8, ఆగస్టు 2011, సోమవారం

వాళ్ళ సరదా వాళ్ళిష్టం మధ్యన నా ఏడుపేంది? నేనంత కూల్ కాదు మరి, ప్చ్..

హైదరాబాద్ లో టమాటా ఫెస్టివల్ జరుపుకున్నారంట కుర్రాళ్ళు. స్నేహితుల దినం సందర్భంగా.. జీవితం మళ్ళీదొరకదని ఈ మధ్యే తెలుసుకున్న పిల్లగాళ్ళు వీళ్ళంతా. మనకున్న పిచ్చి చాలదన్నట్టు ప్రపంచంలోని పిచ్చినంతా ఈ ఉన్న ఒక్క జీవితంలోకి ఎక్కించేసుకోవాలనే సరదా వీరిది పాపం. అసలు జీవితమనేదే ఒకటుందని తెలియని కోట్ల మంది ఉన్న సమాజంలోని వనరుల్ని వాడుకుని మెరుగైన జీవితం అనుభవిస్తున్న అతికొద్దిమందిమి మాత్రమే తామనే స్పృహ వీళ్ళకి లేనట్టుంది.


సంస్కృతీ, తొక్క లాంటి వాటి గురించి పక్కనబెడితే.. అసలు తినే పదార్ధాలని కొంతమంది సరదాలకోసం వాడుకోవడం పబ్లిగ్గా కొన్ని టన్నుల టమాటాలను వ్యర్ధం చెయ్యడం మన సమాజంలో చెయ్యతగిన పనేనా ?

బానే ఉంది టమాటా రైతులకి ఇది మంచిదేగా అనుకోనూ వచ్చేమో. అలా అయితే మొత్తం సమాజం ఎలా ఉన్నా నాకనవసరం అని కొంతమంది సరదాగా దేశంలో ఉన్న ధాన్యమంతా తీసుకొచ్చి ఒక ఆట ఆడుకుంటే ?

ఇది చిన్న సరదానే కావచ్చు కానీ, చాలా లోతైన ప్రశ్నల్ని లేవనెత్తే అంశమే. సంబంధిత అధికారులు దీని మీద సరిగ్గా స్పందించుంటే బావుండేది. ఇది సరైన చర్య కాదు అని చెప్పే సందేశం ఇచ్చి ఉంటే బావుండేది అనిపిస్తుంది. మాలూలు జనాలమీదకి కాలుదువ్వే అధికార యంత్రాంగం తలుచుకుంటే ఏదో ఒక సెక్షన్ దొరకదూ.. కనీసం ఇది తప్పూ అని చెప్పడానికి !!

ఈ మధ్య ఎవడుజూసినా యూతో యూతో అని వెరెత్తి పోవడం ఒక ఫ్యాషనైపోయింది. మరి మన యూతేమో పరమ బూతులా ఉంది. ఒక పక్క అవినీతి, తెలంగాణా సమస్య, రైతుల సమస్యలు, ఉద్యోగాలూ, విద్య, వ్యవసాయం, న్యాయ వ్యవస్థ, అధిక ధరలు ఇన్నిటిమీద దేశం అట్టుడికి పోతుంటే అవేమీ తమకి పట్టనట్టు బీరు దినాలూ, టమాటా తద్దినాలు జరుపుకుంటున్న మన యూతు బూతుని చూస్తుంటే ఇదేనేమో కూల్ యూతంటే అనిపిస్తుంది మరి.

అయ్యా హజారే బాబూ, మీ దీక్షలు ఇట్టాంటి పనికిమాలిన పోకడలని దూరం చేసేలా చైతన్యం నింపడానికి చెయ్యండి సారూ.. రాజకీయాలు వాటంతటవే బాగుపడతాయి.. జనాలు ఇట్లా తయారవుతుంటే మీరేంది సారూ పాపం రాజకీయ నాయకుల మీద పడ్డారు ! సమాజంలో ఉన్న జనాల క్వాలిటీ ఇలా ఉంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. యధా ప్రజా తధా నాయకా...

PS: Image taken from Sakshi news paper..

68 కామెంట్‌లు:

  1. :-( Sad. ఇంకో హిందీ సినిమా లో ఇంకోటేదో ఫెస్టివల్ చేస్తే,మనం వెంటనే అనుకరించేస్తాం అనుకోండి.మన పక్కన మనుషులకి మౌలిక అవసరాలైన వాటిని ఇలాగ నేను కొనగలను కాబట్టి వ్యర్థ పరుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను.. అని కొందరు కొనేస్తే? --

    లా ప్రకారం ప్రశ్నించలేకపోవచ్చు.. కానీ సమాజం పట్ల కనీస బాధ్యత లేకపోవటాన్ని నేనైతే హర్షించలేకపోతున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకునే వ్యవస్థ మనది. మాకు బట్టలు చలవ చేసే పిల్లాడు 'ఏం తిన్నావ్ పొద్దున్న?' అని ఎప్పుడడిగినా 'కారం అన్నం' అంటాడు. టమాటాలు నలభై ఉన్నాయ్ మేడం. లేకపోతే మా అమ్మ టమాటా బాత్ చేస్తది మాడం. అన్నాడు. నిన్ననే. వాడే గుర్తొచ్చాడు టీ వీ లో ఈ 'ఫెస్టివల్' చూస్తుంటే..

    రిప్లయితొలగించండి
  2. "ఈ మధ్య ఎవడుజూసినా యూతో యూతో అని వెరెత్తి పోవడం ఒక ఫ్యాషనైపోయింది. మరి మన యూతేమో పరమ బూతులా ఉంది."నిజం చెప్పారు. వెగటు కలిగించే చేష్టలివి.

    రిప్లయితొలగించండి
  3. వీకెండ్, అదే నేను అడుగుతున్నా ? మీ ఏడుపేంది ?

    రిప్లయితొలగించండి
  4. (నేను ఒక కోణం లో)
    నేను కూడా అందులో ఉంటె ఎంత బాగుండేది :)))
    ( నేను మరొక కోణం లో )
    ఎంజాయ్ చెయ్యొచ్చు కానీ ఇలా వనరులని వృధా చెయ్యడం నాకు నచ్చదు
    ఎంతో కష్ట పడి ఉత్పత్తి చేసిన కరెంటు ని అబానీలు వృధాగా వాడుతున్నారు
    వారి కరెంటు బిల్ లక్షల్లో ఉంటుంది
    ఇక్కడ మనకి కరెంటు ఉండదు
    వనరులని వృధా చేసే సినిమాలకి నేను వెళ్ళను
    ఒక్క బైక్ కొన్నుక్కోవదానికే ఎంతో కష్ట పడతాం అలాంటిది ఎన్నో సుమో లని నాశనం చేస్తే కానీ ఒక సినిమా పూర్తవ్వదు

    @ చదువరి గారు
    ఇక్కడ వనరుల దుర్వినియోగం చూద్దాం ( కుర్ర చేష్టలు మామూలే కదా)

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాతా
    >>>మీ ఏడుపేంది ?
    ఇక్కడ కడుపు రగిలి పోతోంది
    ఒకటి నేను అక్కడ లేను :((((
    రెండోది టమాటాలు వృధాగా వాడుతున్నారు :((((

