13, ఏప్రిల్ 2012, శుక్రవారం

తెరుచుకున్న బడి తలుపులు (Updated with Photo)

నిన్నటి సుప్రీం కోర్టు తీర్పుతో ప్రాధమిక విద్యాహక్కు చట్టానికి ఉన్న అవరోధాలు అన్నీ తొలగిపోయినట్టయ్యింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి చట్టాల్లో ఇది చాలా ముఖ్యమైన చట్టం. దేశ భవిష్యత్తుని నిర్దేశించగల సత్తా ఉన్న చట్టం అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.
THE LONG ROAD TO GOOD SCHOOLING: Girls on their way to school near Koraput, Orissa. Photo: K.R. Deepak. Note: Just adding the photo taken from The Hindu with thanks :)

దేశ వ్యాప్తంగా ఎన్నో మౌలిక మైన మార్పులకి ఇది ఒక మంచి ముందడుగు అనడంలో ఎటువంటి సందేహానికీ తావు లేదు. పాఠశాలల నిర్వహణలోనూ, శిక్షణా, బోధనా పద్దతులని ప్రామాణీకరించడంలోనూ, భావి పౌరులకి విద్యని తల్లిదండ్రుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఒక హక్కుగా అందించడంలోనూ, దేశ నిర్మాణం లో ఎన్నో కీలకమైన మార్పులు తెచ్చే విధంగా ఈ చట్టాన్ని తయారు చేసినందుకు పార్లమెంటుని అభినందించాల్సిందే.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, స్థానిక ప్రభుత్వాలు తమ పరిధిలో అవసరమైన అన్ని వనరులూ సమకూర్చి పటిష్టంగా అమలు చెయ్యడం మీద చాలా మందికి సందేహాలు ఉండొచ్చు. కానీ ప్రజల నుండి కొంత సహకారం, భాగస్వామ్యం లభిస్తే మాత్రం అమలులో లోపాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇంతకుముందు సమాచార హక్కు లాంటి చట్టాన్ని ఎలాగైతే ఉపయోగించుకోగలిగామో అలాగే పౌర సమాజం గనక బాధ్యతగా స్పందిస్తే అద్భుతాలు సృష్టించ గల శక్తి ఈ చట్టానికి ఉందని నేనైతే బల్లగుద్ది చెప్పగలను.

ఇంతకు ముందు ఈ చట్టం వచ్చిన మొదట్లో, వివరాలు నా ఆంగ్ల బ్లాగులో వ్రాశాను. వివరాలు కావలిస్తే చూడొచ్చు. http://weekendpolitician.blogspot.in/2010/04/right-to-education-rte-abc-and-xyz-of.html

వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: I will be working on the ground for this act to the extent my weekend politics allow. I would be delighted to provide any help and material for others who want to work on ensuring the right to Education.

8 కామెంట్‌లు:

  1. Weekend politician gaaru,
    I really appreciate your timely post.
    I felt very happy that someone has responded to such a historical judgement in blog world and posted about it.
    I sincerely wish you good luck for any of your contributions towards such good deeds.

    Meena

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీనా గారు,

      ఈ తీర్పు ప్రాముఖ్యతని మీరు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. తీర్పు బాగానే వుంది. మరి ఆ 25% కోటా కుల/మతాతీతంగా పేదలకేనా లేక రాబందులు తన్నుకుపోతాయా అనేది పరిశీలించాల్సిన విషయం. వీకెండ్ గారి ఆశావాదం చూస్తే ముచ్చటేస్తోంది, మీకు నిరుత్సాహం కలక్కూడని ఆశిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  3. SNKR గారు,

    మీ శుభాశీస్సులకి ధన్యవాదాలు.

    ఇంక తన్నుకుపోయే రాబందులూ, మాటువేసి ఉండే తోడేళ్ళూ, పక్కనుంచి గిల్లుకునే నక్కల విషయానికొస్తే అది ఎప్పుడూ ఉండే ప్రమాదమే. కాకపోతే ఈ చట్టం కొంచెం పకడ్బందీగానే ఉందండీ. పౌర సమాజం గనుక తమ పాత్ర పోషిస్తే సరిగ్గా అమలవ్వడానికే అవకాశాలు ఎక్కువ. ప్రయత్నిద్దాం మనకి చేతనైనంతవరకూ.

