తెలంగాణా వస్తుందనీ, రాదనీ, ఇది ఒట్టుట్టి కమిటీ అనీ రక రకాల ఊహాగానాలూ, రాజకీయ ఎత్తుగడలూ జనవరి 6 న రిపోర్టు బహిర్గతం అయ్యే వరకూ సాగుతూనే ఉంటాయి.
సరే కమిటీ ఏం చెప్పడానికి అవకాశం ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ కమిటీ ఒక నిర్ణయాన్ని వెలువరించదు. కొన్ని పరిష్కార మార్గాలనీ, వాటి లోటు పాట్లనీ చెప్పి ప్రభుత్వ నిర్ణయానికి కావలిసిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. తద్వారా ఏదో ఒక పరిష్కార మార్గం వైపుకినడిపించగలిగే అవకాశం ఉంది. స్థూలంగా ఉన్న పరిష్కార మార్గాలు 3:
సరే కమిటీ ఏం చెప్పడానికి అవకాశం ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ కమిటీ ఒక నిర్ణయాన్ని వెలువరించదు. కొన్ని పరిష్కార మార్గాలనీ, వాటి లోటు పాట్లనీ చెప్పి ప్రభుత్వ నిర్ణయానికి కావలిసిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. తద్వారా ఏదో ఒక పరిష్కార మార్గం వైపుకినడిపించగలిగే అవకాశం ఉంది. స్థూలంగా ఉన్న పరిష్కార మార్గాలు 3:
- తెలంగాణా ఇవ్వడం
- సమైఖ్యాంధ్రప్రదేశ్ ని కొనసాగించడం
- కొన్ని అంశాల (రాయలసీమ, హైదరాబాదు, నీటి వనరులు, ఉద్యోగులు etc.. )పరిష్కారం తరువాత తెలంగాణా ఇవ్వడం
నా దృష్టిలో 3వ మార్గం వైపుగా కమిటీ రిపోర్టు ఉండే అవకాశం ఉంది. అంటే తెలంగాణా ఇవ్వడానికి అంగీకరిస్తూనే, కొన్ని కీలక మైన అంశాలని ఏవిధంగా, ఎంత సమయంలోపు ఎలా పరిష్కరించాలో సూచించి ఆ తరువాత తెలంగాణా ఇవ్వొచ్చు అనే పరిష్కారం వైపు కమిటీ రిపోర్టు మొగ్గు చూపే అవకాశం ఉంది.
2009 డిసెంబరు 10వ తారీఖున ఒక కాంగ్రేస్ వాది కాంగ్రేస్ పార్టీకి సమర్పించిన ఒక నివేదికని నా ఆంగ్ల బ్లాగులో పొందు పరిచాను. చూడాలంటే ఇక్కడ నొక్కండి.
2009 డిసెంబరు 10వ తారీఖున ఒక కాంగ్రేస్ వాది కాంగ్రేస్ పార్టీకి సమర్పించిన ఒక నివేదికని నా ఆంగ్ల బ్లాగులో పొందు పరిచాను. చూడాలంటే ఇక్కడ నొక్కండి.
మీరన్న మూడో పాయింటులోని అంశాలు శ్రీక్రిష్ణ కమిటీ వారు ఇలా పరిష్కరించొచ్చు.
రిప్లయితొలగించండిరాయలసీమ --> ఆంధ్రాకు వెళ్తుంది.
హైదరాబాదు --> తెలంగాణాకు వెళ్తుంది.
నీటి వనరులు --> న్యాయ సూత్రాల ప్రకారం పంచబడతాయి.
ఉద్యోగులు --> ఎక్కడి లొకాలిటీ వారు అక్కడికి వెళతారు.
హరి గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. అయితే ఆ పరిష్కారాలు సరైన పద్దతిలో పూర్తి అయినతరువాత మాత్రమే తెలంగాణా రావచ్చు. దానికి కొంత సమయం పట్టవచ్చు.
నా దృష్టిలో -
రిప్లయితొలగించండికమిటీ.. రిపోర్టులో తెలంగాణకు గత 54 సంవత్సరాలలో ఏఏ రంగాలలో ఎంతెంత అన్యాయం జరిగిందో తప్పక ధృవీకరిస్తుంది.
అలాగే ఆవేశంతో మద్రాసు రాష్ట్రం నుండి వేరయిన సీమాంధ్ర ప్రాంతం, వేరే ఏదైనా పారిశ్రామీకరణానుకూల ప్రాంతంతోగాని, ఇతర సహజ వనరులు గల ప్రాంతంతోగాని, కలిస్తేగాని... స్వతంత్ర రాష్ట్రంగా మనలేని పరిస్థితులను వివరిస్తుంది.
