23, జనవరి 2012, సోమవారం

రష్డీ ఇండియాకి ఎందుకు రాకూడదు ?

సల్మాన్ రష్డీ రాసిన పుస్తకాల మీదా ఇంతకు ముందు వివాదాలు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు పుస్తకం మీద వివాదం అవసరమా, లేదా అనేది వేరే విషయం అనుకోండి.


ఆయన ఇప్పుడు మన దేశంలోకి రావటానికి వీల్లేదని కొంతమంది ఫత్వా జారిచేశారంట. ఆయన పుస్తకాలమీద విమర్శలు చేసుకోండి.. కానీ, అసలు రానియ్యం, రావటానికి వీల్లేదు అనటానికి వీళ్ళెవరు? ఇటువంటి బెదిరింపులకి దిగేవాళ్ళని కట్టడి చెయ్యాలిగానీ శాంతి భద్రతలకి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి రావొద్దని ప్రభుత్వాలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయం. బయటకొస్తే రేపులు జరుగుతున్నాయ్ కాబట్టి స్త్రీలెవ్వరూ బయటకి రావొద్దని చెప్పినట్టు లేదూ !


వివాదం మొదలయ్యి, కొంతమంది ఉన్మాదులు ఆయన్ని చంపడానికి బహిరంగంగా ఫత్వాలూ గట్రా జారీ చెయ్యడం జరిగాక ఆయనొక నాలుగైదు సార్లు ఇండియా వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా సమస్య ఏంటి అనే సందేహం రాక మానదు. కాకపోతే దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తుంది కాబట్టి, మన ఉన్మాదులంతా ఇదే సందు ప్రభుత్వాలని డూ డూ బసవన్న ఆడించడానికి అని అతిగా రెచ్చిపోయారు. ఈ ప్రభుత్వాలేమో అలవాటుగా తలాడిస్తున్నాయి అని సరిపెట్టుకోబోయాం గానీ.. ఇంకా ప్రమాదకరమైన విషయాలే ఇందులో ఉన్నట్టనిపిస్తుంది. అసలు వివాదమే ఎన్నికల కోసం సృష్టించబడింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుత్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే, అది అత్యంత దురదృష్టకరం, గర్హనీయం.


సాధారణంగా పార్లమెంటులో  మాట్లేడేటప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతారో అంతే అధ్వాన్నంగా బయట మాట్లాడగల మన ఒవైసీ మహాశయుడు గారు, తమ వంతుగా కొన్ని బెదిరింపులు (నర్మగర్భంగానే అనుకోండి) చేసి అవతల పడేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే తస్లీమా నస్రీన్ వచ్చినప్పుడు మన హైదరాబాద్ లో నానా వీరంగం సృష్టించారు. కాకపోతే, అలా చేసిన ఉన్మాదుల చర్యలని ఖండించి ప్రభుత్వాలు వాళ్ళకి ముందస్తుగా తలొగ్గలేదని సంతోషించాం. ఈ సారి మరీ తలదించుకునేలా ప్రభుత్వాలు ప్రవర్తించాయనడం లో తప్పులేదు. మీరేమంటారు?

12 కామెంట్‌లు:

  1. మీరు మత మౌధ్యం అనండి...చాందసవాదం అనండి.....అది కుడా మన భారత సంప్రదాయమే...MF హుస్సేన్ కానివ్వండి...సల్మాన్ రాష్ది కానివ్వండి..తస్లీమా నస్రీన్ కానివ్వండి.....సున్నిత విషయాల మీద రాళ్ళు వేస్తె భారతీయులు పులులు అయిపోతారు..పాకిస్తాన్ టీం గురించి IPL లో షారుఖ్ వాఖ్యనిస్తే శివసేన "పాకిస్తాన్ వెళ్ళిపో" అని షారుఖ్ ని హెచ్చరించారు ....అసలు దేశం విడిచి వెళ్ళిపో అని చెప్పటానికి ఈయన ఎవడండి ?? నేను ఆస్ట్రేలియా కు సపోర్ట్ చేస్తే ...నన్ను ఆస్ట్రేలియా వేల్లిపోమంటాడా??, ఎమన్నా అంటే .." మీ దేశభక్తి మీద మాకు అనుమానం" అన్నట్టు చూపు ఒకటి...దేశభక్తి అంటే ...లేదా చూపించాలి అంటే ..ఈయనలాగా అందరికి మంది మార్భాలం ఉండవుగా...

    సల్మాన్ రాష్ది ఇండియా రాకుండా ప్రభుత్వం పన్నిన పన్నాగమే అనుకుంటే.....ముస్లిం భారతీయులు అంత కళ్ళుమూసుకుని లేరు గుడ్డిగా నమ్మి ఓట్లు వేయడానికి....ఏది మంచో... ఏది చెడో ..ఎవరికీ వోట్లు వేస్తె తమకు రక్షణ ఉంటుందో అనే విచక్షణ జ్ఞానం ఉపోయోగిస్తున్నారు...అయిన సల్మాన్ రాష్ది ఒక భారతీయ ముస్లిములకే కాదు ప్రపంచ వ్యాప్త ముస్లిములకి అత్యంత "పీతి" పాత్రుడు...ఆయన కోసం వాళ్ళు ఇండియా మీద టార్గెట్ చేస్తే ...??? అందుకే ఆయన రాకపోవడమే మంచిది...

