19, ఫిబ్రవరి 2011, శనివారం

వ్యవస్థతో పోరాటం - Chetan's Fight

అబ్బే ఈ దేశం బాగుపడదు. సమాజం మరీ స్వార్థ పూరితమైపోయింది. ఈ జనాలు, ఈ రాజకీయాలు ఇంతే. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు లాంటి వాటిని వినీ వినీ విసుగొస్తుంది కదూ. నాకు బాగా తెలిసిన ఒక మూడు వేరు వేరు అనుభవాలని టపాలుగా రాస్తున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. ఇందులో మొదటిది చేతన్ కథ.
----------------------------------------------------------------------------------


2004 లో సంగతి ఇది. రోజూ ఉత్సాహంగా పని చేసి, సాయంత్రానికి చక్కగా అప్డేట్ ఇచ్చే చేతన్ ఒకరోజు అసలేమాత్రం సమాచారం లేకుండా మధ్యహ్నమే వెళ్ళిపోయాడు. ఏంటి విషయం, ఏమైనా సమాచారం ఇచ్చాడా అని మిగిలిన వాళ్ళని అడిగితే ఏదో ఫొన్ వచ్చిందనీ హడావిడిగా వెళ్ళాడనీ చెప్పారు. అరే ఏదైనా సమస్యొచ్చిందేమో కనుక్కోలేదా అని వెంటనే ఫొన్ చేశాను.. చేతన్, ఎక్కడున్నారు మీరు? ఈజ్ ఎవ్రీ థింగ్ ఆల్రైట్ అని? అప్పుడు తెలిసింది పాపం మా చేతన్ ప్రేమించి పెళ్ళడదామనుకుంటున్న అమ్మాయికి యాక్సిడేంట్ అయిందని. యాక్సిడెంట్ చేసినతనే హస్పటల్ లో చేర్పించాడట. కొంచెం ధైర్యం చెప్పి అవసరమైతే ఫొన్ చెయ్యమన్నాం.


మూడు నెలలపాటు హాస్పిటల్లో రకరకాల ప్రయత్నాలు చేసినా దురదృష్టవశాత్తూ ఆ అమ్మాయి చనిపోయింది. ఆ మూణ్ణెల్లూ చేతన్ మాత్రం సెలవుపై వెళ్ళకుండా తనికిష్టమైన టైములో పనిచేసుకునే వెసులుబాటు అడిగాడు. నాకర్థమయ్యింది.. అదే బెటర్ తనకి కూడా వర్క్ కొంతవరకూ ఉపశమనం కలిగిస్తుందని. టైముకి ఆఫీసులకి వచ్చే చాలా మంది రోజంతా చేసే దానికంటే చాలా ఎక్కువే పనిచేశాడు. ఫగలు మాత్రం దాదాపుగా హస్పిటల్ దగ్గరే గడిపేవాడు.


మూడు నెలలపాటు హాస్పిటల్లో వైద్యం అంటే మాటలా? ఖర్చు లక్షల్లో అయ్యింది. ఎం ఎస్ అయ్యింతర్వాత కొద్ది నెలలు మాత్రమే అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడ ఉండడం ఇష్టంలేక ఇండియాకి వచ్చిన మా చేతన్ దగ్గర అంత డబ్బు లేదు కానీ, అదృష్టవశాత్తూ అమెరికాలో ఉన్నప్పటి క్రెడిట్ కార్డు ఉండబట్టి ఒక మూడు లక్షలు పైనే వైద్యానికి సర్దుబాటు చేసుకోగలిగాడు. నెల నెలా ఇక్కడ ఉద్యోగంతో అక్కడి అప్పు తీర్చడమంటే ఎంతకష్టం? కానీ అమెరికా నుండి వచ్చేశాం కదా అని లైట్ తీసుకునే చాలా మందిలా కాకుండా రెండేళ్ళు కష్టపడి ఆ అప్పు మొత్తం తీర్చేశాడు.


ఇదంతా వ్యక్తిగతం. తనకొచ్చిన అనుకోని పరిస్థితులూ, మనుషులతో ఉండే సంబంధాలమీద నిబద్ధతా, నిజాయితీ లాంటివి పుష్కలంగా ఉన్న ఒక మంచి వ్యక్తిగా చేతన్ అంటే నాతో పాటు మా ఆఫీస్ లో చాలా మందికి ఎంతో గౌరవం.


