17, జనవరి 2012, మంగళవారం

An ugly manifestation of వర్ణ(కుల) వ్యవస్థ

ఈ రోజు ఒక వార్తా పత్రికలో(AndhraJyothi) వచ్చిన వార్త ఇది. అసలేం జరిగింది, కధనంలో పోరపాట్లు ఎంతవరకూ ఉండొచ్చు అనేవి ఇంకా పెద్దగా తెలియదనుకోండి. కానీ, చాలా వరకు అక్కడ జరిగిందాన్ని అర్థం చేసుకోవచ్చు.

మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్లలో బోనాల వేడుక ఘర్షణకు దారి తీసింది. అందరూ కలిసి బోనాలు నిర్వహించాలన్న విషయంపై దళితులు, అగ్రవర్ణాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా కొందరు రాళ్ల దాడికి పాల్పడడంతో పోలీసులతో పాటు ఇద్దరు గాయపడ్డారు. ఏదుట్లలో ప్రతి ఏడాది సంక్రాంతి, కనుమల సందర్భంగా కోటమైసమ్మకు బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజు అగ్రవర్ణాలు, కనుమ రోజు దళితులు బోనాలు నిర్వహించడం చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే తాము కూడా సంక్రాంతినాడే బోనాలు తీసుకెళ్తామని కొందరు దళితులు ఇటీవల తహసీల్దార్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరున ఏదుట్ల పంచాయతీ ముందు కులవివక్షపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి రోజే దళితులు, అగ్రవర్ణాలు కలిసి బోనాలు తీసుకెళ్లాలని తహసీల్దార్ తీర్మానించారు.


అయితే 15న సంక్రాంతి సందర్భంగా అగ్రవర్ణాల వారు బోనాలకు వెళ్లకుండా టెంకాయలతో మైసమ్మకు మొక్కు తీర్చుకున్నారు. కొందరు దళితులు బోనాలు తీసుకెళ్తామని పోలీసులకు తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య బోనాలతో బయలు దేరారు. కోటమైసమ్మ గుడికి సమీపంలో కొందరు వారిని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్థులను చెదరగొట్టేందుకు యత్నించారు. అదే సమయం లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లో ఓ వైపు నుంచి రాళ్ల దాడి జరిగింది. దాడిలో పోలీసులతో పాటు రేమద్దులకు చెందిన రాములు, గోపాల్‌పేటకు చెందిన రఘు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దళితులు బోనాలను రోడ్డుపక్కనే ఓ అరుగుపై దించేసి వెళ్లిపోయారు. పోలీసులు గ్రామస్థులతో చర్చలు జరిపారు. బోనాలను పోలీసు వాహనంలో తీసుకెళ్లి పాఠశాల భవనంలో భద్రపరిచారు. సోమవారం దళితులు బోనాలకు వెళ్లాల్సి ఉన్నా, తాము వెళ్లబోమంటూ వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఉండడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

అందరూ ఒకే రోజు బోనాలు జరుపుంటే ఏంటి నష్టం? ఎందుకు జరుపుకోకూడదు ? ఇప్పుడక్కడ పోరాటాలు చేసి ఖండించి దళితులు కూడా సంక్రాంతి రోజే బోనాలు జరుపుకునేలా చేస్తే మనం బాగుపడిపోయినట్టేనా ?

దళితులతో కలిసి చేసుకునేట్టయితే మేమసలు బోనాలే చెయ్యం అని అగ్ర వర్ణాల వాళ్ళు అంటే ఏం చెయ్యాలి ?

అసలు మన మీదా మన మెదళ్ళమీదా ఈ అత్యంత దుర్మార్గమైన వర్ణ/కుల వ్యవస్థ ప్రభావం లేదా? పుట్టుకని బట్టే మనుషుల్ని అంచనా వేసే దురాచారం వేరు వేరు రూపాల్లో మనలో కూడా ఉందా ?

ఇటువంటి సంఘటనల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందీ, ఆచరించాల్సిందీ ఏంటి?

23 కామెంట్‌లు:

  1. వర్ణ వ్యవస్థ = కుల వ్యవస్థ really !!!

