అన్యాయం అయిపోయాం అంటాడు. మేము గోప్పవాల్లమే కాని, అన్యాయం అయిపోయాం అంటాడు ఇంకో చోట. అందరికి వేప కాయ అంత ఉండే వెర్రి, మాకు వెలక్కాయ అంత ఉంటుంది. అదే... ఇందులోనూ కనిపిస్తోంది. నేను కూడా బ్రాహ్మనుడినే.. పుట్టుకతో. అది నా కూడా రావడం మానేసింది. బ్రాహ్మణ వ్రుత్తులకి ఇప్పుడు సాంఘిక గౌరవం లేదు. పురోహితులకి సంపాదించే అవకాశం ఉన్నా కూడా, ఎవరూ పిల్లనివ్వడం లేదు. గుళ్ళో అర్చకత్వం లాభసాటి గ లేదు.

గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సంఘం మలిచిందే అని సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు, మా వాళ్ళందరికీ మీరు తెలివైన వాళ్ళు, చదివితే వంట బడుతుంది అని సంఘం మాకు చెప్తూ వచ్చింది. అందుకే ఇంజినీరు అవాలన్నా, ఇంకోటవ్వాలన్నాడబ్బొకటే ఇబ్బంది. పరిణామ క్రమం లో పురోహితులుంటారు, అర్చకులు ఉండరు. గుళ్ళో దీపం పెట్టక పోయినా ఆయన అనుకున్నంత ఇబ్బంది ఏమి లేదు. మార్పు అనేది సాంఘిక లక్షణం. బ్రహ్మ విష్ణు వెనక్కేల్లిపోయి, షిర్డీ సాయి బాబా, అయ్యప్ప అంటూ కొత్త దేవుళ్ళు రాలేదూ? దానికి బ్రాహ్మడే అర్చకుడవక్కర్లేదు. ఏమిటో మీ చాదస్తం.
 
ఇప్పుడు కుండలు చేసే కుమ్మరికి, చెక్క పని చేసే వడ్రంగికి, కంసాలికి, క్షురకులకి ఇలా ఏ వృతుల వారికి కూడా దాని మీద ఆధార పడే పరిస్థితి లేదు. అందరూ చదువుకుని పట్నాలకి పోయి వేరే ఏదో పని చేసుకుంటున్నారు. గతం లో బ్రాహ్మలూ.. క్యాలెండరు తయారు చేసి, ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు పంటలు వెయ్యాలో, అధిక మాసలతో గణించి చెప్పి సంఘానికి సాయ పడుతూ వచ్చారు. జనానికి చదువులూ చెప్పారు. అలాగే, వైశ్య, కాపు, కమ్మ, మాల, మాదిగా, పాకీ ప్రతి వాళ్ళు సంఘం లో ఉంటూ సంఘానికి సాయపడ్డారు. సమాజం మారిపోయింది. చాతుర్వర్ణ వ్యవస్థ కి, మనువు సిధాంతాలకి ఇప్పుడు అర్థం లేదు. కూలి పని చేసినా, IT ప్రాజెక్ట్ చేసినా.. మనమందరం మనుషులం. అంతే.

Sai Rama Raju Kalidindi: ఆ ఆర్టిక‌ల్ నేను పూర్తిగా చదవలేదు, కానీ కొద్దిగా అర్ధం అయ్యింది. బ్రాహ్మణులు వాళ్ళ బ్రాహ్మణత్వాన్ని వాళ్ళే వదిలేసారు, ఇంక వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? నాతో పాటు సమానంగా కూర్చుని చికెన్‌బిర్యానీ తింటూ మా బ్రాహ్మణులని ఎవరు గౌరవిస్తున్నారండీ అని ...ఒక వ్యక్తి అడిగాడు, ఎందుకు గౌరవించాలి నువ్వు నీ కుల ధర్మాన్ని వదిలేసి నాతో సమానంగా ఉన్నప్పుడు నిన్ను నాకంటే ఏ విషయంలో ఉన్నతుడుగా చూడాలో నువ్వే చెప్పు అంటే సమాధానం లేదు. ఈ రోజు కైనా వాళ్ళు సమాజ శ్రేయస్సు గురించి పాటు పడితేనే వాళ్ళకి మిగిలిన గౌరవమైనా దక్కుతుంది, లేకపోతే వాళ్ళు పుట్టు బ్రాహ్మణులుగానే ఉండిపోతారు.

Kishore Kvn: ఒక దళితుడికైన, బ్రాహ్మణుడి కైనా ఇదే వర్తిస్తుంది. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే. సంఘం లో ఒక వర్గం ఆధిపత్యం సింగపూర్ లోను మలేషియా లోను అమెరికాలోను కూడా తప్పట్లేదు. అదే మనకీ ఉంది. మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు. వేసవి లో మామిడి పళ్ళు మాత్రమే అమ్ముతాడు. మిగిలిన కాలాల్లో కూర గాయాలు అమ్ముతాడు. దేనికి గిరాకి ఉంటె ఆ పని చేసుకోవాలి. మన సివిల్ ఇంజినీర్లు అందరూ కంప్యుటర్ ప్రోగ్రామింగ్ చేయ్యట్లేదూ? ఇదీ అంతే.

Mahesh Kumar Kathi బ్రాహ్మణులు తాము థియరైజ్ చేసి సామాజిక మూసకు తామే బలయ్యారు...

Kishore Kvn: Mahesh, మార్పు ని అంగీకరించ లేకపోతే ఎవరికైనా ఇదే జరుగుతుంది. బ్రాహ్మణులు theoritise చేసిన సిస్టం - అప్పటి సమాజానికి అదే కర్రెక్టేమో. అన్ని సేవలు అందరికి అందడం కోసం ఏర్పరిచిన పద్ధతి లో నాకు లోటు కనపడదు. అంటు రోగాలు వ్యాపించ డానికి అవకాశం ఉన్న పనులు చేసే కొన్ని వృత్తుల వారికి immunity ఉంటుంది. వారిని మిగిలిన వారికి దూరంగా quarantine చేసి ఉంచారు. సమాజ శ్రేయస్సు కోసం చేయబడింది. కాల క్రమం లో అది కాస్తా వెర్రి తలలు వేసి, అంటరాని తనంగా మారింది. అది సమాజం లో ఉన్న అజ్జ్ఞానం. దాన్ని తీసుకెళ్ళి బ్రాహ్మణుల తప్పు అనడం సరి కాదేమో? బ్రాహ్మణులకి కూడా వారి సేవలు అవసరమే. వారికి హరిజనుల మీద కక్షతో చేసింది కాదు.

Sreekumar Chinchapattana Gomatham ఒక బ్రాహ్మడు, క్షత్రియుడైన రాముడికీ, యాదవుడైనా కృష్ణుడికీ అర్చనలు, పూజలు చేస్తూ, మిగతా కులాలందరి వాళ్ళకీ భక్తీ, ముక్తి మూటగట్టి పెట్టినప్పుడు, వాళ్ళు లొట్టలేసుకుంటూ తినే చికెన్ తిని, ఆ దేవుళ్ళు తాగే సురాపానం సేవిస్తే తప్పేంటో నాకు ఎప్పుడూ అర్ధం కాదు :-)

ఆర్టికల్ లో నంబర్లు ఎంతవరకు నిజమో తెలీదు కానీ, మా ఇంట్లో మా తాతల వరకు (అమ్మ వైపు, నాన్న వైపు) అర్చకత్వం, పౌరోహిత్యం చేసిన వాళ్ళే. మా నాన్న తరం వచ్చే సరికి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. బ్రతుకు తెరువు ముఖ్యం. ఎలా బ్రతుకుతున్నామన్నది కాదు. అయినా... బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మడు కానీ, పుట్టుకతోనో, చచ్చో బ్రాహ్మణత్వం మూటకట్టుకోరు ఎవరూ. కానీ ఏంటో... రాజకీయాల్లో, సినిమా రంగం లో మాత్రం ఓ రెండుమూడు కులాల వాళ్ళే కనిపిస్తున్నారు, పుట్టుకతోనే మహా నటులు, మహా నాయకులూ అయిపోయి.

Sreekumar Chinchapattana Gomatham: ఇక థియరైజ్ విషయానికొస్తే, బ్రాహ్మలతో పాటు, బలవంతులని కూడా సమానంగా తప్పు పడతాను నేను. అది ధనబలో, కండబలమో... ఏదో ఒకటి. ఆ రెండు చేతులు కలిస్తేనే మోగాయి చప్పట్లు.

Phanindrakumar Machavaram: haha simple ga meeru ela valagurinchi matladukuntunnarantene vallu gola kakda ani ardamavuthudni and vallani takuva chesi matladukodamlo meeku anadam vudani ala kastapaduthunnaru.. etopic matladam valla meeku vallaki evariki use ledhu and w...ho support or comment on them also useless enni years daaatina eppatikina elantivi maravu marchaleru and marchalanukodam valle e dhesam entha chandalamgavundi...maarpu oka stage varaku correct mare athi chesthe elane vuntundi

Syamprasad Meka: @Kishore KVN , Nice discussion. I appreciate most of the points. Let me add a different perspective to one of your comments.

You said, "అప్పటి సమాజానికి అదే కర్రెక్టేమో. అన్ని సేవలు అందరికి అందడం కోసం ఏర్పరిచిన పద్ధతి లో నాకు లోటు కనపడదు. ..."

అప్పటి సమాజానికి కూడా అది కరెక్ట్ కాదేమో కూడా ! ఏం అప్పటి సమాజ లో తప్పులుండవా? ఉండకూడదా? ఉంటాయనే ఊహని మనం భరించలేమా? అప్పటి సమాజం, వాళ్ళకున్న తెలివితేటలూ, అవగాహనా, మామూలుగా ఉండే అనేక రాజకీయ కారణాల పరిధిలో ఏర్పరుచుకున్న పద్దతి అది. అంతే. దానికి లేనిపోని లాజిక్కులు అల్లి తప్పనో, రైటనో, కుట్రనో, యుగధర్మమనో మసిబూయడం సరైనది కాదని నా అభిప్రాయం.

You also Said "అంటు రోగాలు వ్యాపించ డానికి అవకాశం ఉన్న పనులు చేసే కొన్ని వృత్తుల వారికి immunity ఉంటుంది. వారిని మిగిలిన వారికి దూరంగా quarantine చేసి ఉంచారు.సమాజ శ్రేయస్సు కోసం చేయబడింది"

వాళ్ళకి తోచిన పద్దతి వాళ్ళు పెట్టుకున్నారు. మీరంతా ఈ పనులే చెయ్యాలి, మిగిలిన వాళ్ళు ఈ పనులు చెయ్య కూడదు అని నిర్దేశించడం అప్పటి వ్యవస్థలో కూడా తప్పే కదా? సమాజ శ్రేయస్సు కోసమే అయ్యుండొచ్చు, కాకపోతే ఆ శ్రేయస్సు పొందే సమాజంలో పాపం ఆ పనులు చేసే వాళ్ళు లేరనుకుంటా! That is where the problem centers around.