అసలు విషయానికి వస్తే, యాక్సిడెంట్ చేసినతను ఒక పెద్ద బ్యాంకు ఛైర్మన్. పలుకుబడిలోనూ, పరిచయాల్లోను, డబ్బులోనూ మన చేతన్ కి అసలేమాత్రం అందనంత స్థాయి. ఇక్కడినుంచే చేతన్ అసలు పోరాటం మొదలైయ్యింది. పోలిస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు ఫిర్యాదుకూడా తీసుకోకుండా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయినా అన్ని పోలీస్ స్టేషన్ లూ, తిరిగి తిరిగి, పై స్థాయి అధికారుల దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళి ఫిర్యాదు నమోదు చేయించగలిగాడు. అప్పటికీ అవతలి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ.. ఈ కేసు తో వీళ్ళు మనల్నేమి చయ్యగలరులే అనే నమ్మకం అయ్యుండొచ్చు.


మొత్తానికి పోలీసులు చార్జ్ షీట్ పెట్టారు. కారు నడిపిన పెద్ద మనిషి స్థానంలో డ్రైవరు ఉన్నాడు చార్జ్ షీట్లో. శిక్ష ఏంటి? ఎవరికి? అనేదాన్ని పక్కన బెడితే అసలు తప్పు చేసిన వాడు బాధ్యత ఎందుకు తీసుకోడు? ఎంత డబ్బున్న వాడైతే మాత్రం!?


పోనిలే కేసు కోర్టుకి వెళ్ళిందికదా, చూద్దాం ఎక్కడిదాకా వెళ్తుందో అని చేతన్ ఒక లాయర్ ని పెట్టుకొని పొరాటం మొదలు పెట్టాడు. అక్కడినుంచీ ఎడతెరిపిలేని వాయిదాలూ, ఆలస్యాలతో కేసు రెండు సంవత్సరాలు సాగింది. బతుకు పోరాటానికే వ్యవధి సరిపోని మామూలు మనుషులు ఎంతకాలం ఇట్లా తిరగ్గలరు? అంటే కాగితం మీద ఉన్న న్యాయం చేతికందాలంటే కేవలం డబ్బున్న వాడికే సాద్యమా?


ఇంతా చేస్తే, ఒక వాయిదా కి నువ్వు రానవసరం లేదులే, ఈ రోజూ ఎలాగు వాయిదానే అని చెప్పాడు చేతన్ తరపు లాయరు. తరువాత కనుక్కుంటే, ఆరోజు చేతన్ రాలేదు కాబట్టి కేసు మూసేశారట! మరీ సినికల్ గా ఆలోచిస్తున్నాననుకునేరు. ఈ కోర్టుల వ్యవహారోల్లో రెండు వైపులా లాయర్లు కుమ్మక్కవడం నిజంగానే జరుగుతుంది.


సరే, ఇప్పుడేం చెయ్యాలని చేతన్ కనుక్కుంటే, ఇలా మూసేసిన కేసులని మళ్ళీ మూడు నెలల్లోగా తిరిగి తెరిపించే వెసులుబాటు ఉండటం ఆ గడువు ముగియడానికి ఇంకా కొద్దిరోజులే ఉండడంతో చేతన్ మరో లాయర్తో మళ్ళీ కేసు ఓపెన్ చేయించాడు.


మళ్ళీ ఒక సంవత్సరం పాటు వాయిదాలు జరిగి కేసు విచారణకొచ్చింది. సాక్షులు ఎవరంటే, ఆ దారిలో పోతూ యాక్సిడెంట్ చూసిన ఒక ప్రత్యక్ష సాక్షీ, హాస్పిటల్ లో వైద్యం చేసిన డాక్టరూ. ముందుగా ప్రత్యక్ష సాక్షి ని ప్రవేశ పెట్టాలంటే, పోలీసుల దగ్గర అతని పేరు, బంజారా హిల్స్ లోని ఒక బస్తీ పేరు మాత్రమె ఉన్నాయి. చేతన్ ఎలాగోలా కష్టపడి ఆ సాక్షిని కలిసి సహాయం అర్థిస్తే, పాపం అతను రోజు కూలీ చేసుకునే వ్యక్తి. తన కూలీ మానుకొని కోర్టు చుట్టూ తిరగడం అయ్యేపని కాదు. చేతన్ ఎన్ని రోజులు కోర్టుకి వస్తే అన్ని రోజుల కూలీ డబ్బులు ఇస్తాను, నాకోసం ఏమీ అబద్దం చెప్పొద్దు, మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి అని అతనిని ఒప్పించి సాక్ష్యం ఇప్పించాడు.