    రిప్లయితొలగించండి
  2. మీరడిగిన ప్రశ్నలకి నా అభిప్రాయాలు.

    >>> అందరూ ఒకే రోజు బోనాలు జరుపుంటే ఏంటి నష్టం? ఎందుకు జరుపుకోకూడదు ? ఇప్పుడక్కడ పోరాటాలు చేసి ఖండించి దళితులు కూడా సంక్రాంతి రోజే బోనాలు జరుపుకునేలా చేస్తే మనం బాగుపడిపోయినట్టేనా ?

    అందరూ ఓకే రోజు పండుగ చేసుకోవటం లో నష్టం ఏమీ లేదు. పండుగ అందరూ కలిసి జరుపుకుంటే ఏదో, ఎవరో బాగు పడిపోయినట్టు కాదు.

    >>>>దళితులతో కలిసి చేసుకునేట్టయితే మేమసలు బోనాలే చెయ్యం అని అగ్ర వర్ణాల వాళ్ళు అంటే ఏం చెయ్యాలి ?
    మీరు బోనాలు చేస్తే మేం బహిష్కరిస్తాం అని ఎవరైనా అంటే అది వారి ప్రాబ్లమే అవుతుందని నా అభిప్రాయం. దానికి ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. ఎవరికి పండుగ చేయాలనుకుంటే వారే చేసుకుంటారు.

    >>>> అసలు మన మీదా మన మెదళ్ళమీదా ఈ అత్యంత దుర్మార్గమైన వర్ణ/కుల వ్యవస్థ ప్రభావం లేదా?
    హ్మ్ మీ ఉద్దేశ్యం ఏంటి? మనం కూడా.. దళితులొస్తున్నారని గుడులకి వెళ్లటం, వినాయక చవితి ఊరేగింపులూ వాటినీ బహిష్కరిస్తామనా?
    అదే అయితే నా జవాబు: లేదు. అసలు ఆ వచ్చేవారి కుల మతాల గురించి పట్టించుకొను.

    >>> పుట్టుకని బట్టే మనుషుల్ని అంచనా వేసే దురాచారం వేరు వేరు రూపాల్లో మనలో కూడా ఉందా ?
    దురాచారం అంటే ఖచ్చితం గా చెప్పలేను..కానీ..
    వీళ్లు బ్రాహ్మలు మెతక వాళ్లయిఉంటారు, అక్షరాస్యులయి ఉంటారు.. వీళ్లు వైశ్యులు, వ్యాపార దృష్టి కలిగి ఉంటారు.. లాంటివి యెస్ ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను.

    ఒట్టి కులమని ఏముంది? చైనా వాళ్లిలా.. అమెరికన్స్ ఇలాంటి వారు అనుకున్నట్టే ఇదీ. కాదంటారా?

    >>>>ఇటువంటి సంఘటనల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందీ, ఆచరించాల్సిందీ ఏంటి?

    నాకైతే.. ఇలాంటి సంఘటనలు ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయన్నమాట.. అని అర్థమవుతుంది.
    ఆచరించాల్సింది : ప్రత్యేకం గా నాకేమీ తట్టట్లేదు. బహుశా.. ఎవరైనా ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తే.. 'అబ్బే! ఈ రోజుల్లో ఇంకా ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి? ' అని కొట్టి పారేయననుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రిష్ణప్రియ గారు,

      ఇటువంటివి జరిగినప్పుడు మన చుట్టూఉన్న సమాజాన్నీ అర్థం చేసుకునే ఆలోచనలు చెయ్యొచ్చు అనే ఉద్దేశ్యంతో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. సమయాభావం వల్ల బహుశా నేను ప్రశ్నలు సరిగ్గా రాయలేదనుకుంటా. మీ అభిప్రాయం చెప్పడం కంటే పరిక్షరాసినట్టు నా ప్రశ్నలకి సమాధానాలు మాత్రమే ఆలోచిస్తే ఎలాగండీ :)) OK. Jokes apart, I appreciate and value your opinion and comment. Let me clarify my thoughts on each of those points.

