12, జూన్ 2010, శనివారం

వాట్ వుయ్ థింక్ ఈజ్ వాట్ వుయ్ గెట్...

మన రాజకీయాలనీ, రాజకీయ చర్చలనీ చూస్తె నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే, అసలు విషయాన్ని వదిలి, ఎవరో పనికిమాలిన వాళ్ళు మన నెత్తిన రుద్దే మసాలా కబుర్లనే అమాయకంగా రాజకీయ అజెండాగా స్వీకరించేస్తున్నాం చాలా వరకూ!


ఉదాహరణకు, గత రెండు నెలల్లో ప్రాధమిక విద్యా హక్కు చట్టం కంటే, ఏనాయకుడు ఏవర్గంలో ఉన్నాడనే దానిమీదే ఎక్కువ చర్చ జరిగుంటుంది (విద్యా హక్కు చట్టం ప్రాముఖ్యత ఏంటో తెలిసి కూడా). సంక్షేమం,అభివృధ్ది ల గురించి కంటే ఎవరు ఏ పార్టీ లో చేరతారనే దాని మీదే ఎక్కువ చర్చ జరిగుంటుంది కదూ!


అవగాహనా లోపం వల్లో, అలక్ష్యం వల్లో ఎంతోమంది మేధావులూ, విజ్ఞులూ కూడా ఈ ఉచ్చులో పడుతుండడం దురదృష్టకరం . రాజకీయం ఏ విషయాల మీద నడవాలో అజెండా ప్రతిపాదించాల్సింది మనం కాదా? రాజకీయాల ఉచ్చులో మనం పడకుండా మనమే అజెండా నిర్ణయించి, నాయకులే మన దారిలో నడిచేలా చేస్తే ఎంత బాగుంటుందో కదా!  గాడి తప్పుతున్న మన ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రజల ఆదీనంలోకి తెచ్చుకోవడానికి ఏం చెద్దామో, బ్లాగర్లూ మీరే చెప్పండి...

1 కామెంట్‌:

  1. ఏంటి బ్లాగర్లూ చర్చ కుమ్మేస్తారనుకుంటే ఇలా నీళ్ళు చల్లేశారు.. OK. OK. అర్ధమయ్యింది..తరువాతి టపాలు ఇంత heavyweight కాకుండా చూసుకుంటా. సరేనా!

    రిప్లయితొలగించండి