అవతలి వైపు వాళ్ళు ఒక కొత్త వాదన మొదలెట్టారు. ఆ అమ్మాయి చనిపోయింది ప్రమాదం జరిగిన మూడు నెలలకి కాబట్టి ఆమె మాములుగా ఆమెకుండే ఏదైనా అనారోగ్యంతొ చనిపోయుండొచ్చుకదా అని. సాక్ష్యం ఇవ్వడానికి రావలసిన డాక్టర్ తో మాట్లాడేదాకా చేతన్ స్థిమితంగా లేడనే చెప్పొచ్చు. డాక్టర్ గారు చాలా మంచి వారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. యాక్సిడెంట్ లో అయిన గాయాల వల్లే మూడు నెలల పోరాటం తరువాత చనిపోయింది అని.


తీర్పు చెతన్ కి అనుకూలంగా వచ్చింది. అవతలి పార్టీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పింది కోర్టు. ఆరోజు చేతన్ మొహంలో సంతృప్తి నాకు ఇంకా గుర్తుంది. డబ్బులు రాక పోయినా పర్వాలేదు కానీ మనం కేసు గెలిచాం. యాక్సిడెంట్ చేసిన వాడు ఎంత బలవంతుదైనా సరే బాధ్యత తీసుకోవలసిందే అని నిరూపించాం అన్నాడు.


అనుకున్నట్టుగానే అవతలి వాళ్ళు హై కోర్టుకి అప్పీలు చేశారు. ఏదో ఒక రోజు, అలసిపోరా వీళ్ళు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ మొత్తం కథలో, అద్భుతమైన మంచి జరిగింది ఇక్కడే. హైకోర్టు మళ్ళీ కేసుని సాగదీయకుండా, వెంటనే సగం పరిహారం చెల్లించి కేసు కొనసాగించుకోమ్మని రూలింగ్ ఇచ్చింది. సగం పరిహారం కోర్టు ద్వారా చెల్లించ బడింది. కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అవును 2004 నుండి..but chetan is continuing his fight..


వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: మన వ్యవస్థలో ఇన్ని లోపాలున్నాయి నిజమే. కానీ ఇన్ని లోపాలతో అందరూ ఇంత పోరాటం చెయ్యాలా? కొంతవరకైనా న్యాయం పొందడానికి అందరూ చేతన్ లా పోరాటం చెయ్యాలంటే జరిగే పనేనా? వ్యవస్థ అన్యాయంగా ఉందని, తలొంచుకోవడమో, అడ్డదారులు తొక్కడమో లాంటి బలహీనతలకి మనం లొంగితే ఈ వ్యవస్థ బాగు పడే అవకాశం అసలేమాత్రం ఉండదు. చేతన్ లా కొంతమందైనా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుంది. అంతేకాదు ఈ అనుభంతో, భవిష్యత్తులో ఎవరైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆప్రయత్నాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అంచనా వెయ్యగలిగిన చేతన్ లాంటి ఒక పౌరుడు ఈ దేశానికి దొరికడం శుభ సూచికం. వచ్చే వందేళ్ళలో మనం నిర్మించబోయే నవీన భారతావనికి ఇలాంటివాళ్ళే పునాది రాళ్ళు.

44 కామెంట్‌లు:

  1. బావుందండీ మంచిపోస్టు. కానీ ఆలోచిస్తే కొంచెం భయంగానే ఉంది. మీ వ్యాఖ్య నచ్చింది. మిగిలిన రెండు భాగాలు కూడా త్వరగా రాసేయండి మరి

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది మాస్టారూ.
    మీరు హైదరాబాదులో ఉంటారా? ఈ సారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా?

    రిప్లయితొలగించండి
  3. Good post.
    yes, we should not stop fighting until we get justice.
    kaani enni rojulu. Ilanti case lu, poraatalu evaru cheyatlaedanukuntunnara, ilantivi enno, enneno kaani vaatini evaru pattinchukoru, e patrika patnchukodu, e tv channel ki avasarm ledu, ilanti poratalu chalane avuthuvantavi, porattam chesi, chesi sahanam nashinchi tiragabadatharu, roju vvaari avasaralaku antakam eduravuntundhi. appudu vyavasta kalluteruchukuntundhi. Just like in Egypt.

    రిప్లయితొలగించండి
  4. http://ramakantharao.blogspot.com/2011/02/blog-post_19.html
    మీ టపాకి నా వ్యాఖ్య
    ఇక్కడ ప్రచురిద్దామని ప్రయత్నించాను. రెండువేల అక్షరాలకు మించినందున, అబ్బాయ్ నే ప్రచురించ అంది. అందుకే టపా వేసాను

    రిప్లయితొలగించండి
  5. Hats off to Chetan. Proud of him.