      >>"అందరూ ఓకే రోజు పండుగ చేసుకోవటం లో నష్టం ఏమీ లేదు. పండుగ అందరూ కలిసి జరుపుకుంటే ఏదో, ఎవరో బాగు పడిపోయినట్టు కాదు."

      పండగ ఎలా చేసుకున్నారు అనేది కేవలం అక్కడి సమస్య బాహ్యరూపమే. ఈ కులాల వాళ్ళతో కలిసి చెయ్యడమేంటి అనే ఆలోచనా ధోరణి అసలైన సమస్య. నా ప్రశ్న ఉద్దేశ్యం, బాహ్యరూపాన్ని ఎలాగోలా మార్చి అంతా బావుంది అనే పొరపాటు దృక్పథం రాకూడదు అని.

      >>"మీరు బోనాలు చేస్తే మేం బహిష్కరిస్తాం అని ఎవరైనా అంటే అది వారి ప్రాబ్లమే అవుతుందని నా అభిప్రాయం. దానికి ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. ఎవరికి పండుగ చేయాలనుకుంటే వారే చేసుకుంటారు."

      నిజమే. వీళ్ళతో కలిసి చెయ్యాల్సి వస్తే మేము బహిష్కరిస్తాం అనుకోవడం ఏవరికైనా ఉండే వ్యక్తిగతమైన చాయిస్. కాకపోతే, అది వారి ప్రాబ్లం మాత్రమే అవదేమో. అది ఒక సమాజంగా మనందరి ప్రాబ్లం. ఒక రూల్ లాగా ఎవరినీ మార్చలేము. కానీ, మన సమాజంలో చాలామంది వ్యక్తిగత చాయిస్ కి వర్ణాలూ, కులాలు లాంటి ప్రాతిపదికలు ఉన్నాయి అనేది గుర్తించవలసిన అవసరం ఉంది అని భావిస్తున్నున్నాను. ఎందుకంటే ముందు సమస్యని నిజాయితీగా గుర్తించగలిగితే, తరువాత అన్ని వైపులా ఉన్న ఇబ్బందులని అర్థం చేసుకొని పరిష్కారం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది.

      >> హ్మ్ మీ ఉద్దేశ్యం ఏంటి? మనం కూడా.. దళితులొస్తున్నారని గుడులకి వెళ్లటం, వినాయక చవితి ఊరేగింపులూ వాటినీ బహిష్కరిస్తామనా? అదే అయితే నా జవాబు: లేదు. అసలు ఆ వచ్చేవారి కుల మతాల గురించి పట్టించుకొను.

      మీ అబిప్రాయాల ఉన్నతికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. నా ప్రశ్న ఉద్దేశ్యం అది కాదు. ఆ వూర్లో ఉన్నవాళ్ళ అవగాహన ప్రకారం దళితుల్ని రాకుండా చెయ్యడం అనేది వాళ్ళకి కుదరని పని కాబట్టి, వేరు వేరు రోజుల ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే నేను పైన చెప్పినట్టు మూల కారణం అలాగే ఉందనిపిస్తుంది. అలాగే మనలో కూడా మనకి తెలియకుండా వ్యక్తిగత చాయిస్ గా రూపం మార్చుకొని చలామణి అవుతున్న పాత వాసనలు ఉన్నాయేమో అని ఒక్కసారి పరిశీలించుకుంటే మంచిది అని.

      >>> పుట్టుకని బట్టే మనుషుల్ని అంచనా వేసే దురాచారం వేరు వేరు రూపాల్లో మనలో కూడా ఉందా ?
      >>"దురాచారం అంటే ఖచ్చితం గా చెప్పలేను..కానీ.. వీళ్లు బ్రాహ్మలు మెతక వాళ్లయిఉంటారు, అక్షరాస్యులయి ఉంటారు.. వీళ్లు వైశ్యులు, వ్యాపార దృష్టి కలిగి ఉంటారు.. లాంటివి యెస్ ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను. ఒట్టి కులమని ఏముంది? చైనా వాళ్లిలా.. అమెరికన్స్ ఇలాంటి వారు అనుకున్నట్టే ఇదీ. కాదంటారా?"