    రిప్లయితొలగించండి
  6. అక్కడ "టమాటాలు" చితికి పోతున్నాయి
    ఇక్కడ " టమాటాలు" దొరకడం లేదు

    రిప్లయితొలగించండి
  7. >>అసలు జీవితమనేదే ఒకటుందని తెలియని కోట్ల మంది ఉన్న సమాజంలోని వనరుల్ని వాడుకుని మెరుగైన జీవితం అనుభవిస్తున్న అతికొద్దిమందిమి మాత్రమే తామనే స్పృహ వీళ్ళకి లేనట్టుంది.

    very well written

    రిప్లయితొలగించండి
  8. నాకది స్నేహితులదిన౦ లా కాకు౦డా ఇ౦కేదో దిన౦ లా అవపడత౦ది .పాపం సమి౦చుగాక . నిన్న ఆ ఫోటో లు,వార్తా చూస్తూనే ఛి అనిపి౦చి౦ది. టా౦క్ బ౦డ్ పై విగ్రహాలు పడగొట్టిన దానికన్నా ఎక్కువ స్ప౦దన వస్తు౦దనుకొన్నా కాని ప్చ్ :).
    మనవారికి ఉన్న సామాజిక స్పృహ, స౦స్కృతి పై అబిమానమూ నేతిబీరకాయ చ౦దమన్న మాట. అది కాక

    ఈ నీచాలు చూడడం కన్నా విగ్రహాలు పక్కకు పోవడమే మ౦చిదయ్యి౦ది.

    ---------------------------------
    @@@అయ్యా హజారే బాబూ, మీ దీక్షలు ఇట్టాంటి పనికిమాలిన పోకడలని దూరం చేసేలా చైతన్యం నింపడానికి చెయ్యండి సారూ.. రాజకీయాలు వాటంతటవే బాగుపడతాయి.. అసలు జాతి మొత్తం ఇట్లా నిర్వీర్యం అయిపోతుంటే మీరేంది సారూ పాపం రాజకీయ నాయకుల మీద పడ్డారు. సమాజంలో ఉన్న జనాల క్వాలిటీ ఇలా ఉంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. యధా ప్రజా తధా నాయకా... @@@
    ------------------------------------

    well said.

    రిప్లయితొలగించండి
  9. @@@అయ్యా హజారే బాబూ, మీ దీక్షలు ఇట్టాంటి పనికిమాలిన పోకడలని దూరం చేసేలా చైతన్యం నింపడానికి చెయ్యండి సారూ.. రాజకీయాలు వాటంతటవే బాగుపడతాయి.. అసలు జాతి మొత్తం ఇట్లా నిర్వీర్యం అయిపోతుంటే మీరేంది సారూ పాపం రాజకీయ నాయకుల మీద పడ్డారు. సమాజంలో ఉన్న జనాల క్వాలిటీ ఇలా ఉంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. యధా ప్రజా తధా నాయకా... @@@

    దీనికి మాత్రం నాకు అభిప్రాయ బేధం ఉంది. సమాజానికి ఎవరు తోచింది వారు చేస్తారు. ఒకావిడ బ్లూ క్రాస్ అంటుంది. ఒకరు కొండ ప్రాంతాల వారికి రక్షణ అంటారు ఇంకొకరు స్త్రీల పక్షాన ఉంటారు. అన్నా ఇష్టం అన్నాది. ఆయన ఎజెండా ఆయనది..

    రిప్లయితొలగించండి
  10. క్రిష్ణప్రియ గారు,

    స్పందనకి ధన్యవాదాలు. అవునండీ సమాజం పట్ల అవగాహన లేక పోవడం అసలెందుకుండాలి అనే ఆటిట్యూడ్ కొంచెం ఆందోళన కలిగించే విషయమే.

    ఇంక మీరు విభేదించిన పాయింటుకొస్తే... నా ఉద్దేశ్యం హజారే గారి మీద విమర్శ కాదు. ఇటువంటి వాళ్ళ కోసమా ఆయనలాంటి వాళ్ళెందరో ఎన్నో రంగాల్లో పోరాడుతుంది అనే బాధని వ్యక్తం చేసే సెటైర్ మాత్రమే. బహుశా నేను అది సరిగ్గా వ్రాయలేదనుకుంటా.

    రిప్లయితొలగించండి
  11. ప్రత్యేక౦గా హజారే ని అన్నట్లు కాదుగా కృష్ణప్రియ గారు. ఇప్పుడు హజారే ఒక దేవుడు :)

    ఒక్కో దేవుణ్ణి ఒక్కోటి అడక్కుండా , దేవుడా అ౦టాము కదా :)

    అది కాక వీకె౦డ్ గారికి ఆ౦ధ్ర లో హజారే లా ఎవ్వరు కనిపి౦చలేదెమొ స్పూర్తి నివ్వగాలిగిన వారు .:)

    రిప్లయితొలగించండి
  12. @అజ్ఞాత,

    >> వీకెండ్, అదే నేను అడుగుతున్నా ? మీ ఏడుపేంది ?

    :)) అదేమరి నేనంత కూల్ కాదు మరి. ఏం చేస్తాం :(

    @ అజ్ఞాత(8 ఆగస్టు 2011 1:32 సా), Thank you

    రిప్లయితొలగించండి
  13. Apparao Sastri గారు,

    స్పందించినందుకు ధన్యవాదాలు. మీ రెండు కోణాల విశ్లేషణ చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మీ బాధంతా ఒక టపాగా రాసేయండి మరి ;)

    మీరన్నట్టు ఇక్కడ, సామాజిక స్పృహ అవగాహన వంటివే ముఖ్యమైన విషయాలు. కుర్ర చేష్టలని మరీ అతిగా విమర్శించడం కాకూడదు.

    రిప్లయితొలగించండి
  14. @ Mauli గారు,

    స్పందించినందుకు ధన్యవాదాలు.

    >> అది కాక వీకె౦డ్ గారికి ఆ౦ధ్ర లో హజారే లా ఎవ్వరు కనిపి౦చలేదెమొ స్పూర్తి నివ్వగాలిగిన వారు .:)

    అయ్యో ఎంతమాట. అలాంటిదేమీ లేదు లేండి. నా చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎంతో మంది స్పూర్తి నివ్వగల వాళ్ళేనండీ :)

    రిప్లయితొలగించండి
  15. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అదేదో దేశంలో ఇలా చేస్తున్నారని మనమూ అదే పోకడ పోతే ఎలా? వారి పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు.విదేశాల్నించి ఇలాంటి వాటిని త్వరగా దిగుమతి చేసుకుంటాంగానీ వారినుంచి మంచిని మాత్రం స్వీకరించం.

    రిప్లయితొలగించండి
  16. ఇది ఒక అనుకరణ అన్న విషయాన్ని, ఈ తంతువల్ల మిగతా జనాలకు కలిగిన ఇబ్బందిని పక్కనబెడితే, మనదేశంలో సమస్యలున్నాయి కాబట్టి అవితీరిపోయేదాకా అందరూ ascetism practise చెయ్యాలి అన్నట్లుంది మీరు రాసింది.