దీనిని బట్టి మూడు రకాల పరిష్కార మార్గాలను సూచించవచ్చు.
ఒకటి - తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ సీమాంధ్ర రాష్ట్రానికి ఆర్థిక పాకేజినో, లేదా కొన్నాళ్ళపాటు ఉమ్మడిగా హైదరాబాదులోని కొన్ని వనరులను పరిమిత స్థాయిలో వాడుకొనే అవకాశాన్నో, కల్పించడం.
రెండు - రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగిస్తూ, తెలంగాణకు పటిష్టమైన రక్షిత సూత్రాలను రూపొందించి, వాటిని నిక్కచ్చిగా అమలుపరిచే కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజ్యాంగబద్ధంగా రూపొందించడం.
మూడు - మధ్యేమార్గంగా కొంత కాల పరిమితి వరకు ప్రయోగాత్మక ప్రణాళికను సూచించి, అంతవరకు పరిష్కారాన్ని వాయిదా వేయడం.
@shayi,
రిప్లయితొలగించండిమీరు చెప్పిన మూడవ పరిష్కారం వైపుగానే పరిస్థితులు పయనిస్తాయన్నదే నా అంచనా కూడా.
నూతన సంవత్సరం లో మీరు ,మీ కుటుంబం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లిశ్రీ గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చింతలపాటి శ్రీక్రిష్ణ గారు,
మనోభావాలు, భావోద్వేగాలూ, అన్యాయాల సంగతి పక్కన పెడితే, 10 కోట్ల మందికి ఒక ముఖ్యమంత్రి ఉండడం అవసరమా? సరిపోయినన్ని వనరులూ, అభివృధ్ధికి కావలిసిన పరిస్థితులూ ఉండి ఒక ప్రాంత ప్రజలు కోరుకున్నప్పుడు, ఇతరులకి ఇబ్బంది కలగని పద్దతుల్లో వేరే రాష్ట్రం ఏర్పాటు చేసినా తప్పేముంది?
@Weekend Politician:
రిప్లయితొలగించండి"10 కోట్ల మందికి ఒక ముఖ్యమంత్రి ఉండడం అవసరమా?"
I think your questions should be
Is it enough to have a single CM for 10 Crore people?
For your original question, either an yes or a no doesn't serve your purpose ;)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇటు తెలంగాణ వారికి, అటు సీమాంధ్ర వారికి మధ్య, సమభావం కలిగిన పెద్దమనిషిలా "అందరికీ ఆమోదయోగ్య పరిష్కారాలు" అంటూ పోష్టులు ప్రారంభించిన ఈ ‘చింతలపాటి శ్రీకృష్ణ‘ గారు చివరికి ఒక్కొక్క ముసుగు తీసేస్తూ, బ్లాగులోకం నడికూడలిలో పరిపూర్ణ ‘తెలంగాణ ద్వేషి‘గా, సంపూర్ణ ‘సీమాంధ్ర పక్షపాతి‘గా నగ్నంగా నిలుచున్న సంగతి అందరికీ తెలుసు.
రిప్లయితొలగించండిఅవును పాపం... తెలంగాణ కంటే సీమాంధ్రలోనే వనరులు ఎక్కువ. అభివృద్ధి కూడా రెండు ప్రాంతాల్లో సమానంగా జరిగింది. తెలంగాణకు ఏమాత్రం అన్యాయం జరుగలేదు. అయినా అన్ని పార్టీల అధ్యక్షులు మెంటలెక్కి, గత పదేళ్ళుగా ఎన్నికల సమయాల్లో ఈ విషయం ప్రజలకు ధైర్యంగా చెప్పలేక, "మేమూ తెలంగాణకు అనుకూలమే" అంటూ ప్రచారం చేసుకొన్నాయి. 7-12-2009 నాడు అఖిల పక్షంలో నాయకులు పిచ్చికుక్క కరిచి, తెలంగాణకు మద్దతు తెలిపాయి. ఆ వెధవలంతా ’నల్లమోతు - చింతలపాటి’ కోచింగ్ ఇనిస్ట్యూటులో చదువుకొని ఉంటే లెక్క పత్రాలు సరిగ్గ చెప్పగలిగేవారు. ఈయన గారు అప్పుడున్నారో లేదో గాని, 1968లో బ్రహ్మానందరెడ్డి పిచ్చోడై G.O. 34 ఇచ్చాడు. 