      బహుశా నా ప్రశ్న సరిగ్గా లేని కారణం వల్ల మీ సమాధానం అసలు సమస్యని ట్రివియలైజ్ చేసినట్టుగా ఉంది. మీరన్నటువంటి స్టీరియో టైపింగ్ వేరే విషయం. ఇక్కడ నేను అడుగుతుంది.. పలానా కులం వాళ్ళూ లేదా పలానా జాతి వాళ్ళు, కాబట్టి వాళ్ళతో కలవకూడదు, వాళ్ళు వండినవి తినకూడదు, తక్కువ మనుషులుగా చూడాలి లాంటి భావజాలాల బాహ్య రూపమైన అంచనాల గురించి నేను ప్రస్తావించాను.

      >>"నాకైతే.. ఇలాంటి సంఘటనలు ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయన్నమాట.. అని అర్థమవుతుంది. ఆచరించాల్సింది : ప్రత్యేకం గా నాకేమీ తట్టట్లేదు. బహుశా.. ఎవరైనా ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తే.. 'అబ్బే! ఈ రోజుల్లో ఇంకా ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి? ' అని కొట్టి పారేయననుకుంటాను."

      I appreciate your thoughts.

      తొలగించండి
    2. WP gaaru,
      sooooper clarification

      తొలగించండి
  3. ఇది వివక్షకి సంబంధించినదో కాదో చెప్పలేం గానీ.., ప్రతీ చోట ఒక ఆచారం, ఆనవాయితీ వస్తుంది. మీరు చెప్పిన చోట ముందురోజు ఒకరు, వెనకరోజు ఇంకొకరు చేసుకుంటున్నట్టూ వస్తున్నట్టు అర్థమౌతోంది. అంతేగానీ దళితుల్ని పూర్తిగా రానివ్వకపోవడం ఏమీ లేదు కదండి..! ఇందాకన్నట్టు, ఒక్కోచోట ఒక్కో ఆనవాయితీ ఉంది.

    ఉదాహరణకి, తిరుపతిలో (ఇది ఎవరో చెప్పగా విన్నది., తప్పయైతే చెప్పగలరు) ప్రతీరోజూ ముందుగా దర్శించుకొనేది ఆలయ పూజారులు కాదు., ఒకప్పుడు ఆ వేంకటేశుని విగ్రహం కనుగొన్న ఆవు యొక్క సంతానం, అంటే ఇంకో ఆవు వెళ్తుంది(ట), ఆ తర్వాత దాని యజమాని (ఒక గొల్లవాడు) అంటే కథలోని ఆవుయొక్క కాపరి వంశంవాడు వెళ్తాడట, ఆ తర్వాత దూరం నుండి అన్నమాచార్య కీర్తన వినిపిస్తారట.. అప్పటివరకూ వేరెవ్వరూ గర్భగుడిలోకి వెళ్ళరట..! పైన చెప్పిన సందర్భంలోది కులవివక్ష అయితే, ఇది కూడా కులవివక్షే అవుతుంది..! ఖండించేద్దామా..?

    పూరీ జగన్నాధుని రథం కదలాలంటే రాజుగారు బంగారు చీపురుతో దారిని శుభ్రం చెయ్యాలి...! ఇదీ కులవివక్షే..! ఖండించేద్దాం..!

    చాలా ఆచారాలు కులాలమీద ఆధారపడి ఉంటాయి.. ముందెళ్ళినవారు గొప్పవారూ కాదు., వెనక ఉన్నవాళ్ళు తక్కువవాళ్లు అంతకన్నా కాదు...! ఇది నా ఉద్దేశ్యం

    రిప్లయితొలగించండి
  4. ఇది నిజమే. తిరుమలలో స్వామివారిని మొదటగా దర్శించుకొనేది ఒక యాదవుడు. అతడిని సన్నిధి గొల్ల అంటారు.