Mahesh Kumar Kathi: జరిగిన వాటిని ఏదో ఒక రకంగా సమర్థించుకుంటూ పోతుండటంతోనే మార్పు వేగం మందగిస్తుంది. చరిత్ర మళ్ళీమళ్ళీ తిరగ దోడాల్సిన పరిస్థితి వస్తుంది. రగిలిన గాయలను గుర్తుచెయ్యడమే కాకుండా, గాయం చేసిన గొంతుల్ని నిలదియ్యాలనే కోరికల్ని రేపుతుంది. అదే ఘర్షణకు మళ్ళీమళ్ళీ ప్రేరేపిస్తుంది. ఒప్పేసుకుందా,..తప్పుల్ని అచ్చంగా ఒప్పేసుకుందాం. కొత్తగా చరిత్రను తిరగరాద్దాం.

Syamprasad Meka: మహేష్ గారు, మనకి సంబంధం లేని ఎప్పటివో సంగతులు కాబట్టి ఒప్పుకోవడాలూ, ఒప్పుకోక పోవడాలు అవసరం లేదండీ. కాకపోతే, నిజాయితీగా ఆలోచించ గలగడం, అర్థం చేసుకోవడం ముఖ్యం.

అప్పటి వ్యవస్థలో లోపాలకీ, మంచికీ మనం కేవలం వారసులమేకానీ బాధ్యులం కాదు. ఆ వ్యవస్థలో...ని విభజనకి ప్రతినిధులుగా మనం ఆలోచించడం మానుకుంటే మార్పులూ, పరిష్కారాలు అవే వస్తాయి. దురదృష్టవశాత్తూ, అప్పటి వ్యవస్థకీ దాంట్లోని విభజనలకీ ప్రాతినిధ్యం వహించకుండా అలోచించేవాళ్ళు సరిపోయినంత మంది ప్రస్తుతానికి లేరు. That is where we need to start :)


Kiran Chakravarthula: ప్రశ్నలు అడిగినంత దాకా బాగానే సాగి అక్కడక్కడా విపరీతవాదంగా (extremism) పరిణమించింది తాడేపల్లి వారి బ్లాగు టపా. ఆలోచించవలసిన విషయాలు కొన్నైనా ఉన్నాయందులో. (మహేశ్ గారు అడిగిన ప్రశ్న) అందులోని ప్రధానమైన విషయమేంటంటే... బ్రాహ్మణులు కులవృత్తికి ద...ూరమైతే మనగలగటానికి (హైందవ) సమాజం యిప్పటికిప్పుడు సిద్ధంగా లేదని గ్రహించి హిందువులే యేదో ఒకటి చెయ్యాలని. బ్రాహ్మణుల కులవృత్తిలోకి తదితరులను తీసుకురావటం కూడా ఒక భాగం కావచ్చునేమో (నా దృష్టిలో) కానీ తాడేపల్లి వారు అందులో ప్రాథమికమైన యిబ్బందులున్నాయంటారు. నాస్తికులు, మతవర్జ్యులు (మతాన్ని విడచినవారు = apostasists) యేమైనా అనవచ్చు గాక - ఇది వాళ్ళకి సంబంధించిన విషయమే కాదు - హైందవ సమాజానికి ఒక హెచ్చరికగా, (ఆధ్యాత్మిక, దైవిక, మానుష్య కర్మలను చేయించటానికి పురోహితుల అవసరం ఉన్నవాళ్ళకు) రాబోయే "విపత్తు"ను పరిచయం చేసేందుకు ఉద్దేశించబడిన వ్యాసమది. పోప్/ఇమాం/రబ్బై/దిగంబరులు/సిఖ్ గురు/బౌద్ధ సన్యాసి వారి వారి మతస్థులకు యిచ్చే సందేశం (అది మఱో విశ్వాసానికి అవమానమో, ద్వేషమో రగిలించనంత వఱకూ) నాకెంత అనవసరమో హైందవేతరులకు యిదీ అంతే!

<< ఒక బ్రాహ్మడు, క్షత్రియుడైన రాముడికీ, యాదవుడైనా కృష్ణుడికీ అర్చనలు, పూజలు చేస్తూ, మిగతా కులాలందరి వాళ్ళకీ భక్తీ, ముక్తి మూటగట్టి పెట్టినప్పుడు, వాళ్ళు లొట్టలేసుకుంటూ తినే చికెన్ తిని, ఆ దేవుళ్ళు తాగే సురాపానం సేవిస్తే తప్పేంటో నాకు ఎప్పుడూ అర్ధం కాదు :-) >>

రాముడు, కృష్ణుడు చేసారు కనుక చంపుకుంటూ పోయినా తప్పని మీకు అర్థం కాదంటారు మొత్తానికి?

<< మీరంతా ఈ పనులే చెయ్యాలి, మిగిలిన వాళ్ళు ఈ పనులు చెయ్య కూడదు అని నిర్దేశించడం >>

"ఈ పనులు చేసేవాళ్ళు ఒక వర్గం, ఆ పనులు చేసేవాళ్ళు మఱొకటి, ఫలానావి చేసేవాళ్ళు ఇంకొకటి, తక్కినవాళ్ళంతా ఒకటి" అని వర్గీకరించారేమో కానీ పై రకమైన నిర్దేశం కాదు. It's the other way round. (తాము నమ్మినదే సరియైనదిగా భావించి కాదని వాదించదలచిన వాళ్ళకి నేను చెప్పేదేమీ లేదు.)

Kishore Kvn: ‎@syamprasad- I'm just trying to find reasoning in ancient Hindu culture in positive perspective. అప్పట్లో జరిగింది అది తప్పు అయితే తప్పే. Almost 2000-3000 years ago started, know one knows exactly how did it all start. చరిత్ర లో వాస్తవాల వక్రీకరణ లు, ఏక పక్షం గ ఉండటం ఎక్కువని నేను చరిత్ర పెద్దగ చదవ దానికి ఇష్టపడను.

Syamprasad Meka: <<"ఈ పనులు చేసేవాళ్ళు ఒక వర్గం, ఆ పనులు చేసేవాళ్ళు మఱొకటి, ఫలానావి చేసేవాళ్ళు ఇంకొకటి, తక్కినవాళ్ళంతా ఒకటి" అని వర్గీకరించారేమో కానీ పై రకమైన నిర్దేశం కాదు. >>

పుట్టుకను బట్టి చేసే పనుల్ని నిర్దేశించడం, దాన్ని అతిక్రమిస్తే సమాజ అమోదం లేకపోవడం, పూర్వ జన్మల కర్మల ఫలితంగా ఒక వర్ణం లో జన్మించారు కాబట్టి ఆ వర్ణ ధర్మాన్నే పాటించమనడం దేన్ని సూచిస్తుంది?

In simple,
Division of labour by worth is OK, by birth is NOT OK.
For organizing the society, Division of labour is OK, but division of labourers is NOT OK.

These are basic things in any age. Practically it might not have happened properly in the past. That's fine as long as we in the present are ready to understand it and address it. But trying to unneccessarily justify the wrongs of past with funny logic and new interpretations just increases the trust deficit in the society.

Kiran ChakravarthulaI am with you in saying that attributing caste to birth is one folly that happened and has been happening ever since. I don't know when that came into existence. It's definitely not the original idea. It probably started off with parents te...aching their skills to children and soon continued on with selfishness or some other reason warranting exclusivity of the same, eventually leading to keeping the trade within the family.

Syamprasad Meka: ‎@KiranChakravarthula, As you said, we do not know how things got transformed and when. One fundamental thing I am still trying to understand is... Varna system itself is divisive rite? I know according to Bhagavadgita, there are qualities... attributed to varnas. But the basic karma principle of people acquiring the qualities of a particular varna based on their past lifes is still dividing people on birth. Isn't it? Anyway, what is wrong even if there is a problem in the original idea itself. After all those ideas are thousands of years ago. They are bound to be faulty, no issues as long as we are open to the possibility.

Kiran Chakravarthula: Right! :-) Prejudice is bad to start with, or at any point further down the line

73 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. >>అప్పటి వ్యవస్థలో లోపాలకీ, మంచికీ మనం కేవలం వారసులమేకానీ బాధ్యులం కాదు

    ఎందుకోగాని ఈ పాయింట్ నచ్చింది

    రిప్లయితొలగించండి
  3. పై కామెంటు నాదే...ఎందుకో మీ బ్లాగులో గూగుల్ ప్రొఫైల్‌తో వ్యాఖ్య పెట్టడం కుదరడంలేదు
    ..nagarjuna..

    రిప్లయితొలగించండి
  4. Thank You Nagarjuna. I just noticed the problem. Even I am not able to comment using google profile :( I will check the settings..

    --WP

    రిప్లయితొలగించండి
  5. Looks like there is an issue with google profile. I am not able to comment using google profile in any of the blogger blogs. Wordpress blogs seem to be working fine.

    --WP

    రిప్లయితొలగించండి
  6. Same is with all traditional professions. I don't understand why you buffoons are exited if something is written on Hindus/priests of Hindu religion? It shows your mean,low-class, piggish mentality of making the water muddy.

    You call it discussion? You are proving your self a jokers everytime.

    రిప్లయితొలగించండి
  7. అంటు రోగాలు వ్యాపించ డానికి అవకాశం ఉన్న పనులు చేసే కొన్ని వృత్తుల వారికి immunity ఉంటుంది. వారిని మిగిలిన వారికి దూరంగా quarantine చేసి ఉంచారు.సమాజ శ్రేయస్సు కోసం చేయబడింది

    ఆహా ఏమి ఙ్ఞానం, వారిని అంటు రోగాలు అంటుకునే ప్రమాదముంది కాబట్టి వారిని సంఘానికి దూరంగా ఉంచారని ఎంత గొప్పగా సమర్ధించేసుకుంటున్నారు. నిజంగా వారికి అంత మంచి ఉద్దేశ్యమే ఉందనుకుందాం, మరి దాన్ని వంశ పారంపర్యంగా తీసుకురావాలన్న దుర్బుద్ది ఎందుకు కలిగిందో.

