22, జూన్ 2010, మంగళవారం

జై జై సంతలో బానిసలు ...మీకే మా వోట్లు ..

కీలకమైన నిర్ణయాలు చేసే చాలా సందర్భాలలో మన MLA లు హోటళ్ళలోనూ, రిసార్ట్స్ లోనూ గుంపుగా బందింపబడి అసెంబ్లీ లో వోట్లు వేయడం మనకు అలవాటై పోయినట్లుంది. నాయకులమని చెప్పుకొనే వాళ్ళకు కూడా అదో పెద్ద విషయం అనిపిస్తున్నట్లు లేదు. వీళ్ళల్లో ఇంకాస్త పెద్ద నాయకులు మాత్రం, ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఈ బందిఖానాలను ఏర్పాటు చేసి, చూసారా నా దగ్గర ఎంతమంది బానిసలున్నారో!! అన్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు.


సర్లే మనకర్థంగానిదేదో ఉండి వుంటుందిలే అని సరి పెట్టుకుందామన్నా, నాకు ఆశ్చర్యం కలిగించేదేంటంటే, ఇన్నేళ్ళలో ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా "ఇది నా ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తుంది" అని చెప్పి ఆ హోటళ్ళ నుండి బయటకు రాలేదు. వీళ్ళే సంతలో బానిస బ్రతుకులు వెళ్ళదీస్తూ మళ్ళీ ప్రజలకు మాత్రం నాయకులు గా బండి నడిపించేస్తున్నారు.


ఈ మధ్య అన్ని పార్టీల వాళ్ళకీ, "అధిష్టానం ఏం చెప్తే అదే", "ప్రజలేం కోరుకుంటే అదే" అని చెప్పటం fashion అయిపోయింది.


బాబులూ.. ముందు మీరు అధిష్టానానికి ఏమి చెప్తున్నారో, ప్రజలకి ఏం సూచిస్తున్నారో చెప్పి, తర్వాత మీ బానిసత్వం కంటిన్యూ చేసుకుంటే బావుంటుందేమో ఆలోచించండి..

11 కామెంట్‌లు:

  1. ముందు మెజారిటీ జనం వోటుకి వంద తీసుకోవడం లో ఆత్మగౌరవం పాటిస్తే తర్వాత నాయకుల సంగతి ఆలోచించవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. ఆత్మగౌరవమా అది భారతీయులు మర్చిపోయి చాలారోజులయ్యిందనుకుంటా?

    రిప్లయితొలగించండి
  3. శ్రీనివాస్ గారు, మీ కామెంటు చాలా మంచి ప్రశ్ననే లేవనెత్తిందండీ. మెజారిటీ ప్రజలు అలా వున్నారు కాబట్టి నేనూ అలానే వుంటాను అని ఎవరైనా చెప్పొచ్చుగానీ, స్వయంగా తమకు తామే నాయకులుగా ప్రకటించుకొని మరీ ముందుకు వచ్చిన వాళ్ళు ఆ కథలు చెప్పకూడదు కదా!

    ఆన్నట్టు, మీ దెయ్యం కబుర్లు అదుర్స్ ...

    రిప్లయితొలగించండి
  4. వీకెండ్ పొలిటిషియన్ గారూ,

    మీరలాగే చెప్తారు. పాపం కోట్లు పోసి గద్దె కెక్కినవాళ్ళు ఏదో ఇలాంటి పీక్ సీజన్లో తప్ప.. మామూలప్పుడు.. ఎలా సంపాదించుకోగలరు? ఇదేమైనా గవర్నమెంట్ ఉద్యోగమా? నెల తిరిగేటప్పటికి జీతం వచ్చి బాంకి లో పడటానికి?

    మీరెందుకు కుళ్ళుకుంటున్నారు? మీకా చాన్స్ రాలేదనా?

    రిప్లయితొలగించండి
  5. వెంకట్ గారు, వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. మీ లాంటి వారిలో ఒక్కరిలోనైనా ఆత్మగౌరవం వున్నంతవరకూ భారతీయులందరూ అది మర్చిపోయారని అనలేమండీ. నేను ఆశాజీవిని..కనీసం మీరు ఆత్మగౌరవాన్ని మర్చిపొయుండరని నా నమ్మకం.