    ఇహ సాంస్కృతిక అభ్యంతరాల్ని(మనసంస్కృతి కాదు ఇలాంటివన్నమాట) పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.

    రిప్లయితొలగించండి
  17. మీ సామాజిక స్పృహతో వంద శాతం ఏకీభవిస్తున్నా. వీళ్ళ స్నేహితుల దినం చేయ. టమాటాల్లో పందుల్లా పొర్లుతున్నారు. :(
    ఇలాంటి జంతువులకు జన్మ నిచ్చిన ఆ తల్లిదండ్రులతో కలిపి వీళ్ళకు 3ఏళ్ళు కఠిన కారాగారశిక్ష విధించాలి.
    టమాటా రైతులు కూడా గిట్టుబాటు ధరలు లేక చలికాలంలో ప్రతిసారి రోడ్లమీద గుమ్మరించి పోయే వార్తలు వింటున్నాము, అక్కడ ఏ సాస్‌లు చేసే ఫ్యాక్టరీ ఐనా పెట్టి చావరు.

    రిప్లయితొలగించండి
  18. @Indian Minerva

    సమస్యలకు , వీరి సరదాలకు స౦బ౦ధ౦ ఉ౦డాల్సిన అవసరం లేదు, సరే. సంస్కృతి ని కూడా మర్చిపోదాము , ఈ వార్తను టెలికాస్ట్ చేసిన ,ప్రచురి౦చిన సమాచార సాధనాలకు సామాజిక స్పృహ ఉ౦డనవసర౦ లేదా.

    రిప్లయితొలగించండి
  19. శంకర్ గారు
    వీళ్ళు పందుల్లా పొర్లిన టమోటా లతో టమోటా సాస్ చెయ్యొచ్చు అనే ఆలోచన కలిగింది మీ కామెంట్ వల్ల :))
    ఇంతకీ కుళ్ళిన టమోటా లతో , రేటు రాక పారేసిన టమోటా లతో సాసులు , కుళ్ళిన మామిడి పళ్ళతో మాజాలు చేస్తారు అనేది నమ్మలేని నిజాలు.
    ఆ .... లేకపోతె ఎక్ష్ పోర్ట్ క్వాలిటీ పళ్ళతో తయారు చేస్తారా ఏమిటి ?
    ఇక్కడ ఎక్ష్ పోర్ట్ క్వాలిటీ అంటే " భారత దేశం లో తినకూడనివి" అని అర్ధం.

    రిప్లయితొలగించండి
  20. వీకెండ్ పొలిటీషియన్ గారూ,
    ఎంతోమంది పెద్దలు తప్పంతా యువతమీద నెట్టేసే ఆలోచనలో ఉన్నట్టున్నారు!! అలా అనుకుంటే అది నాణేనికి ఒకవైపు మాత్రమే. యువత అలా తయారవ్వటానికి కారణం కచ్చితంగా పెద్దవారి పెంపకము లోపమే అన్న విషయాన్ని ఎందుకో అంగీకరించం. నిజానికి యువతలో ఉన్న అనంత శక్తికి ఒక దిశ అంటూ ఉండదు దానికి వయసుతో వచ్చే 'అనుభవాలనే' మూసలు తోడవ్వటంవల్లనే శక్తికి ఒక దిశ ఏర్పడి దానికో పరమార్థం ఏర్పడుతుంది. యువత అనుభవలేమిని తిట్టుకుంటూనో లేదా వారంతే అనుకుంటేనో లేదూ అవహేళన చేస్తుంటేనో సాధించగలిగేది శూన్యం. ఇప్పటి పెద్దవారంతా ఆ దశను దాటి వచ్చినవారే కదా!
    వ్యక్తుల సరదాలు వారి సంపాదనమీద ఆధారపడి ఉంటాయి. వనరుల వినియోగం ఆ సరదాలమీద ఆధారపడి ఉంటుంది. సంపాదించే సామర్త్యం ఉన్నవారి నుంచి సమాజహితం కోసం ఆశించగలమే కానీ వారు ఎలా ఉండాలో ఎవ్వరమూ ఆదేశించలేము.
    ఇలాంటివాటిని 'జిహ్వకో రుచని సరిపెట్టుకోవటం' అత్యుత్తమ పరిష్కారం నా దృష్టిలో.

    రిప్లయితొలగించండి
  21. @ చిలమకూరు విజయమోహన్ గారు,

    వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    @ SNKR గారు,

    స్పందనకు ధన్యవాదాలు. మరీ అంత అవేశమయితే ఎలాగండీ :)

    రిప్లయితొలగించండి
  22. ఒక తెలుగు అమ్మాయి + ఐదు గురు అబ్బాయిలు కలసి తెలుగు అమ్మాయిని పైకి ఊపుగా,ఉత్సహం గా పైకి,కిందకు ఎగరేసి పిచ్చ, పిచ్చగా కలసి ఆనందిస్తూటే చూడటానికి కన్నుల పండుగుగా వున్నాది. సరైయిన వయసు లో సరైన పని. దానిని నిర్వహించిన నిర్వాహకులు అక్కడ టమాటా ఫెస్టివల్ కు మాత్రమే ఏర్పాట్లు చేశారా?

    రిప్లయితొలగించండి
  23. @ Indian Minerva గారు,

    Thank you for raising a very important question.

    >> మనదేశంలో సమస్యలున్నాయి కాబట్టి అవితీరిపోయేదాకా అందరూ Ascetism Practice చెయ్యాలి అన్నట్లుంది మీరు రాసింది.

    అది నా టపా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. మనం చేసే పనుల ద్వారా, మన సరదాల ద్వారా సమాజం మీద మనకున్న అవగాహనా, సమాజం పట్ల మన దృక్పధం తెలుస్తాయి. మిగిలిన వారి స్పందన వల్ల మన అవగాహన పెంచుకోవడానికి వీలవుతుందండీ.

    Ascetism Practice చెయ్యమనట్లేదు కానీ ఎవరికి వాళ్ళు తమదైన watertight compartment లో జీవించడం అనర్థదాయకమనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం.

    Its neither a big crime nor a great act of irresponsibility by these kids. We need to understand how much we need to work and in what direction in making these excellent folks better citizens of the country and the world.

    రిప్లయితొలగించండి
  24. @Mauli గారు: మీ ప్రశ్న రిపోర్ట్‌చేసిన విధానం గురించయినట్లైతే (అందులో అసభ్యత దొర్లినట్లయితే) తప్పకుండా అభ్యంతరకరమే.

    @Weekend Politician: గారు. ఏ చిన్న సమస్యనైనా భుజాలకెత్తుకొనేదీ యువతే కదండీ, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం కానివ్వండి మరోటి కానివ్వండి ముందుగా ఆకర్షితులయ్యేది కూడా యువతేకదా. మిగతా వాళ్ళుచేసేదంతా కూడా వాళ్ళని (మిస్)లీడ్ చెయ్యడమేకదా. అందుకనే కొంచెం సానుభూతితో స్పందించాను. పైగా అది మా ఏజిగ్రూపు కదా..... :-D

    "We need to understand how much we need to work and in what direction in making these excellent folks better citizens of the country and the world."