    పోనీ అది కూడా మంచికే అనుకుందాం, మరి అలాంటి పని చేయడం అనేది గొప్ప త్యాగముతో కూడుకున్న పని కదా, దానికి ప్రతిఫలంగా, వారికి కలిగిన లోటును పూడ్చే విధంగా ఏమన్న ఇచ్చారా? ఇచ్చినట్టు ఎక్కడైనా చరిత్రలో ఉందా?

    పెద్దలు చేసిన వెధవపనులను, మూఢనమ్మకాలనూ ఏదో ఒక విధంగా వెనకేసుకు రావడం ఈ మధ్య ఒక ఫ్యాషనైపోయింది. ఎవరో చెప్పినట్టు, వారుచేసిన పనులకు మనం కేవలం వారసులమే కానీ బాధ్యులం కాదు అనేది నిజం. అప్పుడు వారు చేసిన వెధవ పనులకు, స్వార్థపూరిత పనులకు ఈ తరం వారు వివక్షను ఎదుర్కోవడం సరికాదు. కాబట్టి, వెధవ పనిని వెధవ పని అని ఒప్పుకుని ముందుకు సాగిపోదాం.

    రిప్లయితొలగించండి
  8. అంతే కాదు, అసలు బ్రాహ్మనులందరూ అర్చక వృత్తిని వదులుకొని చక్కగా ఇంజినీరులుగా డాక్టర్లుగా సెటిలైతే సమస్యేమిటి? హిందూ మతాన్ని ఉద్దరించే వారు ఉండరనా? హిందూ మతానికి వచ్చే నష్టము ఏమీ లేదు. ఇప్పుడు కూడా హిందూ మతాన్ని ఉద్దరించే వారెవ్వరూ లేరు

    మనకు ఎంతో మంది పీఠాధిపతులు ఉన్నారు. వారెవ్వరైనా జనాలలోకి వచ్చి హిందూ మత ధర్మాన్ని ప్రచారం చేసారా? పోనీ, హిందూ మతములో ఉన్న కొన్ని లోపాలను రూపుమాపడానికి ప్రయత్నించారా? లేదు. స్వామి వారంతా తమ తమ ఆశ్రమాలలో కొలువై ఉంటారు, భక్తులు వారిని వెతుక్కుంటు వెళ్ళి వారు చెప్పేది వినాలి. ఈ మాత్రం దానికి స్వామి వారెందుకు? భగవద్గీతనో, లేదా రామాయనాన్నో, భారతాన్నో అచ్చ తెలుగులో అచ్చు వేసి జనాలందరికీ ఒక కాపీ పంచి పెడితే వారికంటే గొప్పగా హిందూ మతాన్ని ఉద్దరించేస్తాయి ఇవి.

    రిప్లయితొలగించండి
  9. ఈ స్వాములోరినందరినీ ఒక సారి దళిత వాడలలో పర్యటించమనండి. ఇప్పుడు ఇమ్యూనిటీ తమకు లేదు, వారికుండే అంటురోగాలు తమకు వస్తాయనే భయం అక్కర్లేదు. ఇప్పుడు అన్నింటింకీ టీకాలున్నాయి. ఒక టీకా వేసుకునే రమ్మనండి. వచ్చి అక్కడ హిందూ మతాన్ని ప్రచారం చేయమనండి. మీకు అలా ప్రచారం చేసిన స్వాములు ఎవ్వరన్నా ఉంటే ఒక్కసారి నాకు తెలపండి. ఆయన ఎంతదూరములో ఉన్నా వెల్లి సాష్టాంగ నమస్కారాలు చేసి వస్తాను.

    రిప్లయితొలగించండి
  10. అవును అంటురోగాలు వస్తాయేమో. శుచి, శుభ్రతలేని ఆహారపు అలవాట్లు వున్నచోట నాకూ తిరగాలనిపించదు, ఇక సాములోళ్ళు ఎందుకు తిరుగుతారు, ఎందుకు తిరగాలి? ఆయనెవరో హిందువులకు ఏదో చెబితే, నాస్థిక అంట్లవెధవలు మొరగడం ఏమిటో. :D

    రిప్లయితొలగించండి
  11. హిందువులు మేల్కోవాలి అ౦టూ, కేవల౦ బ్రాహ్మల గురి౦చి చర్చ చేయడ౦ అర్ధవ౦త౦గా లేదు.
    దేవుడు వరమిచ్చినా .. అన్న సామెత మాదిరిగా ,పూజారి కి దేవునికి భక్తునికి మధ్య వారధి గా మన్ననలు వు౦డేవి. సామాజిక మార్పుల వల్ల ఇప్పుడు దేవునికి, భక్తునికి మధ్య పూజారి ప్రమేయ౦ తగ్గి౦ది .

    రిప్లయితొలగించండి
  12. అదే శుచి శుభ్రం లేని వాడలలో ఇతర మతాల వారు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. దానికి ఆకర్శితులై చాలా మంది మతం మారుతున్నారు. కాకపోతే, దాన్ని చూసి ఇది అన్యాయం అని అంటారు, వారు మోసగిస్తుంచి మతాలు మారుస్తున్నారు అంటారు. అమ్మా పెట్టదు అడుక్కుతిననివ్వదన్నట్టు ప్రవర్తిస్తారు. ఈ మాత్రం దానికి హిందూ మతోద్దరణ అంటు పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం దేనికి?

    ఈ మాటలంటున్నది నాస్తికులు కాదు. బహుషా అయ్యవారు తమకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతీవాడినీ నాస్తికుడు అనేస్తున్నారు. దేవున్ని నమ్మడం అంటే, అయ్యవారు పైన పేర్కొన్న దరిద్ర నియమాన్ని పాటించడమేనేమో. ఏమి చిత్రమేమివిచిత్రం.

    రిప్లయితొలగించండి
  13. హైందుత్వం పై దాడి చేయాలంటే మొదట ముందువరసలోని అర్చకులపై దాడి చేయాలి. వాళ్ళు బలహీనులు, చాలా తక్కువ శాతం వుంటారు. మనమూ మేధావులం అనే గుర్తింపు రావడానికి ఇది షార్ట్‌కట్. మన మేధావిత్వానికి ఓ గుర్తింపు వచ్చాక, బ్రాహ్మల మీద దాడి చేయాలి, వాళ్ళూ <1% పెద్దగా వ్యతిరేకత వుండదు, చలామణి అయిపోవచ్చు. ఆతర్వాత % ప్రకారం వైశ్యులు, రాజులు, రెడ్డి, కమ్మ, కాపు ... ఇలా టార్గెట్ చేసుకోవాలి. ఈ టెక్నిక్కును వుపయోగించి తొలుత మహమ్మదీయులు 1/4 భాగం ప్రజని మతాంతీకరణ చేశారు. ఆ తరువాత క్రైస్తవులు కూడా ఈ పద్దతి ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించినా, కొందరు ఖాళీగా నోరున్న మేతావుల్ని ఇందుకు వినియోగించారు. న్యూట్రల్ అని పించేలా నాస్థిక ముసుగులు కూడా తొడిగి సిస్టమేటిక్‌గా మరిత పురోగతి సాధించారు.
    విజన్ 2050 ప్రణాలిక ప్రకారం ఈదేశాన్ని ఓ క్రైస్తవ దేశంగా అభివృద్ధి పథంలో నడిపించాలి.

    రిప్లయితొలగించండి
  14. శుచీ శుభ్రం లేని గల్లీల్లో ప్రచారం చేస్తే తప్పకుండా మారండి, ప్రచారాలకోసమే ఎదురుచూస్తున్నారు కదా. ఎవడెక్కువిస్తే ఆ మతాన్ని తీసుకుంటామని వేలం వేసుకోండి. టివిల్లో డింగ్! డింగ్!! అని ప్రచారాలూ కావాలా? మీలాంటి తుమ్మితే వూడే ముక్కులకు ఏమతమైతేనేమి? అక్కడన్నా నియమాలని పాటించండి, నిజమైన మనుషుల్లా బ్రతకండి. మీరున్నా వూడినా హైందవానికి వచ్చే నష్టం ఏమీ లేదు. తురకలుగా మారి జిహాదులో చావండి.

    రిప్లయితొలగించండి
  15. త్యాంక్యూ.. నీ మనసులో ఉన్న ద్వేషాన్ని వెల్లగక్కావ్. అవును, మేము ఉన్నా ఊదినా ఈ మతానికి వచ్చే నష్టమేమీ లేదు. అలానే మీరు ఉన్నా ఊడినా ఈ దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. మేల్కోండి బాగుపరచండి అంటూ పెద్ద పెద్ద రాతలు రాయక్కర్లేదు. కాబట్టి మూసుకుని కూర్చోండి.

    రిప్లయితొలగించండి
  16. తుమ్మితే ఊడిపోయే ముక్కులా భలే.. పుట్టుకను చూపించి మేము గొప్పవారం అని మిడిసిపడే వారికి అంతకంటే గొప్పగా ఏమి ఆలోచనలు వస్తాయి. ఇంత వివక్ష, ఇంత అసహ్యాన్ని భరించి కూడా ఇప్పటికీ హిందువులుగానే బతుకుతున్న అనేక మంది దళితులకి ఈ మాటలతో నిజంగానే కనువిప్పుకలగాలి. అందుకే నేమో అంబేద్కర్.. గౌరవం దక్కాలంటే దళితులకు మతం మారడం మినహా వేరే గత్యంతరం లేదని అభిప్రాయపడ్డాడు. తెలివైనోడు, నీలాంటి వాల్ల బుద్దేంటో తెలిసినోడు. చాలా మంది ఆయన మాటలు వినక ఇప్పటికీ నీలాంటి గొప్పవాల్లతో (పుట్టుకను బట్టి అలా అనుకునే నీలాంటి వాల్లు) మాటలు పడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  17. వీరి దృష్టిలో హిందూ మతోద్దరణ ఎలా తగలడిందయ్యా అంటే...

    1. బ్రాహ్మలు హిందూ మతాన్ని ఉద్దరించడములో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వారికి ఉన్నత స్థానాన్ని ఇవ్వాలి.

    2. హిందూ మతోద్దరణ అంటే కులాలను కుల వివక్షలను రూపుమాపడం కాదు. తిరిగి వాటిని బలపర్చడం. అలా అని నేను డైరెక్టుగా అన్ను. కాకపోతే ఇండైరెక్టుగా ఫలానా కులం కొంచెం ఎక్కువ గౌరవప్రదం అంటాను అంతే.

    3. దళితుల అలవాట్లు, వారి చేసే పనులు గౌరవప్రదమైనవి కావు. వారిని అలా తయారు చేసింది ఈ కులవ్యవస్తే అయినా సరే, వారిని మేము అసహ్యించుకుంటాం. వారి ఇల్లకు వెల్లం. వెలితే అంటురోగాలు వస్తాయి.