1972లో సుప్రిమ్ కోర్ట్ జడ్జికి బుద్ధి లేక తీర్పు అలా ఇచ్చాడు. 1974లో ఇందిరాగాంధిది మట్టి బుర్ర - 6 సూత్రాల పథకం అనవసరంగా ప్రవేశపెట్టింది. 1985లో NTR ఆ పథకానికి తూట్లు పడ్డాయనుకొని వెర్రోడై G.O. 610 ఇచ్చాడు. మన చింతలపాటి వారికి సమానమైన వివేకం ఉన్నది కేవలం సి.పి.యం. రాఘవులుకే. తెలంగాణకు మద్దతిస్తున్న అద్వానీ లాంటి జాతీయ నాయకుల మెదళ్ళలో ఉన్నది పెండ [ఓ సారి.. తెలంగాణ రాదుగా .. ’పేడ’ అనాలేమో.] అసలు అబ్దుల్ కలాంకు ఈయన గారి వివేకంలో పదో వంతు ఉన్నా .. పార్లమెంటు ప్రసంగంలో తెలంగాణ ఊసెత్తేవాడా? మన్మోహన్ సింగుకు ఈయనగారికి వచ్చిన లెక్కల్లో వందో వంతు ప్రావీణ్యమున్నా జాతీయ స్థాయి ప్రెస్ కాన్ఫరెన్సులో తెలంగాణకు కమిటయ్యే వాడా? అసలు ఈ సీమాంధ్ర మేధావులు, కవులు, కళాకారులేంటి? .. మతి లేని వెధవలు.. తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు. మన దర్భాగ్యం కాకపోతే .. ఈ వెధవ నాయకులు కాకుండా .. ఎంచక్క మన చింతలపాటి వారిని రాష్ట్రపతిగా, రాఘవులును ప్రధానమంత్రిగా, నల్లమోతు చక్రవర్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోని ఈ ప్రజలున్నారు చూసారే.. గాడిదలు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి@అజ్ఞాత ,
రిప్లయితొలగించండి>> I think your questions should be, "Is it enough to have a single CM for 10 Crore people?"
Thanks. You are right. The question should have been framed better :)
చింతలపాటి శ్రీక్రిష్ణ గారు,
రిప్లయితొలగించండిమీరు చేస్తున్నది వితండవాదం ఎంత మాత్రం కాదు. నాప్రశ్న కూడా ఒక అభిప్రాయంగా కంటే ఆలోచన రేకెత్తించే ఉద్దేశ్యం తోనే.
జనాభాను బట్టి ఎంతమంది ప్రజలకు ఎంతమంది ముఖ్యమంత్రులుండాలనే విషయాన్ని నిర్ణయిస్తామా?శ్రీ కృష్ణ గారి సూటి ప్రశ్నకు 120 కోట్లమందికి ఒక ప్రధాని ఎందుకన్న దానికి..జవాబు ఎవరు చెప్పబోతున్నారు? ఒక సత్యం కళ్ల ఎదురుగా కనపడుతున్నా దాన్ని అంగీకరించలేని వేర్పాటు వాదులు ఎప్పుడో రాజకీయ నాయకులు వాళ్ళ సీట్ల కోసం చేసిన పనులన్నీ ఏకరువు పెట్టి, గొంతు చించుకోవడం కమిటీ రిపోర్ట్ రాకముందు నుంచే మొదలైంది. ఎందుకంటే ఉమ్మడి ప్రయోజనలా కోసం కమిటీ కర్ర విరక్కుండా తీర్పు ఇచ్చి ఉంటుందని అన్ని పార్టీలూ ఊహిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ గాభరా!
రిప్లయితొలగించండిముందేమో కమిటీ తీర్పు మీద నమ్మకముందని, గౌరవిస్తామని చెప్పారు. ఇప్పుడేమో అది తమకు అనుకూలంగా ఉండదని అనుమానం రాగానే కమిటీతో సంబంధంలేకుండా రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కమిటీ నిర్ణయంతో సంబంధం లేనపుడు కమిటీ వేసింది ఎందుకంటా? అంత నమ్మకం లేనప్పుడు కమిటీని మొదటినుంచీ వ్యతిరేకించాలి కానీ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారు? తమ వాదనలు ఎందుకు వినిపించారు?
భావోద్వేగాల పరంగా విడిపోవలసి రావడం ఏమిటయ్యా? భావొద్వేగాలనేవి విడిపోయే సమయంలోనే పెచ్చరిల్లుతాయి.