    రిప్లయితొలగించండి
  5. I think this incident is just a reminder that caste based discrimination can still be seen in rural(or some parts of) India and it might take some time (hopefully not very long) to be completely erased out of the Indian mindset.
    "ప్రతీ చోట ఒక ఆచారం, ఆనవాయితీ వస్తుంది" ... this might be true, but this tradition should not be in such way that it is meant to make a set of people inferior citing their birth as a reason for it, as long as that does not happen, there is no problem in continuing with that tradition.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాతగారు..!
      // this incident is just a reminder that caste based discrimination//
      Don't you think that "Caste Based Reservations" comes to the same category..? (It's based on birth only..!). Then how can hope for a society where a mindset which is out of all such feelings..?

      I donno about this particular incident, much clearly.. even though I can state that it seems to be a incident not at all related to "Caste discrimination"..

      First of all The M.R.O (Tahasildar) has no right to involve(or alter) the tradition. He might be misunderstood that tradition is based on discrimination. There can also be possibility of some people's hand beyond this incident, who tried to badly influence the so called "dalits" at that village..
      (Sorry for my Bad english)

      తొలగించండి
  6. @ అజ్ఞాత(Jan 17, 2012 02:39 AM)

    >>"వర్ణ వ్యవస్థ = కుల వ్యవస్థ really !!!"

    నేనైతే రెండూ ఒకటే అనుకుంటున్నానండీ. కాదా ?! వర్ణవ్యవస్థలో సబ్ క్లాసిఫికేషనే కులవ్యవస్థ. అంతే గానీ వర్ణవ్యవస్థ పునాదిగా లేని వేరే ప్రాతిపదికతో కులవ్యవస్థ ఉందని నేననుకోవట్లేదు.

    మీ అభిప్రాయాన్ని వివరంగా చెప్పగలిగితే అర్థం చేసుకోవడానికి బావుంటుంది.

    రిప్లయితొలగించండి
  7. నష్టం జరిగింది కనుకే అది వార్త అయ్యింది. అందరూ ఒకే రోజు ఒకే సమయం అక్కడ పడి చావకపోతే బేచిల వారిగా వెళ్ళిండవచ్చు కదా. అసలు ఆ బోనాలు చేయమని ఏ హిందూ మత గ్రంధం వీళ్ళకు చెప్పింది? ఇంట్లో చేసుకోవచ్చు కదా. దీనికి వర్ణవ్యవస్థ, మనుస్మృతి, విషవృక్షము, వేదాలు అంటూ అని వేల ఏళ్ళ నాటి సంస్కృతిని, జీవన విధానాన్ని విమర్శించేముందు ఈ దేశంలో బోనాలు చేసుకోవాలని ఎక్కడ, ఎవరు చెప్పారు, ఏ ఏ ప్రాతాలవాళ్ళు, హిందూ మతం పుట్టిన గంగా సింధూ పారివాహక ప్రాంతాల్లో ఎంత శాతం బోనాలు చేసుకుంటున్నారు, వీళ్ళలో వర్ణాశ్రమ ధర్మాలు తు.చ. తప్పకుండా ఎంతమంది పాటిస్తున్నారు అనే విషయాలు అవకాశం దొరికింది కదా అని తగుదునమ్మా అని 5000ఏళ్ళ క్రితం జీవన విధానాన్ని వేలెత్తి చూపేముందు, కెలికేముందు కొద్దిగా ఆలోచించే అవసరం ఇంగితజ్ఞానం వున్న మనుషులందరూ ఆలోచిస్తే ఇలాంటివి వాటికి నిజమైన పరిష్కారం దొరుకుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారు,

      నిజమేనండీ. మీరన్నట్టు ఆలోచించడం, ఇంగితఙానం అనేవి కొరవడటం వల్లే ఎన్నో సమస్యలు కొరకరాని కొయ్యలుగా మారుతున్నాయి.

      బోనాలో, అశ్వమేధయాగమో ఏదోఒహటి లెండి. అసలు సమస్య వాటి గురించి కాదు. వాటి ద్వారా బయటపడిన సంకుచిత భావాల గురించి ఇక్కడ చర్చ.

