18, నవంబర్ 2010, గురువారం

జయహో జయలలిత: శభాష్ సుబ్రమణ్య స్వామి: పాపం మన్మోహన్


2G స్కాము లో చివరికి రాజా తన పదవి వదులుకోవడం కొంతవరకూ సంతోషించవలసిన విషయమె. అసలన్ని ఆరోపణలు వస్తున్నా ఇంత కాలం పదవిలో ఉండగలగడం మాత్రం చాలా ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో మాత్రం కరుణానిధీ, రాజా వంటి వాళ్ళ మొక్కవోని దీక్షా, పట్టుదలా మొదలైన వాటిని బహుశా భవిష్యత్తులో పాఠ్యాంశాలుగా చేర్చవచ్చేమో!
 


సొంత పార్టీలో మాత్రం, కాంగ్రేస్ ఈ మధ్య కొంచెం బానే స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది. శశి థరూర్, అశోక్ చవాన్, సురేష్ కల్మాడి విషయంలో జాప్యం లేకుండా తీసుకొన్న నిర్ణయాలు కొంతవరకూ అభినందిచదగ్గవే. కానీ సంకీర్ణ రాజకీయాల వల్ల రాజా విషయంలో చాలా జాప్యమూ, తాత్సార ధోరణీ కనపడిందనేది బహుశా కరడుగట్టిన కాంగ్రేస్ అభిమానులు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఏంటి ఒప్పుకునేది నా పిచ్చిగానీ, అట్టా ఒప్పుకుంటే అసలు వాళ్ళు కరడుగట్టిన కాంగ్రేస్ గుడ్డెద్దులెలా అవుతారు?


ఇంతా చేస్తే పాపం అనిపించేది మన్మోహనుడి విషయమే. మిగతా విషయాలెలా ఉన్నా, వ్యక్తిగత నిజాయితీలో ఉత్తముడుగా ఉన్న ప్రధాని కూడా ఈ విషయంలో పరిస్థితుల ప్రభావం వల్ల సుప్రీం కోర్టు చేతిలో మొట్టికాయలు తినవలసి రావడం.. వ్యవస్థకి మంచిదే గానీ ఆయనకి మాత్రం కొంచెం ఎక్కడో మండే విషయంలాగే ఉంది. అయినా ఈ పెద్దొళ్ళ మంటలన్నీ, వాళు రిటైర్ అయ్యాకా, పుస్తకాలు రాశాకగానీ మనకి వెలగవు.


ఈ మొత్తం విషయంలో సుబ్రమణ్య స్వామి గారి పాత్రని మాత్రం ఎంత పొగిడినా తక్కువే. మీడియా పాత్ర కూడా తక్కువేంగాదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి లేక పార్టీ మాత్రం జయలలిత and AIADMK. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలూ, రాజాని తీసెయ్యమనీ, ప్రధానిని తప్పుకొమ్మనీ పై పై రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటే, నిజంగా ఆ పని చేయటానికి ప్రభుత్వానికి కావలిసిన ధైర్యాన్ని ఇచ్చి చాలా బాధ్యాతయుతంగా వ్యవహరించారు.


In general.. I think the recent trend of showing at least some accountability in cases of high profile corruption is a good sign. I think it is definitely a signal that is announcing the arrival of Indian middle class..on to the political spectrum. What do you think?  

24 కామెంట్‌లు:

  1. జయలలిత ది పై పై రాజకీయ ఎత్తుగడ అని మీకెందుకు అనిపించలేదు? అదికూడా ఒక రాజకీయ ఉపయోగం కోసమే అనిపించట్లేదా?

    రిప్లయితొలగించండి
  2. ఈ పెద్దొళ్ళ మంటలన్నీ, వాళు రిటైర్ అయ్యాకా, పుస్తకాలు రాశాకగానీ మనకి వెలగవు.

    I love this :)

    రిప్లయితొలగించండి
  3. WP,

    >>I think it is definitely a signal that is announcing the arrival of Indian middle

    How? I dont understand how you are linking this mokaalu and baTTa tala are linked?

    రిప్లయితొలగించండి
  4. It seems the congres is craving for keeping a good record keeping Rahul's future in mind!

    రిప్లయితొలగించండి
  5. "వ్యక్తిగత నిజాయితీలో ఉత్తముడుగా ఉన్న ప్రధాని" ప్రధాని పదవి కోస౦ ఆత్మాభిమానాన్ని అమ్ముకు౦టున్న ప్రధాని ఉత్తముడా?