ప్రజల మనోభావాల కంటే వారి వోట్లు ముఖ్యం గాబట్టే రాజకీయ నాయకులు "మేము తెలంగాణాకు అనుకూలం" అని చెప్తున్నారు కానీ ప్రజల అభీష్టాన్ని గౌరవించి కానే కాదు.
సీమాంధ్ర కళాకారులు, కవులు మద్దతు తెలపడాలు ఇవన్నీ డ్రామాలే! వారికి చిత్త శుద్ధి ఉంటే ఆ పని చేయరు. కానీ వారికి తగ్గ ప్రయోజనం ఏదో దాని వెనుక ఉండే ఉంటుంది.
ఆలమట్టి ఎత్తు పెంచుకుని కర్ణాటక దాచుకోగా మిగిలిన నీళ్ళని తెలంగాణాకు ఇవ్వాలని, అది తమ హక్కని కె సి ఆర్ వాదిస్తున్నాడు. రాష్ట్రం రాకముందే ఇలాంటి వాదనలు చేస్తున్నాడంటే ఇక తెలంగాణా వస్తే గోదావరిని, కృష్ణా నదిని ఆంధ్రలోకి రానిచ్చేలా లేరు. అప్పుడు రాష్ట్రం మొత్తం బీడుగా మారుతుంది. నదులున్నా మౌలిక సదుపాయాలు లేక తెలంగాణా, అవి ఉన్న్నా నీళ్ళు లేక ఆంధ్ర!
నీటి పంపంకం విషయంలో సమైక్యాంధ్రకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కమిటీ ఆలోచించకపోదు.
పై అఙ్ఞాత,
రిప్లయితొలగించండిజనాభాతో సంబంధం లేనప్పుడు ఒక దేశానికి మొత్తం ఒకే ముఖ్యమంత్రి ఎందుకు లేడు?
అసలు రాష్ట్రాలు ఏ ప్రాతిపదికన నిర్ణయింప బడ్డాయి?
భాషాసంయుక్త?
ఐతే హిందీకి ఐదారు రాష్ట్రాలున్నాయిగా?
ప్రాంతాన్ని బట్టి?
తెలంగాణాని రాష్ట్రం చేస్తే నష్టం ఏంటి? ప్రత్యేక రాష్ట్రంగా కూడా తెలంగాణా పద్దెనిమిది రాష్ట్రాల కన్నా పెద్దగా ఉంటుంది.
తెలుగు అనే ఒక్క బంధం తప్ప, మానసికంగా ఎప్పుడో విడిపోయాం. ఇప్పుడు మీరు చెప్పండి రాష్ట్రాన్ని విదడీస్తే తప్పేమిటి?
ఒహో, ఆంధ్రాకు నీళ్ళు రావనా?
న్యాయబద్ధంగా ఎన్ని నీళ్ళు రావటానికి అర్హులో, అన్ని తప్పకుండా వస్తాయి. భయపడకండి. అత్యాశగా హక్కు లేని నీళ్ళు రావాలంటే మాత్రం రావు, ఇప్పటిలాగా.
చింతలపాటి శ్రీక్రిష్ణ గారు,
రిప్లయితొలగించండి>> గురువు గారూ, తెలంగాణ ఉద్యమంలో ఎంత తీవ్రమైన భావోద్వేగాలున్నాయో నాకు తెలుసు. ప్రత్యేకించి మీకు ఈ విషయం పై ఉన్న స్పష్టమైన అభిప్రాయాలు ఇప్పటికే చాలా సార్లు వ్యక్తపరిచారు, మీ విమర్శలని స్వీకరిస్తాను.
I assume you are reffering to అజ్ఞాత :)
భావోద్వేగాల ప్రకారం నిర్ణయాలు తీసుకోకూడదు అనేదాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుదు భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆలోచన చేస్తే అమలు సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది.
రిప్లయితొలగించండిఇంకో విషయం ఏంటంటే విడిపోవటానికి భావోద్వేగాలు ఎలా ప్రాతిపదిక కాకూడదో, అలానే కలిపి ఉంచడానికి కూడా భావోద్వేగాలు ప్రాతిపదికగా ఉండకూడదు.
నిర్ణయం ఎలా ఉన్నా, దానివల్ల ఎక్కువ మంది ప్రజలకు మేలు జరిగితే చాలు. తాత్కాలిక మైన మేలు కోసం గానీ, కొద్దిమందికి ఒనగూరే ప్రయోజనాల కోసం గానీ విధాన నిర్ణయాలు తీసుకోబడితే దాన్ని అందరూ ప్రతిఘటించవలసిందే.