    4. దళితులు కూడా హిందూ మతములో ఉన్నవారే, కాకపోతే వారి స్థానములో వాల్లుండాలి. హిందూ మతాన్ని ఉద్దరించడములో వీరిని భాగస్వాములను చెయ్యడం కానీ, వారిలో కూడా హిందువులము అనే భావనను బలంగా నాటడం కానీ మేము చెయ్యం. అసలు అంటు రోగాలతో తిరిగే వారి వద్దకు మేమె వెల్లడమేమిటీ.

    2050 కల్లా హిందూ మతాన్ని ఉద్దరించేస్తాం. అద్బుతం, మహాద్బుతం... నువ్వు కానీ అన్నాయ్, నువ్వు కేక అంతే.

    రిప్లయితొలగించండి
  18. దళిత శ్రేష్టులారా మీ రోదనలు సమిసెడు రోజులు వచ్చును. పరిశుద్ధాత్ముని ద్వారా తప్ప వేరెవరి ద్వారా మీరు పరలోకమున తండ్రి వద్దకు తోడ్కొనబడలేరు. రండు, త్వరపడుడు. మా మతములో చేరుడు, మొదటి పక్షి డిస్కౌంటుగా 5వేల రొక్కమును పొందుడు. పాపాత్ములైన మీ పాపములను పరిశుద్ధాత్ముని పవిత్ర రక్తముతో కడిగి శుద్ధిచేసికొనుడు. పాపాత్ములకు అన్ని మతములకన్నా మిన్న మా మతమే అని మూర్ఖత్వమునువీడి గ్రహించుడీ. మీ వాడలందు పరిశుద్ధాత్ముడు పర్యటించును.

    రిప్లయితొలగించండి
  19. వారంతం గారు,

    మీరు వ్యాఖ్యలు ప్రచూరించటంలో గల ఉద్దేశం ఎమీటీ? ఈ వ్యాఖ్యలు ప్రచూరించి మీరు సాధించిదేమిటి? రాను రాను మీరు వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. కొంతమందిని బ్లాగులో ముద్ర వేసివదిలిపెట్టారు. మీరిలా చేస్తుంటే త్వరలో ఆ లిస్ట్ లో చేరే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. ఆతరువాత మీతో 365X24X7 చర్చించుకోవటానికి మార్థాండ గారు ఒక్కరే చిక్కుతారు.

    SrIRam

    రిప్లయితొలగించండి
  20. ఈ వుద్ధరించడం ఏమిటో, పర్యటించి ప్రచారం చేయాలడం ఏమిటో, ప్రచారం చేస్తే మతం మారేస్తాం అని డిమాండ్ చేయడం ఏమిటో.
    మతమన్నది స్వంత ఆధ్యాత్మిక నమ్మకం. ఎవరి నమ్మకాలు వారివి. దాన్ని అడ్డుపెట్టుకుని మారుతా మారుతా అని బ్లాక్మెయిలింగు చేసి బెదిరిస్తే బెదురుతారనుకునే దగుల్భాజీలది దివాళాకోరు మతము. మీ నమ్మకాలను గంప గుత్తగా వేలం వేసుకోండి, ఎవరు కాదన్నారు? నిజంగా మతమే ముఖ్యమైతే ఇలా పనికిమాలిన డిస్కషన్లు చేయకుండా మారి పోయేవారు, కాదా?

    స్వాములోళ్ళు పర్యటిస్తే మతంలో వుంటాము అని చెప్పడమే మీ బలహీనత. దృఢనమ్మకాలు వున్నవారు బాబాలు, ముల్లాలు, పాస్టర్లు, బిషప్‌లు చెప్పినా ఇలా చవగ్గా అమ్ముడుపోరు. మారాలనుకున్నోళ్ళు లాభసాటిగా వుంటే వెంటనే మారేయండి, పంకిమాలిన ప్రసంగాలు పోస్టులు దేనికి?

    :D

    రిప్లయితొలగించండి
  21. గాంధిగారిని పదే పదే విమర్శిస్తూ విసిగించిన, జీవించి నపుడు కంటే తరువాత పాపులర్ ఐన ఒక ప్రాంతీయ నాయకుడి సంగతి అందరికి తెలిసిందే. గాంధి గారి ఆచరణకి వీరికి నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడ ఉంది.అది అందరికి తెలుసు కనుకనే ఎవరు ఆయనని పెద్దగాపట్టిచుకోలేదు. ఎవరో ఎందుకు ఆయన వర్గం వారే ఆయన మాటలు పట్టించుకోలేదు. తన మొదటి భార్య చనిపొతే ,ఎప్పుడు తను విమర్శంచే వర్గానికి చెందిన ఆమేను రేండో పెళ్ళి చేసుకొని తన ఆచరణ లోని సిద్దాంతం లోని డొల్లతనం అందరికి చూపారు. ఆయన ఆరోజుల్లో ఎన్ని వాదనలు చేసినా ఆయన స్వంత ఊరిలో కీలక సమయంలో ఒకసారి ఎలెక్షన్స్ ఓడిపోయాడు.

    రిప్లయితొలగించండి
  22. కదా? హిందూ మతం కష్ట దశలో ఉందని శోకాలు పెట్టడం దేనికి? మతాన్ని ఉద్దరించేస్తున్నాం అంటు పేద్ద ఫోజులు కొట్టడం దేనికి? జరిగేది హిందూ మత ఉద్దరనా లేక తమ ఉదర పోషణా?

    అయ్యవారు మా వాడలకు వస్తేనే ఇనతవరకూ హిందూ మతములో ఉన్నామా? లేదుగదా. ఇప్పుడైనా అంతే. అసలు నిజమైన హిందువు ఎవడన్నా ఉన్నాడు అంటే, ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా ఇంకా హిందువుగానే ఉన్న దళితుడే. కాబట్టి, మతమంటే ఏమిటో, దానిపై విశ్వాశమంటే ఏమిటో ఒకరు చెబితే తెలుసుకోవాల్సిన దీనస్థితి దళితుడికి లేదు.

    అయ్యవార్లను మా వాడలకు రమ్మంది, వారు చెప్పుకునే మతోద్దరణలో వారి చిత్తశుద్ది ఎంతో తెలుసుకోవడానికి అంతే. మాకు ఎవ్వరి ప్రీచింగులు అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  23. గాంధీ ఏమన్నా దేవుడా బాబూ, గాంధీని విమర్శించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంది. అది సద్విమర్శ అయినతవరకూ. మరి గాంధీని విమర్శించినత మాత్రాన అంబేద్కరు చెడ్డవాడెలా అవుతాడు. ఇక అంబేద్కరు ఎన్నికలలో ఓడిపోవడం అటుంచు, గాంధీ గారిని ఒక హిందువే కాల్చి చంపాడు దానికేమంటావు ?

    రిప్లయితొలగించండి
  24. @ 25 మే 2011 9:28 ఉ, అజ్ఞాత

    రండి బాబూ రండి హిందూ మతాన్ని ఉద్దరించండి.. మేము గొప్పవాల్లం అని ఫీలయ్యే వాల్లను ప్రోత్సహించి మళ్ళీ హిందూ మతాన్ని ఉద్దరించండి. మాకు వేలు వేలుదక్షినలిచ్చి హిందు మతాన్ని ఉద్దరించండి. మాకు పెళ్ళిచేసుకోవడానికి పిల్లనించ్చి హిందూ మతాన్ని ఉద్దరించండి. మమ్మల్ని గొప్పవారు అని గౌరవించి హిందూ మతాన్ని ఉద్దరించండి. ఆలసించిన ఆశా భంగము.

    రిప్లయితొలగించండి
  25. జాగ్రత్త బాబులు,ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీ మీద కమ్యునిస్టులు,దేశ ద్రోహులు,చైనా ఏజంట్లు అని ముద్ర వేసి మీతో బ్లాగుల్లో పోరాడి హైందవ మతాన్ని,దానితో పాటే భారత దేశాన్ని కూడా కాపాడుతారు ఈ హిందూ మతోద్ధారకులు.
    ప్రస్తుతానికి నార్త్ అమెరికా సంక నాకుతూ,ఆ దేశ పౌరసత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మీ గిల్లుడేంది? అయినా దళిత వాడలకి రావడానికి మా సాములోరికి ఏమి ఖర్మ పట్టింది? మేము కాపాడే/సృష్టించిన మా మతాల జనాలా పరిస్థుతులు ఎలా ఉంటె మాకేంటి.మేము పుట్టుకతోనే గొప్పవారం అంతే.నిప్పులు కడిగే వంశాలు మావి(ప్రస్తుతం పరిశుద్దాత్ములయిన కిరస్తానీ అమెరికోడి సెప్పులు నాకుతున్నాము).తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసింది అంట.తర తరాలుగా దళితులని దూషించిన వాళ్లకి ఇంతకన్నా మంచి మాటలు ఎలా వస్తాయిలే.

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞాత 25 మే 2011 10:50 ఉ
    అట్లాగా! ఎళ్ళెళహే నీ ఎంకమ్మా, ఏదో తెలుసుకున్నాడంట. అంబేత్కర్ అవార్డ్ ఇస్తాములే, బౌద్ధమతం తీసుకో. అర్ ర్ ర్ ర్ ర్ర్.. వద్దులే ఆడ పంది,గొడ్డు తింటే బాగోదు. ఇస్లాంలో వద్దులే ఆళ్ళ రోజులు బాగోలేవు. అమెరికావోడు డ్రోన్లతో తరిమి తరిమి కొడతాడు. కె.జె.పాల్‌కి ఫోన్ కొట్టు, హార్డ్ క్యాసుతో వాలిపోతాడు. అసలే నమ్మకాల రేట్లు ఈమధ్య బాగా పెరిగిపోయినయ్, తక్కువరేటుకు అమ్ముడుపోయేవ్, చూస్కో. రేటు ముందుగల్ల నాలుగుచోట్ల విచారించి మంచిగ మాట్లాడుకో. జర భద్రం కొడుకో, కొమ్మన్న జర పైలం కొడుకో :))
    మా హిందువుల్ని ఈదేశంలో మైనారిటీ చేసి, రిజర్వేషన్లు ఇప్పించి పుణ్యం కట్టుకోండి. నీ ఆధ్యాత్మిక నమ్మకం రేట్లు 100ఏళ్ళు పెరుగుతూనే వుండాల అని దేవునికి ముక్కుకుంటాం.