    రాజా, రాజా అని తెగ గి౦జుకు౦టున్నారే, తను ఇవ్వవలసిన వార౦దరికీ వాటాలివ్వకు౦డానే ఇన్నేళ్ళూ పదవిలో ఉన్నాడా? వాడికి అన్ని తెలివితేటలున్నాయా? ఇప్పుడు అన్నీ బయట పడే సరికి దొరికిన బలిపశువు ’రాజా’. వీడు ఉత్తముడని కాదు, అక్కడున్న బేవార్స్ గాళ్ళ౦దరిలోకి వీడు కాస్త అమాయకుడు అ౦తే! కామన్ వెల్త్ గేమ్స్ లో కల్మాడీ, ఇపిఎల్ లో శశి థరూర్, భూ కు౦భకోణ౦ లో అశోక్ చవాన్ అ౦తా పైకి కనిపి౦చే తోలుబొమ్మలే.

    ఇన్ని జరుగుతున్నా, సీత క౦టే ఉత్తమురాలయిన అసలయిన పెద్ద తలకాయ ఇ౦కా బయటపడలేదు. ఎ౦దుకు చెప్మా? కనీస౦ ఏ చానెల్ లో కూడా ఒక్కడ౦టే ఒక్కడుకూడా వేలెత్తిచూపలేన౦త భయ౦ ఎ౦దుక౦ట?

    రిప్లయితొలగించండి
  6. Just resigning somedbody will not do anything unless they are punished.

    రిప్లయితొలగించండి
  7. @ మొట్టికాయ,

    జయలలిత చేసిందాంట్లో కూడా రాజకీయ ప్రయోజనాలున్నా, సంకీర్ణ ఒత్తిడుల వల్ల ప్రభుత్వం చర్య తీసుకోలేక పోతున్నప్పుడు, ఒక మంత్రి ని తప్పించమని డిమాండు చేసినప్పుడు దానికి కావలిసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చెయ్యడానికి ముందుకు రావడం నాకు నచ్చింది.

    @ మొదటి అజ్ఞాత, :) Thank You

    @ రెండవ అజ్ఞాత,
    Definitely the improvement in the accountability is due to the pressure from middle class. I think the political parties are starting to woo middle class votes and as part of that process only every party is trying to show some amount of accountability.

    @ మూడవ అజ్ఞాత,
    మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

    @ నాలుగవ అజ్ఞాత,
    yes. It is not enough to get one person resign.
    1.Specturm allocated to undeserved companies need to be recovered
    2.People who are responsible need to be punished legally
    3.Policy changes need to be done for prevention of such things in future

    However, getting the concerned minister out is definitely the first step and correct one too..

    రిప్లయితొలగించండి
  8. @ హరి గారు,

    >>It seems the congres is craving for keeping a good record keeping Rahul's future in mind!

    Ruling party craving for a good record, for whatever reasons is still some thing that is good. right?

    రిప్లయితొలగించండి
  9. రాజా చేత రాజీనామా చేయించినందుకు మనం సంతోషించాలా? ఏమోనండీ, నాకలా అనిపించడం లేదు.

    ఇప్పుడు జరిగినది గొప్ప సంగతేమీ కాదు. నానాకష్టాలూ పడి అతడి చేత రాజీనామా చేయించారు. అతడు జాలీగా చెన్నై పోయి వచ్చే ఎన్నికలదాకా ఎంజాయి చేసి, ఆ తరవాత మళ్ళీ వస్తాడు. తన కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ మంత్రవుతాడు. ఈ పాలి 3జీయో, 4జీయో.. దాని సంగతి చూస్తాడు. మనకు రావాల్సి, రాకుండా పోయిన లక్షల కోట్ల నష్టం మాటేంటి? బదులుగా వాళ్ళకొచ్చిన లంచాల మాట, వాటిని పంచుకున్న వాళ్ళ మాటా ఏంటి? ఆ అడ్డగోలు ఒప్పందాలను రద్దు చేసే మాటేంటి?