/10 కోట్ల మందికి ఒక ముఖ్యమంత్రి ఉండడం అవసరమా?/
రిప్లయితొలగించండిఎంతమంది ముఖ్యమంత్రులు వుండాలి? ఎన్ని ముఖ్యమంత్రుల పదవులుంటే అంత అభివృద్ది అని మీరెందుకు భావిస్తున్నారు?
SNKR గారు,
రిప్లయితొలగించండిమరీ కేంద్రీక్ర్తమైన అధికారం వల్ల అవినీతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది నా పాయింట్.
స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు బదిలీ చేసి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచితే సరిపోతుంది. కింది స్థాయిల్లో నాయకత్వాన్ని పెంచుకోవల్సిన అవసరాన్ని మన సమాజం త్వరగా గుర్తించాలి.
అది వీలు కానప్పుడు కొంచెం చిన్న చిన్న రాష్ట్రాల ఏర్పాటుని పరిశీలించడంలో తప్పులేదని నా అభిప్రాయం. కాకపోతే అది శాశ్వత పరిష్కారం అనే భ్రమలో ఉండకూడదు.
ఒక కేంద్రీకృత అధికారి టార్గెట్ ఏడాదికి వెయ్యికోట్లు అనుకుందాము.
రిప్లయితొలగించండిఎక్కువ మంత్రులవల్ల కేవలం అవినీతిని వికేంద్రీకరణ మాత్రమే జరుగుతుంది. స్థానిక స్వపరిపాలన అన్నారు, ఆ పని చేయడానికి మంత్రుల సంఖ్య కాదు, ఇప్పుడున్న వ్యవస్థలోనే పంచాయతీలు, పట్టణ మునిసిపాలిటీలకు ఎక్కువ ఆర్థిక అధికారాలు ఇవ్వవచ్చు. ఓ కెసిఆర్, వాడి ఫేమిలీ అధికారంలోకి వస్తే ప్రాంతం బాగుపడుతుందనే మీ అభిప్రాయం వాస్తవాలకు విరుద్ధంగా వుంది.
వేరితర కారణాలు పుట్టించి 'అందు కోసం విభజించాల ' అని వాదించినా అసలు వేర్పాటు వాదం పుట్టిందే ప్రాంతీయ విద్వేషాలను ఎగదోయడం ద్వారా అన్న విషయం దాస్తున్నారు. స్థానిక స్వపరిపాలనకు ఈ ఎదవలు చేసిన వుద్యమాలు ఏవో ఓ సారి చెప్పండి. లేవు! కదూ.. కాబట్టి ఇదో బహానా.. కుళ్ళు బుద్ధి, రాజకీయ నిరుద్యోగుల కుటిల రాజకీయం. అందుకే నేను వ్యతిరేకిస్తాను. నిజంగా బాగుపడతామంటే ప్రతి తాలూకాని ఓ రాష్ట్రం గా చేసినా అభ్యంతరంలేదు.
Looks like, under development in a particular region is not going to be the issue for dividing AP. From the recent interview of the committee members also it looks like they made references to the fact that in most parameters Telangana region is as good as Andhra region, if not better. (but we might still have to wait for the report to confirm this).
రిప్లయితొలగించండిComing to the point if state has to be divided because of మనోభావాలు, it is a tough one. I think the inception/trigger point for the demand of AP is also to some extent based on మనోభావాలు.
Coming to, is it better to have smaller states, I think one main reason in favor of smaller states is, at least common people can estimate at what range is the corruption taking place and more people can participate in it, thus increasing the competitiveness in corruption.
The fountain head of corruption is how much a particular person is authorized to spend. For our state the CM is authorized to spend (approx) one lakh crores a year.
Straight forward corruption is embezzlement of these funds, how much of this money is actually spent.
The second form is how much money is made by deciding how this one lac crores is to be spent, I mean which district will get roads, which district will get a project which project will be funded and which project is put on hold etc. The best example is ORR.
In a smaller state scenario, more people can understand the budget and its spending pattern.
It is not easy to deal with a person who has a cheque power of one lac crores per annum, he is toooooo powerful, people like us will not even have a slight idea of how corrupt YSR/CBNaidu etc etc.. are (no denying they are great leaders)
But smaller states also have some cons, I think the 3 tier system (central govt, state govt, district govt) is much better than the existing 2 tier (centre, state) system. It will give cultural grouping but divided political power and also the voice to stand up to central govt. if needed.
SNKR గారు,
రిప్లయితొలగించండిమీ అభిప్రాయాలు (సూటిగా) చెప్పినందుకు ధన్యవాదాలు. అయితే ఇందులో నాకొక అభ్యంతరం ఉంది.