    That chairman will pay the price. His consciousness will not let him live peacefully.

    Why dont you publish the name of the chairman, so that we can pray for his downfall and life in hell. He is buying justice using money.

    రిప్లయితొలగించండి
  6. @అజ్ఞాత (19 ఫిబ్రవరి 2011 1:47 ఉ),

    ధన్యవాదాలు. తప్పకుండా రాస్తానండి :)

    @అజ్ఞాత (19 ఫిబ్రవరి 2011 2:41 ఉ) & అజ్ఞాత (19 ఫిబ్రవరి 2011 3:29 ఉ)

    Thank You.

    రిప్లయితొలగించండి
  7. @అజ్ఞాత (19 ఫిబ్రవరి 2011 2:43 ఉ),

    మీరన్నట్టు చాలా మంది ఇలా చేస్తూనే ఉన్నారండీ. కాకపోతే ఇంత వెసులుబాటు లేక తలొంచుకోవడమో, లేక వీలైనప్పుడు న్యాయం పొందడానికి అన్యాయమైన పద్దతుల్ని వాడేవాళ్ళు ఎక్కువైతే వ్యవస్థ ఇంకా దిగజారిపోతుంది. అందుకే ఈ కథలోని చేతన్ లాంటి వాళ్ళు కనిపిస్తే కొద్దిగా ఆనందం.:)

    People like this are important. We do not need a revolution. We are not that bad. We just need good leadership and a bit more responsible citizens. Folks like Chetan are the symptoms of the change that is going to come.

    Thank you for sharing your thoughts.

    రిప్లయితొలగించండి
  8. శివాజీ గారు,

    అవునండీ నేను హైదరాబాదులోనే ఉంటాను. వచ్చేటప్పుడు ఒక ఇమైల్ పంపండి, తప్పకుండా కలుద్దాం. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. Interesting, WP. But, how many people are ready to push it for years together in lousy courts? That's where justice is being denied to the victims, though indirectly.

    Good post.

    రిప్లయితొలగించండి
  10. బాటసారి గారు,

    మీ ప్రతిస్పందనకి చాలా సంతోషం. I will convey your appreciation to Chetan.

    I do not want to publish the names. Chetan itself is a changed name. I want to focus on how the system is against the common man.

    People like Chetan are the one's that keep the system alert. We just need more such folks.

    రిప్లయితొలగించండి
  11. SNKR గారు,

    I share the concerns expressed by you. కానీ ఈ వ్యవస్థ ఇంతే పనిచేస్తుంది అనే నిరాశలోకి వెళ్ళడం కంటే, కొంచెం ఎక్కువమంది చేతన్ లా పోరాడితే వాళ్ళ అసంతృప్తే వ్యవస్థని మార్చే అతిపెద్ద నైతిక శక్తిగా మారుతుంది. అలాంటి నైతిక శక్తి లేనప్పుడు వ్యవస్థని కేవలం కొన్ని రూల్స్ ద్వారానో పకడ్బందీ చట్టల ద్వారానో మాత్రమే మార్చగలుగుతాం అనుకోవడం పొరపాటవుతుంది.

    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. భాస్కర్ రామరాజు గారు,

    ఒక టపాగా వెయ్యాల్సినంత ప్రతిస్పందన మీనుండి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ టపా చదివాను. బావుంది. నా అభిప్రాయాన్ని మీ టపాలో చర్చిద్దాం :)

    రిప్లయితొలగించండి
  13. అజ్ఞాత,

    మీ ప్రశ్నని ప్రచురించలేను. క్షమించాలి. చేతన్ మీకు తెలిసుననుకుంటే మీరు ఎవరో తెలియజేస్తూ నాకు ఇమైల్ రాయండి (meka2014@gmail.com)

    రిప్లయితొలగించండి
  14. అజ్ఞాత,

    I responded to your email. btw, If you know Chetan..then you must be knowing me too..:))

    anyway, the issue is more important than the person in this case

    రిప్లయితొలగించండి
  15. WP gaaru,

    Thanks for this post. I am also fighting a case. In my case those people are not ready to pay the fine for the damage they have done. Insted they are saying we are very sorry for what we have done please take back the complaint. and they are asking me why do you want us to pay fine as you are eaning well?. I told them clearly it is not for money, I am figting for justice and I don't want anyone to suffer like me.

    రిప్లయితొలగించండి
  16. స్నేహ గారు, వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    >>they are asking me why do you want us to pay fine as you are eaning well?

    ఇదొకరకమైన పద్దతి. అంటే ఏంటట వాళ్ళ ఉద్దేశ్యం? since you are earning well, they can damage you and get away with it !! అనా?