    చట్టంలోని వివరాలని నా ఇంగ్లీషు బ్లాగులో వీలయినంత సరళంగా రాశాను చూడండొకసారి. ఇక 25 % కోటా ఎవరికీ అనేది.. in stead of explaining again in my words let me give you the relevant portion of the Act it self..

    (d) "child belonging to disadvantaged group" means a child belonging to the scheduled caste, the scheduled tribe, the socially and educationally backward class or such other group having disadvantage owing to social, cultural, economical,
    geographical, linguistic, gender or such other factor, as may be specified by the appropriate Government, by notification;

    (e) "child belonging to weaker section" means a child belonging to such parent or guardian whose annual income is lower than the minimum limit specified by the appropriate Government, by notification;

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. /such other factor, as may be specified by the appropriate Government, by notification/

      Note it, WP gaaru:
      "other factor", "specified by the appropriate Government".... so, no scope for needy to get such benefits. We experienced enough what & whom govt notifies, in general. :( pch... another eye wash for (n+1)th time!

      Snkr

      తొలగించండి
    2. Snkr gaaru,

      Such other factors are in addition to the mentioned factors, like children of single mothers, HIV infected households etc. These are the things to be decided by the state and local governments based on the needs of the people of that area.

      I can understand your -ve view on Govt.s but we need to try and understand facts rather than just carrying on with old assumptions and false perspectives.

      That is the reason why I am stressing on participation of civil society in the school Management committees and local govt. decisions. That will be very important to make it a success. I did a good amount of study of the Act and for a change, The parliament did the best that is possible in this case.

      తొలగించండి
  4. మంచి వార్త.

    అయితే ఈ క్రొత్త చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల నిర్వహణ లో ఎలాంటి మార్పులు తదనుగుణంగా చేసుకోబోతున్నాయి అన్నది ఆసక్తి కరమైన విష్యం.
    పేద విద్యార్ధులు కూడా ప్రైవేటు స్కూల్స్ లో మిగిలిన పిల్లలతో సమానం గా చదువుకో గలిగే అవకాశం రావాలని మీ ముందు టపా (శ్రీ శ్రీ రవిశంకర్ :) ) లోనే నా అభిప్రాయం తెలియచేసాను.

    ఇప్పటి వరకు కాలేజి విద్యార్ధులు ఆ అవకాశాన్ని కొంత వరకు దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగం ఉంది. కాని ప్రైవేట్ స్కూల్స్ మధ్య ఉండే పోటి వల్ల,ప్రైవేట్ స్కూల్స్ అందరు విద్యార్దులపై శ్రద్ద పెట్టే అవకాశం ఉంది. కాబట్టి రిజర్వేషన్ లో చేరిన విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గానే ఉంటుంది.

    ఫీజులు కడుతున్న కొందరు విద్యార్ధులు ప్రైవేటు స్కూల్స్ లో ఉచితం గా కేటాయించబడిన 25 % సీట్లలో చేరేందుకు కావాల్సిన ఆదాయపు పరిధిలోనే ఉండి ఉండవచ్చు.

    కాబట్టి ఇప్పటి కే ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న అతి కొద్ది మంది విద్యార్దులకు (అతి తక్కువ స్కూల్ ఫీజు లు కూడా చెల్లించలేని వారే ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్నారు ఇపుడు ) అవకాశం లభించాలంటే వారు మిగిలిన వారితో మెరిట్ లో పోటిపడాల్సి వస్తుంది . కాబట్టి ఇక్కడ చదువుకునే పేద విద్యార్ధులకు అక్కడి ఉపాధ్యాయులనుండే కాక పౌర సమాజం నుండి కూడా సహకారం అందాలి.(ఇక్కడ ఉండేది చాల తక్కువమంది కాబట్టి కాస్త సమయం వెచ్చిస్తే చాలు )

    రిప్లయితొలగించండి