>>ఓ కెసిఆర్, వాడి ఫేమిలీ అధికారంలోకి వస్తే ప్రాంతం బాగుపడుతుందనే మీ అభిప్రాయం వాస్తవాలకు విరుద్ధంగా వుంది.
పైన చెప్పిన అభిప్రాయం నాకులేదు. నా టపాలో గానీ, కామెంట్లలో గానీ అటువంటి అభిప్రాయానికి తావిచ్చే విధంగా ఎక్కడాలేదు.
బహుశా మీకుండే భయాలూ అపోహలూ మీకా ఉద్దేశ్యం కలిగించి ఉండవచ్చు. మిగిలిన వాళ్ళు చదివేటప్పుడు అపార్థం చేసుకోకుండా ఉండటానికి మాత్రమే ఈ వివరణ ఇస్తున్నాను, గమనించగలరు.
వారాంతరాజకీయవేత్త గారు, ఏదో పొరపాటైపోయింది. వేర్పాటు వాదం పుట్టిందే కెసిఆర్ ఇంట్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పనా కార్యక్రమం కోసం, వాటిని సమర్థించే వారందరూ గబ్బు-గులాబులే :) అన్న అభిప్రాయం నాకింకా వుంది, అందువల్ల అలా పడిపోయింది.
రిప్లయితొలగించండియాకూబ్ సాబ్ చెప్పిన మూడు-టైర్ల విధానం అంటే ఇప్పుడు వుండే పంచాయతీ/మున్సిపాలిటీ విధానమేఅనుకుంటా, కొత్తది కాదేమో... అలాగైతే ఆయనతో నేను ఏకీభవిస్తున్నా. ఎన్ని రాష్ట్రాలుగా విడగొట్టామన్నది కాదు, అసలు బాగు పడతామా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు ముక్కలు చేసిచ్చినా మరో గొట్టం రాజకీయనిరుద్యోగి రేప్పొద్దున రెచ్చగొట్టి విడగొట్టడన్న నమ్మకమేంటి? 'చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు ...గోవా, సిక్కిం ... బ్లా బ్లా' అని మొదలెట్టే వాళ్ళు ఎంత చిన్నముక్కలుగా తరగాలో సశాస్త్రీయంగా చెప్పి తరగాలని మనవి.
SNKR గారు,
రిప్లయితొలగించండిపైన YABగారు చెప్పేది స్థానిక ప్రభుత్వాల చేతుల్లోకి వీలైనన్ని ఎక్కువ అధికారాలు బదలాయించ గలిగితే ఇటువంటి గొడవలు రాకుండా ఉంటాయనే విషయం. అది అందరూ అంగీకరించ వలసిందే. దురదృష్టవశాత్తూ, స్థానిక సంస్థల బలోపేతానికి రాజకీయ పార్టీలుగానీ పౌర సమాజం గానీ అవసరమైనంత ఒత్తిడి ప్రభుత్వాల మీద తేలేక పోయాయి.
అంతిమంగా స్థానిక సంస్థలు బలోపేతం చేసి, దేశంలో రాష్ట్రాల విషయం ఒక శాస్త్రీయ పద్దతిలో మొత్తం దేశానికి ఉపయోగకరంగా ఒక ఫార్ములా ప్రకారం తీర్మానించబడాలి.
కాకపోతే పైన చెప్పిన ఆదర్శప్రాయమైన పరిష్కారం జరిగేలోపుగానే ఒక సమస్య వచ్చి మన నెత్తిన కూర్చుంది కాబట్టి, దీర్ఘకాలిక పరిష్కారం అయ్యేలోపు ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఏం చెయ్యాలనేది సూచించడమే శ్రీక్రిష్ణ కమిటీ పని.
నా దృష్టిలోనైతే, దీర్ఘకాలిక పరిష్కారమే ఉత్తమం అని తేల్చి చెప్పేసి, ఈ కింది అంశాలు అమలు చెయ్యడానికి నిర్ణీత గడువు చెప్పి, ఆలోపు ఏవిధంగా వివిధ వర్గాల ప్రాంతాల ప్రయోజనాలు కాపాడబడతాయో కేంద్ర ప్రభుత్వం చెప్పగలిగితే అది అత్యంత ఉత్తమమైన పరిష్కారం.