    ఇవన్నీ జరుగుతాయా? జరిగితే గనక, అప్పుడు.. మన ప్రభుత్వాలు, వాటి ఎకౌంటబిలిటీలూ మొదలైనవాటి గురించి మనం తరవాత ఏళ్ళ తరబడి కథలు కథలుగా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి నిదర్లేచి, ధర్మం ధర్మం అని ఆవులిస్తోందని చెప్పుకోవచ్చు. :) ఇప్పుడు ఆ మంత్రి రాజీనామా చేసాడుగదాని, అబ్బో నిజాయితీ వెల్లివిరిసిందని మనం సంతోషపట్టం అచ్చమైన మధ్యతరగతి మెటాలిటీ. (మధ్యతరగతి అనే ముక్కను, మిమ్మల్ని ఎక్కిరిద్దామని అనడం లేదు, అలా భావించకండి).

    ఈ ప్రధానమంత్రి అసలు ఎటువంటి మనిషి, ఏ పదార్థాలతో తయారయ్యాడు అనేది నాకో మిస్టరీ అయిపోయింది.. 1. అతడు మహా నిజాయితీపరుడని చెబుతూంటారు. అంచేత రాజా రాల్చే డబ్బులకు కక్కుర్తి పడి ఉండడు. కాబట్టి రాజాను ఇన్నాళ్ళూ ఉంచుకోడానికి కారణం అది కాదు. 2. చేతకానివాడు, పిరికిసన్నాసి, సోనియా అంటే ఉచ్చోసుకుంటాడు, ఆవిడ ఏం చెబితే అది చేస్తాడు, ఏది వద్దంటే అది మానేస్తాడు అని అనుకునేవాణ్ణి. ’చేతకానివాడే అయితే అణు ఒప్పందం కోసం కమ్యూనిస్టులకు ఎదురు తిరిగేవాడా’ అని ఒక పెద్దాయన నా కళ్ళు తెరిపించాడు. 3. ఇక నాకు తెలిసినంతలో మిగిలింది ఒకే ఒక కారణం.. రాజాను తీసేస్తే ఇతడి ఉద్యోగం కూడా ఊడుద్ది, ప్రధానమంత్రిగా నెలనెలా జీతం రాకపోతేనేమో అతడికి పూటగడవదు, ఈ పని తప్పించి పాపం ఇంకో పనేమో అతడికి రాదు! ఇది తప్పించి నాకు మరో కారణం కనబడ్డం లేదు. అంచేత కోర్టు చెప్పుచ్చుక్కొట్టేదాకా ఆగాడు.

    కారణమేదైనా కావచ్చుగానీ, ఇంత దయనీయమైన పరిస్థితిలో ఇంకా పదవిలో కొనసాగుతున్న మనమోహనుణ్ణి చూసి 'జాలిపడి' వదిలేద్దాం (’పోనీలేండ్రా, పాపం మంచిముండావాడు’ అని అంటూంటారే.. ఆలాగ).

    రిప్లయితొలగించండి
  10. >>ప్రధాని కూడా ఈ విషయంలో పరిస్థితుల ప్రభావం వల్ల సుప్రీం కోర్టు చేతిలో మొట్టికాయలు తినవలసి రావడం.. వ్యవస్థకి మంచిదే

    వ్యవస్థకి మంచిదా? ఏ విధంగా? కొంచె వివరించగలరా?

    రిప్లయితొలగించండి
  11. చదువరి గారు,
    >> రాజా చేత రాజీనామా చేయించినందుకు మనం సంతోషించాలా? ఏమోనండీ, నాకలా అనిపించడం లేదు.

    తప్పకుండా సంతోషించాల్సిన విషయమే. కాకపోతే అక్కడితో ఊరుకోకూడదు. నేను పైన ఒక కామెంట్లో చెప్పినట్టు, తిన్న వాటిని వీలైనంతవరకూ కక్కించాలి, మొత్తం దీనివెనకున్నవాళ్ళు బయతికి రావాలి, అక్రమ లైసెన్సులు రద్దు చేయబడాలి, ఇకముందు ఇలాంటివి జరగకుండా ఉండాలి.

    ఇప్పుడు జరిగింది కేవలం మొదటి అడుగు మాత్రమే, కాకపోతే ఇప్పుడున్న వ్యవస్థలో ఇది కూడా చాలా కష్టమైన నేపధ్యంలో.. మొదటి అడుగైనా పడిందనేది సంతోషిచాల్సిన విషయం కాదా? లేదు మేము పూర్తిగా నెగెటివ్ అంటే చేసేదేం లేదు.:)

    >> ఇప్పుడు ఆ మంత్రి రాజీనామా చేసాడుగదాని, అబ్బో నిజాయితీ వెల్లివిరిసిందని మనం సంతోషపట్టం అచ్చమైన మధ్యతరగతి మెటాలిటీ. (మధ్యతరగతి అనే ముక్కను, మిమ్మల్ని ఎక్కిరిద్దామని అనడం లేదు, అలా భావించకండి).