      >>వేల ఏళ్ళ నాటి సంస్కృతిని, జీవన విధానాన్ని విమర్శించేముందు

      ఎవరు విమర్శించారు ? మీకెందుకు ఈ టపా అలా కనిపించింది? 5000 ఏళ్ళైతే ఏంటి, 10000 ఏళ్ళైతే ఏంటి? అసలు విషయం వదిలి ఏవో మనం ఊహించుకున్న వేలెత్తడాలూ, కెలకడాలూ వగైరాల గురించి మాట్లాడతం ఇక్కడ అసందర్భం అనిపించట్లేదూ మీకు !!

      తొలగించండి
  8. WP గారు,
    నేను ఈ మధ్యనే ఎకడొ చదివినది..
    వర్ణ వ్యవస్థ ఆర్యుల వలన వచ్చినది. గీత ప్రకారం మనిషి స్వభావమే దీనిని నిర్ణయిస్తుంది, పుట్టుక కాదు. కానీ ఆచరణ లో ఇది వేరే రూపం తీసుకొంది. దీనిలో నాలుగు వర్ణాలుంటాయి. వర్ణం అంటే రంగు అని కూడా అర్ధం కదా. ఉత్తర భారతం లో ఆర్యులు స్థానిక ద్రావిడులతో కలిసినపుడు ఈ నాలుగు రంగుల దేహ ఛాయని బట్టి వర్ణాలు నిర్ణయించారు. జన్యు సంకరం లేని స్థానిక జనాభా అంతా శూద్రులు అయినారు.
    కులం అనేది ద్రావిడులలో వర్ణ వ్యవస్థ కంటే ముందు నుంచీ ఉంది. ఇది వృత్తి ఆధారం గా ఏర్పడినది. వర్ణాన్ని ద్రావిడులు కులం గానే అర్ధం చేసుకొన్నారు.
    దక్షిణ భారతం లో నాలుగు వర్ణాలు లేకపోవటం మనం గమనించవచ్చు. తమిళ నాడులో క్షత్రియ వర్ణం లేదు, వైశ్య వృత్తి వారిని శూద్రులు గా పరిగణిస్తారిక్కడ, అలానే కేరళ కర్నాటక్లలో కూడా. మన రాష్ట్రం లో చాలా భాగాలలో నాలుగు వర్ణాలు లేవు.
    మన రాష్ట్రం లోని వైశ్య వర్ణం ద్రావిడ కుల మూలాలనుంచీ వచ్చినదే. క్షత్రియ వర్ణం కూడా ఒకప్పటి భూస్వామ్య శూద్ర కులమే!
    వర్ణ వ్యవస్థని కూడా కొంత దక్షిణాది వారు అనుకరించారు. ఉదాహరణకి తమిళ నాడు బ్రాహ్మణులలోని కొందరి దేహచ్చాయకీ, మిగిలిన శూద్ర కులాల దేహచ్చాయకీ బేధం ఉండదు. జన్యు పరం గా వారు ద్రావిడులేనని తేల్చారు.
    ఒక ప్రాంతాన్ని జయించిన బలమైన శూద్ర తెగలు, వర్ణ వ్యవస్థలో తమ అధికారం ఆధారం గా ప్రమోషన్ పొంది, క్షత్రియులుగానో, బ్రాహ్మణులు గానో మారటం అరుదేమీ కాదు.
    వీటి సిధ్దాంతీకరణ కి హరప్పా తవ్వకాలనీ వాటినీ ఆధారాలు గా చూపెడుతున్నారు. ఇవి ఇంకా పూర్తిగా నిరూపింపబడలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ bondalapati గారు,

      మీకు తెలిసిన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఆర్యుల వలన వచ్చిందా, ఇంకా ముందునుంచే ఉందా, కులాలనుంచి వర్ణాలొచ్చాయా, వర్ణాలనుంచి కులాలొచ్చాయా అనేవి పూర్తిగా నిరూపించబడని విషయాలు. నిజమే.

      మొత్తం మీద ఇవన్నీ సమాజం లోని సమూహాలకీ వ్యక్తులకీ ఉన్న క్లాసిఫికేషన్స్ అని అర్థం చేసుకొవడం అయితే అందరూ దాదాపుగా ఒప్పుకునే విషయమే అనుకుంటున్నాను.