    Agreed!!

    రిప్లయితొలగించండి
  25. @అచంగ గారు,

    తప్పొప్పులు నిర్ణయించడం బాధ్యులని చెయ్యండం నా ఉద్దేశ్యం కాదు. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తే మనమేం చేయాలో ఎలా ఆలోచించాలో మెరుగ్గా బోధ పడుతుందనే ఆశ. అంతే.

    @ Indian Minerva,

    Thank you for standing up for "OUR" age group :D

    రిప్లయితొలగించండి
  26. @SNKR

    సాస్ ఫ్యాక్టరీ మీరే ఎందుకు పెట్టకూడదు?

    రిప్లయితొలగించండి
  27. తారా గారు
    ఆ సాస్ మీరు కొంటారా ? ( కిసుక్కు )

    రిప్లయితొలగించండి
  28. లేదు నేను వెటకారంగా అడగలేదు, ఎంతకీ ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం, యం.బి.య్యే చెయ్యడం, అమెరికా వెళ్ళడం కాకుండా, వ్యాపారం చెయ్యాలి నువ్వు పెద్దయ్యాక అని పిల్లలకి ఎవరూ చెప్పడం నేను ఐతే ఎప్పుడూ వినలేదు, వ్యాపారం ఎందుకు చెయ్యకూడదు?

    ఏ చిన్న చిన్న స్రూలు, నట్లు, చివరకి ఆడుకునే బొమ్మలు కుడా మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం, పూస్తకాల్లో ఉంటాయి బ్రీటీషోళ్ళు, (ఇప్పటికీ వీళ్ళు మనకి దొరలే), మన దగ్గిర ముడి సరుకు కొని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మనకే అమ్మేవాళ్ళు అని, మరి ఇప్పుడు భారత - చైనా వర్తకం చూడండి, ఎన్ని వస్తువులకి ముడి సరకు మనం ఇచ్చి, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నామో, చైనా నుంచి దిగుమతి చేసుకునేవి 90% మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు, ప్రభుత్వం సరే మరి ప్రజలు?

    SNKR గారి విషయంకి వస్తే, చదువున్నది, ఫ్యాక్టరీ పెట్టడానికి అవసరం ఐనవి అన్నీ సొంతగానో స్నేహితులతో కలిసి సమకూర్చుకో గల వనరులు ఉండే అవకాశం ఉన్నది, మార్కెటింగ్ మీద కొద్దిగా అవగాహనా, ధైర్యం ఉంటే చాలు.

    @Apparao Sastri అవును సుబ్బరంగా కొంటాను, ఎందుకు కొనను?

    రిప్లయితొలగించండి
  29. @ Indian Minerva, అసభ్యత గురి౦చి కాద౦డీ :)

    రిప్లయితొలగించండి
  30. వీకెండ్ పొలిటీషియన్ గారూ,
    మీ టపాలో చివరినుంచి రెండవ పేరా చదవగా నాకు కలిగిన అభిప్రాయం పైన చెప్పాను. అలాగే మనకి ఆసక్తి ఉన్న సమస్యలపై మిగిలిన వారికి ఆసక్తి ఉండకపోవచ్చు. చెప్పటమే మన ధర్మం వినకపోతే వారి ఖర్మం.

    రిప్లయితొలగించండి
  31. @ ఆ.సౌమ్య గారు,

    మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు.

    @ తార,
    after a loooong time !!! Welcome back :)

    రిప్లయితొలగించండి
  32. @ అచంగ గారు,

    ఆసక్తి గురించి కాదండీ అవసరం అని గురించే పరిస్థితులు లేవన్నదే బాధ. అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటారనేది నా నమ్మకం. You have to bear with my optimism :D

    Thank you for your views

    రిప్లయితొలగించండి
  33. మ్మ్... ఇక్కడ సంస్కృతి, యువత బాధ్యతలు గట్రా పక్కనపెడితే, అసలు ఇలాంటి సరదాలని ఏ స్నేహితుల రోజనో, మరోటనో కాకుండా రైతులు మద్దతు ధరలు లేక టమాటాలు రోడ్డు మీద పారేస్తున్నప్పుడు, వాటిని మంచి ధరకు కొని అప్పుడు చేసి ఉండవలసింది. వాళ్ళకు సరదా తీరేది, వీళ్ళకు డబ్బులూ వచ్చేవి !

    రిప్లయితొలగించండి
  34. కూరగాయల ధరలు పెరిగిపోతోంటే అవి కొందరి భోగాలకి అవసరమయ్యాయట!

    రిప్లయితొలగించండి
  35. ఈ స్నేహితుల దినం ఎప్పుడొచ్చింది? ఎక్కడ మొదలెట్టారు? నేను అమెరికాలో నలభై ఏళ్ళ బట్టీ ఉంటున్నా కానీ ఎప్పుడూ వినలేదు. ఇక్కడ పుట్టివుండదు.

    రిప్లయితొలగించండి
  36. కొంచం ఆలస్యంగా కామెంటుతున్నా
    కొత్త సంవత్సరం పార్టీ అని తిన్నంత తిని మిగతాది పారేసి, ఆనక అరక్క డోక్కునే వాళ్ళు.
    పుట్టిన రోజు పేరు తో వందలాది బూరలు ఊది సూదులతో పొడిచి పేల్చి ఆనందించే వాళ్ళు,
    పెళ్ళిళ్ళల్లో విస్తరి 500 /- అంటూ బలిసిన మారాజులకే మరింత కొలెస్ట్రాల్ పెంచి పనివాళ్ళని ఈసడించి మాడ్చేవాళ్ళు,
    అలాంటి కోవ లోకే వచ్చే ఈ టమాటో రోగగ్రస్తులు జబ్బు వంశ పారంపర్యం, పెద్దల ముదనస్తపు సంపాదన లోంచే ఇలాంటి విపరీత చేష్టలు.
    పాల్గొన్న అందరినీ, టీవీ వాళ్ళతో సహా కాడికి కట్టి ఎకరాలు దున్నించాలి !!

    రిప్లయితొలగించండి
  37. :)

    అదేదో సిరీస్‌లో మూడోది ఎప్పుడు? ఐ మీన్, వ్యవస్థ గురించి, వ్యవస్థలో ఉంటూ పోరాడటం గురించి.

    ఇక టపాకి వస్తే,

    యూత్తు సరే, దేవుడికి అని చెప్పి ఎన్ని అలంకారాలు చేస్తున్నారు కూరగాయలతో? వాటిల్లో సఘం ఐనా వేస్ట్ అవ్వవా? తరువాత పార్టీల్లో ఈ మధ్య కూరగాయలతో బొమ్మలని అవని ఇవని పెడుతున్నారు, అవన్నీ పారేసేవేగా చివరకి..

    సో, Every one take rational decisions.

    >>కొన్ని టన్నుల టమాటాలను వ్యర్ధం చెయ్యడం మన సమాజంలో చెయ్యతగిన పనేనా ?

    Provided its legal, may be, since "wastage" is not this alone.

    >>సమాజం ఎలా ఉన్నా నాకనవసరం అని కొంతమంది సరదాగా దేశంలో ఉన్న ధాన్యమంతా తీసుకొచ్చి ఒక ఆట ఆడుకుంటే ?