    రిప్లయితొలగించండి
  6. నిజమేనండి నేనేదో ఆవేశం లో చేసిన ఒక జెనరలైజేషన్ అది.ఇక విషయానికి వస్తే, మన దేశ రాజకీయాల్లో, బ్యూరోక్రసీ లోను ఈ బానిసత్వం అనేది నర నరాల్లోనూ నిండిపోతోంది.సొంతంగా నిర్ణయాలను తీసువాలనుకున్న కొత్త వాళ్ళను కూడా తొక్కి పెడుతున్న రోజులివి.కనీసం మన భారత ప్రభుత్వమన్నా తన మన దేశ గౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందా అంటే అదీ లేదు భోపాల్ దానికి ఒక ఉదాహరణ.మార్పు అన్నది ఎక్కడొ అక్కడ మొదలవ్వాలి, కాని ఎక్కడ అన్నదే ప్రశ్న? టపాకు సంబంధం లేకుండ వ్యాఖ్యానించినందుకు సారి ;)

    రిప్లయితొలగించండి
  7. @అజ్ఞాత
    MLA ల కు నెల తిరిగేకల్లా జీతాలు వస్తాయి. ఇంక నా విషయానికి వస్తే, ఆ చాన్స్ నాకే దొరికితే హోటల్లోంచి ముందుగా బయటికి నడిచి మీలాంటి వాళ్ళ మద్దత్తు కూడగట్టెస్తా.

    @వెంకట్
    Thank you for the clarification. I can understand the frustration that creeps in some times.
    ఇంక మార్పు విషయానికి వస్తే, నాకు Michale Jackson పాట ఒకటి గుర్తొస్తుంది. ..which runs like this "If you want to change the world, change the man in the mirror"

    రిప్లయితొలగించండి
  8. inni maatlalu maatladE mundu.. manam asalu Votu evariki vEsam ani okka saari aalochiddam.. manam election lo votu veyyaka poyina kooda oka vedhava praja pratinidhi ayye avakaasam vundikada..

    so, janalani, vyavastha ni tittukOkunda.. ee paristhi maaradaaniki manam em cheyyalo aalochiddam.

    రిప్లయితొలగించండి
  9. 2nd అజ్ఞాత,
    Thank you for directing the discussion into proper way.
    కేవలం ఆలోచింపచేసే ప్రయత్నమే తప్ప, వ్యవస్థనీ, జనాలనీ తిట్టడం ఈ టపా వుద్దెశ్యం ఎంత మాత్రం కాదు.

    కనీస అవసరాలు కూడా తీరని వాళ్ళు ఆత్మగౌరవం గురించి పట్టించుకోకపోతే అర్థం చేసుకోవచ్చుగానీ, సమాజానికి నాయకులుగా చెలామణి అయ్యేవాళ్ళు ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటే ఏమనాలి?

    రిప్లయితొలగించండి
  10. ఆ పొలిటీషియన్స్ అనబడే వెధవలకు ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఇంక దానికి గౌరవమా? కొంతమందికి మిగిలివున్నా అది అర మాత్రమే. వున్న అర (రూం) తలుపుకు తాలమేశారెపుడో.

    రిప్లయితొలగించండి
  11. sathi గారూ,
    మన సమాజంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందండీ. ఎందుకనో మనం మంచి నాయకులని తయారు చేసుకోలేకపోతున్నాం. ఉన్న కొద్దిమంది నాయకులకు సరైన ద్వితీయ శ్రేణి లేకపోవడం తో వాళ్ళు కూడా కొంత వెనకడుగు వేయాల్సివస్తుంది. నేనైతే నా పరిధిలో గట్టిగానే ప్రయత్నిస్తా అర్థం చేసుకోవడానికీ, మార్పు తేవడానికి. చూద్దాం..

    రిప్లయితొలగించండి