    I appreciate your spirit. The opinion of all the people who read about your case is a great moral force. That moral force is very powerful than some people might think.

    రిప్లయితొలగించండి
  17. WP gaaru,

    >> That moral force is very powerful than some people might think.

    Very true. That's why I thanked you for posting about Chetan. It is giving me moral support to continue my fight.

    రిప్లయితొలగించండి
  18. వాపో,
    మీరంటున్నట్లు 'నైతిక' బలం/పోరాటం అన్నపదాలు, అలాంటి ప్రతి ఒక్క పోరాటానికీ వాడటం సరికాదేమో. ఆ వర్డ్ ఓ స్థాయికి చేరుకున్న వాళ్ళకు వాడాలి వుదా. గాంధీ, భగత్‌సింగ్, గాడ్సే. That is a commitment to a noble cause/belief with a sense of sacrifice. ఇలాంటి కోర్ట్ పోరాటలకు నైతికం మాటేమో గానేమో కాని, లాయర్లను మేపడానికి డబ్బు, ఓపిక, తీరిక, ఆరోగ్యం అవసరం వుంటుంది.

    Using 'moral' for every such fight is not correct, just sufficient to call it a fight for justice. For example, the person who is going to fight should not get tempted by monetray compensation, even if it is few millions.

    రిప్లయితొలగించండి
  19. ఎవరో ఒకరు ఎపుడో అపుడు..అన్నట్లు చేతన్ లాంటి వాళ్ళు ఇలాంటివి మొదలు పెట్టినపుడు, ఆపోరాటాలకు ప్రాచుర్యం కలిగించాలి! ఎందుకంటే "పెద్ద వాళ్లతో పెట్టుకోడం ఎందుకనో, మనకేం ఒరిగేది లేదనో, ఇదంతా మన ఖర్మనో అనుకుని సర్ది చెప్పుకుని ఊరుకుండిపోయేవాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు. వాళ్ళకి కాస్తంత స్ఫూర్తి, నమ్మకం, విశ్వాసం కల్గించాలంటే చేతన్ లాంటి వాళ్ళు ఉన్నారని అందరికీ తెలియాలి.

    జెస్సిక కేసులాగా, చేతన్ కేసు కి కూడా పేపర్లలో కవరేజ్ కావాలి.

    కేవలం భయంతో ఇలాంటివి ఎన్ని మరుగున పడిపోతున్నాయో! వ్యవస్థ మారడం అనేది చాలా పెద్ద మాట..పెద్ద ప్రాసెస్ కూడా! నష్టపోయిన ప్రతి వాళ్ళూ భయం లేకుండా, ప్రాణాలకు తెగించి(బాంకు చైర్మన్ ఊరుకున్నాడు గానీ ఆ రిస్కు మాత్రం లేదంటారా చేతన్ కి)ప్రతొక్కళ్ళూ కేసులు పెట్టడం జరిగితే గానీ వ్యవస్థ మార్పు దారి పట్టదు.

    అంత ప్రగతి కోరుకోడం ప్రస్తుతం అత్యాశే కానీ, ఇలాంటి స్టోరీలు మరిన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టాలి మీలా.....కథంతా తెలిసిన వాళ్ళు.

    రిప్లయితొలగించండి
  20. సుజాత గారు,

    స్వాగతం. I am honored. మొదటిసారి అనుకుంటా మీరు నా బ్లాగుకి రావటం.

    మీ వ్యాఖ్య ఆలోచింపజేసేదిగా ఉంది. మీరన్నట్టు ఇటువంటి ఉదాహరణలు కాస్తంత స్ఫూర్తి, నమ్మకం, విశ్వాసం కలిగించగలిగితే అదే ఒక గొప్ప మార్పు.

    మీరు చెప్పినట్టుగా:
    >> వ్యవస్థ మారడం అనేది చాలా పెద్ద మాట..పెద్ద ప్రాసెస్ కూడా! అంత ప్రగతి కోరుకోడం ప్రస్తుతం అత్యాశే.

    అయ్యుండొచ్చు కానీ నా అభిప్రాయం ఏంటంటే,వ్యవస్థ మారడానికి ఏవో అద్భుతాలు అక్కర్లేదు. అలా అద్భుతాల వల్ల జరిగే మార్పుల వల్ల నిజానికి ఉపయోగం తక్కువ. వీలయినంతవరకూ మనవంతుగా ఇటువంటి వాటికి ప్రచారం కల్పించి స్ఫూర్తి నింపడం, చేతనైనంతవరకూ ఇటువంటి ఉదాహరణలు చేసి చూపించడం చేస్తే వ్యవస్థ మారుతుంది. ఆ మార్పు ఒక్క రోజులోరాదు ఏదో ఒక్కరి వల్ల రాదు. వీలైనంత ఎక్కువమంది మంచిని గుర్తించి ఆచరించగలిగితే మార్పు వచ్చి తీరుతుంది. అదే సరైన మార్గం అనేది నా నమ్మకం.