    మీరు నన్ను వెక్కిరించట్లేదని నాకు తెలుసు. అయినా వెక్కింతేముందండీ ఇందులో, Aren't we proud of being middleclass?
    కనీసం మధ్యతరగతి వాళ్ళ అభిప్రాయాలకీ, అసంతృప్తులకీ కొంత విలువ ఇవ్వాల్సిన అవసరాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయనేది శుభ పరిణామమే కదా!

    ఇక ప్రధాని విషయంలో మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. ఆ విషయం మీద నా అభిప్రాయాలూ ఆలోచనలూ పూర్తిగా వేరు.

    రిప్లయితొలగించండి
  12. పొలిటీషియన్ గారు,
    పొరపాటుకి, అవినీతికీ తేడా మీకు కూడా తెలియటం లేదా?
    @చదువరి గారు,
    మీకు భగవంతుడు ఇంతే పరిపక్వత ఇచ్చాడని నేను మీ మీద జాలిపడుతున్నాను.

    రిప్లయితొలగించండి
  13. నీహారిక గారు,

    >>పొరపాటుకి, అవినీతికీ తేడా మీకు కూడా తెలియటం లేదా?

    మీకెందుకలా అనిపించిందో నాకర్థం కాలేదు. నాదృష్టిలో రాజా చేసింది అవినీతి అయ్యుంటుందనిపిస్తుంది. చర్య తీసుకోవడంలో ప్రధానికి సంకీర్ణ రాజకీయాలు కొంత ప్రతిబంధకంగా మారాయనిపిస్తుంది.

    where did I portrayed mistake as corruption?

    రిప్లయితొలగించండి
  14. మీరు సోనియా గాంధీ గారిని నమ్మరు.మన్మోహన్ గారిని కూడా నమ్మరా?
    ఆయనే స్వయంగా చెప్పారు కదా పొరపాటు జరిగింది అని, స్పెక్ట్రమ్ వేలం వేయాలని అపుడు వారికి తోచలేదు. అన్ని లక్షల కోట్లు వస్తాయని ఊహించలేదు. అంత పెద్దవాళ్ళు ఊహించలేదని ఒప్పుకుంటే అపుడు అదో పెద్ద గొడవ. తప్పుచేసిన వాళ్ళూ బి జె పి లో లేరా? వాళ్ళు తప్పు ఒప్పుకుంటారా?
    ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసేయరూ? ఏదయినా అంటే హిందూత్వం అంటారు.

    రిప్లయితొలగించండి
  15. దళితుడైన అండిముత్తురాజా లక్షలకోట్లు భోంచేసినా ఊరుకోకుకుండా గొడవచేసి రిజైన్ చేయించడం CAG, మీడియా, ప్రతిపక్ష , పాలకపక్షాల యొక్క అభిజాత్యం, బ్రాహ్మినికల్ కుట్ర.

    రిప్లయితొలగించండి
  16. పై అఙాత,

    మీరు రాసింది నా దృష్టిలో అర్థం పర్థం లేని వ్యాఖ్య. అవినీతి పరుడుగా ఆరొపించబడినవాడు అవినీతి చేశాడా లేదా అని అలోచించాలిగానీ వాడిది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేదాని గురించి ఆలోచించే వాళ్ళ అభిప్రాయాలకు విలువివ్వడం నాకు అలవాటు లేదు.

    రిప్లయితొలగించండి
  17. వారాంతం, వారాంతం ఎన్నాళ్ళు నీ రాతలంటే, కెలుకుడోళ్ళు కెలికిందాక అనే సామెత వినలేదా?