    :)), its not possible, imagine a scenario where you want to buy all the shares of a listed company through that exchange.

    >>అసలు జాతి మొత్తం ఇట్లా నిర్వీర్యం అయిపోతుంటే

    ఇది చాలా పెద్దమాట సారు, ఒక చిన్న ఉదాహరణ, ఎవరిదాకో ఎందుకు, మీరే ఉన్నారు, బ్లాగులు ఎప్పుడు రాస్తున్నారు? మీ కంపెనీ సమయంలో కదా? మరి ఇది కూడా ఒక రకమైన వేస్తేజే, ప్రభుత్వరంగంలో పని చేస్తూ, ఆఫీసు పని ఆపి, బజ్జులు, బ్లాగులు, ఫేస్ బుక్కుల్లో కాలక్షేపం చేస్తూ పనిని నిర్లక్ష్యం చేస్తూ, లెదా ఎలాగోలా చేసేసి బజ్జులు, బ్లాగులు రాసుకునేవారెందరు? మరి ఇవి అన్నీ ఎందరికి తిండిని దూరం చేస్తున్నాయి?
    మరి మీరందరూ సదరు "సమాజంలోని వనరుల్ని వాడుకుని మెరుగైన జీవితం అనుభవిస్తున్న అతికొద్దిమందిమి మాత్రమే తామనే స్పృహ వీళ్ళకి లేనట్టుంది" క్రిందే వస్తారు కదా.

    సరే మాది ప్రవేటు ఉద్యోగం అవసరం ఐతే గొడ్డు చాకిరీ చేస్తాం అంటారా?

    :)

    కొన్నిటికి సమాధానాలు చాలా కష్టం మాష్టారు, మాట అనెయ్యడం సులువే మనది కానప్పుడు.

    One needn't be perfect, at least we should try. I am not saying your opinion is quite wrong, you are quite right in my personal opinion, but that doesn't mean you (and I) are right, those kids are wrong, I can't say they should stop this, but at the same time I can't say they can do that...

    రిప్లయితొలగించండి
  38. తార గారు , బా చెప్పారు...ఇప్పుడే టివి తొమ్మిది విడియో చూసి, అబ్బ వీళ్ళ కన్నా మన దర్శకే౦ద్రుని సామాజిక స్పృహ ఎ౦త గొప్పది. పాటల్లో అన్నన్ని పళ్ళు వాడినా ఒక్కటి కూడా చితకదు నలగదు అనిపి౦చి౦ది

    అక్కడెక్కడో రాములక్కాయలు ఎక్కువై కక్కోచ్చే సీజన్ లో ఈ ఆట ఆడుకొ౦టారేమొ. మనకి అలా కాదుగా . పేపర్లో, టి వి లో చూసే జనాలకి ఎమోషన్స్ ఏడ్చాయి కదా.ఆ పిల్లల్ని కాదు , ప్రోగ్రాం నిర్వహి౦చినోడి దినం చెయ్యాల ఒక నాలుగైదు బుట్టలు కాకు౦డా క్వి౦టాల్ల తాజా కాయలను ఉపయోగి౦చిన౦దుకు.

    రిప్లయితొలగించండి
  39. /SNKR గారి విషయంకి వస్తే, చదువున్నది, ఫ్యాక్టరీ పెట్టడానికి అవసరం ఐనవి అన్నీ సొంతగానో స్నేహితులతో కలిసి సమకూర్చుకో గల వనరులు ఉండే అవకాశం ఉన్నది, మార్కెటింగ్ మీద కొద్దిగా అవగాహనా, ధైర్యం ఉంటే చాలు/
    :) hi taara, longtime no see?!
    ఇగ పోతే విషయానికి వద్దాము. ఆయనే వుంటే మంగలోడు ఎందుకనేగా చేత కాక ఇలా...
    రామోజీకి ఏం చదువుందని, పచ్చళ్ళలో MBA చేశాడా ఏంటి? త్రివేణీ వక్కపొడి మేస్టారికి వక్కపొడి చేయటంలో హార్వర్డ్ డిగ్రీ వుందా ఏమిటి? ఏదో అంతో ఇంతో, సామ్యవాదము, ఎకనామిక్స్, అసైన్సు,సాసుసన్సు తెలిసిన వారు టమేటా జ్యూసోయ్ బాబు జ్యూసు అని రైళ్ళలో అమ్మితే... మన అప్పారావుగారన్నట్లు కుళ్ళిందైనా కొని చచ్చి ప్రోత్సహించే వాళ్ళమే కాని.... సాసు బాటిళ్ళు అమ్మలారా అక్కలారా రెండుకొంటే ఓకటి ఉచితం అంటూ ఇంటింటా తిరిగి అమ్మే ఓపిక .. అహా నావల్ల కాదు. :)) అసలే ఎర్రరంగు అంటే కుజుడు, వక్రకంట శని్ఇంట రాహువు నీచ నూ. నా జాతకానికి పడదు, నన్నొగ్గేయ్.

    రిప్లయితొలగించండి
  40. 8 ఆగస్టు 2011 6:28 సా
    తార చెప్పారు...
    :O :) అరే ఏమైందీ.... రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ...
    Over to Praveen Sharma.. to reply Tara. ;)

    రిప్లయితొలగించండి
  41. @ Ruth గారు,
    :) ధన్యవాదాలు

    @ ఫ్రవీన్ శర్మ గారు, Thank you.

    @ Rao S Lakkaraju గారు, అదే తెలియదండీ :) ఈ మధ్య దినాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి లెండి. Thank you for your comment.

    రిప్లయితొలగించండి
  42. @ ఆత్రేయ గారు,

    మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. అవును మీరన్నది నిజమే. అనేక సందర్భాలలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనం కూడా చాలా సార్లు చేస్తూనే ఉంటాం ఇలాంటి పనులు :(

    రిప్లయితొలగించండి
  43. మొన్న ఈనాడులోనూ యాణ్ణో టమాటా ఫెస్టివల్ అని హెడ్లైను చూసి హా బొంగులే యాణ్ణో ఐరోపాలోకదా అనుకుని సదవను కూడక సదవల్యా.
    అమ్మనీ!! ఇది హైద్ లోనా జరిగింది. భేష్.
    మరే!! మన యూత్ ఎంత ఆలోచనా పరులో. సూడండి పై బొమ్మలో, ముద్దుగుమ్మని మగపిల్లకాయలు ఎట్టా ప్రేవగా ఆదిపిస్తన్నారో...
    బాబూ వారాంతపు రాజకీయ వేత్తా, కుళ్ళుకోమాక పుసుక్కున. సూసి నేర్చుకోవాల టమాటాల్తో ఏట్టా పేవ పుట్టించుకోవాలో, హా!

    టమాటాల్ని రాంములక్కాయలు అంటం మేము. కాళ్ళకింద ఏసి మరింకాణ్ణో ఏసి తొక్కాలంటే ఆపేరు పెట్టి, మా పాత తరానికి కూసింత కట్టవే రాజకీయవేత్త గారూ!!