    రిప్లయితొలగించండి
  27. @అజ్ఞాత 25 మే 2011 11:52 ఉ,

    సలహాకు త్యాంక్సు తంబీ, ఇచ్చేందుకు ఫ్రీగా నువ్వున్నా తీసుకునేంత దీన స్థితిలో మేము లేముగానీ, దలితులంతా పంది మాంసము గొడ్డుమాంసమూ తింటూ బతుకుతారనే నీ సెత్త బుర్రుంది సూశావ్.. దాన్ని ఏదన్నా మురిక్కాల్వలో పడెయ్. ఒక వేల తిన్నారే అనుకో వారిష్టం నీ ఏడుపేంది. ఏం నీకు పెట్టడం లేదనా? ఓరి ఓరి నీ పాసుగాల ఆ ముక్క ముందే సెప్పకపోయావ్.. తినే వరికి సెప్పి నీకూ ఓ రెండు ముక్కలు పార్సిలు సేపిచ్చే వాల్లం గదా..!!

    రిప్లయితొలగించండి
  28. నేను ఉదహరించిన తాడేపల్లి గారి టపా నాకు నచ్చలేదు. కానీ చర్చించవలసిన విషయంగానే అనిపించింది. కానీ ఆ బ్లాగులో చర్చ ఏమీ జరగలేదు.

    ఫేస్ బుక్ లో చర్చ జరిగిన విధానం నాకు నచ్చింది. అందుకే ఇక్కడ ఈ టపా పెట్టాను మంచి చర్చ జరిగి ఆలోచనల్లో స్పష్టత వస్తుందేమో అని.

    -వీకెండ్ పొలిటీషియన్/-

    రిప్లయితొలగించండి
  29. SrIRam గారు,

    >>మీరు వ్యాఖ్యలు ప్రచూరించటంలో గల ఉద్దేశం ఎమీటీ?

    పై వ్యాఖ్యలో చెప్పాను చూడండి.

    >>ఈ వ్యాఖ్యలు ప్రచూరించి మీరు సాధించిదేమిటి?

    ఏమి సాధిద్దామని అందరూ బ్లాగులు రాస్తున్నారు? ఏదో మనకి అనిపించినవి మన బ్లాగుల్లో రాస్తాం. అంతే కదా !

    >>రాను రాను మీరు వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. కొంతమందిని బ్లాగులో ముద్ర వేసివదిలిపెట్టారు. మీరిలా చేస్తుంటే త్వరలో ఆ లిస్ట్ లో చేరే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది.

    మీ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. నేను రాసిన దాంట్లో మీ అభ్యంతరాలు ఏంటో చెప్పుంటే కొంచెం బావుండేది. కానీ మీరు ఇలా అకారణమైన వ్యక్తిగత దాడి చేశారు కాబట్టి నేను చెప్పేదేంటంటే..

    "మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి."

    అర్థమైందనుకుంటాను :D

    -వీకెండ్ పొలిటీషియన్/-

    రిప్లయితొలగించండి
  30. After seeing some of the comments above, I think it is required to republish one of the comments from my post above. here it is..

    అప్పటి వ్యవస్థలో లోపాలకీ, మంచికీ మనం కేవలం వారసులమేకానీ బాధ్యులం కాదు. అప్పటి వ్యవస్థలోని విభజనకి ప్రతినిధులుగా మనం ఆలోచించడం మానుకుంటే మార్పులూ, పరిష్కారాలు అవే వస్తాయి. దురదృష్టవశాత్తూ, అప్పటి వ్యవస్థకీ దాంట్లోని విభజనలకీ ప్రాతినిధ్యం వహించకుండా అలోచించేవాళ్ళు సరిపోయినంత మంది ప్రస్తుతానికి లేరు. That is where we need to start :)

    -వీకెండ్ పొలిటీషియన్/-

    రిప్లయితొలగించండి
  31. అజ్ఞాత 25 మే 2011 11:52 ఉ
    నువ్ మంత మక్కువబడి తింటే తినేయ్, నీకన్నా నాకు పందేం అంత ముఖ్యం కాదు. కాని బౌద్ధంలోకి పోయి నానా కన్న కష్మాళము తినొద్దు అని వేడుకున్నా అన్నా అంతనే. వూకే మామీద పడి పడి ఏలేడుస్తవ్, మతం మారిపోరాదూ. వినీ వినీ విసుగొచ్చింది. దళితులు అని ఏడుస్తూనే స్పెక్ట్రం రాజా, కనిమోళి, కరుణానిధి 39బిలియన్లు దొబ్బితిన్నారు. మీ మాయావతి తన అందమైన దుష్టిబొమ్మలు బతికుండగానే పాతించుకుంది. సర్లే అవన్నీ ఏల నీకు మీ అధికార ప్రతినిధికి అద్వానీతో క్షమాపణ చెప్పిస్తాం, మతం మారి నా తరపున, మీ ఇంట్లోవాళ్ళకి నోరుతిరగని పేరెట్టేసుకో జాన్ డోర్జవిక్ సెబాస్టియన్ డిసౌజా అని. ఓరే జాడోరిగా అని ముద్దుగా పిలుచుకుంటారు హి హి హి

    రిప్లయితొలగించండి
  32. @వీకెండ్,

    నాకూ అది చాలా బాగా నచ్చింది. పూర్వీకులేదో చేశారని మనం ఇప్పుడున్న వారిని దూశించడం సరికాదు. అలానే, పూర్వీకులేదో చేశారని ఇప్పుడు మేము గొప్పవారము అనడం కూడా సరికాదు. నేను చెప్పాలనుకున్నది ఒకటే.
    ==============================================

    బ్రాహ్మనునికి ఉన్నత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అంటే మల్లీ కుల వ్యవస్థను పటిష్ట పరుద్దామనా?

    వర్ణవ్యవస్థ కేవలం సమాజ శ్రేయస్సుకోసం ఏర్పడింది అంటారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని మన ధర్మాలలో ఎక్కడా చెప్పలేదని అంటారు. అదే నోటితో మేము గొప్పపనులు చేస్తున్నాము అంటారు. అంటే వర్ణవ్యవస్తే దళితుని దుస్తికి కారణం అన్నప్పుడు మాత్రం వర్ణ వ్యవస్థ అలాంటిది కాదు అని, దాన్ని వెనుకేసుకు రావడానికి... ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని ఎక్కడా చెప్పలేదు అంటారు. మామూలుగా మాట్లాడుకునేప్పుడేమో, మేమే అన్నింటినీ పరిరక్షించాము మేము గొప్పవారము అంటారు.

    బ్రాహ్మనులు ఇప్పటివరకూ చేసినదంతా వారు తప్పక చేయవలసినది. ఎందుకంటే వర్ణవ్యవస్థలో వారు దానికే నియమితులయ్యారు కాబట్టి. వారిలానే క్షత్రియులు రాజ్యాన్ని కాపాడారు, వైశ్యులు వ్యాపారాన్ని రక్షించారు, శూద్రులు మిగ్లిలిన పనులనూ వ్యవసాయాన్ని రక్షించారు. అందరికన్నా హీనంగా దళితులు మిగిలిన అన్ని పనులూ చేశారు. వర్ణవ్యవస్థ అంత నీతిమంతమైనదే అయితే అందరికీ సమాజములో అద్బుతమైన గౌరవము ఉండాలి, ఎవరి పని వారు చేసినందుకు. మరి ఈ Hierarchy హటాత్తుగా ఎక్కడినుండి ఊడిపడింది. ఒకరు పూజ్యులు మరొకరు అంటరాని వారు ఎలా అయ్యారు. అసహ్యించుకోదగ్గ వారు ఎలా అయ్యారు?

    ఒక పనిని కేవలం వీరే చేయాలని అని పెట్టిన నియమాన్ని మరిచి, మేము తప్ప ఈ సేవ చేసిన వాల్లెవరూ లేరు కాబట్టి మేము గొప్ప అనడం హాస్యాస్పదం

    రిప్లయితొలగించండి
  33. వీకెండ్ గారు,
    మీకు నచ్చకపొతే గమ్ముగా ఉండండి. అర్థం కాక పోతే కొంపలేమి మునగవు. తాడేపల్లి గారు బ్లాగులో రాస్తున్నారని మీకు కొంచెం తక్కువ భావం ఉన్నట్టుంది. బ్లాగు లోకంలో ఆయనకు ఉన్న నాలేడ్జ్, ప్రతి అంశమ్మీదా స్పష్ట్టమైన,సంగ్రమైన అవగాహన నాకు తెలిసి ఎవరికి లేదు. అదేకాకా ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆపకుండా రాస్తున్నాడు. అది అతని కమీట్మేంట్. దానిని చూసి కొంతమందికి అసూయలు ఉండటం సహజం. ఇంతక్రితం ఎన్నొ చర్చలు జరిగాయి. కొన్ని బుర్రలకు యెంతో ఒపికతో అర్థమయ్యేట్టు చెప్పినా అర్థంకాలేదు. అటువంటి వారికి ఎప్పటికి అర్థం కాదు కూడాను. ఆతరువాత చాలామందికి వారిలాంటి వారి గురించి అర్థమయ్యింది ఎమీటంటే నరసింహ సినేమాలో నీలాంబరి లాంటి స్వభావం అని. ఆసమయం లో వ్యాఖ్యలను ప్రచూరించే ఆప్షన్ తీసేశారు. ఆయన లాంటివారు కొన్నిసంవత్సారాల పరిశీలన,అవగాహన తో రాసిన వ్యాసం ఐదు నిముషాలలో చదివితే కొన్ని మొద్దు బుర్రలకు అర్థం కాదు. మీకు అర్థం అయ్యేటట్టు చెప్పటానికి ఇక్కడ ఎవరు కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. ఆ అవసరం కూడా లేదు. అర్థమైన కొంతమందికి చాలు.
    ------------------------------------------
    *బ్రాహ్మణులు తాము థియరైజ్ చేసి సామాజిక మూసకు తామే బలయ్యారు...*

    కొంతమంది పగటి కలలు కంట్టుటారు. పుస్తకాలు రాసుకొంట్టుటారు. రాసిన పుస్తకాలు చాలామంది చదివారు కనుక ప్రజలలో చాలా అవెర్నేస్ పెరిగిందని ఊహిస్తూ భంగ పడుతూంటారు. అటువంటి వారే ఇలా థియరైజ్ చేసి సామాజిక మూసకు తామే బలయ్యారు లాంటివి రాసుకొని సంతోషపడుతూంటారు. వారి ఆలోచన విధానం వీరిలాంటి వారికి ఊహకందనిది. అందుకనే అర్థం చేసుకోలెక గందరగోళానికి గురీయిపోతారు. మొన్నటివరకు రాజకీయాలలో పని ఐపోయిందని అనుకొన్నపుడు ఒక సుబ్రమన్య స్వామి లాంటి వాడు ఒక్కడిగా ఉన్నా దేశానికి ఎంత సేవ/మేలు చేయవచ్చొ చేసి చూపుతున్నాడు.
    బాబయ్యా మేము బతికినా, పోయినా లేక భూమీద నుంచి మాయమై పోయినా మా ప్రభావం భారత దేశం ఉన్నని రోజులు ఎదో ఒకరూపం లో కొనసాగుతుంది. మంచి కవులు వారి రచనల ద్వార ప్రజల నాలుకల మీద ఎలా నిలచిపోతారో అలానిలచి పోతాం.మాకేమి మాయమైపోతున్నామని భయమో లేక బాధో ఎమీ లేదు.

