సల్మాన్ రష్డీ రాసిన పుస్తకాల మీదా ఇంతకు ముందు వివాదాలు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు పుస్తకం మీద వివాదం అవసరమా, లేదా అనేది వేరే విషయం అనుకోండి.
ఆయన ఇప్పుడు మన దేశంలోకి రావటానికి వీల్లేదని కొంతమంది ఫత్వా జారిచేశారంట. ఆయన పుస్తకాలమీద విమర్శలు చేసుకోండి.. కానీ, అసలు రానియ్యం, రావటానికి వీల్లేదు అనటానికి వీళ్ళెవరు? ఇటువంటి బెదిరింపులకి దిగేవాళ్ళని కట్టడి చెయ్యాలిగానీ శాంతి భద్రతలకి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి రావొద్దని ప్రభుత్వాలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయం. బయటకొస్తే రేపులు జరుగుతున్నాయ్ కాబట్టి స్త్రీలెవ్వరూ బయటకి రావొద్దని చెప్పినట్టు లేదూ !
వివాదం మొదలయ్యి, కొంతమంది ఉన్మాదులు ఆయన్ని చంపడానికి బహిరంగంగా ఫత్వాలూ గట్రా జారీ చెయ్యడం జరిగాక ఆయనొక నాలుగైదు సార్లు ఇండియా వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా సమస్య ఏంటి అనే సందేహం రాక మానదు. కాకపోతే దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తుంది కాబట్టి, మన ఉన్మాదులంతా ఇదే సందు ప్రభుత్వాలని డూ డూ బసవన్న ఆడించడానికి అని అతిగా రెచ్చిపోయారు. ఈ ప్రభుత్వాలేమో అలవాటుగా తలాడిస్తున్నాయి అని సరిపెట్టుకోబోయాం గానీ.. ఇంకా ప్రమాదకరమైన విషయాలే ఇందులో ఉన్నట్టనిపిస్తుంది. అసలు వివాదమే ఎన్నికల కోసం సృష్టించబడింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుత్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే, అది అత్యంత దురదృష్టకరం, గర్హనీయం.
సాధారణంగా పార్లమెంటులో మాట్లేడేటప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతారో అంతే అధ్వాన్నంగా బయట మాట్లాడగల మన ఒవైసీ మహాశయుడు గారు, తమ వంతుగా కొన్ని బెదిరింపులు (నర్మగర్భంగానే అనుకోండి) చేసి అవతల పడేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే తస్లీమా నస్రీన్ వచ్చినప్పుడు మన హైదరాబాద్ లో నానా వీరంగం సృష్టించారు. కాకపోతే, అలా చేసిన ఉన్మాదుల చర్యలని ఖండించి ప్రభుత్వాలు వాళ్ళకి ముందస్తుగా తలొగ్గలేదని సంతోషించాం. ఈ సారి మరీ తలదించుకునేలా ప్రభుత్వాలు ప్రవర్తించాయనడం లో తప్పులేదు. మీరేమంటారు?