    రిప్లయితొలగించండి
  44. తార,

    :) మూడో కథలో కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి లెండి. అందుకే పక్కన బెట్టా. అన్నీ కలిపి ఒకేసారి రాస్తా.

    నిజమే వేస్టేజ్ అనేది ఇక్కడొక్కచోటే జరుగుతుందని కాదు. చాలా చోట్ల మనమే చేస్తూంటాం. ఎక్కడిదాకో ఎందుకు.. ఎప్పుడైనా సినిమాకెళ్తే 1500/- దాకా ఖర్చు పెడతాం. ఈ సమాజంలో అదీ బాధ్యతా రాహిత్యమే కదా.

    ఎవరైనా 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. మనందరిలోనూ ఉండే లోపాలే ఇతరుల్లో కనిపించినప్పుడు బయట పడి చెప్తాం అంతె. కాకపోతే అలా చేసేప్పుడు మనల్ని మనం కూడా కొద్దిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

    మనం అనుకునేది కరెక్ట్ అని చెప్పలేం. అలా అనుకోవడం కూడా సరికాదు అనే విషయంలో మీతో అంగీకరిస్తాను. అందుకే మన ఆలోచనల్ని ఇతరులతో పంచుకోవడం ప్రాక్టికల్ గా వాటిని సరి చూసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ.

    As I told in one the comments above..

    "Its neither a big crime nor a great act of irresponsibility by these kids. We need to understand how much we need to work and in what direction in making these excellent folks better citizens of the country and the world."

    It is important to define the level of abstraction at which we are talking and talk in that plane. Shifting between different levels of abstraction takes us nowhere..and we will end up not doing or expressing anything. As far as I am concerned, I would prefer to think the issue through all the levels (that my limited powers can enable me)and while expressing it I would prefer to express it at a level of abstraction that is in tune with the context.

    I am sure you are getting what I am trying to say :)

    రిప్లయితొలగించండి
  45. >>మీ రెండు కోణాల విశ్లేషణ చాలా ఆసక్తిదాయకంగా ఉంది.<<
    వీకెండు గారూ!
    ఆసక్తిదాయకం?
    అంటే ఏంటండీ?
    ఆసక్తికరం అని విన్నాను. ఆసక్తిదాయకం ఎప్పుడూ వినలేదే?

    రిప్లయితొలగించండి
  46. భాస్కర్ రామరాజు గారూ,

    టపా మీద స్పందించినందుకు ధన్యవాదాలు. నేనైతే ఆసక్తికరం అనే ఉద్దేశ్యంతొనే రాశానండీ. మీరు చెప్పాక ఆలోచిస్తే.. నిజమే పొరపాటు అయ్యుడొచ్చు అనిపిస్తుంది..

    హ్మ్మ్.. ఒకవేళ ఆసక్తి దాయకం అనే పదం ఉండుంటే.. బహుశా రెంటి మధ్యా కొద్దిగా తేడా ఉండి ఉండొచ్చు..

    ఆసక్తికరం --> ఆసక్తి కలిగించేది (interesting)
    ఆసక్తి దాయకం --> ఆసక్తి కలిగేలా చేసేది (evokes interest)

    ఎవరైనా కొత్త పాళీ గారి లాంటి పెద్దలు చెప్పాల్సిందే.. నాకైతే సరిగ్గా తెలియదు మరి.

    రిప్లయితొలగించండి
  47. టమాటోల గోల ఒదిలి
    ఈ వ్యాకరణ తర్క మీమాంస ఏల?
    రామాయణం తరలి
    గొబ్బెమ్మెల మీద పడ్డట్టు !!

    రిప్లయితొలగించండి
  48. ఆత్రేయ గారూ
    రామాయణం గతం
    గొబ్బెమ్మ కండ్లముందుది.
    రామాయణం వింటూ గొబ్బెమ్మని తొక్కితే మరి ఎలా?
    [అర్థం అవ్వలేదా? నాక్కూడా :)]

    రిప్లయితొలగించండి
  49. SNKR గారు,

    >>:) hi taara, longtime no see?!

    సున్నాలు ఒకట్లు మీద పడ్డా..,
    లేటెస్ట్‌గా 0=1 ఎప్పుడు అవ్వుద్ది, అసలు సున్నానే లేకపొతే దాన్ని ఎట్టా అరువు తెచ్చుకోవాల ఇలాంటి విషయాలు తెలుసుకుంటున్నాను, ఎంత ఫేక్ ఐనా ఏదో ఒకటి చేస్తుండాల కదా.
    ఇవి బ్లాగుల్లో ఐతే రాయను, ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటాయి అని నేను అనుకోను, పోనీ రాసినా 0 = 1 అవ్వుద్దా అని ఓ ప్రశ్న అడిగితే అప్పారావుగారి నారద బ్లాగులో కామెంట్లకి తప్ప పెద్దగా ఆలోచిస్తారు అని నేను అనుకోను.

    అంతెందుకు ఎకానమీని కార్మికుల దృష్టి కోణంలోనే చూడాలి అని తేల్చేసారు, అట్టా కాదు, ఈక్వలీబ్రియం ఒకటే ఉంటుంది అని 1953లో ప్రూవ్ వచ్చింది, అదెవడికి తెలుసు? ఊహూ మన పేపర్లు ఏది చూడు ఏదో భూమి పుట్టకముందు మార్క్సు ఏదో చెప్పాడు అనే తప్ప, అది నిజమో అబద్దమో వీళ్ళకి తెల్వద్, కానీ వీళ్ళే మళ్ళీ ఎనలిస్టులు, కళాకారులు, కవులు పైగా మేధావులు :)

    మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీక్కుడా నేను రాసుకుంటున్నవి సి.సి. పెడతాను..

    రిప్లయితొలగించండి
  50. >>ఎప్పుడైనా సినిమాకెళ్తే 1500/- దాకా ఖర్చు పెడతాం. ఈ సమాజంలో అదీ బాధ్యతా రాహిత్యమే కదా.

    చదువు మనలోని మూర్ఖత్వాన్ని బయటపెడుతుంది :) (జెనరల్ గా రాసాను ఇది)
    ఇంజనీరింగ్లో నేను ఇదే అనుకునేవాడ్ని, కానీ అసలేమీ ఖర్చు పెట్టకపోతే పనులెలా అవుతాయి, ఐమీన్, సినిమా పరిశ్రమ నడవాలి అన్నా, పాప్కార్న్ అమ్ముకునే కుఱ్ఱోడు బ్రతకాలి అన్నా అప్పుడప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టాలేమో కదా, మన ఖర్చు వలనే ఉపాధి పెరుగుతుంది, ఇహ, ఎంత ఖర్చు పెట్టాలి అంటే, 30% సేవింగ్స్ ఉంటే కనుక ఆ దేశం త్వరగా అభివృద్ది చెందుతుంది అట (Stanley), కాబట్టి, మీకు 30% సేవింగు ఉంటే ఈ ఖర్చు పెట్టినా అది భాద్యతా రాహిత్యం అవదులేండి.

    >>ఎవరైనా 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు

    మీరన్నారని నేను అనలేదు.

    >>అందుకే మన ఆలోచనల్ని ఇతరులతో పంచుకోవడం ప్రాక్టికల్ గా వాటిని సరి చూసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ.