      కాక పోతే, ఆ విభజనకి ప్రాతిపదిక ఏంటి? పుట్టుకా? పూర్వ జన్మలో చేసిన పాప/పుణ్యాల ఫలితమా? గుణగణాలా ? వృత్తులా ? ప్రాంతాలా? జాతులా? శరీరచ్చాయా? దీని మీద కూడా రక రకాల వాదనలున్నాయి.

      మీరన్నట్టు, "గీత ప్రకారం మనిషి స్వభావమే దీనిని నిర్ణయిస్తుంది, పుట్టుక కాదు" గీత ప్రకారం ఆ స్వభావాలు పుణికి పుచ్చుకోని ఆయా వర్ణాలలో పుట్టడం పూర్వ జన్మల లోని కర్మల ఆధారంగా జరుగుతుందని నేను ఎక్కడో చదివిన గుర్తు. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పాలి మరి.

      కులవ్యవస్థైనా, వర్ణవ్యవస్థైనా, ద్రావిడులు పెట్టినా, ఆర్యులు పెట్టినా సాటి మనుషుల్ని తక్కువ చేసి, జన్మాంతర కారణాల వల్ల అలా జరుగుతుంది అని చెప్పే పద్దతిని నేనైతే సరైందని అనుకోను. అటువంటి సిధ్ధాంతాల వేరు వేరు బాహ్య రూపాలు ఎక్కడ కనబడినా వాటిని చూసి నిజాయితీ గా ఆలోచించి అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి అని కోరుకుందాం.

      తొలగించండి
  9. @వామనగీత gaaru,
    Don't you think that "Caste Based Reservations" comes to the same category..? (It's based on birth only..!)
    I certainly think "Caste Based Reservations" come under the same category.

    I donno about this particular incident, much clearly.. even though I can state that it seems to be a incident not at all related to "Caste discrimination"..

    Well every one is free to make their deductions ...

    అయితే తాము కూడా సంక్రాంతినాడే బోనాలు తీసుకెళ్తామని కొందరు దళితులు ఇటీవల తహసీల్దార్‌కు తెలిపారు.
    If somebody wants to take bonalu on sankranthi day ... they should be free to do so.

    పోలీసు బందోబస్తు మధ్య బోనాలతో బయలు దేరారు.కోటమైసమ్మ గుడికి సమీపంలో కొందరు వారిని అడ్డుకున్నారు.
    Certainly shows that all sections of the people were not happy with dalits taking bonalu on sankranthi day and that tension prevailed.

    made me assume that there was a form of discrimination involved. Well if it is not, then it is a good thing.

    1. There can also be possibility of some people's hand beyond this incident, who tried to badly influence the so called "dalits" at that village..

    It could have been anything, possibilities are unlimted.

    రిప్లయితొలగించండి
  10. సోకాల్డ్ మతం, సంస్కృతి, సాంప్రదాయం అన్నీ సామాజిక వివక్షని రీన్ఫోర్స్ చేసేవే. అప్పట్లో అదే కరెక్టైతే కావచ్చుగాక, కానీ కాలంతో పాటూ మనుషులూ పురోగమించారు. అప్పటి విలువలు అమానవీయమైనవి, వివక్షాపూరితమైనవిగా గుర్తించారు. అందుకే ఆ వివక్షకు సమాధానంగా కొత్త చట్టాలు, కొత్త నియమాలు, కొత్త సాంప్రదాయాలూ వచ్చాయి.

    వాటిని వివక్షాపూరితం అని కొందరు అనుకుంటే, అలాగే ఇంకా చాలా మంది అనుకుంటే మళ్ళీ అవీ మారతాయి. కొత్త మతాలు, కొత్త సంస్కృతులు, కొత్త సాంప్రదాయాలు పుడతాయి. ఐదువేల సంవత్సరాల గొప్ప సంస్కృతి లాంటి మిథ్స్ శుష్కవాదం తప్ప మరొకటి కాదు. ఏదీ స్థిరంగా లేదు. ఏదీ ఐదువేలసంవత్సరాల నుంచీ పర్మనెంటుగా ఉండిందీ లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మహేష్ గారు, సామాజిక మార్పుల గురించి మీరు చెప్పిన దాంతో చాలా వరకూ ఏకీభవిస్తాను.కాకపోతే...