    రిప్లయితొలగించండి
  18. చూడు నీహారికా మమ్మ్మల్ని ఇక్కడ నీ పిచ్చి వాదలనలతో విసిగించకు. బ్లాగులో కపు జయంతి నటరాజన్/మనీష్ తివారిలా తయారయ్యావు. మీ తెలివికి మీ మిత్రులు పొంగి పోవచ్చేమో కాని ఇక్కడ ఎవ్వరు పడి పోయేవారు లేరు. మీరేదో పెద్ద అనలిసిస్ రాణి అని బ్రమలో ఉన్నట్టున్నారు.
    ------------------------------------
    *మన్మోహన్ గారిని కూడా నమ్మరా?*
    ఎందూకు నమ్మాలో ఒక పది కారణాలు రాయండి. అన్ని లక్షల కోట్ళ తిన్నవాడిన్ని 15నెలల పైన పల్లెత్తు మాట అనలేదు.
    ----------------------------------------------
    5 లక్షలు జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి థార్డ్ పార్టి చెకింగ్ అని పుట్టిన ఊరునుంచి, ఆఖరు గా పనిచేసిన కంపెనీ కి పోయి వెరిఫికేషన్ చేస్తారు. మరి ఇన్ని కోట్లు తిన్న వాడు రోజు కళ్ళ ముందు కనపడుతున్నా దిష్టి బొమ్మ చూస్తున్నట్లు అంతా చూస్తూ కుర్చున్నారు. అది 120 కోట్ల జనం గల దేశం లో !!! సుబ్రమణ్య స్వామి రాసిన లేఖలు అన్ని బుట్ట దాఖలు చేస్తారా? సుప్రీం కోర్ట్ కు తెలిసిన తప్పొప్పులు మిగతా మంత్రులకు. ఐ.యే. యస్. వారికి తెలియ రాలేదా? సుబ్రమణ్య స్వామి ఏపదైవి లేక పోయినా ఎన్నో సార్లు పదవులలొ ఉన్నవారిని అందరి తప్పుడు ఎత్త్తుగడలకు బ్రేక్ వేశాడు . ఈ దేశం లో ఉన్న "ఒక్క మగాడు" సుబ్రమణ్య స్వామి ఒక్కడే. మిగతా అంత వంశాల పేర్లు చెప్పుకొంట్టు చెక్క భజన ముఠాను తయారు చేసుకొనే వారు. నాయకుడు తిని, విసిరి వేసే ఎంగిలి మెతుకులు తిని సంతోషించేవారు.
    అతని నిజాయితీ ని తట్టుకోలేని మీడియా ఎప్పుడు అతనిని కవర్ చేయదు. ఇప్పుడు పి.యం. నెత్తిన వేశిన మొట్టికాయకు ఆయాన కారణం కనుక కొంచెం ఆయనని కవర్ చేయవలసి వచ్చింది.

    రిప్లయితొలగించండి
  19. అజ్ఞాత చెప్పారు...
    చూడు నీహారికా...

    మీకు సహనం నేర్పేందుకే ..

    http://ramyamgakutirana.blogspot.com/2010/03/blog-post.html

    రిప్లయితొలగించండి
  20. @అజ్ఞాత,

    please refrain from insulting others. You could have given the same mesage without insulting others.

    రిప్లయితొలగించండి
  21. Good reply @8:13 Ajnata. Keep commenting. :)

    రిప్లయితొలగించండి
  22. 4. Vir Sanghvi and Niira Radia
    - By Open Magazine on November 18th 2010: Read and listen here
    - By Outlook on November 18th 2010: Read and listen here
    5. Barkha Dutt and Niira Radia
    - By Open Magazine on November 18th 2010: Read and listen here
    - By Outlook on November 18th 2010: Listen here.