    కావాలంటే తమరు అభిమానించే దర్శకుల లిస్ట్ చూసుకోండి.Gurudat, శ్యాం బెనగల్.... విషాల్ భరద్వాజ్,అనురాజ్ కశ్యప్ వరకు అదిక భాగం వారి వర్గం వారే మీ అభిమాన దర్శకులు.

    రిప్లయితొలగించండి
  34. @అజ్ఞాత 25 మే 2011 1:07 సా,

    యే మొమాటపడకు. చికెనీలు తిని బొక్కలు గోడ బొక్కల్లో తోసుడు, కోడిగుడ్లు తిని పెంకులు ఇంటిపెంటుల్లో దాసుడు ఎందుకు.. ధైర్యంగా తిను. పార్సిలు పంపిస్తా. నాక్కూడా నీకంటే వెధవ పంది మంసము ముక్కలు ఎక్కువా? బౌద్దమతములోకి వెల్లడం కుదరదులే ఎందుకంటే, దళితులకి కావల్సింది కేవలం మతం మాత్రమే కాదు, దాడి జరిగితే తమని రక్షించే బలం కలిగిన వర్గం కాబట్టీ దానికి సరైందే ఎన్నుకుంటారు, కాబట్టి నువ్వు మరీ శ్రమపడిపోమాక.

    ఇక మా పేర్లు నోరుతిరగలేదంటున్నావ్. తిరగదులే ఎందుకంటే, దొంగ చాటుగా తిన్న్ చికినీలు, మటనీలు నాలికను మొద్దు బారేలా చేసుంటాయి. కాస్త కష్టమే. అయినా ట్రై చేయి, ప్రాక్టీసు మేకు మెన్ పర్ఫెక్టూ.. ట్రై చెయ్.

    రిప్లయితొలగించండి
  35. *"మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి."*
    నేనేమి ప్రత్యేకం గా పని గట్టుకొని చేయవలసిన అవసరం లేదు. మెల్లగా జనాలకే అర్థమౌతుంది. నాకు మొదటనే అర్థమైంది మిగతావారికి త్వరలో అర్థమౌతుంది.

    SrIRam

    రిప్లయితొలగించండి
  36. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. ఇక్కడ కొంత మంది అజ్ఞాతల మాటలు వింటుంటే ఇంకా హిందూ మతమే మాది అని చెప్పుకునే దళితుల కళ్ళు తెరచుకుంటాయి.పంది మాంసం,గొడ్డు మాంసం దళితులేంది,చాలా కులాలు తింటారు.
    ఈ బ్రాహ్మణ కుల గజ్జి అజ్ఞాత మాటలకి దళితులు ఏందీ,మిగతా చాలా కులాలనుండి ఇంకా మతాంతీకరణలు పెరగటం ఖాయం.ఏమి బావుకున్నారో ఏందో ఈ మదపు మాటలతో.

    రిప్లయితొలగించండి
  38. మాది బి.సి అండి. నేను మాంసం తినడం 10ఏళ్ళక్రితం వదిలేశానండి. ఆ అజ్ఞాత బాగా చెప్పారండి, నేనేకీభవిచేశానండి. మీ కంపు మీకింపు కాని స్వాములని మీదగ్గరికి రమ్మనడం లేదంటే మతం మారుతా అని ఎవర్ని బెదిరిస్తున్నారండి? తమరు మతం మారితే ఏ మతమూ నష్టపోవడమూ, లాభపడటమూ జరగదండి. మీకే అంత విలువే వుంటే ఇలా బ్లాక్మెయిలింగు చేసి అడుక్కుంటారేటండి?

    రిప్లయితొలగించండి
  39. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  40. @అజ్ఞాత 25 మే 2011 7:40 సా,

    అంతేలెండి ఎవడి కంపు వాడికి ఇంపే. మీకంపు మీకు ఎలానో మిగిలిన వారికీ అలానే. అయ్యవారూ ముందు మిగిలిన అఙ్ఞాతల కామెంట్లు కూడా చదివి ఆ తరువాత కామెంటడం అలవాటు చేసుకోండి. ఇక్కడ వారు రాకపోతే కొంపలు మునిగిపోతాయనో లేకపోతే మా జీవితాల్లో వెలుగురాదనో ఎవ్వరూ ప్రాదేయపడట్లేదండి. కాకపోతే, తామేదో హిందూ మతోద్దారకులమనీ తమకు ఉన్నత స్థానమివ్వాలని చెప్పేవారికి... హిందూ మతముపై దానిలోని జనాలపై ఉన్న ప్రేమనూ అభిమానాన్నీ కొంచెం అందరికీ తెలియజేసే ప్రయత్నమేలెండి అది. తమకు మరోలా అర్థమయితే.. నవ్వుకోని వదిలేయడం మాకలవాటే.

    మేము మతము మారాలనుకునేది ఎవర్నో బెదిరిద్దామని కాదండీ, మమ్మల్ని గౌరవించని చోట మేము ఉండకూడదు అనే భావణతోనే. అది తమకు అడుక్కోవడంలా, బెదిరించడములా కనిపిస్తే ఏమిచేస్తాం చెప్పండి. తమరి అవగాహనా రాహిత్యాన్ని చూసి మరోసారి నవ్వుకుంటాం.

    రిప్లయితొలగించండి
  41. Guys, please do not abuse each other. I will come back and review all the comments and remove some of the meaningless and abusive ones as soon as I can.

    రిప్లయితొలగించండి
  42. @వీకెండ్ గారు: అసలు తాడేపల్లి గారి పోస్ట్ లో దళితుల ప్రస్తావన కూడా లేదే. చర్చ దళితుల చుట్టూ ఎందుకు తిరుగుతూంది? మహమ్మదీయులు ముల్లాల గురించి, కిరస్తానీలు ఫాదర్ల గురించి మాట్లాడుతుంటే లేని గగుర్పాటు బ్రాహ్మణుల గురించి మాట్లాడితే ఎందుకు? అసలాయన బ్లాగులో టపా శీర్షిక సరిగ్గా గమనించారా?

    రిప్లయితొలగించండి
  43. రవి గారు,

    చాలా మంచి ప్రశ్నలు అడిగారు.

    >>అసలు తాడేపల్లి గారి పోస్ట్ లో దళితుల ప్రస్తావన కూడా లేదే. చర్చ దళితుల చుట్టూ ఎందుకు తిరుగుతూంది?

    అదే నాకూ అర్థం కాలేదు. ఫేస్ బుక్ లో చర్చ కూడా ఇలానే అయ్యింది. కాకపోతే, అక్కడ వాళ్ళు చర్చించిన విధానం, విభేదించడం, అవసరమైనప్పుడు అంగీకరించడం నచ్చాయి.

    >>మహమ్మదీయులు ముల్లాల గురించి, కిరస్తానీలు ఫాదర్ల గురించి మాట్లాడుతుంటే లేని గగుర్పాటు బ్రాహ్మణుల గురించి మాట్లాడితే ఎందుకు? అసలాయన బ్లాగులో టపా శీర్షిక సరిగ్గా గమనించారా?

    ఇది అర్థం కాలేదు. కొంచెం వివరించగలరా..

    రిప్లయితొలగించండి
  44. పైనెవరో ఒకాయన అంటరాని తనానికి, సంఘ బహిష్కారానికి ఒక గొప్ప నిర్వచనాన్ని ఇచ్చి, వారిని రానిస్తే అంటు రోగాలు వస్తాయి అని చెప్పడం వలన వచ్చింది. ఇంత దారుణంగా ఒక వర్గాన్ని చూసి దానికి సమాజ శ్రేయస్సే కారణం అన్న తరువాత, కోపగించుకోని దళితుడు ఎవ్వరైనా ఉంటే వాడు చీమూ నెత్తురూ లేని మనిషన్నా అయ్యుండాలి, చచ్చిన శవమన్నా అయ్యుండాలి.

    జరిగిన ఘోరాన్ని ఘోరమని ఒప్పుకుని వుంటే ఒక్కమాటతో పోయేది. అలా కాక, మేమేదో గొప్పవారం, వారు అంటురోగాలతో తిరిగే వారు అంటూ మాట్లాడడం, మరో అఙ్ఞాత అవును నిజమే అంటు దానికి వత్తాసు పలకడం. ఇవి చాలదాండి, దళితుడన్న వాడు తిరగబడడానికి.

    రిప్లయితొలగించండి
  45. అజ్ఞాత,

    మీరు మరీనండి. తాడేపల్లి వీరాభిమానులకి తెలియకా ఏంది? అన్నీ తెలిసే అడుగుతారు. వాళ్ళకదో తుత్తి అంతే :)

    రిప్లయితొలగించండి
  46. కిరస్తానీయులలో,మహమ్మదీయులలో పుట్టుకతోనే వచ్చే వర్గాలేవీ లేవు. ఒకడు ఏసునునమ్మి కిరస్తానీయుడైన తర్వాత బైబిలుమీద అతని అవగాహనను బట్టి, ఎవరైనా వాటికన్ చర్చికి పాదరీగా వెల్లొచ్చు. అట్లే మహమ్మదీయుల్లో కూడా.. ఖురాను మీద అవగాహనను బట్టి ఎవరైనా ముల్లా గా మారిపోవచ్చు. ఈ ప్రాధమిక వ్యత్యాసాన్ని పట్టించుకోకుండా, హిందూ మతాన్ని వీటితో కంపేర్ చేయడం అర్థరహితం.

    రిప్లయితొలగించండి
  47. >> చర్చ దళితుల చుట్టూ ఎందుకు తిరుగుతూంది?