    We need to have leaders who can recognize such a change in us and do the needful. We just need to prepare the ground for such leaders. When the ground is prepared our society will throw up leaders :)

    రిప్లయితొలగించండి
  21. SNKR గారు,

    క్షమించండి. నైతికబలం/పోరాటం, Moral Force గురించిన మీ వ్యాఖ్యతో దాదాపు పూర్తిగా విభేదిస్తున్నాను.

    పై వ్యాఖ్యలో వెలిబుచ్చిన మీ అభిప్రాయాలూ, మీరు ఉదహరించిన ఉదాహరణల విషయంలో నా భావాలూ, నా ఆలోచనలూ వేరేగా ఉన్నాయి.

    ఒకవేళ నేను మీ వ్యాఖ్యని సరిగా అర్థం చేసుకోలేదనో, లేక దాని మీద చర్చించి మన అభిప్రాయాలు మరింత విపులంగా చెప్పవలసిన అవసరం ఉందని గానీ మీకు అనిపిస్తే దయచేసి చెప్పండి. అది చర్చించడానికే ఒక టపా వేస్తాను. Count on me. I will not discuss just to win the argument :)

    రిప్లయితొలగించండి
  22. "
    People like this are important. We do not need a revolution. We are not that bad. We just need good leadership and a bit more responsible citizens" ........could not agree more

    రిప్లయితొలగించండి
  23. Sanju -The king!!!,

    Thankyou and welcome to my blog. oh..yes people like Chetan are important. by what I have read so far in your blog, people like you are the signs of hope.

    రిప్లయితొలగించండి
  24. వారాంత రాజకీయనాయకా,
    ఓకే వుదాహరణల్లోని వ్యక్తులు మీకు నచ్చకపోయివుండవచ్చు, ఐతే 'పూర్తిగా విభేదించే' అంశాలేమిటో చెప్పండి, తప్పుదిద్దుకుంటాము.

    ఒకటి గమనించాను. పైన ఇద్దరికి ఐయాం I am honored అన్నారు. సంజు గారు రాజు నని చెప్పుకున్నా I am honored అనలేదు. మీరు స్త్రీ పక్షపాతకవాదులా? గీతాచార్య మిమ్మల్ని గమనిస్తూ వుండవచ్చు, మీ వాలెట్ జాగర్త. ;) :))

    I am dishonored అని కూడా ఎప్పుడైనా అనడం ఇక్కడ జరిగిందా?

    రిప్లయితొలగించండి
  25. SNKR గారు,

    దిద్దుకోవలసింత తప్పులేం లేవు లెండి. మీరు మరి! I think, the opinion of every person is a moral force that acts on the society (misteriously for some people). I do not beleive in reserving such words for a few things and a few people according to a criteria defined by someone else.

    SanjuTheKing కి అంతకంటే మంచి కాంప్లిమెంటే ఇచ్చాను కదండీ(Deservedly for him)! నేను ఏ పక్షపాతినీ కాదు. ఎదుటి మనిషిని స్త్రీ గానో, పురుషుడి గానో, తెలుగువాడిగానో, తమిళవాడిగానో, మరొకటనో దృష్టితో చూడటం అలవాటు లేదండీ నాకు. ఏదుటి వాళ్ళని మనుషులు గా చూడటం వారి నేపధ్యాన్నీ ఆలోచనలనీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చేస్తూ ఉంటాను.

    ఇంక గీతాచార్య విషయానికొస్తే.. మనసూ, మెదడూ జాగ్రత్తగా పెట్టుకుంటే, వాలెట్ అయినా మరింకేదైనా జాగ్రత్తగానే ఉంటుంది లేండి. లేదంటే నేర్చుకోవలసిన అనుభాలు సంపాదించుకుంటాం :))

    రిప్లయితొలగించండి
  26. చేతన్ ప్రదర్శించిన పోరాట పటిమ చాలా అభినందనీయం. వ్యక్తిగత విషయాలపట్ల కాకుండా సామాజికాంశాల పై ఇలాంటి కమిట్‌మెంట్ ఉన్న చేతన్‌లు కావాలి మనకు....అలాంటివారు ఎంతమంది వున్నారన్నదే ప్రశ్న అలాంటివాళ్లు లేకనే వ్యవస్థ ఇలావుంది. మీ పోస్టులో ఇది సరిగా కనపడివుండక భ.రా.రా గారు పోస్టును వేసారనిపించింది as i could see him appreciate the fight of chetan but raising the question if the court asked for any changes in the system.