1. 2వ SRC వేసి జాతీయ స్థాయిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకి శాస్త్రీయమైన ప్రతిపాదన రూపొందించడం
2. స్థానిక సంస్థలకి నిధులూ, విధులూ, అధికారాలూ రాజ్యాంగం ప్రకారం నిజాయితీగా బదలాయించడం
అయితే గుర్తుంచుకోవలసిన అంశం ఏంటంటే పై రెండూ నిర్ణీత గడువు లోపు సక్రమంగా పూర్తి చేయడం అసాధ్యం కాకపోయినా కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అందువల్ల ప్రజల నమ్మకాన్ని చూరగొనే ఒక తాత్కాలిక పరిష్కారం కూడా అవసరమే.
@Snkr
రిప్లయితొలగించండిyab గారు చెప్పింది జిల్లా స్థాయిలో ఆర్థిక స్వాతంత్ర్యం గురించి. అంటే ఎక్కడి నిధులు అక్కడే వినియోగించు కోవడం అన్న మాట. ప్రస్తుతం నిధులన్నీ రాష్ట్ర ముఖ్య మంత్రి ఆధీనంలొ ఉన్నాయి. అదే ఆయన చెప్పిన లక్ష కోట్ల బడ్జెటు. జిల్లా అయినా, గ్రామ పంచాయతీ అయినా ముఖ్యమంత్రిని అడుక్కుతినడం తప్ప ఇప్పటి పరిస్థితిలో చేసేదేమీ లేదు. అందుకే నిధుల మళ్ళింపు.
ఇప్పుడున్న పంచాయితీ/మునిసిపాలిటీ వ్యవస్థ, అదీ ఒకటి కాదని నీలాంటి గబ్బు ఎదవలు (అవి రెండు నువ్వు వాడిన పదాలే) తెలుసుకోవడానికి కొంచం కష్టపడవలసి ఉంటుంది.
WP and YAB,
రిప్లయితొలగించండిThank you for your analysis and nice inputs. Very well presented indeed.
@శ్రీకాంతాచారి
lol. What a blast!! :))
స్థానిక సంస్థలను బలోపేతం చెయ్యాలి అనేది నిర్వివాదాంశం. కానీ చిన్నరాష్ట్రాలు, స్థానిక స్వపరిపాలన అనేవి రెండు వేరువేరు విషయాలని నా ఉద్దేశం. రాష్ట్రాన్ని విడదీస్తే పాతికవేల స్థానిక సంస్థల రాష్ట్రం స్థానే పదివేలు, పదిహేను వేల స్థానిక సంస్థలు గల రాష్ట్రాలు ఏర్పడతాయి. స్థానిక సంస్థల బలోపేతం అనే దృష్టితో చూస్తే, అది కొత్త రాష్ట్రాల్లోని ప్రజలకు ఏ రకంగా ఉపయోగం?
రిప్లయితొలగించండిచిన్న రాష్ట్రాలతో పరిపాలక యూనిట్ పరిమాణం తగ్గుతుందేమోగానీ, అవినీతి పరిమాణం తగ్గిపోతుందేమోగానీ, అధికార కేంద్రీకరణ అనేది అలాగే ఉంటుంది. అధికార కేంద్రీకరణ వల్ల పెద్ద రాష్ట్రాలలో ఉండే సమస్యలన్నీ చిన్న రాష్ట్రాలలోనూ అలాగే ఉంటై. స్థానిక స్వపరిపాలన ద్వారా సాధించగల ప్రయోజనాలు అధికారాల వికేంద్రీకరణ, వనరుల సదుపయోగం, స్థానిక సమస్యలపై మరింత ఫోకస్ లాంటివి. ఈ ప్రయోజనాలు చిన్న రాష్ట్రాల్లో ఉంటాయి, పెద్ద రాష్ట్రాల్లో ఉండవు అని అనుకోవడం సరైంది కాదు.
ఆచారి, ఆ పదాలు నీ దృష్టిని ఆకర్షిస్తాయని వూహించా. అనుకున్నట్టే వల్లో పడ్డావు. అసలే ఏడుపుగొట్టు మొహాలు, ఇలా ప్రతిదానికీ భుజాలు తడుముకుంటావెందుకు? బలగాలు వస్తున్నాయ్ అని డి.జి.పి చెప్పిండు, నీలాంటి గబ్బుగులాబ్ లకు "ధులాయ్-భలయ్" షురూ అవుతుంది. :)) నీకు యాకూబ్ చెప్పింది ఒక్కముక్క అర్థం కాలేదని తెలుస్తోంది, అసలే ఎనకబడిన జాతి, అందులో ఏడుపుగొట్టు ముహాలు. వీకెండ్ రాసింది 10మార్లు చదువు, ఏమన్నా అర్థమవుతుందేమో. బస్సుల మీద రాళ్ళేయనీకి, కిరొసిన్ పోసుకుని తగలట్టుకునేందుకు పనికొస్తారు నీలాంటోళ్ళు. :P
రిప్లయితొలగించండిYou should be transferred to Palasa, Srikakulam for 10years. Then you would atleast know what AP is!