    హిందువుల గురించీ, బ్రాహ్మణుల గురించీ జరగాల్సిన చర్చ క్రైస్తవులూ, ముసల్మానుల మీదికి మళ్ళించబడుతుంది అనే విషయం కూడా కనిపించుంటే మహాద్భుతంగా ఉండేది :P

    రిప్లయితొలగించండి
  48. మగురువుల గురించి ప్రస్తావన లేకుండా అసలు మతం అనేదేమైనా ఉంటుందా అని ప్రశ్న. వ్యవస్తీకృత మతం చెడ్డది, మతంలో లోపాలు ,బ్రాహ్మణులు ఏదో కాలంలో ఎవరినో తొక్కారు లాంటి ఐడియల్ పోరాటాలు అవన్నీ పక్కనెట్టండి కాసేపు. మతగురువుల ఒకప్పటి వైభవం తొలగిపోయి, వారి పరిస్థితి దయనీయమైంది అని తాడేపల్లి గారంటే అందులో చర్చించవలసింది, విమర్శించవలసింది ఏముందని?

    రిప్లయితొలగించండి
  49. వీకెండ్ రాసిన మొదటి నాలుగు లైన్లు చదివితే తెలుస్తుంది.

    <<"హిందువులు మేల్కోవాలి అనే టపా ఒకటి చూశాను. అర్చక, పౌరోహిత వృత్తులలో మనుషుల కొరత ఉంది దాన్ని ఎలాగోలా సరిచెయ్యాలి అనే అసలు విషయం తప్ప మిగతా టపా అంతా చాలా అసందర్భంగానూ, అర్థరహితంగానూ అనిపించింది. అదే విషయం ఆ టపాలో వ్యాఖ్యానిస్తే బ్లాగు రచయిత నా వ్యాఖ్యని ప్రచురించలేదు.">>

    రిప్లయితొలగించండి
  50. అసలు సమస్య మేము బాధలలో ఉన్నము అంటేకాదు, అత్యంత లోపబూయిష్టమైన వ్యవస్థని వెనుకేసుకు రావడముతోనే ఉంది.

    రిప్లయితొలగించండి
  51. స్వాములని మీదగ్గరికి రమ్మనడం లేదంటే మతం మారుతా అని ఎవర్ని బెదిరిస్తున్నారండి?
    ------------------------------------------------------------------------------------------------------------------
    మేము బెదిరించడం లేదు అండి.ఆ స్వాములోరు మా వాడలకి వస్తే వాళ్లకి ప్రత్యక్షంగా తెలుస్తుంది వాళ్ళు సమజా శ్రేయస్సుకోసం సృష్టించిన వర్ణ వ్యవస్థ ఎలా ఉందొ అని.
    వాళ్లు వస్తే మాకేదో గౌరవం పెరిగిద్ది అనికాదు అండి.గౌరవం అనేది మన ప్రవర్తన ద్వారా వస్తుంది అండి,పుట్టుకతో గాదు.ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు,తన ప్రవర్తనలో ఏదో లోపం ఉన్నవాళ్ళు మాత్రమె పుట్టుకతో గొప్పవారం అనుకుంటారండి.
    ఇది మీకు ఈ జన్మకి అర్ధం కాదులెండి.

    తమరు మతం మారితే ఏ మతమూ నష్టపోవడమూ, లాభపడటమూ జరగదండి.
    -------------------------------------------------------------------------------------------------------
    తమరు కూడా ఏ మతము మారక పోయిన హిందూ మతం కి కూడా లాభ నష్టం ఏమి ఉండదు అండి

    మాది బి.సి అండి. నేను మాంసం తినడం 10ఏళ్ళక్రితం వదిలేశానండి.
    ----------------------------------------------------------------------------------------------------
    ఆహా మీ మత నిష్ట, దేశ సేవ కు ఫోటో frame కట్టాలండి. అయిన మాంసం తింటే హిందువు కాదా అండి?

    రిప్లయితొలగించండి
  52. వీకెండ్ గారు,

    మీ అసలు పేరేమిటి? ఎమి చదువుకున్నారు? మీరు బ్రహ్మణులా లేక దళితుల వర్గానికి చెందిన వారా? ఈ అనవసరపు చర్చ /పరస్పర దూషణ వలన మీరు బావుకొనిదేమిటో వివరించండి. మీలాంటి మందమతులకు బ్లాగు రాయటం అవసరమా?

    Srinivas

    రిప్లయితొలగించండి
  53. woo.. what a discussion.. u guys r proving yourself again n again, Mr WP i didn't expected such a nonsense from you-Raghav

    రిప్లయితొలగించండి
  54. ఎమి చదువుకున్నారు? మీరు బ్రహ్మణులా లేక దళితుల వర్గానికి చెందిన వారా?
    idi antha avasarama ?

    ఈ అనవసరపు చర్చ /పరస్పర దూషణ వలన మీరు బావుకొనిదేమిటో వివరించండి
    Did WP indulge in పరస్పర దూషణ ?

    మీలాంటి మందమతులకు బ్లాగు రాయటం అవసరమా?
    Seen ga(ru) n(m)eeku ee comment avsaramaa. Do u have any IQ test certificates ?
    neekantha unte ....u wld not have asked the stupid query మీ అసలు పేరేమిటి?

    రిప్లయితొలగించండి
  55. Srinivas గారు,

    >>మీ అసలు పేరేమిటి? ఎమి చదువుకున్నారు?

    నా పేరు, చదువుతో మీకేమి అవసరం? నా పేరూ, నేనెవరో ఈ బ్లాగుల్లో చాలా మందికి తెలుసు. మీరు ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నారు? నా పేరు, నా చదువుని బట్టి మీ అభిప్రాయాలు మారతాయా?

    >>మీరు బ్రహ్మణులా లేక దళితుల వర్గానికి చెందిన వారా?

    ఇటువంటి అసందర్భమైన ప్రశ్న ఎందుకు? సిగ్గుండాలి ఒక మనిషిని ఈ ప్రశ్నలడగడానికి. నేనే వర్గానికి చెందినవాడినైతే మీకెందుకు?
    మీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం ఇంతగా బ్రష్టు పట్టింది.

    >>ఈ అనవసరపు చర్చ /పరస్పర దూషణ వలన మీరు బావుకొనిదేమిటో వివరించండి.

    పరస్పర దూషణ అనవసరం అనే దాంట్లో నేను మీతొ అంగీకరిస్తాను. కాకపోతే ఇప్పుడు బ్లాగుల్లో జరిగే దూషణలతో పోలిస్తే ఇక్కడ జరిగిన దూషణలు ఒక రకంగా లిమిట్స్ లోనే ఉన్నాయి.

    >> మీలాంటి మందమతులకు బ్లాగు రాయటం అవసరమా?

    నువ్వెవడివిరా గొట్టాం గాడివి నన్ను మందమతి అనడానికి? Idiots and people who go by caste like you have no place in my blog.. get lost you scum bag..

    రిప్లయితొలగించండి
  56. Mr. Raghav,

    >> Mr WP i didn't expected such a nonsense from you

    what is the nonsense I wrote? and what is the nonsense I allowed in my blog that is not happening in the blogworld?

    If you are unhappy with the level of discussion in this post... my sympathy and empathy is with you. But the comments in this post are far better than the average of our telugu blogworld. What is it that particularly upset you? let me know so that I can address that.

    OR

    Are you upset with only one side of the comments?

    రిప్లయితొలగించండి
  57. ఓరీ అజ్ఞా(ని)త,
    నేను అడిగింది వీకేండ్ ని, నువ్వు ఎవడివి మధ్యలో కలుగ జేసుకోవటానికి. హవ్వ! ప్రపంచంలో ఎవరైనా ముక్కు మొకం తెలియని అజ్ఞా(ని)త (కి) ఐ.క్యు.టెస్త్ సర్టిఫికేట్ విషయాలు చెపుతారా? అసలికి ఇది ఒక బుద్ది/జ్ఞానం ఉండేవాడు అడగవలసిన ప్రశ్నా?
    బ్లాగులో చెత్త చర్చ జరుగుతూంటే, కామేంట్లు మాలిక వ్యాఖ్యల భాగంలో నిండిపోతుంటే కనీసం తన బ్లాగులో ఎమి జరుగుతున్నాదో చూసుకోవటం కూడాలేదు.

    Srinivas

    రిప్లయితొలగించండి
  58. Srinivas గారు,

    >> కామేంట్లు మాలిక వ్యాఖ్యల భాగంలో నిండిపోతుంటే

    ఆ విషయం మాలిక వాళ్ళు చూసుకుంటారు. మీరెందుకు అంత హైరానా పడుతున్నారు? You just chillout buddy. I was a bit busy to watchout on the blog in the biginning. Once it started, it is tough for anyone to stop in the middle. But still I am taking out stuff that are abusive and offensive.

    Let me know if there is any thing that is particularlt offensive to you.

    రిప్లయితొలగించండి
  59. మీగురించి చెప్పుకోవటానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు తెలియదు.

    *సిగ్గుండాలి ఒక మనిషిని ఈ ప్రశ్నలడగడానికి. నేనే వర్గానికి చెందినవాడినైతే మీకెందుకు? మీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం ఇంతగా బ్రష్టు పట్టింది.*
    నాలంటి వాళ్ళ వలన సమాజం బ్రష్టు పట్టిందని ఎలా చెప్పగలరు. మీరు సమాజాన్ని బాగు చేశారనో/చేయబోతున్నారనో/చేయగలరనో ఎలా అనుకోగలరు? దాదాపు రెండు రోజులనుంచి ఇక్కడ అజ్ఞాతల రూపంలో పరస్పరం తిట్టుకొంట్టూంటే దాని ప్రభావం ఎంత మందిమీద పడిందో నువ్వు ఊహించేలేక పోవచ్చు. నువ్వు సమాజాన్ని బాగు చేయటం సంగతి తరువాత విషయం చదివిన వ్యాఖ్యలు చదివిన వారికి కలిగిన ఫిలింగ్స్ కి ఎమాత్రం నువ్వు జవాబుదారి తనం వహించకుండా మాలిక వాళ్ళు చూసుకొంటారు అని రాస్తున్నారు. మీలాంటి వారు ఎలాగు గొప్ప మేధావులనే బ్రమ లొ ఉంటారు. కనుక మందమతి అనే పదం వినేసరికి అహంకారం దెబ్బతిని నువ్వెవడివిరా గొట్టాం గాడివి నన్ను మందమతి అనడానికి? అని నోరు పారేసుకొని అసలు రూపాన్ని బయట పేట్టారు. నాలంటి వారు ఎలాగూ సమాజాని బ్రష్టు పట్టిస్తున్నారని అంట్టున్నారు కదా, సమాజాని ఉద్దరించాల అనుకొనేమీలాంటి వారికి మొదట ఉండావలసినది ఓపికా,సహనం,శాంతం మరియు ప్రేమాలాంటి మొద|| గుణాలు. దానిని గురించి తెలుసుకోవటానికి మరిన్ని వివరాలకు రుద్రవీణ సినేమాలో హీరో పాత్రని చూడండి. బ్లాగులో జరిగే ఇటువంటి చర్చలవలన సమజం బాగు ఎంతపడుతుందో తెలియదుగాని అనవసరమైన అపార్థాలు బాగా పెరుగుతాయి.