    >>If 10 people on each day do the same thing.. the police and higher officials will automatically know that oh.. we got get it properly in the first place.<<
    ఈ మాట ముందే చెప్పేయాల్సింది.......మనకు తెలిసి మన రాష్టంలో ఓ పెద్దాయన నెత్తినోరు కొట్టుకొని చెబుతున్నదిదే

    రిప్లయితొలగించండి
  27. నాగార్జున గారు,

    ధన్యవాదాలు. సామాజిక అంశాలమీద ఇలాంటివి ఉంటే ఇంకా మంచిది. కానీ వ్యక్తిగత విష్యాల్లో కూడా, వ్యవస్థలోని లోపాలకి లొంగకుండా, మన హక్కుల్ని మనం సాధించుకోవడానికి ఎక్కువమంది తయారయితే వ్యవస్థలో మార్పు రావడానికి చాలా దోహద పడుతుంది.

    అవునండీ భాస్కర రామరాజు గారు కొన్ని మంచి సూచనలు చేశారు. మీరన్నట్టుగా బహుశా నేను ఇంకొంచెం స్పష్టంగా విషయాన్ని వ్యక్తపరిస్తే బావుండేది. Anyway, after the discussion here and in Bha.Raa.Raa's blog I think all of us were abel to express many important things.

    >>మనకు తెలిసి మన రాష్టంలో ఓ పెద్దాయన నెత్తినోరు కొట్టుకొని చెబుతున్నదిదే

    అవునండీ, చేతన్ లాంటి వాళ్ళూ, లేక అలాంటి విషయాలు తెలుసుకున్న వాళ్ళూ ఆయన చెపేదాన్ని సరళంగా అర్థం చేసుకోగలుగుతారు.

    రిప్లయితొలగించండి
  28. @wp .... thankyou mastaru....ippatidaka naa blog ki naaku vachina pedda pogadtha adi :)

    రిప్లయితొలగించండి
  29. @wp, this is a good post. wat is ur opinion on the attak on JP?

    రిప్లయితొలగించండి
  30. ఇప్పుడే నో వన్ కిల్డ్ జస్సిక సినిమా చూసాను. మీరూ ఓ సారి చూడండి.

    రిప్లయితొలగించండి
  31. @sanju -The king!!! ,
    :)

    @అజ్ఞాత,
    Thank You. oh. yeah I will write someday..

    @భాస్కర్ రామరాజు,
    ప్రయత్నిస్తానండీ. ఆ సినిమా మీద ఒక టపా రాసెయ్యండి మరి. అప్పుడు మేము చూడకపోయినా పర్లేదు :)

    రిప్లయితొలగించండి
  32. భాస్కర్,
    నేనూ నిన్న రాత్రే ఆ సినిమా చూసాను. అది చూస్తున్నంత సేపూ, చూసిన తర్వాత చాలా సేపూ, నేను ఆలొచించిందీ, చించుతున్నదీ రాయాలంటే ఇక్కడ కామెంటు సరిపోదు.

    బై ద వే, ఈ చేతన్ పోస్ట్ కూడా నిన్న మధ్యాన్నమే చదివాను. అలాగే రెండు రోజుల క్రితం ఆంధ్రాలో జరిగిన ఒక ఇన్సిడెంట్(పాతది) గురించి తెలిసింది(ఓ అబ్బయి అమ్మయి తల్లి తండ్రులని చంపేయడమూ, తర్వాత వాడికి శిక్ష పడ్డతర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటము).

    అన్నింటినీ చూస్తూంటే, నాలో అసలు ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడైనా ఉందా అనుమానం నన్ను పెనుభూతం లా కదిలించేస్తోంది. సర్వైవింగ్ కోసం ఎక్కడో తెలంగాణ కుగ్రామం నుంచీ, దేక్కుంటూ కెరీర్ అనో, డబ్బులనో, కంఫర్ట్స్ అనో, ఈరోజు దాకా ఫైట్ చేసుకుంటూ రావటం వేరూ, ఆడ్స్ అన్ని నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, హీల్స్ ఇంకా డిగ్ ఇన్ చేసి, ఒక కాజ్ కోసం, లైఫూ, కెరీరు అన్ని వదుల్కోవడానికి నిర్ణయించేసుకొని ఫైట్ చెయటం వేరు. నేను చాలా వీక్ పర్సనాలిటీని అని అర్ధం అవుతోంది నాకు.