    సరైన వారితో పంచుకోవడం ఏమో, బాబా రాందేవ్‌ని అడిగితే క్లోస్డ్ ఎకానమీ మంచిది అని చెబుతాడు, ఎట్టా తెలిసిందట?? ఏదో లాజిక్ చెబుతారు, కానీ లాజిక్ వేరు సైన్సు వేరు, సైన్సు నిజాల మీద ఆధారపడి ఉంటుంది, ఇజాల మీద, లాజిక్ మీద కాదు, ఎకనమిక్స్ గురించి మాట్లాడాలి అంటే Rudin Principles of Analysis or equivalent చదివి ఉండకపోతే అతను ఎకనిమిస్ట్ కాలేడు ( Not my opinion alone :) ), ఎనలిస్ట్ మాత్రమే అవుతాడు, ఎనలిస్ట్ అంటే ఎకానమీని కాదు, ఏదో తనకి తెలిసిన నాలుగైదు మీద పని చేసుకోవదం వరకే :)

    >>how much we need to work and in what direction

    I don't know.

    >>It is important to define the level of abstraction at which we are talking and talk in that plane.

    Dummit Foote used same words during discussion about order of group GLn(F).
    So, I am carried away here.

    >>that my limited powers can enable me

    Increase your knowledge, start reading real books about Economics, that will definitely makes you to think beyond borders (Real books I mean, not novels by RN or Rand, both are equally ignorant about Economics, you can start with Varian for Microeconomics, and Dornbusch, Fisher, Stanley for Macro, and Apostol for Calculus, you can't do a bit in Econ with out Mathematics, and Economics is not about buying and selling or Demand and supply, it has no limits :) )

    I remember studying a Mathematical model about how people behave if they are left alone in a Jungle in my grad micro course. :)

    రిప్లయితొలగించండి
  51. >> ఇంజనీరింగ్లో నేను ఇదే అనుకునేవాడ్ని, కానీ అసలేమీ ఖర్చు పెట్టకపోతే పనులెలా అవుతాయి.

    :) నేను కూడా అలా అనుకోవట్లేదు. పైపైన చూసేటప్పుడు విషయాలు ఎలా కనిపిస్తాయో చెప్పడానికి ఉదాహరణగానే రాశానండీ నేను సినిమా గురించి. anyway, we both seem to understand each other. We can leave it at that.

    >> లాజిక్ వేరు సైన్సు వేరు, సైన్సు నిజాల మీద ఆధారపడి ఉంటుంది, ఇజాల మీద, లాజిక్ మీద కాదు, ఎకనమిక్స్ గురించి మాట్లాడాలి అంటే Rudin Principles of Analysis or equivalent చదివి ఉండకపోతే అతను ఎకనిమిస్ట్ కాలేడు ( Not my opinion alone :) ), ఎనలిస్ట్ మాత్రమే అవుతాడు, ఎనలిస్ట్ అంటే ఎకానమీని కాదు, ఏదో తనకి తెలిసిన నాలుగైదు మీద పని చేసుకోవదం వరకే :)

    I agree in general. I am not trying to be an economist. I am trying to be politician and I know I can not be an expert in all the subjects. I would count on subject matter experts like you (I am writing this with a lot of respect. Please do not read satire in this).

    Thank you for the excellent list of books. I would definitel try to read at least some of them. At present I am working, reading adn understanding on someother knowledge area which makes understand society.

    I am wondering what made you think that I am considering Rand as an economist my friend ? ! Whatever it is, I do not consider her as an economist. Even after reading the list of books suggested by you I would not claim to be an economist.

    Its great discussing stuff with you. One suggestion if I may give you is.. please go ahead and write some of the economics and math related stuff in your blog. do not bother about the interest of others.. there will always be folks who look for such stuff.

    రిప్లయితొలగించండి
  52. టమాటాలు వృధా! అది ఒక సమస్య కాగా నాకు ఇందులో "స్నేహం" ఎక్కడుందో కనిపించడం లేదు!

    రిప్లయితొలగించండి
  53. @ సుజాత గారు,

    చాలా రోజులకి కనిపిస్తున్నారు :) స్పందనకి ధన్యవాదాలు.
    అదే మరి స్నేహం ఏ టమాటాలో దాక్కుందో వెదుకుతున్నట్టున్నారు పాపం వాళ్ళు కూడా :)


    @ ఆత్రేయ గారు,

    >>రామాయణం తరలి గొబ్బెమ్మెల మీద పడ్డట్టు !!

    :)) ఏదో మా పిడకల వేట మరి :)

    రిప్లయితొలగించండి
  54. >>I am not trying to be an economist. I am trying to be politician

    అవి ప్రతి రాజకీయవేత్త చదవాల్సినవి అండి, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పుతీసుకోవచ్చా? లేదా వేరే విధంగా డబ్బులు సమకూర్చుకోవడం వీటిల్లో ఏది లాభమో తెలియజెప్పాలి కదా ప్రతిపక్షాలకి.

    >>I would count on subject matter experts like you

    I am not an expert, it will take few more years to gain considerable knowledge :)

    >>Rand as an economist my friend ?

    I just quoted Rand as an example, RN and Rand both write on Economics, but both lack basic knowledge in Economics, I just wanted to say that (but do you know she started her own "School of Economic thought?" many Indians joined her, google fountainhead business school LOL)

    http://en.wikipedia.org/wiki/Schools_of_economic_thought


    >>I would not claim to be an economist.

    LOOOL, by reading those 4 books (Apostol Cal is in 2 vols), you can't even understand first chapter of Sargent's Macroeconomic Theory :), those books gives you basic knowledge of Society and Economy.

    Simple example, A communist says, only government should run companies, and after reading these two books, you can say, why that is not possible and even if implemented will result in higher prices and more poverty.

    And you can know why Economic policies aren't working, like that.


    >>please go ahead and write some of the economics and math related stuff in your blog.

    ప్రపంచంలో పరమ బద్దకస్తుల్ల లిస్ట్ రాస్తే ఆ లిస్ట్లో నేను తప్పకుండా ఉంటాను :)
    కొన్ని రాస్తునే ఉంటాను కానీ, బ్లాగుల్లో పెట్టను, తెలుగు బ్లాగుల్లో రాయాలి అన్నా ఫండమెంటల్స్ లేకపోతే ఎవరికీ అర్ధం కావు, పోనీ సబ్జెక్ట్ రాద్దామన్నా, నాకన్నా చాలా బాగా రాసేవారున్నారు,physicsforums.com, ఇది పేరుకే ఫిజిక్స్ కానీ లెఖ్ఖల్లో ఏ ఎరియా ఐనా సమాధానం చెప్తారు :), ఎక్కడా దొరక్కపోతే అప్పుడు ఇక్కడ thelastmetro.wordpress.com రాసుకుంటుంటాను.

    >>do not bother about the interest of others

    Never :)


    Taara.

    రిప్లయితొలగించండి
  55. >> అవి ప్రతి రాజకీయవేత్త చదవాల్సినవి అండి.