    Good bye
    Srinivas

    రిప్లయితొలగించండి
  60. గౌరవం అనేది మన ప్రవర్తన ద్వారా వస్తుంది అండి,
    ------------------------------
    ఈ మీ పైవ్యాఖ్యల వల్ల గౌరవం వస్తుందనే భావిస్తున్నారా? గౌరవం ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిందే అని వాపోతే గౌరవం ఇస్తారా? :)

    అర్హతను, హోదాను, ఆర్థికస్థితిని, విద్యను, నడవడికను, సత్సాంప్రదాయాలను, సంస్కారాన్ని బట్టి గరవాలు సాధారణంగా దక్కుతాయి. ఇలా బురదచల్లుకుని, ఇయ్యండో అని హృదయవిదారకంగా దేబరించి, విలపించే అవసరం లేదని అని నేననుకుంటున్నాను. ఈపోస్ట్ ప్రేరేపించిందని చెప్పబడుతున్న పోస్ట్ నేను చూశాను. అందులో దళితుల ప్రస్తావనే లేదు, వాళ్ళ కష్టనష్టాలేవో చెప్పుకున్నారు. మీరెందుకు ఇక్కడ మొరుగుతున్నారో అర్థం కాలేదు. దయచేసి ఎవరైనా లేదా ఈ బ్లాగరైనా వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  61. >>మీరు బ్రహ్మణులా లేక దళితుల వర్గానికి చెందిన వారా?

    >>బ్లాగులో చెత్త చర్చ జరుగుతూంటే, కామేంట్లు మాలిక వ్యాఖ్యల భాగంలో నిండిపోతుంటే కనీసం తన బ్లాగులో ఎమి జరుగుతున్నాదో చూసుకోవటం కూడాలేదు.

    are both of these anyway related ?
    If ur only concern is "మాలిక వ్యాఖ్యల భాగంలో నిండిపోతుంటే" ....why did u ask the first question

    is this the only post so far which has generated huge number of comments ?

    రిప్లయితొలగించండి
  62. @srinivas
    >>మీరు బ్రహ్మణులా లేక దళితుల వర్గానికి చెందిన వారా?

    >>బ్లాగులో చెత్త చర్చ జరుగుతూంటే, కామేంట్లు మాలిక వ్యాఖ్యల భాగంలో నిండిపోతుంటే కనీసం తన బ్లాగులో ఎమి జరుగుతున్నాదో చూసుకోవటం కూడాలేదు.

    Is malika programmed in such a way to discriminate on the basis of caste ?

    brahmin or dalit ani chebithe, will the comments section in malika not get filled ?

    >> మీలాంటి మందమతులకు బ్లాగు రాయటం అవసరమా?
    evadu mandamatho ardham avutundi

    రిప్లయితొలగించండి
  63. @mandamathi seenu

    >>మీ అసలు పేరేమిటి?
    any person with avg. IQ levels should be able to make out WP's name, if they read the above post.

    రిప్లయితొలగించండి
  64. @Nagarjuna
    >>అప్పటి వ్యవస్థలో లోపాలకీ, మంచికీ మనం కేవలం వారసులమేకానీ బాధ్యులం కాదు
    >>ఎందుకోగాని ఈ పాయింట్ నచ్చింది

    I too liked it...may be as it makes a lot of sense.

    రిప్లయితొలగించండి
  65. @mandamathi seenu
    >>మీరు బ్రహ్మణులా లేక దళితుల వర్గానికి చెందిన వారా?

    >>బ్లాగులో చెత్త చర్చ జరుగుతూంటే, కామేంట్లు మాలిక వ్యాఖ్యల భాగంలో నిండిపోతుంటే కనీసం తన బ్లాగులో ఎమి జరుగుతున్నాదో చూసుకోవటం కూడాలేదు.

    mokaliki, battatalaki ki link pettadam ante idenemo

    రిప్లయితొలగించండి
  66. తాడేపల్లి గారి పోస్ట్ చదివాక, మహేశ్ గారి ఫేస్ బుక్ లో చర్చ చూసాను. అందరూ చాలా గౌరవప్రదం గా విభేదించుకోవటం చాలా నచ్చింది.

    ఒక విషయం ఒప్పుకుని తీరాలి. బ్లాగ్ ప్రపంచం లో అంత చక్కని వాతావరణం లేదు. At slightest విమర్శ, బ్లాగర్లు వ్యక్తిగాతదూషణలకి దిగటం సర్వ సాధారణమైపోయింది.

    అసలు వారాంతం గారన్నట్టు మనం మన పూర్వీకుల పనులకి వారసులమే కానీ బాధ్యులం కాము. అలాగే.. మన ఇంట్లో ఉన్న డర్ట్ ని సమర్ధించుకోవటం మాని కడుగుకోవటం మంచిదేమో..?

    రిప్లయితొలగించండి
  67. WP గారు,

    మీ intention మంచిదయ్యుండవచ్చు.. కానీ.. అజ్ఞాతలకి పూర్తి స్వేచ్చ నిచ్చి.. తర్వాత సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే వ్యాఖ్యలు తొలగించటం వల్ల వచ్చిన కన్ఫ్యూషన్ ఏమో? అలాగే.. ఒకసారి మీరన్నట్టు వ్యాఖ్యలు బ్లాగర్ ఎకవుంట్లతో పెట్టలేని సమస్య ఉన్నప్పుడు.. ఆ సమస్య తీరేంత వరకూ మాడరేషన్ ఎందుకు చేయలేకపోయారు? అన్నది లాజిక్ కి అస్సలూ అందట్లేదు. పోస్ట్ వేసాక నాలుగు రోజులు మీకు తీరిక లేదన్నప్పుడు.. పోస్ట్ అయినా తర్వాత వేసుండాల్సింది.. లేదా, మాడరేషన్ పెట్టి మీ పనులు చేసుకోవాల్సిందేమో..

    నిన్న అజ్ఞాత గా రాసిన వ్యాఖ్య నాదే.. నాకు బ్లాగర్ అకవుంట్ లేకపోవటం వల్ల నిన్న నా పేరు తో వ్యాఖ్య ఉంచలేకపోయాను. ఇలా రాసినందుకు మన్నించండి! అలాగే నన్ను రాజేష్ గారిలా కుల గజ్జి పీడిత మనిషి ననీ, సరుకుననీ.. etc etc నిందించరని నమ్ముతున్నాను.

    రిప్లయితొలగించండి
  68. అగ్రకులం అనగానే వాళ్లని ఏదో అనేస్తున్నారని బ్రాహ్మణులు వాదనకు దిగడమేతప్ప, అన్ని దళిత ఉద్యమాలూ బ్రాహ్మణిజానికి వ్యతరేకంగానే తప్ప బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరగటం లేదు. అయినా బ్రాహ్మణులు ఇప్పటి సమాజంలో ఏమాత్రం ......సామాజిక-ఆర్థిక-రాజకీయ ప్రాఖ్యతలేని కులం. పోరాటమైనా, ఉద్యమాలైనా అధికార కులాలతోనే తప్ప కేవలం పేరుకు అగ్రకులంగా మాత్రమే మిగిలిపోయిన బ్రాహ్మణులతో కాదు.

    నిజానికి దళితులు బ్రాహ్మణులతో కలిసి రాజ్యాధికారం సాధించొచ్చని మాయావతి నిరూపిస్తే, మిగతా అగ్రకులాల దాష్టీకాలకు కొమ్ముకాసే పనులు మానమని బ్రాహ్మణులే వెన్నుపోటు పొడిచేవరకూ వెళ్ళిండి పరిస్థితి. సమస్య తాడేపల్లిగారి వ్యాసంలోని బ్రాహ్మణుల false prestige లో ఉంది, సామాజిక నిజాల్ని పరికించలేని మూర్ఖత్వంలో ఉంది. దళితుడు కులం వల్ల దళితుడైతే, ఆర్థికంగా దళితులుగా బ్రాహ్మణులు మిగిలిపోయారన్న స్పృహలేక సమస్య సమస్యగానే ఉంది.

    మళ్ళీ ఏమైనా అంటే వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాల్నిభుజాన వేసుకుని తిరుగుతారు. అవే బ్రాహ్మణుల్ని irrelevant చేశాయి, ఇంకా అదే పట్టుకుని తిరిగితే unwanted ని చేస్తాయి. Only dalit - Brahmin unity can save this society. అధికార కులాలన్నీ బ్రాహ్మణుల జుట్టుకు దళితుల డప్పుకూ ముడిపెట్టి మ్యూజిక్ వింటూ అధికారం చేస్తాయి అంతే.

    రిప్లయితొలగించండి
  69. మలక్పేటరౌడీ,
    >>I too have had the same feeling, not from your post but from the way you selectively deleted the comments that you have the lenience towards one line of argument. If you have it then better say it openly. It would put these issues to rest right? There were nasty comments form both sides but the treatment has not been the same.

    I did not removed more that 3 or 4 comments which are particularly abusive in their language. So there is no question of me taking sides in that mudslinging match is

    I am not leaning onto any side. I take everything case by case. See my comments in the FB discussion or in the comments section of my blog. I am just writing what I am thinking. You are more than welcome to ask me, if you think some of them need more elaboration.

    రిప్లయితొలగించండి
  70. WP,
    i did not see any involvement of మలక్పేటరౌడీ in this post. why r u addressing it to him?

    రిప్లయితొలగించండి
  71. అజ్ఞాత,

    మలక్పేటరౌడీ, commented the quoted lines elsewhere about this post. I thought he and a couple of others seem to have formed a wrong opinion that I have removed only one side of the nastiness and allowed the otherside.

    The assumptions are totally wrong and prejudiced. I do not know how they came to the conclusion that I removed many comments.

    My above reply to మలక్పేటరౌడీ is mainly to correct those perceptions.

    రిప్లయితొలగించండి
  72. @ajnaata&WP
    Please read below tapa.
    మాత్సర్యానికి మందు లేదు-1
    http://kalagooragampa.blogspot.com/2011/11/1_08.html
    మాత్సర్యానికి మందు లేదు-2
    http://kalagooragampa.blogspot.com/

    Srinu

    రిప్లయితొలగించండి