    ఈ మాత్రం బతుకు ఎవరైనా బతుకుతారు కదా.

    రిప్లయితొలగించండి
  33. KUMARN గారు,

    I think you are being toooo harsh on yourself. You are surviving because you are a good fighter and you are where you are now because you are competetive.

    అవును మీరన్నట్టు ఒక కాజ్ కోసం, లైఫూ, కెరీరు అన్ని వదుల్కోవడానికి నిర్ణయించేసుకొని ఫైట్ చెయటం వేరు. కానీ అందరూ అలానే చెయ్యలంటే కుదరదు. అలా చేసే వాళ్ళు అభినందనీయులు అంతేకానీ మిగిలిన వాళ్ళు వీక్ అని కాదు. మన అభిప్రాయాల ద్వారా అలా చేసే వాళ్ళకి నైతిక బలాన్ని ఇవ్వడం ముఖ్యం. To the extent possible one should try atleast not to further corrupt the system around us. That is what Chetan in this story did. After all.. our system is a sum total of all of us.

    రిప్లయితొలగించండి
  34. Nice post. It is good to see the fair amount of response generated for this post, which is devoid of any negative vibes towards any particular person, region, religion or caste nor any demeaning parodies.

    I was involved in a legal issue, and watched a legal issue from very close quarters, it is very painful and energy draining process, which does not necessarily end in justice for the right party. So I really appreciate Chetan from the bottom of my heart.

    The above story itself shows our fragile legal system.

    1. Difficulty in giving a complaint.

    2. Lawyers colluding, which is not rare.

    3. Consider the witness. Chetan offered him his daily wages to come to court. Just consider the scenario in which the Chairman offering Rs. 3 lakh to the witness and extracting a strategically changed statement. That wud have been the end of the story.

    I don't know if such an offer was made and if the witness (coolie) resisted, but if he had resisted and told the truth .... he is a great guy. I wouldn't have felt bad even if had accepted the money and changed his statement.

    I totally agree with sanju's comment, "People like these are important....."

    Yeah, may be all of us cannot fight like Chetan, we should atleast try not to further corrupt the system - well said WP.

    రిప్లయితొలగించండి
  35. There has been a reference to personal commitment and social commitment in one of the above comments.

    >> వ్యక్తిగత విషయాలపట్ల కాకుండా సామాజికాంశాల పై ఇలాంటి కమిట్‌మెంట్ ఉన్న చేతన్‌లు కావాలి మనకు....అలాంటివారు ఎంతమంది వున్నారన్నదే ప్రశ్న అలాంటివాళ్లు లేకనే వ్యవస్థ ఇలావుంది

    I feel Chetan's commitment to get justice, with in the legal framework and not resorting to any shortcuts, itself is his social commitment, we cannot expect anything more from a person.

    సామాజికాంశాల పై ఇలాంటి కమిట్‌మెంట్ ఉన్న చేతన్‌లు ఎంతమంది ఉన్నారన్నది కాదు ప్రశ్న, పర్సనల్ commitments ki అడ్డ దారులు త్రొక్కనివాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది ప్రశ్న

    రిప్లయితొలగించండి
  36. @YAB,

    Thank you for a very good summary of the discussion and your observations.

    when you are referrinng to NagarJuna's comment in your second comment, I like the ending you gave. That is what exactly I am trying to bring out :D

    రిప్లయితొలగించండి
  37. @YAB,

    >>"It is good to see the fair amount of response generated for this post, which is devoid of any negative vibes towards any particular person, region, religion or caste ..."

    hmm..Very important observation. understanding this actually helps in understanding many problem issues and divisive tendencies. Lets think and understand this further.. :)

    @b,

    Thank You.

    రిప్లయితొలగించండి
  38. చేతన్ లాంటి వాళ్ళు అన్ని చోట్లా (నిజానికి ఇరువైపులా: పోలీసు లీగల్ వ్యవస్థలతోసహా)ఉన్నారుకాబట్టే దేశం ఇట్టా నడుస్తోంది. లేకపోతే ఎప్పుడో....

    రిప్లయితొలగించండి
  39. మహేష్ గారు,

    అవునండీ. కరెక్ట్ గా చెప్పారు. ఇంకొంచెం ఎక్కువమంది కావాలి అప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా నమ్మకంపెరుగుతుంది మన మీదా మన తోటి వాళ్ళ మీదా..

    రిప్లయితొలగించండి