    రిప్లయితొలగించండి
  23. సిగ్గు ఎగ్గు లేక పొతే మంత్రిగారిని తొలగించి, ఆ మంత్రిని ఆఖరి నిముషం వరకు వెనుకేసుకొచ్చిన పార్టి అధినేత ఇంట్లో పెళ్ళికి వెళ్లి అక్కడచేరీ జీవన్ టోన్ అడ్వర్టైస్మెంట్ లో ఖండలు చూపించినట్లు వాడిలా, పెళ్ళిలో వీరు మా బంధం ఎంత గట్టిగా ఉందో చూడండని విలేఖరులకు చెప్పి దేశప్రజలకు మీ బంధం యొక్క బలం చూపుతారా! ఇంత గట్టిగా వారి బంధం ఉన్నపుడు ఇక వీరు చేసే ఎంక్వైరి రిసుల్ట్ ఏమి వస్తుందో అందరికి తెలుసు. డబ్బులు తినేసి ఎరగని వారిలా గమ్మున కూచొని, ప్రతిపక్షాలు అడిగిన ఒక్క డిమాండ్ ను ఆమోదించకుండా ప్రతిపక్షాలు గోడవ చేస్తున్నారు. మేము అవినీతి గడ్డిని తిన్న గంగి గోవులం వారు పిచ్చి కుక్కలు అనే భావం వచ్చేవిధంగా పార్లమేంట్ సమావేశాలు సాగ నీయటం లేదు. అని ఒక నిముషం పార్లమేంట్ సమావేశ పరిస్తే అయ్యే ఖర్చు ఇంతా లాంటి కాకి లేక్కల తో హాల్ఫ్ నాలేడ్జ్ మేధావులను (బూదిగా చిన్నపటినుంచి తల్లిదండ్రుల మాటవిని చదువుకొని, ఒక ఐ.టి. కంపేనీలో ఉద్యోగం చేసుకొని, యం.బి.ఏ. చదివితే కేరిర్ గ్రొత్ ఎలా ఉనంట్టుంది అని ఆలోచించే మేధావులను ) ఆకట్టుకోవచ్చేమో కాని అందరిని ఎల్ల కాలం మోసం చేయలేరు.
    -----------------------------------------
    మీడియా వారిని అడ్డుపెట్టుకొని పాలన సాగిద్దామని పెద్ద ప్రణాలిక వేశారు. తమ పార్టి వారిని నాలుగు ఇంగ్లిష్ చానేల్స్లో చెక్క భజన చేయిద్దామను కొన్నారు. అది చాలామందికి ఎప్పటినుంచో తెలిసినా నిన్నటి తో వీర్ సింగ్వి, బర్ఖా దత్ బండారం బట్ట బయలు అయ్యింది.
    *సొంత పార్టీలో మాత్రం, కాంగ్రేస్ ఈ మధ్య కొంచెం బానే స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది.*
    ఇది నిజమా! అలా ప్రతిస్పందించే పనైతే ఆంధ్రాలో జరిగిన ఎన్ని కుంభ కోణాల మీద ప్రతిస్పందిస్తున్నాది? అసలికి వీరు తినే డబ్బులు ఎన్ని వందల కోట్లు, వారు ఇచ్చిన రాజీనామా పత్రం నాలుక గీకోవటానికి కూడా పనికి రాదు. మీరు అల్ప సంతోషులు కనుక అలా తెగ సంబర పడుతున్నారని అనిపిస్తున్నాది. ఒక్క సారి డిల్లీ పరిసర ప్రాంతాలో ఒక్క అపార్ట్మెంట్ 12 కోట్ల పైమాట, ఒక్కొక్క కాంప్లెక్స్ లో సుమారు 100 ఇళ్ళు ఉంటాయి. అదే అద్దె తీసుకోవాలంటె నెలకి ఇంటి ఐదు లక్షలు. మళ్ళి ఈ అపార్ట్మేంట్లు అడ్వర్టాఇస్మెంట్ వచ్చిన రోజే సగం పైన అమ్ముడైపోతాయి. ఇంత డబ్బులు ప్రజలకు ఎక్కడ నుంచి వస్తున్నాయి?
    8:13 అజ్ఞాత

    రిప్లయితొలగించండి
  24. 2G Spectrum Scam: What To Read And Listen To, And Where

    http://www.medianama.com/2010/11/223-2g-spectrum-scam-what-to-read-where/

    Yesterday, Open magazine and Outlook published audio files and transcripts of conversations that Niira Radia, who runs several PR and consultancy companies, allegedly had with Tata Group Chairman Ratan Tata, Telecom Minister A. Raja, and the DMK’s Kanimozhi, as well as with senior journalists Barkha Dutt (from NDTV) and Vir Sanghvi (Editorial Director, HT Media), around the appointment of the Telecom Minstry in India. This follows previous revelations published by Mail Today and The Pioneer, and broadcast by HeadlinesToday. For reference purposes, we’re putting together is a list of information related (and allegedly related) to the appointment, and the 2G Spectrum scam that preceded the appointment, that has been published online; if true, it is shocking commentary on how the Telecom sector is manipulative, and policies manipulated. We’re updating this list, so feel free to suggest more links in the comments below.

    Introduction

    Some of these are alleged to be recordings of conversations that Niira Radia had with several people, in the aftermath of the Parliamentary elections that took place last year, discussing alleged issues with the appointment of ministers from the DMK, a regional political party from Tamil Nadu, as well as appointments to India’s Cabinet of Ministers. The context of these discussions is appointment of A. Raja as Telecom Minister, who allocated 2G mobile licenses in India, on a controversial first-come-first-served basis, by choosing an arbitrary cut-off date for allocation, and it was expected at the time that he would not head the ministry again.

    రిప్లయితొలగించండి