      >> మతం, సంస్కృతి, సాంప్రదాయం అన్నీ సామాజిక వివక్షని రీన్ఫోర్స్ చేసేవే.

      మతం, సంస్కృతి, సాంప్రదాయం అనేవి సామాజిక వివక్షని రీ ఇన్ ఫోర్స్ చేసే వాదనల్లో వాడుకోబడుతుండొచ్చు కానీ అసలవన్నీ ఉండేదీ వివక్షని రీ ఇన్ ఫోర్స్ చెయ్యడానికే అనేది ఓవర్ స్టేట్మెంట్ అనిపిస్తుంది.

      >> అప్పట్లో అదే కరెక్టైతే కావచ్చుగాక

      ఏ అధారంతో చెబుతున్నారు ? అప్పట్లో అదే కరెక్టని? ఊరికే అలా అనేశారా? అప్పట్లో అదే కరెక్టో కాదో మనం ఇప్పుడు చెప్పడం కష్టం. నా అభిప్రాయంలో మాత్రం కాలాలకతీతమైన ధర్మం ప్రకారం అప్పట్లో కూడా అది కరెక్ట్ కాదనే అనిపిస్తుంది.

      తొలగించండి
    2. ఐదువేల సంవత్సరాల గొప్ప సంస్కృతి లాంటి మిథ్స్ శుష్కవాదం తప్ప మరొకటి కాదు. ఏదీ స్థిరంగా లేదు. ఏదీ ఐదువేలసంవత్సరాల నుంచీ పర్మనెంటుగా ఉండిందీ లేదు.

      What a philosophy! What a myth(yaavaadam)! Hope WP would learn something from this and stop citing something fivethousand year old as reason for this. Once if the dark glasses are removed, everything can be seen clear.

      తొలగించండి
    3. అజ్ఞాత,
      మీరు అసలేం మాట్లాడుతున్నారు ? నేనన్నదాంట్లో మీకు అభ్యంతరకరమైనదేంటో చెప్పకుండా మీ అభద్రతనీ, అపోహలనీ నాకు అంటగట్టడం ఎందుకండీ ?

      తొలగించండి
  11. మతం అనేది ఎప్పుడూ ఉన్న వ్యవస్థనే సమర్థిస్తుంది. ఇండియాలో రాజులు అనేక హిందూ దేవాలయాలు నిర్మించారు కానీ బౌద్ధ, జైన దేవాలయాలు నిర్మించిన సందర్భాలు తక్కువ. ఒకవేళ హిందూ మతం కుల వ్యవస్థని అంగీకరించకుండా ఉంటే రాజులు ఈ మతానికి అంత patronisation ఇచ్చేవాళ్ళా? క్రైస్తవ మతం అప్పటి భూస్వామ్య రాచరిక వ్యవస్థని సమర్థించబట్టే రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతానికి ఆమోదముద్ర వేశారు. ఉన్న వ్యవస్థని సహకరిస్తూ ఉండడం మీదే మతం యొక్క ఉనికి ఆధారపడుతూ ఉంటుంది. చార్వాక, లోకాయత మతాలు ఉన్న వ్యవస్థని అంగీకరించకపోవడం వల్లే కదా అవి పాలక వర్గాల పాట్రొనైజేషన్ లేకుండా అంతరించిపోయాయి. హిందూ మతం పోయినంతమాత్రాన కుల వ్యవస్థ పోదు. హిందూ మతం నుంచి క్రైస్తవ, ఇస్లాం మతాలలోకి మారినవాళ్ళు కూడా కులాన్ని ఆచరిస్తున్నారు. కానీ కులవ్యవస్థ పోతే హిందూ మతం పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్న వ్యవస్థ పోయినప్పుడు దాని ఆధారంగా నిర్మించిన మతంతో అవసరం ఉండదు కదా.

    రిప్లయితొలగించండి
  12. కులవాదులు మతం పేరు ఎందుకు చెప్పుకుంటారో ఇక్కడ వ్రాసాను: https://plus.google.com/111113261980146074416/posts/6En54vpbQDT

    రిప్లయితొలగించండి