----
@WP, Yes, I agree with you. SRC is the only solution. They should be given ample time to study the problem from deep root level. Let them study for another 50years, we can wait. If they can't 3rd SRC. :)) :P
మిత్రులారా,
రిప్లయితొలగించండిదయచేసి ఒకనొకళ్ళు దూషించుకోకుండా విభేదించే ప్రయత్నం చేయండి. వ్యక్తిగత దూషణలూ, ప్రాంత జాతి దూషణలు ప్రత్యేక తెలంగాణాకీ, లేదా సమైఖ్య రాష్ట్రానికీ దేనికీ పనికిరావు.
ప్రజల్లో భావోద్వేగాలని రెచ్చగొడుతున్నారని రాజకీయ నాయకుల్ని తిట్టడం బ్లాగుల్లో చాలా చోట్ల చూశాను. But after seeing some instances in the blogworld, I feel we do not need anybody to mislead us. While well educated intellectuals are hurling unprovoked personal abuses on others.. what is point in blaming all those poor guys who do vandalism for their leaders :( and what is the point in criticizing politicians for their lack of decency in various debates.
మీరు రాసే వ్యాఖ్యల్లో కొన్నింటిని ప్రచురించకుండా ఆపడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కాకపోతే ఇదే విధంగా దూషణల పర్వం కొనసాగితే కొన్ని వ్యాఖ్యలని నా విచక్షణ ఉపయోగించి నిరాకరించవలసిన దురదృష్టకర పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దయచేసి సహకరించగలరు.
చదువరి గారు,
రిప్లయితొలగించండిమీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. స్థానిక సంస్థలని బలోపేతం చెయ్యడం చాలా అవసరం. అది సరిగ్గా జరిగినప్పుడు రాష్ట్రాల పునర్విభజన ఇంత జటిలంగా కనపడదు. మీరన్నట్టు రాష్ట్రాలు పెద్దవైనా చిన్నవైనా వికేంద్రీకరణ చేసి తీరాల్సిందే.
Weekend Politician గారు
రిప్లయితొలగించండిసదరు Snkr గారికి తెలంగాణావారిపై ఎంత కసి ఉందో అతడు ఉపయోగించే భాష ఒకసారి పరిశీలించ గలరు.
నేను కేవలం అతను వాడిన పదాలను అతనిపై ప్రయోగిస్తే తట్టుకోలేక పోయాడు. మరి ఇతరులపై ఆ పదాలను ప్రయోగించడానికి అతడెలా అర్హుడు?
yab చెప్పింది ఏమీ తనకి అర్థం కాలేదని ముందటి కామెంటులోనే తెలిసింది.కాని ఎలా సమర్థించుకుంటున్నాడో చూడండి. పైగా నేను 10 సార్లు చదవాలట.
ఇది అతని వ్యాఖ్యకు సమాధానం కాదు. మీకు వివరణ మాత్రమే. మీరు ఈ వ్యాఖ్య ప్రచురించక పోయినా ఫర్వాలేదు, పైన Snkr వ్యాఖ్యను ఒకసారి మళ్ళీ పరిశీలించండి.
శ్రీకాంతాచారి గారు,
రిప్లయితొలగించండినేను ఎవరో ఒకరికి మాత్రమే చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతోనే జనరల్ గా అందరికి ఒక విఙప్తి చేసాను. SNKR గారు కూడా ఎదో ఇంతకుముందు అందరూ ఇలానే మాట్లాడుతున్నారు గదా అని సరదాగానే రాసుంటారు లెండి. ఆయనకూడా ప్రత్యేకమైన ద్వేషభావం చూపించాలని రాసుండక పోవచ్చు.
కొద్దిసేపటి తరువాత నా దృష్టిలో దూషణలుగా కనబడిన వ్యాఖ్యలని తొలగిస్తాను.
Sometimes it happens but I believe no one carries these. We just need to self check and correct. that's all.
I, my self might fall prey to such weakness sometimes and I look forward to receiving a quick censure from others.
Cheer up guys..lets get back to the topic.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ బ్లాగు బాగుంది. మరి నా బ్లాగూ చూస్తారా!!
రిప్లయితొలగించండిwww.iandsahachara.blogspot.com