    Politics covers a very broad spectrum and I am interested in the band that covers social dynamics, reconciling conflicting interests, making public opinion etc. As of now I am not thinking of the band that covers the executive side of the things. nevertheless, honing the basics of economics is very fundamental. Thanks for the pointers :)

    >> I am not an expert, it will take few more years to gain considerable knowledge :)

    Being a politician, I made it my habit to see the present and visualize the future ;) I am talking about future :)

    >> I just quoted Rand as an example, RN and Rand both write on Economics, but both lack basic knowledge in Economics, I just wanted to say that (but do you know she started her own "School of Economic thought?"

    When I read her for the first time, my 18 years self was very impressed but I learnt better and was more wise in my 20s. Yeah.. I read about her own school of economic thought. Didn't delved more into it.

    I would definitely be doing a lot of reading as I go along and will be using my political and social acumen while understanding things rather than getting sold out to one or the other isms..

    రిప్లయితొలగించండి
  56. ఈ వీకెండ్ తో పెద్ద ప్రాబ్లం ఇది..నేను ఎప్పుణ్ణుంచో గమనిస్తన్నా..
    tara/rowdy/witreal/RK/katti ఎవులోకళ్ళొచ్చి గట్టిగా గుంజుతారు.. ఇక ఆణ్ణించి ఆళ్ళూ ఈయనాగలిసి మనల్ని ఇంగిలిపీసులో ఇసిగిస్తారు చస్స్..నాకు మా సెడ్డ సిరాగ్గా ఉంటది

    రిప్లయితొలగించండి
  57. *టమాటాలు వృధా! అది ఒక సమస్య కాగా నాకు ఇందులో "స్నేహం" ఎక్కడుందో కనిపించడం లేదు!*

    శుభలగ్నం సినేమాలో మొగుడు పేళ్లాలు గా వున్న ఆమనిని జపతి బాబు కౌగింలిచుకుంట్టుంటే పేళ్లి అయిన తరువాత దీనికి డబ్బు ఖర్చు లేదు కదా అందువలన ఈ పనికైతే మీరు రేడి అని అంట్టుంది. పేళ్లికి ముందుగాని/తరువాత గాని ఆడవారిని పట్టుకోనే ముందు మగ వారు టొల్ టాక్స్ కడితే (నగలు,బహుమతుల రూపంలో డబ్బులు ఖర్చు పేడితే) భార్య దానిని ప్రేమగా భావిస్తుంది. గర్ల్ ఫ్రేండ్
    స్నేహంగా అనుకొంట్టుంది. మగవారు పైసా డబ్బు ఖర్చు పెట్టకుండా స్నేహం పేరుతో అమ్మాయిని అందరు కలసి అలా పైకి ఎత్తుకొంటే వొప్పుకొంటారా?
    డబ్బులు లేని వాడు కౌగిలిచుకోవటానికి కట్టుకున్నభార్య కూడా ఒప్పుకోదు. వీలైతే చాగంటి గారి ఉపన్యాసాలు వినండి.
    ఆయన ఇంకా బాగా చేపుతాడు.

    రిప్లయితొలగించండి
  58. అజ్ఞాత (10 ఆగస్టు 2011 12:52 ఉ),

    చాలా దారుణంగా ఉంది మీరు చెప్పేది. ఎవరేం చెప్పినా దాన్ని ఇలా out of context విషయాలతో ముడిపెట్టి sweeping generalizations చేస్తే కష్టం బాస్.

    స్త్రీ పురుషుల సంబంధాల మీద మీ విశ్లేషణ ఒక టపాగా రాయండి మీరూ ఒక బ్లాగు పెట్టి.

    రిప్లయితొలగించండి
  59. >>*చాలా దారుణంగా ఉంది మీరు చెప్పేది*

    ప్రస్తుత తరం లో చాలామంది ఆడ వారి స్వభావం ఇంకాదారుణం. పాత రోజుల్లో స్రీ బుద్ది ప్రళయాంతకహ అన్నారు. స్రీల విషయం లో నాకు పెద్ద మనసు లో లేదు. ఎవరైనా కష్ట్టపడి తమ పిల్లలలను పెంచుకొనె తల్లులను మాత్రం గౌరవిస్తాను, డబ్బులు కూడా ఇస్తాను. హక్కులు, అభిరుచులు, స్నేహాలు అనే పెద్ద మాటలు మాట్లాడే వారిమీద గౌరవం ఉండదు. అబలల గురించి రాయటమ అది నా అహంకారానికి చెంపదెబ్బ. మగవాడు నంబర్:1 అని నా గట్టి అభిప్రాయం. ప్రకృతి ఇచ్చిన స్థానన్ని వదలుకోను. అటువంటి మగవారు రేండు, మూడు స్థానాల లో వున్న వారిని గురించి రాయటమా! హథవిధి ! ఈ మధ్యకాలంలో వారిని నెత్తిన ఎక్కించుకోవటం చాలా ఎక్కువైంది వారిని భుమి మిదకు తీసుకు రావలసిన అవసరం చాలా వుంది.
    జగన్ పేరుతో రాసిన నాభావలు ఈ క్రింది టపాలో చదవండి. ఒక్కరు ముందుకు రాలేదు వాదనకు.

    http://nidurinchethotaloki.blogspot.com/2011/08/blog-post.html
    html

    రిప్లయితొలగించండి
  60. అజ్ఞాత (10 ఆగస్టు 2011 11:50 ఉ),

    మీ వ్యాఖ్య లోనుంచి ఇతరులని కించపరిచే భాగాలు తొలగించాను. గమనించగలరు.

    మీరు చెప్పిన ఇతర గట్టి అభిప్రాయాలని చూసి మేము కూడా మీ మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది అని మీకు తెలిసే ఉంటుంది.
    Anyway, you seem to have some strong opinions which lack maturity and shows only an itch to be different from others rather than real thoughts.

    రిప్లయితొలగించండి
  61. oh.. ok. I just saw the link you gave me. your experiences might not be universal. but yeah.. there is definitely some truth and experience in what you are saying.

    రిప్లయితొలగించండి
  62. అజ్ఞాత (10 ఆగస్టు 2011 12:52 ఉ) గారికి ఆడవాళ్ళు సామాజిక ఆమోదం ఉన్న వ్యభిచారుల్లా కనిపిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  63. maastaaru...purreko buddhi , jihvaa ko ruchi annaaru peddalu. cigaretts thaagey prathi vaadini maanpinchalem, but aa cigarette ekkada thayaaravvuthundo daaniney naasanam chestey???? Aalochana baagaaney vundi kadaa?. Evadi saradaa vaadidi.pillalu thappu chesinappudu sarididdaalsina baadyatha peddalidi.Ee saradaalu evadiki vaadu nirnayinchukune vi. Pillalu thappu chestunnaarani parents ki teliyadam ledu. Parents ki telisetlu ee youth cheyyadamu ledu.Naa saradaa naadi annatlu thayarayyindi lokam. Okasaari nannu nenu prasninchukuntey, asalu nenu em cheyyagalanu, em chestey ilaantivi thagginchagalam, em chestey youth lo aalochana puttinchagalam ani anipistundi. Ilaa blog lo raasukovadam thappaa em cheyyalekapotunnaa.

    రిప్లయితొలగించండి