    ఇది నా అభిప్రాయమే దీన్ని మళ్లీ " ఫత్వా" అనుకునేరు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. raf raafsun గారు,

      MF హుస్సేన్ విషయమైనా, రష్డీ విషయమైనా, షారూఖ్ ఖాన్ విషయమైనా జరిగినదాంట్లో మనోభావాలు దెబ్బతిన్నవాళ్ళు విమర్శించడంలో నాకేమీ తప్పుకనిపించదండీ. వాళ్ళ మనోభావాలు గాయపర్చుకోవడం సరైనదా కాదా అనేది నేను నిర్ణయించాలనుకోను. కాకపోతే నేను వాళ్ళతో ఏకీభవించలేకపోవచ్చు.

      ఇక్కడ సమస్య ఏంటంటే ఎవడికి వాడు బెదిరింపులకి దిగడం, మా మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి మేము ఏమైనా చేస్తాం అనేలా ప్రవర్తించడం, చాందసవాదంతో మామూలు జనాలు అటువంటి ముష్కరులకి పాసివ్ సపోర్ట్ ఇవ్వడం. వీటిని ఖడించాల్సిన అవసరం అందరికీ ఉంది. కాదంటారా?

      దేశం విడిచి వెళ్ళిపోండి, మీరు భారతీయులు కాదు లాంటి చెత్త వాగుడు ఎవరు వాగినా వాళ్ళని మతోన్మాదులు అనుకోవడంలో తప్పులేదు. అలా అనే హక్కు ఎవరికీ లేదు.

      >>"ముస్లిం భారతీయులు అంత కళ్ళుమూసుకుని లేరు గుడ్డిగా నమ్మి ఓట్లు వేయడానికి....ఏది మంచో... ఏది చెడో ..ఎవరికీ వోట్లు వేస్తె తమకు రక్షణ ఉంటుందో అనే విచక్షణ జ్ఞానం ఉపోయోగిస్తున్నారు"

      మీతో ఏకీభవిస్తాను. అన్ని వర్గాల్లోనూ మెజారిటీ ప్రజలు గుడ్డిగా వోట్లు వెయ్యరు. ఆ నమ్మకంతోనే మన రాజకీయ వ్యవస్థ నడవాలి. అక్కడక్కడా కొన్నిసార్లు ఆ నమ్మకానికి వ్యతిరేకంగా జరిగినా అది శాశ్వతంకాదు.

      మీ ఆవేదన అర్థమయ్యింది. కానీ ఇక్కడ మనలాంటివాళ్ళంతా గమనించాల్సిన విషయమేంటంటే, ప్రజల్ని అటువంటి ఉన్మాదం వైపుగా నడిపించే ఏ ప్రయత్నాన్నైనా మనం వెంటనే ఎదుర్కోవడం చాలా అవసరం. లేకపోతే కొద్దిమంది ముష్కరుల అదుపాఙల్లో మొత్తం సమాజం బందీగా ఉండాల్సి వస్తుంది.

      తొలగించండి
  2. raf raafsun గారు,

    మీరు నా బ్లాగుకి రావటం ఇదే మొదటిసారనుకుంటా. స్వాగతం :)

    రిప్లయితొలగించండి
  3. హుస్సేన్ = రష్డీ అన్నట్టుగా రాసారు. మీరు ఖచ్చితంగా సూడో సెక్యులరిస్టు అయ్యుంటారు :P

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత, అసలు విషయం మీద చర్చించండి. నేను ఏంటి అనేది ఇక్కడసలు చర్చేకాదు.

      తొలగించండి
  4. anon,

    they both are same....both played with sensitive feelings...

    రిప్లయితొలగించండి
  5. అతన్ని రానివ్వక పోవడం ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం చెయ్యో, కాలో, తోకో వుందట, చర్చించండి.

    రిప్లయితొలగించండి
  6. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. the same one from yaraman's!

    ok sir! didnt realize you are this good! I cam to your blog and read some of your stuff...found that....you are needed here!!

    at the other place, let's forget our differences!
    you are good! you are not like that ROWDY guy at least!!
    he needs 1000 steps to reach you!!! but still......some dissatisfaction!!

    loose comments are not invited!!! anywhere! not particularly in YARAMANA's!! and then, that ROWDY is s*** and we everyone knows it!! please keep up with your work.....truth will always prevail..by the mercy of the almighty!!! his greed will be brought out!! he will be proved as a false one!! whoever the GOD is!! lets put it upto him!

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాత,

    I do not know who you are, but thanks for appreciating some of my stuff :) I am open for criticism and constructive discussion. I know none of us can be right all the times, I welcome you if you want to discuss on issues.

    ధన్యవాదాలు. నేను రాసిన దానిమీద చర్చించడానికీ, విమర్శించడానికీ ఎప్పటికీ స్వాగతం. నన్నేకాదు ఎవరినైనా వ్యక్తిగత దాడి లేకుండా చర్చించడం, విభేదించడం ఉత్తమమని అనుకుంటాను.

    దయచేసి ఇతరుల గురించి వ్యక్తిగత దాడి స్థాయిలో ప్రస్తావన తేకుండా ఉండటమే అందరికీ మంచిదండీ.

    రిప్లయితొలగించండి